Bold scenes
-
ప్రియుడితో అలాంటి సీన్స్.. అదే కావాలంటోన్న మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీగా అభిమానుల్లో గుండెల్లో పేరు సంపాదించుకున్న భామ తమన్నా భాటియా. గతేడాది జైలర్ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టేసింది. అంతే కాకుండా బాలీవుడ్లో వెబ్ సిరీస్‌లతో అలరించింది. లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో మరి బోల్డ్‌గా నటించి తన గ్లామర్‌ను మరోసారి పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో విజయ్ వర్మతో చేసిన రొమాన్స్ వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. తాజాగా ఈ సిరీస్‌లో అలా నటించడంపై తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది.లస్ట్ స్టోరీస్-2 ఫస్ట్ పార్ట్ చూశాక బోల్డ్ సీన్స్ పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తమన్నా తెలిపింది. అలా నటిస్తే తప్పేముందని నాలో నేనే ప్రశ్నించికున్నానని పేర్కొంది. అయితే అలాంటి సీన్స్‌లో నటిస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని వెల్లడించింది. అందుకే బోల్డ్ సీన్స్‌లో నటిస్తే తప్పేం లేదని అనిపించిందని తెలిపింది. అంతే కాదు.. ఒక నటిగా తాను అన్ని రకాల పాత్రలు చేయాల్సిన అవసరముందని చెప్పుకొచ్చింది. అందుకే ఒక నటిగా తాను ఏం చేయాలో అదే చేస్తానంటోంది మిల్కీ భామ. -
ఈ బ్యూటీ గుర్తుందా.. మళ్లీ ఐదేళ్ల తర్వాత బోల్ట్ సీన్స్‌లో రచ్చ చేస్తుంది
రంగుల ప్రపంచంలో అవకాశం రావడమే అదృష్టం! అయితే కొంతమందికి ఎన్ని అవకాశాలు వచ్చినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాదు. ఒకప్పుడు నటి 'రిచా పనయీ' పరిస్థితి కూడా అదే! అందుకే కాస్త విరామం తీసుకొని ఇప్పుడు వెబ్‌దునియాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె గురిం కొన్ని మాటలు... (ఇదీ చదవండి: Circle Review: ‘సర్కిల్’మూవీ రివ్యూ) ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో పుట్టిన రిచా.. చదువు మొత్తం ఢిల్లీలో సాగింది. మొదట ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసి, తర్వాత మోడల్‌గా మారింది. నటనపై ఆసక్తితో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి.. మలయాళంలో ‘వాడమల్లి’ సినిమాతో రంగప్రవేశం చేసింది. తర్వాత ‘బ్యాంకాక్ సమ్మర్’, ‘వీడుగోల్డ్ ఎహే’, ‘రక్షక భటుడు’, ‘రాగలహరి’ తదితర చిత్రాల్లోనూ నటింంది. అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ సినిమాతో ఆకట్టుకున్న రిచాకు అదే స్థాయిలో సక్సెస్ దక్కలేదు. కాస్త రూటు మార్చి వెబ్‌దునియాలోకి అడుగుపెట్టింది. 2017లో వచ్చిన ‘క్రాస్‌రోడ్స్’ అనే వెబ్‌సిరీస్ విజయంతో.. రిచాకి కాస్త ఊరటనిచ్చింది. తెర ఏదైనా మంచి పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని గ్రహించి.. కాస్త విరామం తీసుకుంది. ఆ విరామ సమయంలో.. సామాజిక వధ్యమాల్లో ఎప్పటికప్పుడు తన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు చేరువగానే ఉంది. ఐదేళ్ల తర్వాత.. తాజాగా తిరిగి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించింది. జులై 7న రిలీజ్ అయిన ‘సర్కిల్’లో కథానాయికగా మెప్పించింది. సాయి రోనక్ హీరోగా.. దర్శకుడు నీలకంఠ తెరకెక్కిన ఈ సినిమాలో రిచా కాస్త బోల్ట్గానే కనిపించింది. సినిమాలో చాలావరకు రొమాంటిక్ సన్నివేశాలు ఉండగా.. అవన్నీ కూడా యూత్‌ని ఆకట్టుకుంటాయి. View this post on Instagram A post shared by Richa Panai (@richapanai) (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్ రూమ్.. ఎంత బాగుందో..) -
అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి
కథానాయకిగా నటి ప్రియమణికి మంచి పేరు ఉంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ కన్నడ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాపులర్ అయింది. తెలుగులో కొంతకాలం స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియమణి పెళ్లి తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల నాగచైతన్య 'కస్టడీ'లో సీఎంగా మెప్పించింది. త్వరలో షారుఖ్ 'జవాన్' చిత్రంతో రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ప్రియమణి. కిస్ సీన్లకు బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటో తాజాగా వెల్లడించింది. (ఇదీ చదవండి: ఆమెతో సుధీర్ నిశ్చితార్ధం.. మరీ రష్మి పరిస్థితి ఏంటి అంటూ..) 'నేను స్క్రీన్‌పై ముద్దు సీన్లలో నటించకూడదని అనుకున్నాను. ఇప్పుడు నేను అలాంటి పాత్రలు చేయడం కరెక్ట్ కాదనిపించింది. సినిమాలో నాది ఒక పాత్ర అయినా వ్యక్తిగతంగా దాని వల్ల ఇబ్బంది పడతాను. అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా నేను తెరపై మరొక వ్యక్తిని ముద్దుపెట్టుకోవడం అంత సౌకర్యంగా కూడా అనిపించదు.' అని చెప్పింది. 2021లో ZEE5లో వచ్చిన 'హిస్ స్టోరీ' వెబ్ సీరిస్‌లో సత్యదీప్ మిశ్రాతో రొమాన్స్ సీన్‌తో పాటు ముద్దు పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయని మేకర్స్ చెప్పారు. కానీ వాటికి ఒప్పోకోలేదని ప్రియమణి గుర్తుచేసింది. అలాంటి సన్నివేశాలలో నటించమని భారీ ప్రాజెక్ట్‌లు వచ్చాయి. అంతే కాకుండా భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. పెళ్లి తర్వాత అలాంటి వాటిలో నటించకూడదని కండీషన్స్ పెట్టుకున్నట్లు ప్రియమణి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!) 2017లో తనకు వివాహమైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి బోల్డ్ సీన్స్‌లో నటించలేదు. సినిమాను అంగీకరించడానికి ముందే ఈ విషయం గురించి దర్శక-నిర్మాతలకు తెలియజేస్తానని చెప్పింది. ఏ సినిమాలో నటించినా దాన్ని తమ ఇరు కుటుంబాల వాళ్లు చూస్తారు. అలాంటి సన్నివేశాల వల్ల వాళ్లు ఇబ్బంది పడడం తనకు ఇష్టం ఉండదని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రియమణి అని తెలిపింది. -
లస్ట్ గురించి బోల్డ్ కామెంట్ చేసిన సీతారామం బ్యూటీ
2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన 'లస్ట్ స్టోరీస్' మంచి విజయం సాధించింది . దానికి కొనసాగింపుగా తాజాగా వచ్చిందే ‘లస్ట్ స్టోరీస్ 2’. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్ వంటి అగ్ర కథానాయకలు నటించడం విశేషం. గురువారం (జూన్ 29)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీరిస్ ప్రధానంగా యూత్నే టార్గెట్ చేసిందనే చెప్పవచ్చు. ఇందులో వేద (మృణాల్ ఠాకూర్) అర్జున్ (అంగద్ బేడీ) ఇరువురు మెప్పిస్తారు. వేద బామ్మగా నీనా గుప్త క్యారెక్టర్ కూడా మెప్పిస్తుంది. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగార జీవితాన్ని రుచి చూడాలని సలహాను వేద బామ్మ ఇవ్వడంతో సీరిస్ ఆసక్తి పెంచుతుంది. (ఇదీ చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే) శృంగారం, కామం గురించి పరిణతి చెందిన సంభాషణ చేయడంలో తప్పులేదంటూ తాజాగా ఈ సీరిస్ గురించి మృణాల్ ఠాకూర్ ఇలా చెప్పింది. 'ఈ రోజుల్లో శృంగారం, కామం గురించి ప్రతి ఇంట్లో ఓపెన్‌గా సంభాషణలు జరగడం ఎంతో ముఖ్యమని నేను బలంగా నమ్ముతాను. ముఖ్యంగా ఇంట్లో యుక్త వయసులో ఉన్న వాళ్లతో దీనిపై మాట్లాడటం అవసరం. వాళ్లకు వీటి గురించి సరైన సమాచారం అందించే ఓ రోల్ మోడల్ అవసరం. ఇలాంటి టాపిక్స్ పై ఇంట్లోని పిల్లలకు నిజాయితీగా వివరించే ఒక్క వ్యక్తి ఉన్నా కూడా వాళ్లు బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని స్వీకరించరు' అని మృనాల్ చెప్పింది. (ఇదీ చదవండి: Ram Charan-Upasana: మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ గిఫ్ట్) ‘సీతారామం’తో అందరికీ ఫేవరేట్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండతో ఓ సినిమా చేయనున్నారు. మరోవైపు నానితో కూడా ఓ సినిమాతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
హీరోతో అభ్యంతరకర సీన్.. నా తల్లిదండ్రులకు చెప్పే చేశా: హీరోయిన్
ప్రతిభను చాటు ఫలితం అదే వస్తుంది అని పెద్దలు చెబుతుంటారు. అలా ఆలస్యంగా శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. యువ నటి ఇవనా ప్రస్తుతం అలాంటి విజయాన్ని అనుభవిస్తోంది. ఈ మలయాలి కుట్టి తన 12వ ఏట నుంచే సినిమాల్లో నటించడం మొదలెట్టింది. మొదట్లో కొన్ని మలయాళ చిత్రాల్లో నటించిన ఇవనా 2018లో బాల దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన నాచియార్ చిత్రంలో ఈమె కీలక పాత్ర ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చదవండి: అల్లు అర్జున్ గొప్ప మనసు.. ప్రశంసలు కురిపిస్తున్న కేరళ కలెక్టర్ ఆ చిత్రంలో నటిగా మంచి ప్రశంసలు అందుకున్న ఈమె ఆ తర్వాత హీరో తదితర చిత్రాల్లో నాయకిగా నటించింది. తాజాగా ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన లవ్ టుడే చిత్రంలో కథానాయకిగా నటించింది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పాత్తి అఘోరం నిర్మించిన ఈ చిత్రం గత 4వ తేదీన విడుదలై విశేష ప్రేక్షకాదరణతో పొందుతోంది. కాగా ఇందులో నటి ఇవనా హీరో ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి పడక గదిలో చాలా సన్నిహితంగా నటించిన సన్నివేశం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. మూవీ సక్సెస్‌లో భాగంగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె దీనిపై స్పందించింది. చదవండి: రజనీకి థ్యాంక్స్ చెప్పిన అలనాటి హీరోయిన్ రాధ, ట్వీట్ వైరల్ ‘నాకు దర్శకుడు కథ చెప్పినప్పుడే ఆ సన్నివేశం గురించి నా తల్లిదండ్రులతో చర్చించాను. అందుకు వారు కథకు అవసరమైతే నటించడంలో తప్పు లేదని చెప్పారు. నటించే ముందు నేను కూడా భయపడ్డాను. కానీ సెట్లో ఆ సీన్లో నటిస్తున్నప్పుడు నేను భావించిన దానికంటే పూర్తి భిన్నంగా ఉంది. అందులో ఎలాంటి అశ్లీలత లేకుండా చిత్రీకరించారు. మూవీ చూసిన తర్వాత నా తల్లిదండ్రులు గానీ, స్నేహితులు కానీ ఎలాంటి విమర్శలను వ్యక్తం చేయలేదు’ చెప్పుకొచ్చింది. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి సన్నివేశం ద్వారా ప్రేక్షకులకు మంచి సందేశం ఉంటుందనే ఉద్దేశంతోనే తాను ఈ సీన్లో నటించడానికి మరో కారణం అని ఇవనా పేర్కొంది. -
దీపిక సినిమాపై కంగనా ఫైర్.. చెత్త సినిమా అంటూ విమర్శలు
దీపిక పదుకొణె నటించిన తాజా చిత్రం గెహ్రియాన్‌పై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలోని శృతిమించిన రొమాన్స్‌పై ఆమె ఘాటుగా స్పందించింది. 'నేను కూడా ఈ తరానికి చెందిన వ్యక్తినే. కానీ ఇలాంటి రొమాన్స్‌ని అర్థం చేసుకోగలను. దయచేసి కొత్తతరం యువత, అర్భన్ సినిమాల పేరుతో ఇలాంటి చెత్తను అమ్మకానికి పెట్టకండి. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలుగానే ఉంటాయి. స్కిన్ షో, అశ్లీలత వంటివి చెత్త సినిమాలను ఏమాత్రం కాపాడలేవు' అంటూ ఇన్‌స్టా వేదికగా విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం కంగనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇందులో సిద్ధాంత్ చతుర్వేదితో దీపిక ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయిందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లి తర్వాత దీపికా ఇలాంటి సీన్స్ చేయడం ఏంటంటూ పెదవివిరుస్తున్నారు. -
కెమెరా ముందు నగ్నంగా నటించనున్న హీరోయిన్!
తమిళ చిత్రం పిశాసు(తెలుగులో పిశాచి) సినిమా ఎంత హిట్టో మనందరికీ తెలిసిందే. దీంతో గతేడాదే దీనికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు మిస్కిన్. ఏడాది ప్రారంభంలో షూటింగ్ కూడా మొదలు పెట్టారు. కానీ అంతలోనే కోవిడ్ సెకండ్ వేవ్ రావడంతో అర్ధాంతరంగా చిత్రీకరణ ఆపేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. హీరోయిన్ ఆండ్రియా ఇందులో బోల్డ్ పాత్రలో నటించనుందట. కథ డిమాండ్ చేయడంతో ఓ సన్నివేశంలో నగ్నంగా కనిపించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ఆమె పారితోషికాన్ని కూడా పెంచినట్లు సమాచారం. గతంలో అమలాపాల్ కూడా ఆడై సినిమాకు నగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆండ్రియా కూడా పిశాచి 2 కోసం ఈ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాక్‌ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్, పూర్ణిమ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: భార్య సురేఖతో కలిసి రక్తదానం చేసిన చిరంజీవి -
బోల్డ్ సన్నివేశాలు కావాలనే పెడతారు: నటి
నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టాక ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయాల్సిందే. గ్లామర్, డీగ్లామర్, ఛాలెంజింగ్.. ఇలా అన్నిరకాల పాత్రలను అంగీకరించి తీరాల్సిందే. ప్రేక్షకుల మనసు దోచుకోవాలంటే జనాలు మెచ్చే సినిమాలు చేయాల్సిందే! అయితే ఎలాంటి సన్నివేశంలోనైనా అలవోకగా నటించే హీరోయిన్లు బోల్డ్ సీన్లు వచ్చేసరికి మాత్రం ఇబ్బంది పడుతుంటారు. బుల్లితెర నటి ఎరికా ఫెర్నాండేజ్ కూడా అందుకు అతీతం కాదు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతానని పేర్కొంది. తనకు ఇప్పటివరకు అలాంటి పాత్రలు చాలా తక్కువగా వచ్చాయని, వాటిలో చాలామటుకు నో చెప్పానని తెలిపింది. కొన్ని బోల్డ్ సన్నివేశాలను కావాలని బలవంతంగా చొప్పిస్తారని, అలాంటప్పుడు ఆ సీన్లలో నటించేందుకు నిరభ్యంతరంగా తిరస్కరిస్తానని స్పష్టం చేసింది. 'ఆ బోల్డ్ సన్నివేశం ఎందుకు అవసరమనేది ముందు నాకు క్లారిటీ ఇవ్వాలి. నిజంగానే అది తప్పనిసరి అనిపించినప్పుడు మాత్రమే అందులో నటించేందుకు నేను మానసికంగా సిద్ధమవుతాను. అంతేకానీ కథ డిమాండ్ చేయకపోయినా అలాంటి సన్నివేశాల్లో నటించాల్సిందే అంటే అందుకు అస్సలు ఒప్పుకోను' అని నటి తేల్చి చెప్పింది. కాగా 'కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ'తో బుల్లితెర మీద తన ప్రయాణం మొదలు పెట్టింది ఎరికా ఫెర్నాండేజ్. దీనికి కొనసాగింపుగా వచ్చిన రెండో సీజన్లోనూ ఎరికానే నటించింది. 2018లో ప్రారంభమైన కసౌటీ జిందగీ కే 2వ సీజన్లోనూ తన నటనతో మెప్పించింది. చదవండి: బాహుబలి, రేసుగుర్రం బాలనటుడు హీరోగా 'బ్యాచ్' మూవీ ఆ డబ్బులు తీసుకోమన్నా వినలేదు: యాంకర్ ఝాన్సీ -
నరేష్‌తో లిప్‌లాక్‌పై నటి ఆమని కామెంట్
నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో శుభలగ్నం, మావిడాకులు, మిస్టర్ పెళ్ళాం.. వంటి సినిమాల్లోని ఆమె పాత్రల్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అనేక హిట్ చిత్రాల్లో నటించి సహజమైన తన నటనతో అందరి మన్ననలు అందుకున్నారు. కెరీర్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సినిమాల నుంచి తప్పుకొని వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయారు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని.. ఇప్పుడు మళ్లీ వరస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల శ్రీకారం సినిమాలో శర్వానంద్ తల్లిగా నటించారు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లోనూ నటిస్తున్నారు. అలాగే అల్లు శిరీష్, నవీన్ చంద్రకు మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమని చావు కబురు చల్లగా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. యంగ్ హీరో కార్తీకేయ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమని హీరో తల్లిగా కనిపించనున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముదుకు రానుంది. ఈ క్రమంలో ఆమని ఇటీవల ఓ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె లిప్ లాక్స్, బోల్డ్ సీన్స్, సినిమాల్లో తల్లి పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చందమామ కథలు సినిమాలో నటుడు నరేష్‌తో ఆమె చేసిన ఓ బోల్డ్ సీన్ గురించి చర్చించారు. చిత్రంలో సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు బోల్డ్ సన్నివేశాల్లో నటించడం తప్పేం కాదన్నారు. ‘నేను నా వృత్తిలో భాగంగా చేశాను. నరేష్ గారు సీనియర్ నటుడు, ధైర్యంగా సన్నివేశాన్ని చేయటానికి అంగీకరించి ఆయన తన గౌరవాన్ని చాటుకున్నారు.’ అని పేర్కొన్నారు. కాగా చందమామ కథలు చిత్రంలో ఆమని.. నరేష్‌తో లిప్ లాక్ సీన్ లో నటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. చదవండి: జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు వరుణ్ పెళ్లిపై నాగబాబు కామెంట్.. ఆ అమ్మాయి అయినా ఓకేనట -
మరోసారి బోల్డ్ పాత్రలో...
హోమ్లీ పాత్రల్లోనే కాదు.. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామరస్ రోల్లో నటించడానికి వెనకాడరు అమలాపాల్. ఆ మధ్య ‘ఆమె’ చిత్రంలో బోల్డ్‌గా నటించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారామె. తాజాగా మరోసారి ఓ బోల్డ్ పాత్రలో నటించేందుకు పచ్చజెండా ఊపారట. అయితే సినిమాలో కాదు.. ఓ వెబ్ సిరీస్ కోసం కావడం విశేషం. 1970ల నాటి కథతో తెలుగు, తమిళ భాషల్లో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. అప్పటి పరిస్థితుల్ని తెలిపే నవల ఆధారంగా ఈ బోల్డ్ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఇందులో అమలాపాల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే బాలీవుడ్లో మహేష్ భట్, జియో స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి పచ్చజెండా ఊపారు. దీని ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అమలాపాల్. -
ఆ సీన్లు చేసుండాల్సింది కాదు!
‘‘ఏదైనా ఒక క్యారెక్టర్ బాగా చేస్తే ఆ తర్వాత అందరూ అలాంటి పాత్రలకే అడుగుతారు. చేసిన పాత్రలే చేస్తే నాకు బోర్ కొడుతుంది. చూసే ప్రేక్షకులు కూడా ఒకే రకమైన పాత్రల్లో కనిపిస్తోంది అంటారు’’ అంటున్నారు ఆండ్రియా జర్మియా. గాయనిగా, నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఆండ్రియా ‘వడ చెన్నై’ అనే తమిళ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్‌లో నటించారు. 2018లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఆ సినిమాలో ఆమె చేసిన చంద్ర తరహా పాత్రలకే అడుగుతున్నారట. ఆ విషయం గురించి ఆండ్రియా మాట్లాడుతూ – ‘‘వడ చెన్నై’ సినిమాలో నా కో–స్టార్ అమీర్‌తో కలిసి బెడ్రూమ్ సీన్స్ చేశాను. ఆ రొమాంటిక్ సీన్స్ చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. ఎందుకంటే చాలామంది దర్శకులు అలాంటి పాత్రలతో నా దగ్గరకు వస్తున్నారు. నాకిష్టం లేదు. ఒకవేళ రొమాంటిక్ సీన్స్ లేకుండా మంచి పాత్రకి అవకాశం వస్తే పారితోషికం తగ్గించుకోవడానికి కూడా నేను రెడీ’’ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ హీరోగా రూపొందిన ‘మాస్టర్’లో నటించారు ఆండ్రియా. ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ‘కా’, ‘వట్టమ్’, ‘మాళిగై’, ‘అర్ణ్మనై’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారామె. -
అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం
మల్లికా శెరావత్ తన సినిమాలతోనే కాదు, మాటలతోనూ దుమారం లేపుతుంటారు. ‘మర్డర్’, ‘ది మిత్’ ‘హిస్’, ‘టైమ్ రైడర్స్’ చిత్రాలతో పాపులర్ అయిన మల్లిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘‘ఫ్రంటల్ న్యూడ్ సీన్లలో నటించడానికి ఇప్పటి హీరోయిన్లు వెనకాడడం లేదు. ఆడియన్స్ కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. నటించేవాళ్లకూ, చూసేవాళ్లకూ ఇబ్బంది లేనప్పుడు ఇక తీర్పులిచ్చే అవసరం ఏముంటుంది?!’’ అని ఆమె చక్కగా నవ్వేశారు. తను నటించిన ‘మర్డర్’ చిత్రం కాలానికి అతీతమైనది చెబుతూ.. అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం, ఇప్పుడైతే వెరీ కామన్ అని కూడా మల్లిక అన్నారు. -
యూపీ శివ
తీర్థం ఇచ్చే చేతికి గన్ దొరికితే? మంత్రాలు చదివే మనిషి.. కంత్రీలతో తిరిగితే?శివ్ అలాంటి వాడే. యూపీలో కొట్టేవాడు. బిహార్ వణికేది. పాతికేళ్లకే గడగడలాడించిన డాన్ వాడు. ఎలా డాన్ అయ్యాడు? చివరికెలా గన్ డౌన్ అయ్యాడు? చదవండి.. ఈవారం ‘వెబ్ ఫ్లిక్స్’లో. ‘‘ఈ ఇంట్లో నాటిన చెట్టు కాత కొచ్చే సమయానికి కొమ్మలు, రెమ్మలు, కాయలతో పక్కింట్లో వాలింది. ఆ చెట్టుపళ్లను ఆ ఇంటి వాళ్లు కోయొద్దు.. అంటే కోయకుండా ఉంటారా?’’ ఓ గ్యాంగ్‌స్టర్ మరో గ్యాంగ్‌స్టర్‌ను అడుగుతాడు. ఈ లైన్ చుట్టూ అల్లుకున్నదే రంగ్‌బాజ్. జీ5లో కొత్తగా అప్‌లోడైన క్రైమ్ థ్రిల్లర్. 1990ల నాటి ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌వార్ ఈ సీరియల్‌కి నేపథ్యం. సెటిల్మెంట్లు, మారణాయుధాల అక్రమ రవాణా సామ్రాజ్యాన్ని యూపీ గోరఖ్‌పూర్ టు బీహార్ పట్నా దాక విస్తరింపచేసిన ఓ పాతికేళ్ల యువకుడి కథ. వెబ్ప్లే 1974, గోరఖ్‌పూర్.. బ్రాహ్మణ వర్ణానికి చెందిన రామ్‌శంకర్ తివారి (తిగ్మాంశు ధులియా), రాజపుత్రుడైన మేహా అనే ఇద్దరూ ఆయా సామాజిక వర్గాలకు ప్రతినిధులుగా, బలమైన శక్తులుగా, తూటాలు పేల్చుకునే ప్రత్యర్థులుగా మారుతారు. తమ బలగాలతో గోరఖ్‌పూర్‌ను ఏలుతుంటారు. రాజకీయాల్లోకీ అడుగుపెడ్తారు. తొంభయ్యవ దశకం వచ్చేసరికి ఎదురులేని ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీలోనూ గ్యాంగ్‌వార్‌ను కొనసాగిస్తుంటారు. గ్యాంగ్‌ను మెయింటేన్ చేసుకోవడానికి గోరఖ్‌పూర్ యూనివర్శిటీలోని స్టూడెంట్స్‌ను వలలో వేసుకుంటూంటారు వాళ్లకు తుపాకులిస్తూ. అలా రామ్‌శంకర్ తివారీకి చిక్కిన విద్యార్థే శివ్ ప్రకాశ్ శుక్లా (సాఖీబ్ సలీమ్). గురి మార్చిన తూటా శివ్ ప్రకాశ్ శుక్లా తండ్రి స్కూల్ మాస్టర్. పాఠాలు చెప్పడం తప్ప ఇంకో ప్రపంచం లేని వ్యక్తి. శివ్ ప్రకాశ్ తల్లి ఆ తండ్రికి తగ్గ ఇల్లాలు. శివ్‌కు ఓ చెల్లి. అన్నంటే ప్రాణం. ఆ అమ్మాయి ఒకరోజు కాలేజ్ నుంచి వస్తుంటే ఓ షాపు యజమాని (యువకుడే) అల్లరి పెడ్తాడు. విషయం తెలుసుకున్న శివ్ ఆవేశంతో తన స్నేహితుడి దగ్గరున్న గన్ తీసుకొని అల్లరి పెట్టిన వాడిమీదకు వెళ్తాడు, బెదిరించాలనుకొని. పెనుగులాటలో తుపాకి పేలుతుంది. షాపు యజమాని నేలకొరుగుతాడు. భయంతో వచ్చి ఇంట్లో దాక్కుంటాడు శివ్. తల్లి, తండ్రి, చెల్లి షాక్ అవుతారు అతను చేసింది విని. ఏమీ పాలుపోదు ఎవరికీ. అప్పుడు వాళ్లింటికి వస్తాడు రామ్‌శంకర్ తివారి. భయపడొద్దు అంటూ వాళ్లకు అభయమిచ్చి శివ్‌ను వెంట తీసుకెళ్లిపోతాడు. విశ్వసనీయమైన అనుచరులతో అతనిని బ్యాంకాక్ పంపిస్తాడు. గురి చూసి తుపాకీ పేల్చడం, మూడో కంటికి తెలియకుండా టాస్క్ పూర్తి చేయడం వంటివాటిలో శిక్షణ ఇప్పిస్తాడు అక్కడే. అతని మీద పూర్తి నమ్మకం వచ్చాకే తిరిగి గోరఖ్‌పూర్‌లో దింపుతాడు రామ్ శంకర్ తివారి. శివ్‌కు తన ప్రత్యర్థి మేహాను చూపించి హత్య చేయమంటాడు. తుపాకి బొడ్లో దోపుకొని బయలుదేరుతాడు శివ్. నడి రోడ్డు మీద.. మనుషులను కిడ్నాప్ చేసి చంపడం అన్న ఓల్డ్స్టయిల్కు గుడ్‌బై చెప్తాడు శివ్ నడి రోడ్డుమీదే తుపాకి గురిపెడుతూ. ఈ విపరీతానికి గోరఖ్పూరే కాదు ఉత్తరప్రదేశ్ అంతా వణుకుతుంది. రామ్‌శంకర్ తివారి గర్వపడ్తుంటాడు. ఇరవై రెండేళ్ల కుర్రాడు నెత్తుటి భయం లేకుండా బహిరంగ హత్యలతో వీరంగం చేస్తుంటే ప్రత్యర్థి రక్తం చల్లబడ్తుంటుంది. మేహా కణతలో తూటా దింపుతాడు శివ్. తనకు ఏకచ్ఛత్రాధిపత్యం వచ్చేసిందన్న ఆనందాన్ని రామ్‌శంకర్ ఆస్వాదిస్తుండగానే శివ్ స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడన్న చేదూ అతని చెవినపడుతుంది. కొడుకును కాదని పరాయివాడిని విశ్వసిస్తే జరిగిన నిర్వాకానికి నివ్వెరపోతాడు. శివ్ ధైర్యాన్ని, సాహసాన్ని అటు బీహార్ నేత చంద్రభాన్ సింగ్ ఉపయోగించుకోవాలనుకుంటాడు. తనకు సహాయం చేయమని కోరుతాడు. దీన్నే బాస్ రామ్శంకర్కు చెప్పకుండా సొంతంగా చేసేస్తాడు శివ్. అప్పటి నుంచి శివ్ చర్యల మీద ఓ కన్నేసి ఉంచుతాడు రామ్శంర్. శివ్ నిజాయితీని పరీక్షించడానికి ఒక మంత్రిని చంపే పని అప్పగిస్తాడు. సరేనని ఇంకో మంత్రిని చంపేస్తాడు శివ్.. బీహార్ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత చంద్రభాన్ ఆజ్ఞప్రకారం. దీంతో శివ్ తన మనిషి కాదని రూఢీ అవుతుంది రామ్శంకర్కి. అప్పటికే శివ్ స్వతంత్రంగా ఓ సేననూ తయారు చేసుకుని ఉంటాడు. మంత్రి హత్యతో చంద్రభాన్సింగ్కు సన్నిహితుడవుతాడు. రామ్‌శంకర్ తివారి కూడా భయపడేంత బలవంతుడవుతాడు శివ్. నిండా పాతికేళ్లు కూడా లేని అతనితో మాట్లాడాలంటే చంద్రభాన్ మధ్యవర్తిత్వం తీసుకోవాల్సి వచ్చేంత పెద్దవాడవుతాడు. చెల్లి పెళ్లి బ్యాంకాక్ నుంచి వచ్చాక శివ్ ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్తాడు. వార్తాపత్రికల్లో వస్తున్న కథనాలతో కొడుకు దందా అర్థమైపోతుంది తండ్రికి. శివ్ తల్లిదండ్రులుగా వీళ్లను చూసి జనాలు భయపడ్తుంటే సిగ్గుతో తలదించుకుంటుంటారు. పరిస్థితి మరీ దిగజారకముందే కూతురికి పెళ్లిచేసెయ్యాలని సంబంధం ఖాయం చేస్తారు. చెల్లి ఫ్రెండ్, తన గర్ల్‌ఫ్రెండ్ అయిన శృతి అనే అమ్మాయి ద్వారా చెల్లి పెళ్లి విషయం తెలుసుకుని ఇంటికి వస్తాడు శివ్. తనకు చెప్పకుండా చెల్లి పెళ్లి ఎట్లా చేస్తారు? అంటూ తల్లిదండ్రులతో గొడవపడ్తాడు. నిన్ను ఇన్వాల్వ్ చేస్తే గూండా చెల్లెలికి ఈ జన్మలో పెళ్లవుతుందా? అని నిలదీస్తారు తల్లిదండ్రులు. మారు మాట్లాడకుండా చెల్లి చేతిలో డబ్బు పెట్టి వెళ్లిపోతాడు శివ్. నిశ్చితార్థానికి తప్పకుండా ఇంటికి వస్తాడని, ఆ టైమ్‌లో వాడి చావుకి ముహూర్తం పెట్టమని తన కొడుక్కి పురమాయిస్తాడు రామ్‌శంకర్ తివారి. కాని శివ్రాడు. దాంతో శివ్ గర్ల్‌ఫ్రెండ్‌ని టార్గెట్ చేస్తాడు రామ్‌శంకర్. ఆ పిల్లకు తన మేనల్లుడితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అది అశనిపాతమవుతుంది శివ్‌కి. ‘‘నీ పద్ధతితో విసిగిపోయారు. నవ్వు మారవు. నాకీ తుపాకులు, గోరఖ్‌పూర్ వాతావరణం నచ్చట్లేదు. అందుకే బెంగుళూరులో మంచి ఉద్యోగం చేసుకుంటున్న రామ్‌శంకర్ మేనల్లుడితో పెళ్లికి ఒప్పుకున్నాను’’ అని చెప్పి దూరమవుతుంది శృతి. కుంగిపోతాడు. రామ్‌శంకర్ మీద ఇంకా పగపెంచుకుంటాడు. రామ్‌శంకర్ కన్స్ట్రక్షన్ బిజినెస్ పార్ట్నర్ను కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేస్తాడు. ఆ డబ్బుతో పట్నా వెళ్లిపోయి అక్కడ కాంట్రాక్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే లక్ష్యంతో. ఆ మేరకు చంద్రభాన్ కూడా భరోసా ఇస్తాడు. డబ్బులిచ్చినట్టే ఇచ్చి ఆ కాంట్రాక్టర్ చేతికి చిక్కగానే శివ్ అండ్ గ్యాంగ్‌ను లేపేయాలనే ప్లాన్‌తో వస్తాడు రామ్‌శంకర్ తివారి కొడుకు. అయితే ఆ ప్లాన్ రివర్స్ అవుతుంది. డబ్బు తీసుకుని రామ్‌శంకర్ కొడుకుని, అతని అనుచరులనూ చంపేస్తాడు శివ్. కొడుకును చంపేశాడన్న కసి, కక్షతో ఉత్తరప్రదేశ్‌లో శివ్ మీద నిఘాను పెంచుతాడు రామ్‌శంకర్. అతనిని పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేయిస్తాడు. ఎన్కౌంటర్.. అప్పుడడప్పుడే సెల్ ఫోన్ల ఎంట్రీ. శివ్ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది. పట్నాకు వెళ్తూ లక్నోలో ఆగుతాడు. స్టార్ హోటల్లో బస కోసం వెళితే రిసెప్షనిస్ట్ నచ్చుతుంది. ఆమె పేరు బబితా శర్మ (ఆహనా కుమ్రా). ఇంట్లో సంబంధాలు చూస్తుంటే ఇంటర్‌కాస్ట్ అండ్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్లోంచి వచ్చేస్తుంది. ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటూంటారు. వీళ్ల సంభాషణను స్పెషల్ టాస్క్ ఫోర్స్ ట్యాప్ చేస్తూ ఉంటుంది శివ్‌ను పట్టుకోవడానికి. శివ్ అండర్‌వరల్డ్ చర్యలు పట్నాకూ పాకి.. అక్కడా పోలీసుల థ్రెట్ ఉండడంతో పట్నాలో ఆశ్రయం ఇస్తానన్న చంద్రభాన్ ఇంకోచోట తాత్కాలిక బస ఏర్పాటు చేస్తాడు. ఈలోపు చెల్లి పెళ్లి ఉంటుంది. వెళ్లాలనుకుంటాడు శివ్. వెళితే చంపేస్తారని అనుచరులు వారిస్తారు. ఇంకోవైపు లక్నో నుంచి ఘజియాబాద్‌కు మకాం మార్చమని బబితాకు చెప్తాడు. పట్నాకు తనతోపాటు ఆమెనూ తీసుకెళ్లాలనుకుంటాడు. ఇటు పోలీసులు బబితా అడ్రస్ ట్రేస్ చేస్తారు. చెల్లి పెళ్లికి వెళ్లాలా? ప్రియురాలి దగ్గరకు వెళ్లాలా అనే డైలమాతోనే ఉన్న చోటునుంచి బయలుదేరుతాడు శివ్. వాళ్ల సంభాషణను బట్టి అతను కచ్చితంగా ఆమె దగ్గరకే వెళ్తాడు అన్న నమ్మకంతో పోలీసులు బబితా ఇంటి ముందు పహారా కాస్తుంటారు మఫ్టీలో. చెల్లితో ఒకసారి మాట్లాడాలనుకుని ఇంటికి ఫోన్ చేస్తాడు శివ్. తండ్రి ఫోన్ ఎత్తుతాడు. మాట్లాడుతాడు. మాటల్లో కొడుకులో ఉన్న బాధ బయటపడుతుంది. తండ్రీ చలిస్తాడు. చెల్లికి విషెస్ తెలుపమంటాడు శివ్. ‘‘టైమ్ చిక్కినప్పుడు ఇంటికి రా’’ అంటూ ఫోన్ పెట్టేస్తాడు తండ్రి. చిన్నప్పటి జ్ఞాపకాలు వెంటాడుతాయి శివ్ని. పశ్చాత్తాపం మొదలవుతుంది. బబితను తీసుకొని నేపాల్ వెళ్లిపోయి ప్రశాంతంగా బతకాలనుకుంటా డు. ఆ సంగతే ఆమెకు ఫోన్లో చెప్పి బయలుదేరుతాడు. తమ అంచనా తప్పుకాలేదు అనుకుంటూ.. కారు దిగి బబితా ఫ్లాట్‌లోకి వెళ్లబోతున్న శివ్‌ను అనుసరిస్తారు పోలీసులు. అనుమానం వస్తుంది శివ్ అండ్ గ్యాంగ్‌కి. తూటాల యుద్ధం మొదలువుతుంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ (రణ్వీర్ శౌరీ) చేతిలో శివ్ ప్రకాశ్ శుక్లా చనిపోతాడు. కొంత కల్పితాన్ని జోడించిన నిజం ఇది. 25 ఏళ్లకే డాన్ అయిన ఓ విద్యార్థి జీవితం. యూపీలో మొట్టమొదటిసారి ఏకే 47ను వాడింది అతనే. 20 మందిని దారుణంగా చంపాడు. అప్పుడప్పుడే ప్రైవేట్ చానళ్ల జోరు, క్రైమ్ కహానీల హోరు షురూ అయింది. శివ్‌ను పట్టుకోవడానికి ఓ ప్రైవేట్ చానల్లో శివ్ మీద క్రైమ్స్టోరీనీ షూట్ చేయించారు స్పెషల్ టాస్క్ పోలీసులు. అయినా పట్టుకోలేకపోతారు. చివరకు అలా ఎన్కౌంటర్ అవుతాడు శివ్. 100 మంది రాజకీయ నేతలతో అతనికి సంబంధాలున్నట్లు, వాళ్లందరికీ అతను పనిచేసిపెట్టినట్లూ శివ్ డైరీ వెల్లడించింది. వెబ్‌సిరీస్ అంటేనే సెన్సార్ లేకుండా బోల్డ్‌గా, కుటుంబ సమేతంగా చూడ్డానికి వీల్లేనివి అన్న అభిప్రాయం ఉంది. సత్యమే. కాని రంగ్‌బాజ్ దానికి విరుద్ధం. – సరస్వతి రమ -
కెమిస్ట్రీ కుదిరింది
‘మిణుగురులు’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘24 కిస్సెస్’. అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్టంశెట్టి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘బోల్డ్ కంటెంట్‌కు తోడు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అయోధ్యకుమార్. అదిత్, హెబ్బా మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్. ఇప్పటికే విడుదలైన మా సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మా చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నరేష్, రావు రమేష్, అదితి మైఖెల్, శ్రీని కాపా, మధు నెక్కంటి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, లైన్ ప్రొడ్యూసర్: చందా గోవింద రెడ్డి, కెమెరా: ఉదయ్ గుర్రాల, సంగీతం: జోయ్ బరువా, నేపథ్య సంగీతం: వివేక్ ఫిలిప్. -
బోల్డ్ విషయముంది
‘మాంగ్ మే సింధూర్’ అడిగే హీరోయిన్లు మాయమైపోయారు. ‘కర్వా చౌత్’ అంటూ వ్రతాలు చేసే హీరోయిన్లూ ఔట్ డేట్ అయిపోయారు. గతంలో ‘బికిని’ వేసుకుంటే బోల్డ్‌గా చేసింది అనేవారు. నేడు డార్క్ సైడ్ ఆఫ్ ది లైఫ్‌ను చూపించే పాత్ర చేస్తే బోల్డ్ అంటున్నారు. సరైన పాత్ర దొరికితే రొటీన్‌కు మారో గోలి అంటున్నారు. నాలుగు డైలాగులు చెప్పాలి అయిదు పాటల్లో గెంతాలి. బ్రెయిన్ ఉన్నా ఉపయోగించకూడదు. బుజ్జి బుజ్జి మాటలు.. ముద్దు ముద్దు చేష్టలతో కథానాయకుడి ప్రాపకం కోసం పాకులాడుతూ ఉండాలి. ప్రేమ పేరుతో వెంటబడాలి. హీరో చిరాకు పడుతూ చీదరించుకుంటుంటే వానపాటల్లో తడుస్తూ అతగాడిని అలరించడానికి తడవాలి! ఇంకెన్నాళ్లీ బోరింగ్ హీరోయిన్స్ రోల్స్‌ను మోయాలి? అందుకే నో ... చెప్పారు కొందరు కథానాయికలు. ప్రాధాన్యమున్న పాత్రలను ఆశిస్తున్నారు. స్క్రిప్ట్ డిమాండ్‌ను బట్టి బోల్డ్‌గా నటించేందుకూ డిసైడ్ అయ్యి బాక్సాఫీస్ కలెక్షన్స్ పెంచుతున్నారు. రెమ్యునరేషన్‌ను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. అలాంటి బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటున్న హీరోయిన్స్ ఇప్పుడు బోలెడుమంది. అందరికీ తెలిసిన కొందరి గురించి బ్రీఫ్ నరేషన్... డర్టీ పిక్చర్.. గ్రేట్ ఐడెంటిటీ ‘పరిణీత’తో హిందీ సినిమా సఫర్ షురూ చేసినా విద్యాబాలన్‌కు గుర్తింపు వచ్చింది మాత్రం ‘డర్టీ పిక్చర్’తోనే. తెలుగు నటి సిల్క్ స్మిత బయోగ్రఫీ అంటూ వచ్చిన ఆ సినిమాలో సిల్క్ స్మితగా నటించి విద్యాబాలన్ న్యూస్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండస్ట్రీలో బొద్దుగా ఉండే హీరోయిన్స్‌కే క్రేజ్ కనుక సిల్క్ స్మిత కూడా బొద్దుగా ఉండేది కనుక డర్టీ పిక్చర్ కోసం బరువు పెరిగింది విద్యా. ‘ఊలాలా... ఊలాలా’ అంటూ ప్రేక్షకులను వేడెక్కించే స్టెప్పులేసింది. ‘ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్’ అంటూ గారాలు పోతూ ఆమె చెప్పిన డైలాగులు విద్యను వ్యాంప్‌గా నిలబెట్టలేదు. ఆమెలోని నటినే పరిచయం చేశాయి. ఆమెది డర్టీ డెసిషనే కాదు అని నిరూపించాయి. ఆ తర్వాత ‘ఇష్కియా’, ‘కహానీ’, ‘బేగంజాన్’, ‘తుమ్హారీ సులూ’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ ఆమె వెంటపడ్డాయి! అవార్డుల పంట పండించి.. ఆమెకు గ్రేట్ ఐడెంటిటీ ఇచ్చాయి! ‘క్వీన్’ ఆన్ సిల్వర్‌స్క్రీన్... ఇది ఎవరి గురించి ప్రస్తావనో హింట్ ఇచ్చేసినట్టే కదా! యెస్... కంగనా రనౌత్. ఆమె ఫిల్మోగ్రఫిలో మూడు నాలుగు మినహా అన్నీ ప్రత్యేకమైనవే. ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’, ‘ఫ్యాషన్’, ‘తనూ వెడ్స్ మనూ’, ‘క్వీన్’, ‘రంగూన్’.. లెక్క చేయాల్సిన సినిమాలు. ‘తనూ వెడ్స్ మనూ’లో మెట్రోపాలిటన్ సిటీ కల్చర్‌ను అడాప్ట్ చేసుకున్న కాన్పూర్ కన్సర్వేటివ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిగా... దాని సీక్వెల్ అయిన ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’లో డీ గ్లామర్ స్పోర్ట్స్ ఉమన్‌గా ఈ గ్లామర్ క్వీన్ ఉనికి ఇండస్ట్రీలో హీరోయిన్ల ప్రిఫరెన్స్నే మార్చేసింది. ‘రంగూన్’లోనైతే కంగనా దేహం కూడా అభినయిస్తుందనే ప్రశంసలందుకుంది. ఆ బోల్డ్నెస్కే ఫిల్మ్‌ఫేర్ నుంచి నేషనల్ అవార్డ్స్ దాకా ఎన్నో పురస్కారాలు దాసోహమయ్యాయి. చమ్మక్ చల్లో ఛమేలీ... కన్ఫ్యూజ్ కావద్దు.. కరీనా కపూర్ గురించే! ఆమె మొదటి సినిమా ‘రెఫ్యూజీ’లో కరీనా పెర్ఫార్మెన్స్ చూసి ‘ప్చ్’ అన్నవాళ్లే ఓమ్కారాతో బెస్ట్ యాక్ట్రెస్ అంటూ కితాబిచ్చారు. ‘కుర్బాన్’ లో టాప్‌లెస్ అపియరెన్స్, ‘హీరోయిన్’లో లవ్ మేకింగ్ సీన్స్, అంతకుముందే ‘చమేలీ’, ఈ మధ్య ‘వీరే దీ వెడ్డింగ్’తో స్టీరియోటైప్‌ను బ్రేక్ చేసి యాక్టింగ్‌లో ఛాలెంజ్‌ను క్రియేట్ చేసింది కరీనా. బోల్డ్ అండ్ టాలెంటెడ్ అనే పేరుతెచ్చుకుంది. అవార్డ్స్ కన్నా ప్రేక్షకుల అప్లాజ్ మిన్న అనుకుంది. డాలీ కి డోలీ.. సోనమ్ కపూర్... అనిల్ కపూర్ కూతురిగా కాకుండా ‘కపూర్’ సర్నేమ్ నీడ పడకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదురైన సవాళ్లనన్నిటినీ ఎదర్కొని నిలబడ్డ నటి. ఆమె సినిమాల జాబితా చూస్తే ఎంత భిన్నమైన పాత్రలను ఎంచుకుంటుందో తెలుస్తుంది. తొలి సినిమా ‘సావరియా’ నార్మల్ ల్యాండింగే అయినా మిగతావన్నీ వేటికవే విభిన్నం. ‘డాలీ కి డోలీ’లో నిత్య పెళ్లికూతురిగా, ‘ఖూబ్సూరత్’లో సొంత వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా, ‘వీరే దీ వెడ్డింగ్’లో పెళ్లికి ముందే సెక్స్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేసిన యువతిగా నటించి ఏ హీరోయిన్ చేయని సాహసం చేసింది సోనం కపూర్. అనార్కలీ ఆఫ్ ఆరా స్వరాభాస్కర్ అని తెలిసే ఉంటుంది. ఎరోటిక్ ఫోక్ డాన్సర్‌గా కనిపిస్తుంది ‘అనార్కలీ ఆఫ్ ఆరా’ లో స్వర. అది బోల్డ్ రోల్ కాదు.. గ్లామరస్ అపియరెన్స్ మాత్రమే అని అంటుంది ఆమె. నచ్చని విషయాన్ని ముక్కు పగలగొట్టినట్టే చెప్తుంది. కాంట్రవర్సీలకు భయపడదు. రియల్ లైఫ్‌లోని ఈ గుణమే స్క్రీన్ మీద పాత్రలను ఎంచుకునేటప్పుడూ చూపిస్తుంది స్వరా. కమర్షియల్ రోల్స్‌కి పెద్దగా తావివ్వకుండా ‘లిజన్ అమాయా’, ‘నీల్ బట్టే సన్నాట’, ‘వీరే ది వెడ్డింగ్’ లాంటి మల్టీప్లెక్స్‌కే స్కోప్ ఇస్తోంది. ఇవన్నీ గ్లామర్ గ్రామర్ లేనివే. అంత ధైర్యం లేకపోతే ‘వీరే దీ వెడ్డింగ్’లో స్వయంతృప్తి చెందే సీన్లో ఎలా నటించగలదు? లస్ట్ స్టోరీస్.. అనగానే ముందు గుర్తొచ్చే పేరు రాధికా ఆప్టే. ఆ సినిమాలోని ఫస్ట్ స్టోరీలో నటించింది ఆమె. స్టూడెంట్ పట్ల లస్ట్ ఉన్న టీచర్‌గా. దీనికి నిజంగానే గట్స్ ఉండాలి. ఉన్నాయని ప్రూవ్ చేసుకుంది రాధికా ఆప్టే. అంతేకాదు పాపులర్ బ్యానర్స్ నుంచి చాన్స్‌లు వస్తున్నప్పుడే ‘అహల్య’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి యాక్టింగ్ నో బార్ అని చూపింది. తర్వాత ‘ఫోబియా’ లాంటి ఆఫ్‌బీట్ సినిమాలను, నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌నూ సీరియస్‌గా తీసుకుంది. ఎంతో బోల్డ్‌గా ఉంటే తప్ప ఇంత వెర్సటాలిటీ ప్రదర్శించలేరు. లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా అరవైఏళ్ల రత్నా పాఠక్ షా తీసుకున్న డేర్స్టెప్ ‘లిప్‌స్టిక్ అండర్ మై బురా’్ఖలోని ఆమె పాత్ర. ఏటికి ఎదురీదే గుణంతో పాటు నటననూ వారసత్వంగా తీసుకుంది రత్న.. ఆమె తల్లి దీనా పాఠక్ నుంచి. కెరీర్ తొలినాళ్లలో ప్యార్లల్ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. సెకండ్ ఇన్నింగ్స్‌ను కమర్షియల్ మూవీస్‌తో స్టార్ట్ చేసింది. ఈ మలిప్రారంభమే ఆమెలోని బోల్డ్నెస్కు ప్రతీక. ఇక లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమాలోనైతే ఫాంటసీల్లో బతుకుతున్న యాభై ఏళ్ల విడోగా జీవించి సినీ క్రిటిక్స్‌తో చప్పట్లు కొట్టించింది. వీళ్లేకాక ప్రియాంక చోప్రా, కొంకణ్ సేన్ శర్మ, హుమా ఖురేషి, రీచా చద్దా, నేహా ధుపియా లాంటి హీరోయిన్సూ మూసకు భిన్నంగా నటించినవారే. షబానా ఆజ్మీ లాంటి ఆ తరం హీరోయిన్స్ కూడా కథను అనుసరించి బోల్డ్ క్యారెక్టర్స్ చేశారు. దీపా మెహతా ‘ఫైర్’లో షబానా ఆజ్మీ, నందితా దాస్ లెస్బియన్స్‌గా నటించారు. ఇదీ బోల్డ్ స్టోరీ. బోల్డ్ అంటే ఈ నటీమణుల విషయంలో స్ట్రాంగ్ అనే. డాన్సింగ్ డాల్ కాన్సెప్ట్‌కు ఎండ్ పలికి ఫీమేల్ ప్రొటాగనిస్ట్ స్టోరీస్‌కు డిమాండ్ పెంచాలనే. కథకు అవసరమైతే బోల్డ్సీన్స్ ఓకే అంటున్నారు ఈ స్ట్రాంగ్, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్. – శరాది -
బూతు సైట్లలో నటి క్లిప్ హల్చల్
ఓ బోల్డ్ సీన్లో నటించినందుకుగానూ నటి రాజశ్రీ దేశ్‌పాండేకు ఊహించని షాక్ తగిలింది. వెబ్ సిరీస్ సాక్రెడ్ గేమ్స్‌లో ఓ సీన్లో ఆమె టాప్‌లెస్‌గా నటించారు. అయితే ఆ సీన్‌ను అశ్లీల సైట్లలో అప్లోడ్ చేసిన కొందరు.. పోర్న్ నటిగా ఆమె పేరును ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆమె మండిపడుతున్నారు. ‘అడల్డ్ స్టార్.. బోల్డ్ యాక్టర్... ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. కథను అనుగుణంగా ఆ సీన్ అవసరం. అందుకే అలా నటించా, ఆ మాత్రానికే నన్నో పోర్న్ నటిగా ప్రచారం చేయటం దారుణం. అలాగనీ వారికి బదులు చెప్పాల్సిన అవసరం లేదు. బోల్డ్‌సీన్లు నటించే క్రమంలో ఇలాంటి విమర్శలు సహజం. పట్టించుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు’ అని ఆమె వివరణ ఇచ్చారు. సాక్రెడ్ గేమ్స్‌లో నవాజుద్దీన్ వైఫ్ క్యారెక్టర్లో నటించిన రాజశ్రీ.. ఓ సీన్లో టాప్ లెస్‌గా నటించారు. ఈ నేపథ్యంలో పోర్న్ సైట్లలో సైతం ఆ సీన్ దర్శనమివ్వటం గమనార్హం. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌లో అశ్లీలత, అసభ్యత ఎక్కువగా ఉందంటూ సెన్సార్ బోర్డుకు పలు ఫిర్యాదులు కూడా అందాయి. అడల్ట్ కంటెంట్.. పచ్చి బూతులు -
పెద్ద స్టార్లకేనా ప్రశంసలు.. హీరోయిన్ ఆవేదన
'బాలీవుడ్ అంతా పెద్ద తొండి.. రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తుంది. శృంగార సన్నివేశాల్లో పెద్ద స్టార్లు నటించినప్పుడు వారు బోల్డ్‌గా గొప్పగా నటించారంటూ ప్రశంసలు వస్తాయి. అదే చిన్న స్టార్లు, హీరోయిన్లు అలాంటి సన్నివేశాల్లో నటిస్తే.. వారిదంతా 'వెగటు' ప్రదర్శన అంటూ కొట్టిపారేస్తారు' అంటూ జరీన్ ఖాన్ ఆవేదన చెందుతోంది. సల్మాన్ ఖాన్ 'వీర్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన జరీన్ తాజాగా 'హేట్‌స్టోరీ-3'లో హాట్‌హాట్‌గా నటించింది. ఆ తర్వాత 'ప్యార్ మాంగా హై తుమ్సే' అనే వీడియో సాంగ్‌లో ఈ సుందరి దర్శనమిచ్చింది. అయితే కిషోర్ కుమార్ పాడిన క్లాసిక్ గీతంపై తీసిన ఈ వీడియో సాంగ్‌లో ఘాటైన శృంగార దృశ్యాలు ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జరీన్ స్పందిస్తూ 'ఇలాంటి వాటి(బోల్డ్ సీన్ల)లో పెద్ద నటులు నటించి ఉంటే అవి అద్భుతంగా ఉన్నాయి. ఓ మై గాడ్ అంటూ ప్రశంసించేవారు. 'లుకింగ్ సో హాట్' అని కామెంట్ చేసేవారు. కానీ పెద్దగా పేరు, ప్రఖ్యాతలు లేని వారు తీయడంతోనే ఈ ఇదంతా చెత్త అని, వారిని తిడుతున్నారు' అని వ్యాఖ్యానించింది.