Ivana Respond On Bold Scene With Hero In Love Today Movie - Sakshi
Sakshi News home page

Actress Ivana: హీరోతో అభ్యంతరకర సీన్‌.. నా తల్లిదండ్రులకు చెప్పే చేశా: హీరోయిన్‌

Published Sat, Nov 12 2022 8:59 AM | Last Updated on Sat, Nov 12 2022 9:48 AM

South Actress Ivana Respond On Bold Scene With Hero in Love Today - Sakshi

ప్రతిభను చాటు ఫలితం అదే వస్తుంది అని పెద్దలు చెబుతుంటారు. అలా ఆలస్యంగా శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. యువ నటి ఇవనా ప్రస్తుతం అలాంటి విజయాన్ని అనుభవిస్తోంది. ఈ మలయాలి కుట్టి తన 12వ ఏట నుంచే సినిమాల్లో నటించడం మొదలెట్టింది. మొదట్లో కొన్ని మలయాళ చిత్రాల్లో నటించిన ఇవనా 2018లో బాల దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన నాచియార్‌ చిత్రంలో ఈమె కీలక పాత్ర ద్వారా కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

చదవండి: అల్లు అర్జున్‌ గొప్ప మనసు.. ప్రశంసలు కురిపిస్తున్న కేరళ కలెక్టర్‌

ఆ చిత్రంలో నటిగా మంచి ప్రశంసలు అందుకున్న ఈమె ఆ తర్వాత హీరో తదితర చిత్రాల్లో నాయకిగా నటించింది. తాజాగా ప్రదీప్‌ రంగనాథన్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన లవ్‌ టుడే చిత్రంలో కథానాయకిగా నటించింది. ఏజీఎస్‌  ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కల్పాత్తి అఘోరం నిర్మించిన ఈ చిత్రం గత 4వ తేదీన విడుదలై విశేష ప్రేక్షకాదరణతో పొందుతోంది. కాగా ఇందులో నటి ఇవనా హీరో ప్రదీప్‌ రంగనాథన్‌తో కలిసి పడక గదిలో చాలా సన్నిహితంగా నటించిన సన్నివేశం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. మూవీ సక్సెస్‌లో భాగంగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె దీనిపై స్పందించింది.

చదవండి: రజనీకి థ్యాంక్స్‌ చెప్పిన అలనాటి హీరోయిన్‌ రాధ, ట్వీట్‌ వైరల్‌

‘నాకు దర్శకుడు కథ చెప్పినప్పుడే ఆ సన్నివేశం గురించి నా తల్లిదండ్రులతో చర్చించాను. అందుకు వారు కథకు అవసరమైతే నటించడంలో తప్పు లేదని చెప్పారు. నటించే ముందు నేను కూడా భయపడ్డాను. కానీ సెట్‌లో ఆ సీన్‌లో నటిస్తున్నప్పుడు నేను భావించిన దానికంటే పూర్తి భిన్నంగా ఉంది. అందులో ఎలాంటి అశ్లీలత లేకుండా చిత్రీకరించారు. మూవీ చూసిన తర్వాత నా తల్లిదండ్రులు గానీ, స్నేహితులు కానీ ఎలాంటి విమర్శలను వ్యక్తం చేయలేదు’ చెప్పుకొచ్చింది. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి సన్నివేశం ద్వారా ప్రేక్షకులకు మంచి సందేశం ఉంటుందనే ఉద్దేశంతోనే తాను ఈ సీన్‌లో నటించడానికి మరో కారణం అని ఇవనా పేర్కొంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement