
సాయి రోనక్, అర్షిణ్ మెహతా, బాబా భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకుడు.ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగాఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ 'సర్కిల్ ఆఫ్ లైఫ్', అనే టైటిల్ సాంగ్‌ను విడుదల చేసారు.
జీవితం మరియు దాని అనిశ్చితి గురించి మాట్లాడే పెప్పీ ఫాస్ట్ బీట్ నంబర్ గా వచ్చిన ఈ పాట అందరిని అలరిస్తోంది. ఇక ఈ సింగల్ వీడియో సినిమాలోని విభిన్న సన్నివేశాల విజువల్స్‌ని చూపించి, సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment