కట్టప్పకన్నా పెద్ద మిస్టరీ! | Rakshaka Bhatudu movie release on may 5th | Sakshi
Sakshi News home page

కట్టప్పకన్నా పెద్ద మిస్టరీ!

Published Mon, Apr 10 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

కట్టప్పకన్నా పెద్ద మిస్టరీ!

కట్టప్పకన్నా పెద్ద మిస్టరీ!

‘‘నటుడవ్వాలని చిత్ర పరిశ్రమకొచ్చి, అదృష్టం కలిసి రాక వ్యాపారాలు చేశా. అయినా, సినిమాలపై ఇష్టం పోక నిర్మాతగా మారి, ‘రక్షక భటుడు’ నిర్మించా. నటన మీద ఉన్న మక్కువతో ఈ చిత్రంలో ఓ పాత్ర చేశా’’ అని నిర్మాత ఎ. గురురాజ్‌ అన్నారు. రిచా పనై, బ్రహ్మానందం, ‘బాహుబలి’ ప్రభాకర్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో గురురాజ్‌ నిర్మించిన ‘రక్షక భటుడు’ మే 5న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ –‘‘ నేను ఆంజనేయస్వామి భక్తుణ్ణి. హనుమత్‌ జయంతి రోజునే(మంగళవారం) నా బర్త్‌డే రావడం హ్యాపీ. మా చిత్రంలో ఆంజనేయుడి పాత్ర కీలకం. ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడన్నది పెద్ద మిస్టరీ. మా సినిమాలో హనుమంతుడి వేషం ఎవరు వేశారన్నది అంతకంటే పెద్ద మిస్టరీ. దీనికి సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే. మా చిత్రం కుటుంబమంతా చూసేలా ఉంటుంది. ఫస్ట్‌ లుక్, ట్రైలర్‌తో సినిమాకు మంచి క్రేజ్‌ వచ్చింది. తర్వాతి చిత్రాన్ని ఓ స్టార్‌ హీరోతో చేయనున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement