రంగుల ప్రపంచంలో అవకాశం రావడమే అదృష్టం! అయితే కొంతమందికి ఎన్ని అవకాశాలు వచ్చినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాదు. ఒకప్పుడు నటి 'రిచా పనయీ' పరిస్థితి కూడా అదే! అందుకే కాస్త విరామం తీసుకొని ఇప్పుడు వెబ్‌దునియాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె గురిం కొన్ని మాటలు...
(ఇదీ చదవండి: Circle Review: ‘సర్కిల్’మూవీ రివ్యూ)
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో పుట్టిన రిచా.. చదువు మొత్తం ఢిల్లీలో సాగింది. మొదట ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసి, తర్వాత మోడల్‌గా మారింది. నటనపై ఆసక్తితో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి.. మలయాళంలో ‘వాడమల్లి’ సినిమాతో రంగప్రవేశం చేసింది. తర్వాత ‘బ్యాంకాక్ సమ్మర్’, ‘వీడుగోల్డ్ ఎహే’, ‘రక్షక భటుడు’, ‘రాగలహరి’ తదితర చిత్రాల్లోనూ నటింంది. అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ సినిమాతో ఆకట్టుకున్న రిచాకు అదే స్థాయిలో సక్సెస్ దక్కలేదు.
కాస్త రూటు మార్చి వెబ్‌దునియాలోకి అడుగుపెట్టింది. 2017లో వచ్చిన ‘క్రాస్‌రోడ్స్’ అనే వెబ్‌సిరీస్ విజయంతో.. రిచాకి కాస్త ఊరటనిచ్చింది. తెర ఏదైనా మంచి పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని గ్రహించి.. కాస్త విరామం తీసుకుంది. ఆ విరామ సమయంలో.. సామాజిక వధ్యమాల్లో ఎప్పటికప్పుడు తన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు చేరువగానే ఉంది. ఐదేళ్ల తర్వాత.. తాజాగా తిరిగి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించింది. జులై 7న రిలీజ్ అయిన ‘సర్కిల్’లో కథానాయికగా మెప్పించింది. సాయి రోనక్ హీరోగా.. దర్శకుడు నీలకంఠ తెరకెక్కిన ఈ సినిమాలో రిచా కాస్త బోల్ట్‌గానే కనిపించింది. సినిమాలో చాలావరకు రొమాంటిక్ సన్నివేశాలు ఉండగా.. అవన్నీ కూడా యూత్‌ని ఆకట్టుకుంటాయి.
(ఇదీ చదవండి: మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్ రూమ్.. ఎంత బాగుందో..)
Comments
Please login to add a commentAdd a comment