నచ్చినట్టు జీవిస్తా.. | I like my own life: Richa panai | Sakshi
Sakshi News home page

నచ్చినట్టు జీవిస్తా..

Published Wed, Dec 24 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

నచ్చినట్టు జీవిస్తా..

నచ్చినట్టు జీవిస్తా..

హ్యాపీగా, జోవియల్‌గా ఉండడం తనకు నచ్చుతుందని, జీవితాన్ని నచ్చినట్టు గడపడమే ఇష్టమని అంటోంది టాలీవుడ్ హీరోయిన్ రిచాపనై. యుముడికి మొగుడు (కొత్తది) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిచా... డిసెంబరు 31న నానక్‌రాం గూడలోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్న న్యూ ఇయర్ ఈవెంట్ ఎనౌన్స్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొంది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ‘సిటీప్లస్’తో తన మనోభావాలిలా పంచుకుంది...  
 
 మాది ఉత్తరాఖండ్. పుట్టి పెరిగింది లక్నో. చదువుకుంటూ ఉండగా మోడలింగ్ చేసేదాన్ని. ట్వల్త్ స్టాండర్డ్‌లో మిస్ లక్నోగా ఎన్నికయ్యా. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశా. కలలు కన్న విధంగానే ఎయిర్‌హోస్టెస్ అయ్యా. అయితే మోడలింగ్‌ను మాత్రం వదలలేక హాబీగా కంటిన్యూ చేశా. కొన్ని జ్యువెలరీ యాడ్స్ ద్వారా నన్ను చూసిన నిర్మాతలు ‘యుముడికి మొగుడు’ ఆఫర్ ఇచ్చారు. అలా సినీనటిని అయిపోయా.
 
 కంఫర్ట్‌గా...
 అది 100 రూపాయల డ్రెస్ కావచ్చు, టెన్ థౌజెండ్ వర్త్ కావచ్చు... కంఫర్ట్‌గా మనం క్యారీ చేయగలిగితేనే దాని లుక్ ఆకట్టుకుంటుంది. విభిన్న రకాల డ్రెస్‌లు ఉండడం ఆడపిల్లల అదృష్టం అనే చెప్పాలి. వెరైటీ డ్రెస్సింగ్ అంటే నాకు ఇష్టం. ఉన్న ఒకే ఒక్క జీవితాన్ని హ్యాపీగా నచ్చినట్టు జీవించాలనుకుంటాను.
 
 ఇది పార్టీల సీజన్...
 క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను మిస్ కాను. ట్రీ డెకరేషన్, ఇంటి పైన స్టార్స్... రిలెటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో సరదాలు... గ్రీటింగ్ కార్డ్స్, న్యూ ఇయర్ విషెస్... ఓహ్... భలే సందడిగా ఉంటుంది. అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. ఈ వేడుకల్ని హైదరాబాద్‌లో సెలబ్రేట్ చేసుకోవడమంటే నాకు బాగా ఇష్టం. లక్నో కన్నా ఇక్కడి వెదర్ చాలా బాగుంటుంది. రాజమౌళి దర్శకత్వం అద్భుతం. మహేష్‌బాబుతో నటించడం నా డ్రీమ్.
 -  శిరీష చల్లపల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement