‘సర్కిల్‌’తో అవకాశాలు పెరుగుతాయి : అర్షిణ్ మెహతా, రిచా పనై | Sakshi
Sakshi News home page

‘సర్కిల్‌’తో సినిమా అవకాశాలు పెరుగుతాయి : అర్షిణ్ మెహతా, రిచా పనై

Published Sun, Jun 25 2023 3:36 PM

Arshin Mehta, Richa Panai Talk About Circle Movie - Sakshi

‘నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో సినిమా అవకాశం రావడం మా అదృష్టం. నటన పరంగా అతని దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. ‘సర్కిల్‌’ విడుదల తర్వాత మాకు తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని అశిస్తున్నాం’అని హీరోయిన్లు అర్షిణ్ మెహతా, రిచా పనై అన్నారు. నీలకంఠ దర్శకత్వం వహించిన తాజాగా చిత్రం ‘సర్కిల్‌’.  సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా కీలక పాత్రలు పోషించారు. జూలై 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్స్‌ అర్షిణ్ మెహతా, రిచా పనై మీడియాతో ముచ్చటించారు. 

(చదవండి: డ్రెస్‌ కవర్‌ చేసుకోలేక ఇబ్బంది పడ్డ శ్రియా.. వైరల్‌ అయిన వీడియో)

అర్షిణ్ మెహతా మాట్లాడుతూ - సల్మాన్ హీరోగా నటించిన భజ్రంగీ భాయిజాన్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రతో నా కెరీర్ మొదలుపెట్టాను. సర్కిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. ఇప్పటిదాకా ఇక్కడి చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. నీలకంఠ గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. ఆయన చిత్రంలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. నీలకంఠ గారు క్యారెక్టర్, నటన విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఈ సినిమాతో నటిగా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఈ చిత్రంలో ప్రిన్సెస్ పాత్ర నాది. హీరో ఫొటోగ్రాఫర్. వీరి మధ్య జరిగే ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుంది.సాయి రోనక్ మంచి కోస్టార్. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతనితో కలిసి నటించాం. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇక్కడ మంచి అ‌వకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను’అన్నారు.

రిచా పనై మాట్లాడుతూ .. యముడికి మొగుడు, చందమామ కథలు చిత్రాల్లో నటించాక మంచి అవకాశాలు వస్తాయని ఆశించాను కానీ అనుకున్నంతగా సినిమాలు దక్కలేదు. ఇండస్ట్రీకి దూరమవడం ఇష్టం లేక వచ్చిన రెండు మూడు చిత్రాల్లో నటించాను. ఇప్పుడు సర్కిల్ చిత్రంలో నటించాను. ఈ చిత్రంలో దర్శకుడు నీలకంఠ నా క్యారెక్టర్ ను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. బోల్డ్ గా కనిపించే పాత్ర నాది. అయితే డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా చేయలేదు. ఈ సినిమా నటిగా నాకు మంచి పేరు తేవడంతో పాటు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement