Richa Panai
-
సోకులతో సెగలు రేపుతున్న ఐశ్వర్య.. అలాంటి క్రేజీ లుక్‌తో శోభిత!
వైట్ అండ్ వైట్ డ్రస్‌లో కీర్తి సురేశ్ క్యూట్‌నెస్ ముఖం చూపించకుండా ఫన్నీ పోస్ట్ పెట్టిన రష్మిక బాడీకి అతుక్కుపోయే డ్రస్‌తో మెంటలెక్కిస్తున్న ఐశ్వర్య కుర్చీపై కూర్చుని అలాంటి పోజులిచ్చిన హీరోయిన్ శోభిత బీచ్ ఒడ్డున చిల్ అవుతున్న ముద్దుగుమ్మ రిచా పనయ్ సూపర్ హీరోల కోటు గురించి ప్రియమణి ఇంట్రెస్టింగ్ పోస్ట్ తమిళ యంగ్ హీరోయిన్ చీరకట్టు పోజులు.. మరింత క్యూట్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Rahasya (@rahasya_gorak) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) -
ఈ బ్యూటీ గుర్తుందా.. మళ్లీ ఐదేళ్ల తర్వాత బోల్ట్ సీన్స్‌లో రచ్చ చేస్తుంది
రంగుల ప్రపంచంలో అవకాశం రావడమే అదృష్టం! అయితే కొంతమందికి ఎన్ని అవకాశాలు వచ్చినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాదు. ఒకప్పుడు నటి 'రిచా పనయీ' పరిస్థితి కూడా అదే! అందుకే కాస్త విరామం తీసుకొని ఇప్పుడు వెబ్‌దునియాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె గురిం కొన్ని మాటలు... (ఇదీ చదవండి: Circle Review: ‘సర్కిల్’మూవీ రివ్యూ) ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో పుట్టిన రిచా.. చదువు మొత్తం ఢిల్లీలో సాగింది. మొదట ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసి, తర్వాత మోడల్‌గా మారింది. నటనపై ఆసక్తితో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి.. మలయాళంలో ‘వాడమల్లి’ సినిమాతో రంగప్రవేశం చేసింది. తర్వాత ‘బ్యాంకాక్ సమ్మర్’, ‘వీడుగోల్డ్ ఎహే’, ‘రక్షక భటుడు’, ‘రాగలహరి’ తదితర చిత్రాల్లోనూ నటింంది. అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ సినిమాతో ఆకట్టుకున్న రిచాకు అదే స్థాయిలో సక్సెస్ దక్కలేదు. కాస్త రూటు మార్చి వెబ్‌దునియాలోకి అడుగుపెట్టింది. 2017లో వచ్చిన ‘క్రాస్‌రోడ్స్’ అనే వెబ్‌సిరీస్ విజయంతో.. రిచాకి కాస్త ఊరటనిచ్చింది. తెర ఏదైనా మంచి పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని గ్రహించి.. కాస్త విరామం తీసుకుంది. ఆ విరామ సమయంలో.. సామాజిక వధ్యమాల్లో ఎప్పటికప్పుడు తన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు చేరువగానే ఉంది. ఐదేళ్ల తర్వాత.. తాజాగా తిరిగి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించింది. జులై 7న రిలీజ్ అయిన ‘సర్కిల్’లో కథానాయికగా మెప్పించింది. సాయి రోనక్ హీరోగా.. దర్శకుడు నీలకంఠ తెరకెక్కిన ఈ సినిమాలో రిచా కాస్త బోల్ట్గానే కనిపించింది. సినిమాలో చాలావరకు రొమాంటిక్ సన్నివేశాలు ఉండగా.. అవన్నీ కూడా యూత్‌ని ఆకట్టుకుంటాయి. View this post on Instagram A post shared by Richa Panai (@richapanai) (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్ రూమ్.. ఎంత బాగుందో..) -
సర్కిల్లోనూ ఆ ప్రయత్నం కొనసాగించా
‘‘నా సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తాను. ‘షో’లో మంజుల, ‘మిస్సమ్మ’లో లయ, భూమిక, ‘సదా మీ సేవలో’ చిత్రంలో శ్రియ.. ఇలా నా హీరోయిన్ల క్యారెక్టర్స్ బాగుంటాయని అందరూ చెబుతారు. ‘సర్కిల్’లోనూ ఆ ప్రయత్నాన్ని కొనసాగించాను. ఈ సినిమాలో అరుంధతి పాత్రలో రిచా పనై కొత్తగా కనిపిస్తుంది. అర్షిణ్, సాయి రోనక్, బాబా భాస్కర్ కూడా చక్కగా నటించారు’’ అని డైరెక్టర్ నీలకంఠ అన్నారు. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్.వి శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం జూలై 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘నీలకంఠగారితో పని చేయడం ఒక ఛాలెంజ్. ఈ సినిమా షూటింగ్‌ని ఎంజాయ్ చేశాను’’ అన్నారు సాయి రోనక్. ‘‘ఇదొక డిఫరెంట్ మూవీ.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శరత్ చంద్ర. -
‘సర్కిల్’తో అవకాశాలు పెరుగుతాయి : అర్షిణ్ మెహతా, రిచా పనై
‘నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో సినిమా అవకాశం రావడం మా అదృష్టం. నటన పరంగా అతని దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. ‘సర్కిల్’ విడుదల తర్వాత మాకు తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని అశిస్తున్నాం’అని హీరోయిన్లు అర్షిణ్ మెహతా, రిచా పనై అన్నారు. నీలకంఠ దర్శకత్వం వహించిన తాజాగా చిత్రం ‘సర్కిల్’. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా,రిచా పనై, నైనా కీలక పాత్రలు పోషించారు. జూలై 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్స్ అర్షిణ్ మెహతా, రిచా పనై మీడియాతో ముచ్చటించారు. (చదవండి: డ్రెస్ కవర్ చేసుకోలేక ఇబ్బంది పడ్డ శ్రియా.. వైరల్ అయిన వీడియో) అర్షిణ్ మెహతా మాట్లాడుతూ - సల్మాన్ హీరోగా నటించిన భజ్రంగీ భాయిజాన్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రతో నా కెరీర్ మొదలుపెట్టాను. సర్కిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. ఇప్పటిదాకా ఇక్కడి చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. నీలకంఠ గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. ఆయన చిత్రంలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. నీలకంఠ గారు క్యారెక్టర్, నటన విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఈ సినిమాతో నటిగా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఈ చిత్రంలో ప్రిన్సెస్ పాత్ర నాది. హీరో ఫొటోగ్రాఫర్. వీరి మధ్య జరిగే ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుంది.సాయి రోనక్ మంచి కోస్టార్. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతనితో కలిసి నటించాం. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇక్కడ మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను’అన్నారు. రిచా పనై మాట్లాడుతూ .. యముడికి మొగుడు, చందమామ కథలు చిత్రాల్లో నటించాక మంచి అవకాశాలు వస్తాయని ఆశించాను కానీ అనుకున్నంతగా సినిమాలు దక్కలేదు. ఇండస్ట్రీకి దూరమవడం ఇష్టం లేక వచ్చిన రెండు మూడు చిత్రాల్లో నటించాను. ఇప్పుడు సర్కిల్ చిత్రంలో నటించాను. ఈ చిత్రంలో దర్శకుడు నీలకంఠ నా క్యారెక్టర్ ను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. బోల్డ్ గా కనిపించే పాత్ర నాది. అయితే డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా చేయలేదు. ఈ సినిమా నటిగా నాకు మంచి పేరు తేవడంతో పాటు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. -
లైఫ్.. డెత్.. ఫేట్.. ఇదే సర్కిల్
సాయి రోనక్ హీరోగా, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్.వి. శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ‘సర్కిల్’ టీజర్‌ను విడుదల చేశారు. సాయి రోనక్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను ఫొటోగ్రాఫర్ పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘సర్కిల్ ఆఫ్ లైఫ్, సర్కిల్ ఆఫ్ డెత్, సర్కిల్ ఆఫ్ ఫేట్ .. అనే ఈ మూడు అంశాల కలయికయే ఈ చిత్రం. తన జీవితంలో జరిగిన కొన్ని çఘటనల కారణంగా తనకు ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో తెలసుకోలేని సందిగ్థంలో పడే హీరో ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాడన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు నీలకంఠ. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చతుంది. మా తర్వాతి సినిమాను కూడా నీలకంఠగారితోనే చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత శరత్ చంద్ర. -
Richa Panai: సినీనటి రిచా పనయ్ సందడి (ఫొటోలు)
-
‘బృందావనమది అందరిది’ మూవీ స్టిల్స్
-
కట్టప్పకన్నా పెద్ద మిస్టరీ!
‘‘నటుడవ్వాలని చిత్ర పరిశ్రమకొచ్చి, అదృష్టం కలిసి రాక వ్యాపారాలు చేశా. అయినా, సినిమాలపై ఇష్టం పోక నిర్మాతగా మారి, ‘రక్షక భటుడు’ నిర్మించా. నటన మీద ఉన్న మక్కువతో ఈ చిత్రంలో ఓ పాత్ర చేశా’’ అని నిర్మాత ఎ. గురురాజ్ అన్నారు. రిచా పనై, బ్రహ్మానందం, ‘బాహుబలి’ ప్రభాకర్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో గురురాజ్ నిర్మించిన ‘రక్షక భటుడు’ మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ –‘‘ నేను ఆంజనేయస్వామి భక్తుణ్ణి. హనుమత్ జయంతి రోజునే(మంగళవారం) నా బర్త్‌డే రావడం హ్యాపీ. మా చిత్రంలో ఆంజనేయుడి పాత్ర కీలకం. ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడన్నది పెద్ద మిస్టరీ. మా సినిమాలో హనుమంతుడి వేషం ఎవరు వేశారన్నది అంతకంటే పెద్ద మిస్టరీ. దీనికి సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే. మా చిత్రం కుటుంబమంతా చూసేలా ఉంటుంది. ఫస్ట్ లుక్, ట్రైలర్‌తో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. తర్వాతి చిత్రాన్ని ఓ స్టార్ హీరోతో చేయనున్నాం’’ అన్నారు. -
హిందీలో రక్షకభటుడు
‘‘కథే హీరో అంటుంటాం. అందుకే స్టార్ హీరో నటించారా? మినిమమ్ గ్యారంటీ హీరో నటించారా? అనేది పట్టించుకోకుండా కథ విని, మా చిత్రం హిందీ అనువాద హక్కులను ఫ్యాన్సీ రేటు ఇచ్చి, కొన్నారు’’ అని నిర్మాత ఎ. గురురాజ్ అన్నారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘రక్షకభటుడు’. రిచా పనై, బ్రహ్మానందం, ‘బాహుబలి’ ప్రభాకర్, బ్రహ్మాజీ, సుప్రీత్ ముఖ్య తారలు. ఎ. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘కథే ఈ చిత్రానికి అసలైన హీరో. దెయ్యాలని దేవుడు శిక్షిస్తాడంటారు. కానీ, రక్షిస్తాడనే డిఫరెంట్ ఎలిమెంట్‌తో ఈ చిత్రం నిర్మించాం. ఇటీవల విడుదల చేసిన డిజిటల్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ పోస్టర్లో ఆంజనేయస్వామి పోలీస్ గెటప్‌లో కనిపించడం ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. ఫ్యాన్సీ రేట్‌తో హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడుపోవడం ఆనందంగా ఉంది. ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
రక్షకభటుడు... దెయ్యానికి!
దేవుణ్ణి చూస్తే దెయ్యాలకు వణుకు. భయంతో పరుగులు పెడతాయి. అందువల్ల, ఎవరికైనా దెయ్యం పడితే రక్షించమంటూ భక్తులు దేవుణ్ణి శరణు కోరతారు. దేవుడు వాళ్లను రక్షిస్తాడు. పురాణాల నుంచి మన తెలుగు సినిమాల వరకూ వింటున్న కథలు ఈ కోవలోనే ఉంటాయి. బట్ ఫర్ ఏ ఛేంజ్... దేవుడు ఓ దెయ్యాన్ని రక్షిస్తే? ఎలా ఉంటుందో వెండితెరపై చూడమంటున్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. రిచా పనయ్, ‘బాహుబలి’ ప్రభాకర్, పృథ్వీ, సప్తగిరి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ. గురురాజ్ నిర్మిస్తున్న సినిమా ‘రక్షకభటుడు’. రేపటితో చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో కథే హీరో. స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యత ఉంది. 90 శాతం సినిమా అరకు లోయలోని పోలీస్ స్టేషన్ నేపథ్యంలో నడుస్తుంది. సెకండాఫ్‌లో బ్రహ్మానందంగారు కీలక పాత్ర చేశారు. త్వరలో టీజర్ విడుదల చేస్తాం’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. హీరోయిన్ రిచా పనయ్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, కళా దర్శకుడు రాజీవ్ నాయర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఈడు గోల్డ్ ఎహే’ మూవీ స్టిల్స్
-
ఎయిర్‌హోస్టెస్ నుంచి హీరోయిన్గా...
రాజమహేంద్రవరం : తెలుగు చిత్రపరిశ్రమలో తనకు గుర్తింపు వచ్చిందని హీరోయిన్ రిచా పనాయ్ అన్నారు. సునీల్ హీరోగా నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా పాట విడుదల సందర్భంగా రాజమహేంద్రవరం వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘మా సొంతూరు లక్నో. చదువుకునే సమయంలో సినిమాలపై ఆసక్తి కలిగింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్ పనిచేసేదాన్ని. మనసులో ఉన్న కోరికతో సినిమాల్లో ప్రయత్నం చేశా. మలయాళం సినిమా ‘వాడమల్లి’లో తొలి అవకాశం వచ్చింది. తెలుగులో తొలిసారిగా అల్లరి నరేష్ హీరోగా నటించిన యముడికి మొగుడు చిత్రంలో నటించాను. ఆ తర్వాత చందమామ కథలు, మనసును మాయ చేయకే ఉన్నాయి. లవకుశ విడుదలవ్వాలి. డబ్బు అనేది అందరికీ అవసరమే. కాని మంచి పాత్ర వస్తే దానిమాట పక్కనపెడతా. ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాలో మంచిపాత్ర చేశాను. డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. గుర్తింపు వచ్చే ఏ పాత్ర అయినా చేస్తా. నంబర్ వన్ హీరోయిన్గా స్థిరపడతా. ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’ విలేకరుల సమావేశంలో హీరో సునీల్ అశోకా థియేటర్లో పాట విడుదల తాను నటించిన సినిమాలన్నింటిలో ‘ఈడు గోల్డ్ ఎహే’ ఎంతో ఇష్టపడి చేశానని హీరో సునీల్ అన్నారు. ఆ చిత్రం ఆడియో విడుదల సందర్భంగా రాజమహేంద్రవరంలోని షెల్టాన్ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సినిమా యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ మర్యాద రామన్న తర్వాత అంతటి మంచి సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’ అన్నారు. హాస్యం, థ్రిల్, క్రైంతో కూడుకుని కుటుంబ మొత్తాన్ని ఆహ్లాదపరిచేలా కథ ఉంటుందన్నారు. హీరోయిన్ రిచాపనాయ్ మాట్లాడుతూ ఈ చిత్రంతో తనకు పేరు, గుర్తింపు వస్తుందన్నారు. దర్శకుడు వీరు పోట్ల మాట్లాడుతూ రూ.10 కోట్లతో ఈ సినిమా తీశామని, పెద్ద సినిమాల కోవలోనే విలువలు ఎక్కడా తగ్గకుండా తెరకెక్కించామన్నారు. సహాయ నటుడు బెనర్జీ, విలన్ చరణ్ మాట్లాడారు. అనంతరం రాత్రి అశోక థియేటర్లో మూడో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్బంగా హీరో సునీల్‌ను వింటేజ్ క్రియేషన్స్ నిర్వాహకుడు జేకే రామకృష్ణ పూలమాలలతో అభినందించారు. -
వైజాగ్‌లో ఈడు గోల్డ్ ఎహే!
సందడి చేసిన సునీల్,రీచాఫనయ్ ‘కోపాలెందుకు బాబాయ్’ పాట విడుదల పెదవాల్తేరు/మద్దిలపాలెం : ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈడు గోల్డ్ ఎహే!’ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా నిలుస్తుందని చిత్ర హీరో సునీల్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో రెండో పాట ‘కోపాలెందుకు బాబాయ్’ను గురువారం మద్దిలపాలెం సీఎంఆర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్లో హీరో సునీల్‌తోపాటు,హీరోయిన్ రీచాఫనయ్ దర్శకుడు వీరుపోట్ల,సీనియర్ నటుడు బెనర్జీ,ప్రతినాయకుడు చరణ్ పాల్గొన్నారు. పాటకు అనుగుణంగా తనదైన శైలిలో సునీల్, రీచా చిందులేశారు.ఐలవ్యూ వైజాగ్ అంటూ ఫ్లయింగ్ కిస్‌లతో రీచా విశాఖ కుర్రకారును ఉర్రూతలూగించారు. ఈసందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. అంతకుముందు 93.5 రెడ్ ఎఫ్.ఎం.లో రెండోపాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. కార్యక్రమంలో రెడ్ ఎఫ్ఎం ఆర్జేలు షామిలి,రోహిత్,అనూష,ప్రదీప్,క్రిష్ణ పాల్గొన్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ‘ఈడు గోల్డ్ ఎహే!’ చిత్రం అందరిని అలరిస్తుంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించిన సునీల్‌కు అందాలరాముడు తరువాత మర్యాదరామన్న అంతటి హిట్ ఈ చిత్రం సాధించడం గ్యారంటీ.-దర్శకుడు వీరుపోట్లా నాది వైజాగే.. ఈడు గోల్డ్ ఎహే! చిత్రంలో పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ పాటలన్నీ నేనే రాశాను. నా సొంతూరు వైజాగే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. ఈచిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను. -గీతరచయిత బాలాజీ నా తొలి చిత్రం షూటింగ్ గీతంలోనే.. వెండితెరపై నా తొలి అడుగు పడింది వైజాగ్‌లోనే. తొలి చిత్రం పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం షూటింగ్ గీతం యూనివర్సిటీలో జరిగింది. అందులో హీరో స్నేహితులు బృందంలో నేను ఒకడిగా నటించాను. చిత్రరంగంలోకి వెళ్లకు ముందు వైజాగ్‌లో చాలా కాలం ఉన్నాను. నాకు ఇక్కడ చుట్టాలు చాలా మంది ఉన్నారు. తెరకు పరిచయం అయిన తరువాత నన్ను ఎంతగానో ఆదరిస్తున్నది మాత్రం వైజాగ్ వాసులే. అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదలకానుంది. - హీరో సునీల్ -
సునీల్ సరసన ఇద్దరు హీరోయిన్లు!
చెన్నై ఒక హీరోయిన్ కంటే ఇద్దరైతే లక్ అని భావించారో ఏమో గానీ.. సునీల్ హీరోగా 'ఈడు గోల్డ్ ఎహే' సినిమాకు ఇద్దరు హీరోయిన్లను పెట్టారు. సుష్మా రాజ్, రిచా పనాయ్.. ఈ ఇద్దరు అమ్మాయిలు సునీల్ సరసన నటిస్తారని సినిమా వర్గాలు తెలిపాయి. పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్లికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా 'ఈడు గోల్డ్ ఎహే'. ఇందులో హీరోయిన్లిద్దరినీ ఇటీవలే కన్ఫమ్ చేశామని, ఈ సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. సినిమాను రెండు నెలల్లో పూర్తిచేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈలోపు సునీల్ హీరోగా నటించిన మరో సినిమా 'కృష్ణాష్టమి' విడుదల కావాల్సి ఉంది. -
లవకుశ ఆడియో విడుదల
-
నచ్చినట్టు జీవిస్తా..
హ్యాపీగా, జోవియల్‌గా ఉండడం తనకు నచ్చుతుందని, జీవితాన్ని నచ్చినట్టు గడపడమే ఇష్టమని అంటోంది టాలీవుడ్ హీరోయిన్ రిచాపనై. యుముడికి మొగుడు (కొత్తది) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిచా... డిసెంబరు 31న నానక్‌రాం గూడలోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్న న్యూ ఇయర్ ఈవెంట్ ఎనౌన్స్మెంట్ కార్యక్రమంలో పాల్గొంది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ‘సిటీప్లస్’తో తన మనోభావాలిలా పంచుకుంది... మాది ఉత్తరాఖండ్. పుట్టి పెరిగింది లక్నో. చదువుకుంటూ ఉండగా మోడలింగ్ చేసేదాన్ని. ట్వల్త్ స్టాండర్డ్‌లో మిస్ లక్నోగా ఎన్నికయ్యా. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశా. కలలు కన్న విధంగానే ఎయిర్‌హోస్టెస్ అయ్యా. అయితే మోడలింగ్‌ను మాత్రం వదలలేక హాబీగా కంటిన్యూ చేశా. కొన్ని జ్యువెలరీ యాడ్స్ ద్వారా నన్ను చూసిన నిర్మాతలు ‘యుముడికి మొగుడు’ ఆఫర్ ఇచ్చారు. అలా సినీనటిని అయిపోయా. కంఫర్ట్‌గా... అది 100 రూపాయల డ్రెస్ కావచ్చు, టెన్ థౌజెండ్ వర్త్ కావచ్చు... కంఫర్ట్‌గా మనం క్యారీ చేయగలిగితేనే దాని లుక్ ఆకట్టుకుంటుంది. విభిన్న రకాల డ్రెస్‌లు ఉండడం ఆడపిల్లల అదృష్టం అనే చెప్పాలి. వెరైటీ డ్రెస్సింగ్ అంటే నాకు ఇష్టం. ఉన్న ఒకే ఒక్క జీవితాన్ని హ్యాపీగా నచ్చినట్టు జీవించాలనుకుంటాను. ఇది పార్టీల సీజన్... క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను మిస్ కాను. ట్రీ డెకరేషన్, ఇంటి పైన స్టార్స్... రిలెటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో సరదాలు... గ్రీటింగ్ కార్డ్స్, న్యూ ఇయర్ విషెస్... ఓహ్... భలే సందడిగా ఉంటుంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఈ వేడుకల్ని హైదరాబాద్‌లో సెలబ్రేట్ చేసుకోవడమంటే నాకు బాగా ఇష్టం. లక్నో కన్నా ఇక్కడి వెదర్ చాలా బాగుంటుంది. రాజమౌళి దర్శకత్వం అద్భుతం. మహేష్‌బాబుతో నటించడం నా డ్రీమ్. - శిరీష చల్లపల్లి -
చందమామ కథలు మూవీ స్టిల్స్
-
ఎనిమిది కథలతో...
‘‘అందం, బంధం, బాంధవ్యం, నమ్మకం, అబద్ధం, మోసం, ఆశ, పేదరికం.. ఈ ఎనిమిది అంశాలు మానవ జీవితాన్ని బలంగా ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలను ఒక్కో కోణంలో ఆవిష్కరిస్తూ ఈ సినిమాని రూపొందించాం’’ అని ప్రవీణ్ సత్తారు అన్నారు. లక్ష్మీప్రసన్న, చైతన్యకృష్ణ, సీనియర్ నరేష్, ఆమని, రిచా పనై, షామిలి, ఇషా ముఖ్య తారలుగా వర్కింగ్ డ్రీమ్స్ పతాకంపై చాణక్య బూనేటి నిర్మించిన చిత్రం ‘చందమామ కథలు’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ పాటలు స్వరపరిచారు. పాటలను ఈ నెల 17న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘నిత్య జీవితంలో చూసే వ్యక్తులు, సంఘటనల సమాహారంతో ఈ చిత్రం చేశాం. ఎనిమిది కథలను అనుసంధానిస్తూ చేసిన సరికొత్త ప్రయోగం ఇది. ఓ రచయిత దృష్టి కోణంలోంచి సాగే చిత్రం. ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేసే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు. -
ప్రేమలో మలుపులు
తొలి ప్రేమ ఎంతో మధురమైనది. ఆ మధురమైన ప్రేమను మూడు ముళ్ల బంధంగా మార్చుకోవాలనుకుంది ఓ జంట. కానీ, కథ వేరే మలుపు తిరిగింది? ఆ మలుపు ఎలాంటిది? ఆ యువతీ యువకుడు తమ ప్రేమను సఫలం చేసుకోగలిగారా? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మనసును మాయ సేయకే’. ప్రిన్స్, రిచా పనయ్, దిశా పాండే, సేతు ముఖ్య తారలుగా ఫుల్హౌస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జెసన్ పులికొట్టిల్, విన్స్ మాంగ్డన్ నిర్మించారు. సురేష్ పి. కుమార్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం డీటీయస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో రూపొందించాం. ప్రిన్స్, సేతు అద్భుతంగా నటించారు. మణికాంత్ కద్రి స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. -
'మనసు మాయ సేయకే'
ప్రిన్స్, రిచా పనయ్, దిశాపాండే, సేతు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మనసు మాయ సేయకే' రివేంజ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాకు సురేష్ పి కుమార్ దర్శకుడ ఆగస్టు 14న 'మనసు మాయ సేయకే' ఆడియో విడుదలకానుంది.