లైఫ్‌.. డెత్‌.. ఫేట్‌.. ఇదే సర్కిల్‌ | Circle Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

లైఫ్‌.. డెత్‌.. ఫేట్‌.. ఇదే సర్కిల్‌

Jun 6 2023 4:24 AM | Updated on Jun 6 2023 4:24 AM

Circle Movie Teaser Launch - Sakshi

సాయి రోనక్‌ హీరోగా, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్‌’. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్‌.వి. శరత్‌ చంద్ర, టి. సుమలత అన్నిత్‌ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ‘సర్కిల్‌’ టీజర్‌ను విడుదల చేశారు. సాయి రోనక్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను ఫొటోగ్రాఫర్‌ పాత్ర చేశాను’’ అన్నారు.

‘‘సర్కిల్‌ ఆఫ్‌ లైఫ్, సర్కిల్‌ ఆఫ్‌ డెత్, సర్కిల్‌ ఆఫ్‌ ఫేట్‌ .. అనే ఈ మూడు అంశాల కలయికయే ఈ చిత్రం. తన జీవితంలో జరిగిన కొన్ని çఘటనల కారణంగా తనకు ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో తెలసుకోలేని సందిగ్థంలో పడే హీరో ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాడన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు నీలకంఠ. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చతుంది. మా తర్వాతి సినిమాను కూడా నీలకంఠగారితోనే చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత శరత్‌ చంద్ర. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement