
2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన 'లస్ట్ స్టోరీస్' మంచి విజయం సాధించింది . దానికి కొనసాగింపుగా తాజాగా వచ్చిందే ‘లస్ట్ స్టోరీస్ 2’. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్ వంటి అగ్ర కథానాయకలు నటించడం విశేషం. గురువారం (జూన్ 29)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీరిస్ ప్రధానంగా యూత్‌నే టార్గెట్ చేసిందనే చెప్పవచ్చు. ఇందులో వేద (మృణాల్ ఠాకూర్) అర్జున్ (అంగద్ బేడీ) ఇరువురు మెప్పిస్తారు. వేద బామ్మగా నీనా గుప్త క్యారెక్టర్ కూడా మెప్పిస్తుంది. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగార జీవితాన్ని రుచి చూడాలని సలహాను వేద బామ్మ ఇవ్వడంతో సీరిస్ ఆసక్తి పెంచుతుంది.
(ఇదీ చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే)
శృంగారం, కామం గురించి పరిణతి చెందిన సంభాషణ చేయడంలో తప్పులేదంటూ తాజాగా ఈ సీరిస్ గురించి మృణాల్ ఠాకూర్ ఇలా చెప్పింది. 'ఈ రోజుల్లో శృంగారం, కామం గురించి ప్రతి ఇంట్లో ఓపెన్‌గా సంభాషణలు జరగడం ఎంతో ముఖ్యమని నేను బలంగా నమ్ముతాను. ముఖ్యంగా ఇంట్లో యుక్త వయసులో ఉన్న వాళ్లతో దీనిపై మాట్లాడటం అవసరం. వాళ్లకు వీటి గురించి సరైన సమాచారం అందించే ఓ రోల్ మోడల్ అవసరం. ఇలాంటి టాపిక్స్ పై ఇంట్లోని పిల్లలకు నిజాయితీగా వివరించే ఒక్క వ్యక్తి ఉన్నా కూడా వాళ్లు బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని స్వీకరించరు' అని మృనాల్ చెప్పింది.
(ఇదీ చదవండి: Ram Charan-Upasana: మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ గిఫ్ట్)
‘సీతారామం’తో అందరికీ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండతో ఓ సినిమా చేయనున్నారు. మరోవైపు నానితో కూడా ఓ సినిమాతో బిజీగా ఉంది ఈ బ్యూటీ.
Comments
Please login to add a commentAdd a comment