Baba Bhaskar
-
గతంలో నా చిత్రాల్లో ఈ బ్యాలెన్స్ లేదు: ప్రముఖ డైరెక్టర్
'కాన్సెప్ట్, కమర్షియల్ అంశాలను బాగా బ్యాలెన్స్ చేయాలి. అయితే నా గత చిత్రాలకు ఈ బ్యాలెన్స్‌ను మిస్సయ్యానని అనుకుంటున్నా. బాలచందర్గారివంటి పెద్ద దర్శకుల కమర్షియల్ చిత్రాలు ఆడియన్స్‌ను అలరిస్తూనే కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా ఉండేవి. ‘సర్కిల్’ సినిమాకి ఆ బ్యాలెన్స్ మిస్ కాకుండా జాగ్రత్త తీసుకుని, చేశాను' అన్నారు దర్శకుడు నీలకంఠ. సాయిరోనక్, బాబా భాస్కర్ ప్రధాన పాత్రల్లో అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్’. ఎమ్వీ శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నీలకంఠ మాట్లాడుతూ– ‘‘సర్కిల్’ ఎమోషనల్ థ్రిల్లర్ ఫిల్మ్. విధి వందమందిని ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి వారి జీవితాలను ఎలా అల్లకల్లోలం చేసింది? అన్నదే కాన్సెప్ట్. ఈ చిత్రంలో ఫొటోగ్రాఫర్ పాత్రలో నటించిన సాయి రోనక్ అనూహ్యమైన ఘటనల్లో ఎలా చిక్కుకున్నాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఆడియన్స్ సినిమాలను చూసే విధానంలో మార్పు వచ్చింది. నా తరహా సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో.. ఇది నా టైమ్ ఏమో అనిపిస్తోంది. ‘సర్కిల్’ ప్రేక్షకులకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇక నా కెరీర్లో నేను గ్యాప్ ఇవ్వలేదు... ఇవ్వబడింది. ‘మాయ’ సినిమాను మహేశ్ భట్‌గారు హిందీలో తీయాలనుకున్నారు.. కుదర్లేదు. ఓ రెండు ప్రాజెక్ట్స్ సెట్స్‌కు వెళ్లే టైమ్‌లో ఆగిపోయాయి. స్వామి వివేకానందగారి జీవితంతో వెంకటేశ్‌గారితో ఓ ప్రాజెక్ట్ అనుకున్నాను.. కుదర్లేదు. కానీ ఆయన నటించిన ‘ఈనాడు’కు డైలాగ్స్ రాశాను. హిందీ ‘క్వీన్’ మలయాళ రీమేక్ చేశాను. ఓ సోషల్ డ్రామా, పీరియాడికల్ సబ్జెక్ట్స్‌తో వెబ్ సిరీస్‌ల్లానే ఉంది’’ అన్నారు. -
Circle:శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో ఏం చేశాడు?
ఓ ఫొటోగ్రాఫర్ తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో ఉంటాడు. అప్పుడు అతనేం చేశాడు? అనేది ‘సర్కిల్’ చిత్రం ప్రధాన ఇతివృత్తం. సాయి రోనక్, బాబా భాస్కర్ ప్రధాన పాత్రల్లో అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా, పార్థవ సత్య కీలక పాత్రలు చేశారు. ఫొటోగ్రాఫర్‌గా సాయి రోనక్ చేశారు. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్వీ శరత్ చంద్ర, టి. సుమలత, అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం జూలై 7 రిలీజ్ కానుంది. ఒక ఫొటోగ్రాఫర్ జీవితం చుట్టూ అల్లుకున్న కథతో ‘సర్కిల్’ సినిమా తెరకెక్కింది. తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో కథానాయకుడు ఏం చేశాడనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారు దర్శకుడు నీలకంఠ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతున్నారు. -
ఆకట్టుకుంటున్న ‘సర్కిల్ ఆఫ్ లైఫ్’ సాంగ్
సాయి రోనక్, అర్షిణ్ మెహతా, బాబా భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకుడు.ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగాఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ 'సర్కిల్ ఆఫ్ లైఫ్', అనే టైటిల్ సాంగ్‌ను విడుదల చేసారు. జీవితం మరియు దాని అనిశ్చితి గురించి మాట్లాడే పెప్పీ ఫాస్ట్ బీట్ నంబర్ గా వచ్చిన ఈ పాట అందరిని అలరిస్తోంది. ఇక ఈ సింగల్ వీడియో సినిమాలోని విభిన్న సన్నివేశాల విజువల్స్‌ని చూపించి, సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
లైఫ్.. డెత్.. ఫేట్.. ఇదే సర్కిల్
సాయి రోనక్ హీరోగా, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్.వి. శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ‘సర్కిల్’ టీజర్‌ను విడుదల చేశారు. సాయి రోనక్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను ఫొటోగ్రాఫర్ పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘సర్కిల్ ఆఫ్ లైఫ్, సర్కిల్ ఆఫ్ డెత్, సర్కిల్ ఆఫ్ ఫేట్ .. అనే ఈ మూడు అంశాల కలయికయే ఈ చిత్రం. తన జీవితంలో జరిగిన కొన్ని çఘటనల కారణంగా తనకు ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో తెలసుకోలేని సందిగ్థంలో పడే హీరో ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాడన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు నీలకంఠ. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చతుంది. మా తర్వాతి సినిమాను కూడా నీలకంఠగారితోనే చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత శరత్ చంద్ర. -
అదే నా కోరిక..దాని కోసం ఎంత కష్టమైన భరిస్తా : బాబా భాస్కర్
కోరియోగ్రాఫర్ , డ్యాన్సర్ , యాక్టర్...ఇలా ఏదైనా సరే నాకు సినిమానే జీవితం. సినిమానే నా డ్రీమ్. ఎవరు ఏ అవకాశం ఇచ్చినా చేస్తాను’అని కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ అన్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఈ సినిమాలో హీరోకి స్నేహితుడుగా కీలక పాత్రలో నటించాను. కిరణ్ తో పని చేయడం చాలా సులువుగా ఉంది. తను అందరితో బాగా కలసి పోతాడు.చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె కు కథ విషయంలో మంచి స్పష్టత ఉంది. ఈ సినిమా కొరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన కోడిరామకృష్ణ బ్యానర్ లో నటించడం చాలా హ్యాపీ గా ఉంది ► ఈ చిత్రంలో నటిస్తూనే లాయర్ పాప సాంగ్ కు కోరియోగ్రఫీ చేశాను.ఈ పాట ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.. నాకు కోరియోగ్రఫీ, యాక్టింగ్ అనేవాటిని వేరుగా చూడకుండా .రెండు సేమ్ అని భావిస్తాను.అయితే నాకు ఎవరు ఏ అవకాశం ఇచ్చినా చేస్తాను. చివరికి చిన్న క్యారెక్టర్ అయినా చెయ్యాలనే కోరిక ఉంది. ►నేను ఒక సినిమా డైరెక్షన్ చేశాను. ఆ తరువాత కూడా డైరెక్షన్ చేయాలని చాలా కథలు సెలెక్ట్ చేసుకొంటున్నాను. టైమ్ సెట్ అయితే వెంటనే సినిమా చేస్తాను. కోరియోగ్రాఫర్ గా రాష్ట్ర జాతీయ పురస్కారాలు అందుకోవాలనేది నా కోరిక దానికోసం చాలా కష్టపడ్డాను. ఇకపై కూడా కష్టపడతాను. ► కొత్త చిత్రాల విషయానికొస్తే.. తెలుగులో నీలకంఠం గారు చేసే సినిమాలో మంచి క్యారెక్టర్ లో చేస్తున్నాను. తమిళ్ లో ఒక సినిమాకు కోరియోగ్రఫీ చేస్తున్నాను. -
డబ్బులు పట్టుకుని పోదామనుకున్నా: బాబా భాస్కర్
Bigg Boss Non Stop Telugu Grand Finale: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో గ్రాండ్ ఫినాలే జోరుగా ప్రారంభమైంది. ఈషోలో బాబా భాస్కర్ మాస్టర్ ప్రయాణం ముగిసిపోయింది. టాప్ 7 నుంచి అనిల్ రాథోడ్ ఎలిమినేట్ కాగా తర్వాత సత్యదేవ్ చేతుల మీదుగా బాబా బాస్కర్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. బాబా మాస్టర్ స్టేజ్‌పైకి వస్తూనే ఆయన భార్య రేవతికి దండం పెట్టేశాడు. ఇది గమనించిన నాగార్జున భలే కవర్ చేస్తున్నావ్ కదా ? అన్నట్లుగా సెటైర్ వేశాడు. దీని తర్వాత బాబా మాస్టార్ తన అనుభూతి గురించి తెలిపాడు. ఈ సీజన్ కంటే ముందుగా వచ్చిన సీజన్ అనుభవం బాగుంది. అప్పుడు మాకేం తెలియదు. కానీ ఈ సీజన్‌కు వచ్చే సరికి అంత ఎగ్జైట్మెంట్ లేదు. బిగ్‌బాస్ గురించి అంతా తెలుసు కాబట్టి అలా అనిపించలేదు. అయితే ఈ షోకు రావడం ఆనందగా ఉంది. సీక్రెట్ రూమ్‌లో ఉండటం, ఎవిక్షన్ పాస్ రావడం అన్ని బాగున్నాయి. కానీ శ్రీకాంత్ లోపలకు వస్తాడేమో, డబ్బులు పట్టుకుని పోదామనుకున్నా. అలా జరగలేదు. అదొక్క అసంతృప్తి మాత్రమే ఉంది. తర్వాత విన్నర్ ఎవరు అవుతారని నాగార్జున అడగ్గా, ముందుగా బిందు అని సమాధానం ఇచ్చాడు బాబా మాస్టర్. తర్వాత మళ్లీ శివ, అఖిల్ పేర్లు చెప్పాడు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కావాలని అన్నట్లుగా తెలిపాడు. -
బాబా భాస్కరా? మజాకా? నేరుగా ఫినాలేలోకి!
బిగ్‌బాస్ షోను రక్తికట్టించేవి నామినేషన్స్, ఎలిమినేషన్సే! అయితే కొన్నిసార్లు ఎలిమినేషన్ కూడా కంటెస్టెంట్ల చేతిలోనే ఉంటుంది. అందుకు నేటి ఎపిసోడ్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ హౌస్మేట్స్ అందరినీ వెనక్కు నెట్టుతూ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచాడు. దీన్ని డేంజర్ జోన్లో ఉన్న అరియానా, అషూలలో ఎవరికోసమైనా వాడొచ్చని నాగ్ చెప్పాడు. ఈ మేరకు ప్రోమో కూడా రిలీజైంది. అంటే ఈ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోవాలా? వద్దా? అన్నది బాబా భాస్కర్ చేతిలో ఉంది. అయితే నాగ్ ఇక్కడే ఓ మెలిక పెట్టాడు. ఈసారి తనెలాగో నామినేషన్స్‌లో లేడు కాబట్టి ఈ వారం ఎవరినైనా సేవ్ చేయడానికి ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడొచ్చు, లేదంటే వచ్చేవారం తను నామినేషన్స్ నుంచి గట్టెక్కడానికి వాడుకోవచ్చు అని చెప్తాడు. ఇంత మంచి అవకాశం ఇచ్చాక ఇంకా ఎవరికోసమో ఎందుకు పాస్ వాడతాడు. ఛాన్సే లేదు, నెక్స్ట్ వీక్ తనకోసం వాడుకుంటానని అతడు ముక్త కంఠంతో చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో తక్కువ ఓట్లు పడ్డ అషూ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఎలాగో బాబా సోమవారం తన పాస్ వాడుకుంటాడు కాబట్టి వచ్చేవారం(11వ వారం) నామినేషన్లో ఉండడు. ఒకవేళ 11వ వారం మధ్యలో సడన్ ఎలిమినేషన్ ఉన్నా, వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ ఉన్నా బాబా భాస్కర్ నేరుగా టాప్ 6లో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన బాబా బిగ్‌బాస్ ఓటీటీలో ఫస్ట్ ఫైనలిస్టుగా చరిత్ర సృష్టించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ షో నుంచి ఆమె ఎలిమినేట్ -
బిగ్‌బాస్ హౌస్‌లో సన్నీ, అతడే ఎవిక్షన్ ఫ్రీ పాస్ విన్నర్!
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ యాంకర్ శివ నెత్తిన దరిద్రం తాండవం చేస్తోంది. అందుకే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీదారుడిగా నిలిచేందుకు ఎంత కష్టపడ్డా ఫలితం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం అఖిల్, అనిల్, బాబా, బిందు మాధవి పోటీపడ్డారు. వీరిలో బాబా భాస్కర్ పాస్ గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాస్ బాబా ఎవరికోసం ఉపయోగిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక హౌస్‌లో ఇప్పటికే సిరి, షణ్ముఖ్, రవి, మానస్ రాగా తాజాగా విన్నర్ సన్నీ వచ్చాడు. అతడి రాకతో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అతడిని ఆటపట్టిస్తూ స్విమ్మింగ్ పూల్‌లో నెట్టేశారు. అయినా సరే సన్నీ పూల్‌లోనూ డ్యాన్స్ చేస్తూ తగ్గేదేలే అని నిరూపించాడు. మరి సన్నీ ఎంటర్టైన్మెంట్, హౌస్మేట్స్ గేమ్ చూడాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఆ డైరెక్టర్స్ మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడుకుంటారు.. ఫ్యాన్స్‌కు మహేశ్‌బాబు రిక్వెస్ట్, సోషల్ మీడియాలో లేఖ వైరల్ -
అమ్మాయిలా, రాక్షసులా? మిత్ర చేయి విరగ్గొట్టేలా ఉన్నారే!
బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో మరింత రసవత్తరంగా మారింది. ఆయన వచ్చీరావడంతోనే బిందుమాధవిని సేవ్ చేయడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా అతడు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో సంచాలక్‌గా ఉన్నాడు. అరియానా, హమీదా, బిందుమాధవి, అజయ్, నటరాజ్ మాస్టర్ ఏలియన్స్ టీమ్‌లో, మిగిలినవారంతా హ్యూమన్స్ టీమ్‌లో ఉన్నారు. ఏలియన్స్ దగ్గర ఉన్న బ్యాటరీలను దొంగిలించి పగలగొట్టడం హ్యూమన్స్ పనైతే వారి చేతులకు రంగు పూయడం ఏలియన్స్ పని. ఈ టాస్క్ కోసం రక్తాలు కారేలా ఆడారు హౌస్మేట్స్. అమ్మాయిలా, ఆటంబాంబులా అనేలా రెచ్చిపోయారు ఏలియన్స్ టీమ్ సభ్యులు. అయితే ఈ క్రమంలో వారు గేమ్‌లో శృతి మించిపోయినట్లు కనిపిస్తోంది. హ్యూమన్స్ టీమ్‌లోని మిత్ర శర్మను దొరపుచ్చుకుని ఆమె చేతికి రంగు పూయాలని భావించింది ఏలియన్స్ టీమ్. అనుకున్నదే తడవు పదేపదే ఆమెను టార్గెట్ చేస్తూ దాడి చేసింది. ఆమె చేయి పట్టుకుని లాగుతూ, కిందపడేస్తూ నానారచ్చ చేశారు. కిందపడేసినప్పుడు తనకు దెబ్బలు తాకినా ఏమాత్రం పట్టించుకోకుండా బిందు మాధవి ఆమె చేయి పట్టుకుని లాగింది. ఒకరకంగా చెప్పాలంటే హమీదా, అరియానా, బిందు ఆమెను హింసించారు. దీంతో సోషల్ మీడియాలో వీరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె చేయి విరగ్గొట్టేలా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిత్ర అవస్థను గుర్తించిన బాబా భాస్కర్వెంటనే వెళ్లి జుట్టు సరిచేసి చెమట తుడిచి గేమ్ పాజ్ చేశాడు. అటు అఖిల్ ఆమె షర్ట్ పైకి పోవడంతో దాన్ని కిందకు సరిచేశాడు. వీళ్లిద్దరూ అంత మానవత్వంతో ప్రవర్తిస్తుంటే ఆ ముగ్గురు మాత్రం మరీ దారుణంగా వ్యవహరించారని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. మిత్ర గేమ్ ఆడిన విధానం బాగుందని మెచ్చుకుంటున్నారు. చదవండి: యశ్ నుంచి ప్రకాశ్ రాజ్ దాకా.. కేజీఎఫ్ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే? నన్ను కొట్టింది, నేనూ కొడ్తా: మిత్ర వెనకాల హమీదా పరుగు -
బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్‌గా!
బాబా భాస్కర్.. బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఈయన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. చెన్నైలో పుట్టి పెరిగిన ఆయనకు చిన్ననాటి నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. ఈ ఇష్టంతోనే అతడు శివ శంకర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా కొన్నేళ్లు పని చేశాడు. తర్వాత సుందరం మాస్టార్‌కు అసిస్టెంట్‌గా చేరాడు. వీళ్లిద్దరూ బాబాకు సినిమా కొరియోగ్రఫీలో ఓనమాలు నేర్పించారు. పాటను ఎలా కొరియోగ్రఫీ చేయాలనేదాన్ని వారి దగ్గరి నుంచే నేర్చుకున్నాడు. తెలుగు, తమిళ చిత్రాల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ఆరంభించిన బాబా భాస్కర్ కొత్త బంగారు లోకంతో కొరియోగ్రాఫర్‌గా మారాడు. కేడీ సినిమాతో కోలీవుడ్‌లోనూ కొరియోగ్రాఫర్‌గా అడుగుపెట్టాడు. ఆ సినిమాతో బాబా ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్, సిద్దార్థ్, కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా, విశాల్ వంటి ఎందరో స్టార్ హీరోలతో స్టెప్పులేయించాడు బాబా. తెలుగులో మహేశ్ బాబు, రామ్‌చరణ్, నాగార్జున వంటి బడా హీరోల సినిమాలకు సైతం కొరియోగ్రఫీ చేశాడు. ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తోన్న బాబా భాస్కర్ గతంలో బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్నాడు. అయితే అప్పుడు ఫినాలేకు అడుగు దూరంలో ఆగిపోయిన ఆయన తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో అడుగు పెట్టాడు. ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన టాప్ 5లో చోటు దక్కించుకుంటాడేమో చూడాలి! -
బిగ్‌బాస్ షోలో బాబా భాస్కర్, కాకపోతే ఓ ట్విస్ట్!
బాబా భాస్కర్.. బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. మూడో సీజన్లో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. శ్రీముఖితో చేసిన కామెడీకి జనాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. కొరియోగ్రాఫర్ బాబాలో కామెడీ యాంగిల్ కూడా ఉందని నిరూపించాడు. ఇప్పుడు ఈయన పేరు ఎందుకు ప్రస్తావించామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. తాజాగా అతడు బిగ్‌బాస్ ఓటీటీలోనూ అడుగుపెట్టాడు. ఈ మేరకు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది. నా ఇంటికి వచ్చేశాను అంటూ సంతోషం వ్యక్తం చేశాడు బాబా. అతడి ఎనర్జీని చూసి ఆశ్చర్యపోయిన నాగ్ మీరు ముదురులా ఉన్నారే అంటూ పంచ్ వేశాడు. ఇదిలా ఉంటే ఈరోజు మహేశ్ విట్టా ఎలిమినేట్ అవనున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అనంతరం రేపటి నామినేషన్స్ పర్వం ముగిశాక బాబాను హౌస్‌లోకి పంపించనున్నారట. అప్పటివరకు అతడిని సీక్రెట్ రూమ్‌లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. మరి షో ప్రారంభమైన ఏడు వారాల తర్వాత హౌస్‌లో అడుగు పెట్టబోతున్న బాబా భాస్కర్‌ను హౌస్మేట్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి! చదవండి: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గని, ఆహా ట్వీట్ చూశారా? నిఖిల్ పాన్ ఇండియా సినిమా టైటిల్ ఇదే, దసరా పండుగే టార్గెట్ -
స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్, బాబా భాస్కర్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ!
బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ను ఓటీటీలోకి తెస్తే ఎలా ఉంటుంది? బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేదాన్ని గంట ఎపిసోడ్‌గా చూపించడం కంటే కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు 24 గంటలు చూసేలా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తే ఇంకెలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా పుట్టుకొచ్చిందే బిగ్‌బాస్ ఓటీటీ. హిందీ, తమిళంలోనూ వర్కవుట్ అయిన ఈ బిగ్‌బాస్ ఓటీటీ తెలుగులో ప్రారంభమై ఏడువారాలవుతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం 11 మంది మాత్రమే మిగిలారు. శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం అనిల్, నటరాజ్, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్, అరియానా, మహేశ్ విట్టా నామినేషన్లో ఉన్నారు. వీరిలో అఖిల్, బిందు మాధవి ఓట్ల రేసులో దూసుకుపోతున్నారు. అరియానా, శివ మొదటి నుంచి మంచి గేమ్ ఆడుతుండటంతో వీరికంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓట్ల విషయం పక్కన పెడితే ఎప్పటిలాగే ఈవారం కూడా మిత్ర శర్మ సేఫ్. మిగిలిందల్లా అనిల్, మహేశ్. ఇద్దరూ గేమ్ ఎవరి స్టైల్లో వారు గేమ్ ఆడుతున్నారు, కానీ శ్రమకు తగ్గ గుర్తింపు మాత్రం దొరకడం లేదు. ఇంకా చెప్పాలంటే అనిల్ ఇంట్లో ఉండీలేనట్టుగా ఉంటున్నాడు. చదవండి: ప్రియురాలితో యాంకర్ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్ అటు మహేశ్ గతంలో కంటే కూడా చాలా మెరుగయ్యాడు. హౌస్‌మేట్స్‌కు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. టాప్ 5కి చేరుకునే సత్తా ఉంది. కానీ అనూహ్యంగా అతడిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఏడో వారం మహేశ్ ఎలిమినేట్ అయ్యాడని లీకువీరులు దండోరా వేసి చెప్తున్నారు. నిజానికి ఓట్ల పరంగా అతడు మెరుగైన స్థానంలోనే ఉన్నప్పటికీ కావాలనే అతడిని గేమ్ నుంచి తప్పించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే గేమ్‌లో కొట్లాటలు తప్ప పెద్దగా కామెడీ లేకుండా పోవడంతో బిగ్‌బాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూడో సీజ్‌లో పాల్గొన్న బాబా భాస్కర్‌ను హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించనున్నట్లు తెలుస్తోంది. మరి బిగ్‌బాస్ ప్లాన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి! చదవండి: అమ్మ నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది: యాంకర్ -
అది టెలికాస్ట్ చేయలేదు: బాబా భాస్కర్
బాబా భాస్కర్.. తెలిసిన కొద్దిమందికీ కోపిష్టి కొరియోగ్రాఫర్‌గా పరిచయం. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఆయన ఎంటర్టైన్మెంట్ కా కింగ్. ఆయన మాటలకు నవ్వుకోని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. బాబా.. ఏకంగా బిగ్‌బాస్ మనసునే గెలుచుకున్న వ్యక్తి. ఎలాంటి ఆర్మీలు, సోషల్ మీడియా అకౌంట్లు లేకపోయినా వేల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. రెండు వారాలు ఉండటానికి వచ్చాను అంటూనే టాప్ 3లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఓటమి చెందినందుకు తానేమీ బాధపడట్లేదు అంటున్నాడు. బిగ్‌బాస్ షో తన లైఫ్‌లో పెద్ద గిఫ్ట్ అని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నాడు. బిగ్‌బాస్ గురించి బాబా భాస్కర్ మాట్లాడుతూ.. రెండు వారాలే ఉంటాననుకున్నాను.. కానీ అందరూ నన్ను ఫినాలే వరకు తీసుకొచ్చారు. అందుకు ప్రేక్షకులు ప్రతీసారి కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను. సీన్ రివర్స్ అయింది.. బిగ్‌బాస్ షో కోసం 300 మంది పనిచేశారు. నాకు మొదటి వారంలో అందరూ దగ్గరయ్యారు.. నాలుగోవారం తర్వాత అందరూ దూరమయ్యారు. అయితే నన్ను కొట్టినా పర్లేదు కానీ నా వెనక మాట్లాడటం నచ్చదు.. అది తట్టుకోలేను. ఇక నాగార్జున నవ్వుతూనే అన్ని చెప్పేవారు. గొడవలైనా కూడా అందరినీ కలిపేవారు. శనివారం వచ్చిందంటే ఏమంటారోనని భయపడుతూ ఉండేవాళ్లం. మెడాలియన్ టాస్క్‌లో వితిక తెలివిగా ఆడింది.. కానీ నమ్మకద్రోహం చేసిందనిపించింది. నేను మెడాలియన్ కోసం బాగా ప్రయత్నించాను కానీ అది దొరకలేదు. కొరియోగ్రఫీ చేయమని అడిగారు రాహుల్, శ్రీముఖి, వరుణ్ ఈ ముగ్గురిలో ఒకరు గెలుస్తారనుకున్నాను. మరీ ముఖ్యంగా శ్రీముఖి గెలుస్తుందనుకున్నా. అయితే రాహుల్‌ను విన్నర్‌గా ప్రకటించారంటే అతనికి వచ్చిన ఓట్లే కారణం. నా గురించి మెగాస్టార్ స్టేజీమీద మాట్లాడారు. నేను ఆయనకు ఫ్యాన్ అని చెప్తే ఆయనే తిరిగి నాకు ఫ్యాన్ అనడం చాలా సంతోషంగా అనిపించింది. షోలో మరొకటి కూడా చెప్పారు. కానీ అది టెలికాస్ట్ చేయలేదు. మెగాస్టార్ ఏమన్నారంటే.. ‘మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఖైదీ 150 కూడా చేశాను. నాకు కొరియోగ్రఫీ చేస్తావా’ అని అడిగారు. తప్పకుండా చేస్తానని బాబా భాస్కర్ బదులిచ్చాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌తో క్లోజ్‌గా ఉన్నాడని ఫ్యామిలీలో గొడవలు వచ్చాయంటూ వచ్చిన పుకార్లను బాబా కొట్టిపారేశాడు. ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు. -
బిగ్‌బాస్: బాబా ఔట్.. విజేత ఎవరంటే!
బాస్‌బాస్ సీజన్ 3 తుదిపోరు రసవత్తరంగా మారింది. టాప్-5లో ఉన్న ఐదుగురి కంటెస్టెంట్లలో ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అలీ రెజా, వరుణ్ సందేశ్ ఇప్పటికే ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా ఊహించినట్టే బాబా భాస్కర్ కూడా హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. దీంతో తుది అంకానికి చేరుకున్న ఫైనల్ పోరులో టాప్-2 కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మిగిలారు. టాప్-2లో ఈ ఇద్దరే ఉంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీముఖి, రాహుల్‌లలో విజేత కానుండగా.. మరొకరు రన్నరప్ కానున్నారు. బిగ్‌బాస్-3 గ్రాండ్ ఫినాలెలో మూడో కంటెస్టెంట్ ఎలిమినేషన్ కూడా నాటకీయంగా సాగింది. ఈ ఎలిమినేషన్ కోసం అంజలి హౌజ్‌లోకి వెళ్లారు. ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేసి.. తన వద్దకు తీసుకువచ్చే బాధ్యతను నాగార్జున ఆమెకు అప్పగించారు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి కూడా రూ. 25 లక్షల ఆఫర్‌ను నాగార్జున ఇచ్చారు. నమ్మకం లేనివారు రూ. 25 లక్షలు తీసుకొని రావొచ్చునంటూ ఊరించారు. అయినా ఎవ్వరూ ఆఫర్‌ను స్వీకరించలేదు. దీంతో బాబా భాస్కర్‌ను ఎలిమినేట్ చేస్తున్నట్టు అంజలి ప్రకటించి.. నాగార్జున వద్దకు తీసుకొచ్చారు. ఇక, మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లలో ఎవరు విన్నర్ అవుతారని బాబా భాస్కర్‌ను అడుగగా.. శ్రీముఖి విజేతగా నిలుస్తారని, రాహుల్ రన్నరప్ అవుతారని బాబా తన అభిప్రాయం చెప్పారు. ఇక, గ్రాండ్ ఫినాలె షోలో భాగంగా వితిక, పునర్నవి, రవికృష్ణ, శిల్పా చక్రవర్తి తమ డ్యాన్సులతో అదరగొట్టారు. -
బిగ్‌బాస్: వాళ్లకు సోషల్ మీడియా అంటే ఏంటో తెలీదు!
బాబా భాస్కర్.. ‘ఎంటర్టైన్మెంట్ కా బాప్, టాస్క్‌లో తోపు, వర్క్‌లో తోపు, డాన్స్ కా కింగ్, నో బ్యాక్ బిచ్చింగ్, లవ్స్ ఎవ్రీ వన్’ ఇది ఓ అభిమాని చెప్పిన మాట. అయితే ప్రేక్షకులు కూడా దీన్ని ఎంతో కొంత ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే బాబా ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉంటాడు. గుండెలో ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం చిరునవ్వుతో కనిపిస్తాడని స్వయంగా బిగ్‌బాసే పేర్కొన్నాడు. ఇక వచ్చీరాని తెలుగుతో ఆయన ఆపసోపాలు పడ్డా.. అవి కూడా నవ్వు తెప్పించేవి. బాబా భాస్కర్ అంటే ఇంటి సభ్యులందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం. కానీ, అదే సమయంలో బాబా ‘మాస్కర్’ అన్న పేరును సంపాదించుకున్నాడు. బాబా ఒంటరి పోరాటం సోషల్ మీడియాలో.. బాబా భాస్కర్ ‘ఎంటర్టైన్మెంట్ కింగ్’ అని ఆయన అభిమానులు చెప్పుకొస్తుంటే, బాబా ‘మాస్కర్’ అంటూ ఆయనంటే గిట్టనివాళ్లు ప్రచారం చేస్తున్నారు. దీనిపై బాబా స్నేహితుడు, రెండోవారంలోనే ఇంటి బాట పట్టిన హౌస్‌మేట్ జాఫర్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా బాబాపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టాడు. బిగ్‌బాస్ హౌస్ లోపల ఉన్న ప్రతీ ఒక్కరికీ బయట ఎవరో ఒకరి సపోర్ట్ ఉందని, కొంతమందికైతే ఏకంగా సోషల్ మీడియా మేనేజర్స్ మద్దతు కూడా ఉన్నట్టు కనిపిస్తోంది అని పేర్కొన్నాడు. కానీ ఎలాంటి అండదండలు లేని ఏకైక వ్యక్తి బాబా భాస్కర్ మాత్రమేనన్నాడు. బాబాను ‘మాస్కర్’ కాదు: పైర్ బాబా భాస్కర్ కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా అంటేనే తెలియదని, దానిపై కనీస అవగాహన కూడా లేదని జాఫర్ చెప్పుకొచ్చాడు. ఆట కోసమో, టైటిల్ కోసమో మాస్కులు వేసుకునే తత్వం బాబాది కాదని ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇక ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో టాప్-5కు చేరుకున్న ఇంటి సభ్యుల కోసం బయట గట్టిగానే ప్రచారం జరుగుతోంది. కానీ బాబాకు మాత్రం ప్రచారం చేసే ఆర్మీలు కానీ మద్దతుగా నిలిచే సెలబ్రిటీలు గానీ లేరు. అయితే.. ఓట్ల కోసం ఎలాంటి జిమ్మిక్కులు చేయకపోయినా బాబా గెలుపు కోసం చాలామందే పోరాడుతుండటం విశేషం. -
బిగ్‌బాస్ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి
మూడు రోజుల్లో బిగ్‌బాస్ షోకు శుభం కార్డు పడనుంది. ఇప్పటికే వంద రోజులు పూర్తవడంతో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంటి సభ్యులు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగిన జర్నీని వీడియో ద్వారా చూపించాడు. మొదటగా వరుణ్‌ను యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్‌బాస్ అతని గ్రాఫ్‌ను, ప్రేక్షకుల అభిప్రాయాలను క్షుణ్ణంగా వివరించాడు. బిగ్‌బాస్ ఇల్లు ఆనందంగా ఉండేందుకు వరుణ్ ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. ప్రేక్షకులు వరుణ్‌ను ‘మిస్టర్ కూల్, ప్రాబ్లమ్ సాల్వర్, మిస్టర్ పర్ఫెక్ట్’ అని ప్రేమగా పిలుస్తారని బిగ్‌బాస్ తెలిపారు. మీ మానసిక శక్తే మీ బలం అని చెప్తూ హౌస్‌లో ఇప్పటివరకు సాగిన జర్నీని చూపించాడు. వీడియో చూస్తూ వరుణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. రాహుల్‌ను చూసి గర్వించిన బిగ్‌బాస్.. అనంతరం రాహుల్ వెళ్లగా.. ఇంట్లో మీ ప్రయాణం ఎలాంటి అంచనాలు లేకుండా సాగింది అని పేర్కొన్నాడు. ‘టాస్క్‌ల్లో మొదట నిరుత్సాహంగా ఆడటంతో నిన్ను ఇంటి సభ్యులు చాలాసార్లు నామినేట్ చేశారు. బహుశా.. మిగతా వాళ్లలా మీ మనసుకు గేమ్ ఆడటం తెలియదేమో.. అందుకే ఆటలో వెనుకబడ్డార’ని చెప్పుకొచ్చాడు. మీ స్నేహితుల కష్టసుఖాల్లో తోడుగా నిలిచారని ప్రశంసించాడు. అన్నింటికీ మించి పెద్ద ఊరట కలిగించింది మీ స్నేహమని తెలిపాడు. ప్రేక్షకులకు మీరేంటో తెలుసు, ఏం చేయగలరో తెలుసు. అందుకే నామినేషన్లో ఉన్న ప్రతీసారి మీకు అండగా నిలిచారని గుర్తు చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో మీరు ఎదిగిన తీరు చూసి గర్వపడుతున్నానని బిగ్‌బాస్ పేర్కొన్నాడు. కాస్త ఎమోషనల్ అయిన రాహుల్ వెంటనే తేరుకుని బిగ్‌బాస్‌కు కృజ్ఞతలు తెలిపాడు. కన్నీళ్లు పెట్టుకున్న బాబా భాస్కర్.. ఆ తర్వాత బాబా భాస్కర్ యాక్టివిటీ ఏరియాలోకి ప్రవేశించాడు. ‘బాబా భాస్కర్.. ఈ పేరు వింటే డాన్స్ మాత్రమే గుర్తొచ్చేది.. కానీ ఇప్పుడు వినోదం గుర్తుకు వస్తుంది. మీరు ప్రతీ ఇంటి సభ్యుల మనసు గెలుచుకున్నారు. మీరు చేసిన వంటలు, పంచిన నవ్వులు ప్రతీ ఒక్కరినీ అలరించాయి. చిన్నపిల్లాడిలా అల్లరి చేసినప్పటికీ ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు పెద్ద మనిషి పాత్ర పోషించి అందరి బాగోగులు చూసుకున్నారు. బిగ్‌బాస్‌ను గురువుగారు అని సంభోధించిన తీరు బిగ్‌బాస్ మనసు గెలుచుకుంది. అందరినీ నవ్వించే మీరు కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. గుండెలో బాధ ఉన్నా పైకి చిరునవ్వుతోనే ఇంతదూరం వచ్చారు’ అని అభినందనలు తెలిపాడు. కాగా బిగ్‌బాస్.. బాబాకు ‘సూపర్‌స్టార్ ఆఫ్ ద హౌస్’ బిరుదు ఇచ్చాడు. తన జర్నీ వీడియో చూసిన బాబా కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఎమోషనల్ అయితే ఇంటి సభ్యులు తప్పుపడుతున్నారని దిగులు చెందాడు. తాను చాలా సెన్సిటివ్ అని చెప్పుకొచ్చాడు. ఇక మిగతా హౌస్మేట్స్ జర్నీ వీడియోలు నేటి ఎపిసోడ్లో ప్రసారం కానున్నాయి! -
బిగ్‌బాస్: అర్థరాత్రి ‘బిగ్’ షాక్
తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్3 షో ముగింపు దశకు వచ్చింది. ఫైనల్‌కి వెళ్లే టాప్ 5 ప్లేస్‌ల కోసం హౌస్మేట్స్ పోటీ పడుతున్నారు. రాహుల్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవడంతో మిగిలిన ఐదుగురు ఫైనల్ పోరులో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో బాబా మాస్టర్ జాక్‌పాట్ కొట్టాడు. అనూహ్యంగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలోని మంచి జోష్ ఉన్న సాంగ్‌తో నిన్నటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ పాటకు శ్రీముఖి, బాబా భాస్కర్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. వీరికి శివజ్యోతి కూడా జతకలవడంతో డాన్స్‌లతో హౌస్‌ను షేక్ చేశారు. అనంతరం టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌కి కేఎల్ఎం ఫ్యాషన్స్ వాళ్లు ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి, మిస్టర్ అండ్ మిస్ బిగ్ బాస్ హౌస్‌గా నిలిచిన వాళ్లకు వారికి 10వేల గిఫ్ట్ ఓచర్ ప్రకటించారు బిగ్ బాస్. ఈ గిఫ్ట్ ఓచర్‌ను బాబా భాస్కర్, శివజ్యోతి దక్కించుకున్నారు.] (చదవండి: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!) అనంతరం ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ చుక్కలు చూపించాడు. అర్థరాత్రి వేళ సైరన్ మోగించి.. నామినేషన్లో ఉన్నవారిని బ్యాగులు సర్ధుకొని గార్డెన్ ఏరియాలోకి రావాల్సిందిగా ఆదేశించాడు. దీంతో షాకైన ఇంటిసభ్యులు.. నిద్రమత్తులోనుంచి తేరుకొని బ్యాగులు సర్ధుకున్నారు. శని, ఆదివారాల్లో నామినేషన్ ఉంటే ఇప్పుడు బ్యాగులు సర్ధుకోవాడం ఏంటని అనుకుంటూ.. భారంగా బ్యాగ్‌లు తీసుకొని గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ పై బాబా మాస్టర్ తనదైన స్టేల్లో జోకులు పేల్చాడు.ఎందుకు ఇప్పుడు బ్యాగ్‌లు సర్ధమంటున్నారని వరుణ్ అడిగితే బయటకు పిలిచి ఆటోకి డబ్బులు ఇస్తారంట అన్నాడు. మరి మీకేం కావాలి అని వరుణ్ అడగ్గా.. ఫ్లైట్ టికెట్‌తో పాటు ఓ పది లక్షలు ఇస్తే హ్యాపీగా బయటకు వెళిపోతా అన్నాడు. మరి ఓ బిర్యానీ ప్యాకెట్, మందు బాటిల్ వద్దా అని వరుణ్ పంచ్ వేస్తే..పొద్దునే వద్దులే అంటూ జోక్‌లు పేల్చారు. అనంతరం తలుపు తెరవడంతో గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ఈ సందర్భంగా నామినేషన్లో ఉన్న ఇంటి సభ్యులు వాళ్ల జర్ని గురించి చెప్పమని బిగ్‌బాస్ ఆదేశించగా..ఒక్కొక్కరు తమ జర్నీని ఎమోషనల్‌గా షేర్ చేసుకున్నారు. అనంతరం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఈవారం నామినేషన్స్‌లో ఉన్న బాబా భాస్కర్ని ప్రేక్షకులు తమ ఓట్లు ద్వారా రక్షించారని చెబుతూ.. బాబాను టాప్5 కంటెస్టెంట్‌గా ప్రకటించారు. అనంతరం కన్ఫెషన్ రూంకి పిలిచి బాబాకి టికెట్ టు ఫినాలేను అందించాడు. దీంతో ఈ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ తనను గెలిపించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ.. టికెట్ టు ఫినాలేను ఆడియన్స్‌ని డెడికేట్ చేశారు బాబా భాస్కర్.దీంతో ఏపిసోడ్ ముగిసింది.కాగా, మిగతా నలుగురిలో ఎవరు ఎలిమేషన్ అవుతారనేది నేటి ఎపిసోడ్ లేదా రేపటి ఎపిసోడ్లో తేలనుంది. -
బిగ్‌బాస్ ఇంట్లో సర్కస్, నేడే చూడండి!
బిగ్‌బాస్ షో ముగింపుకు వస్తున్న కొద్దీ మరింత రంజుగా మారుతోంది. పద్నాలుగో వారానికి గానూ బిగ్‌బాస్ ఇచ్చిన నామినేషన్ టాస్క్.. ఈ సీజన్లోనే బెస్ట్ టాస్క్‌గా నిలిచిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే జోష్‌లో మరో ఆసక్తికర టాస్క్ ఇవ్వడానికి బిగ్‌బాస్ సిద్ధమయ్యాడు. అందులో భాగంగా నామినేట్ అయిన ఇంటి సభ్యులకు కఠినతరమైన టాస్క్‌లు ఇస్తూ వారి బలాబలాలను బేరీజు వేయనున్నాడు. మిమ్మల్ని మీరు నిరూపించుకోడానికి ఇది సువర్ణావకాశం అంటూ.. నామినేషన్లో ఉన్న బాబా భాస్కర్, వరుణ్, శ్రీముఖి, అలీ, శివజ్యోతిలకు భిన్న టాస్క్‌లను ఇచ్చాడు. అభిమానులను అలరించడానికి సర్కస్ ఫీట్లు చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు హౌస్మేట్స్. తాజా ప్రోమో ప్రకారం.. టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేయడానికి ఇంటి సభ్యులు నానా తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనూ కామెడీ కింగ్ బాబా.. పంచ్‌లు విసురుతూ ఇంట్లో నవ్వులు పూయిస్తున్నాడు. మరి వీళ్ల ఫీట్లతో జనాల్ని మెప్పిస్తారా? లేక బొక్కబోర్లా పడతారా అన్నది చూడాలి! అయితే ఈ వారం ఎవర్ని పంపించాలన్నది ప్రేక్షకులు ఎప్పుడో డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. గత వారం స్వల్ప ఓటింగ్ తేడాతో గట్టెక్కిన శివజ్యోతి ఈసారి తప్పించుకోలేదని, బిగ్‌బాస్ షోకు బైబై చెప్పే రోజులు ఆమెకు దగ్గర్లోనే ఉన్నాయని నెటిజన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. Which nominated contestant will prove his best to get viewers appreciation ??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/vxEXxf0cMr — STAR MAA (@StarMaa) October 23, 2019 -
బిగ్‌బాస్: అలీని చూసి వణికిపోతున్న హౌస్మేట్స్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ పద్నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరికోసం బిగ్‌బాస్ ఓ సువర్ణావకాశాన్ని ఇస్తూనే అందులో ఓ మెలిక పెట్టాడు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ‘టికెట్ టు ఫినాలే’ అనే టాస్క్‌ను ఇచ్చాడు. ఇందులో ఒక్కరు మాత్రమే గెలిచే అవకాశం ఉండగా ఓడిపోయిన మిగతా అయిదుగురు సభ్యులు నామినేషన్లో ఉంటారని ప్రకటించాడు. గెలిచిన ఒక్కరికి టికెట్ టు ఫినాలే దక్కుతుందని తెలిపాడు. దీనికోసం పగలూ రాత్రీ తేడా లేకుండా ఇంటి సభ్యులంతా టాస్క్‌లపైనే దృష్టి సారించారు. ఇప్పటికే అధిక శాతం బ్యాటరీతో అలీ రెజా మొదటి స్థానంలో ఉండగా.. తక్కువ బ్యాటరీతో వరుణ్ చివరి స్థానంలో ఉన్నాడు. ఇక అర్ధరాత్రి సమయంలో బజర్ మోగించినపుడు అలీ, బాబాలు గంట మోగించడంతో వారిద్దరికీ బిగ్‌బాస్ రసవత్తరమైన టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా మట్టి పాత్రలో బాబా ఎరుపు రంగు పూలు.. అలీ ఊదా రంగు పూలు పెట్టాల్సి ఉంటుంది. ఒకరి పూలను మరొకరు పీకే ప్రయత్నం చేయవచ్చని బిగ్‌బాస్ సూచించాడు. దీంతో అలీ.. బాబా పూలను పెకిలిస్తూ.. దూరంగా విసిరేశాడు. ఆగ్రహించిన బాబా.. అలీ పూలను కూడా మట్టిలో నుంచి తీసేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఈ కుస్తీలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దొర్లుతూ గెలుపు కోసం భీకరంగా పోరాడుతున్నారు. తాజా ప్రోమో ప్రకారం.. అలీ బాబాను ఎత్తిపడేస్తున్నట్టు కనిపిస్తోంది. వీరి పోరాట పటిమను చూస్తుంటే ఇంటి సభ్యులకు సైతం ఒళ్లు గగుర్పొడొస్తోంది. టాస్క్ హింసాత్మకంగా మారడంతో ఇంటి సభ్యులు భయంతో వణికిపోయారు. ఓ పక్క శ్రీముఖి వారిస్తోన్నప్పటికీ అలీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బాబాపై విరుచుకుపడ్డాడు. రసవత్తరంగా మారిన ఈ టాస్క్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. #Ali ki #BabaBhaskar ki madhyalo jarigina fight lo evaru gelicharu?#BiggBossTelugu3 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/zWDLv9aZCD — STAR MAA (@StarMaa) October 22, 2019 -
బిగ్‌బాస్: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..
బిగ్‌బాస్ హౌస్ నుంచి వితికా వెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాల్లో బందీ అయిన వరుణ్ తనను తలుచుకుంటూ బాధపడ్డాడు. ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు కారుస్తున్న వరుణ్‌ను.. రాహుల్, అలీ ఊరడించే ప్రయత్నం చేశారు. ఇక బిగ్‌బాస్ పద్నాలుగోవారానికిగానూ నామినేషన్ ప్రక్రియను కాస్త భిన్నంగా ఇచ్చాడు. ఇందులో గెలిచే ఒక్కరే ‘టికెట్ టు ఫినాలే’ సొంతం చేసుకుంటారని, మిగతా అయిదుగురు నామినేట్ అవుతారని ప్రకటించాడు. బిగ్‌బాస్ ఇచ్చిన ‘బ్యాటరీ ఉంటే నిండుగా.. జరుపుకోండి పండగ’ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులందరూ వివిధ కలర్ బ్లాక్స్‌ను ఎంచుకున్నారు. అందులో ఉన్న నెంబర్ శాతం ప్రకారం.. బాబా భాస్కర్.. 40 %, రాహుల్, శ్రీముఖిలు.. 50 %, శివజ్యోతి 60 %, అలీ.. 70% ల బ్యాటరీ పర్సెంటేజ్‌తో ఆట స్టార్ట్ చేశారు. సైరన్ మోగిన ప్రతీసారి ఇంటి సభ్యుల బ్యాటరీ లెవల్స్ తగ్గుతూ వస్తాయి. అయితే బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు గంటలను ఎవరు ముందుగా మోగిస్తారో వారు బ్యాటరీ రీఫిల్ చేసుకోడానికి టాస్క్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి బ్యాటరీలను చూపించే పట్టికను బిగ్‌బాస్ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. ఒకేసారి గంట కొట్టిన అలీ-శివజ్యోతి.. రాహుల్-వరుణ్.. బాబా భాస్కర్-శ్రీముఖి టాస్క్‌ల్లో తలపడ్డారు. అరటిపండ్ల టాస్క్‌లో శివజ్యోతి 15 మాత్రమే తినగా, అలీ 21 తిని రీఫిల్ చేసుకునే అవకాశాన్ని పొందాడు. రాహుల్, వరుణ్‌లకు థర్మాకోల్ నింపిన సంచులను ఇచ్చి ఒకరి సంచిని మరొకరు ఖాళీ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ పేర్కొన్నాడు. ఇందులో వరుణ్, రాహుల్ భీకర పోరాటం చేయగా చివరగా రాహుల్‌దే పైచేయి అయింది. బాబా, శ్రీముఖిలు.. ఆల్ఫాబెట్ కాయిన్స్‌ను పిండి, ఈకలు ఉన్న డబ్బాలో నుంచి కేవలం నోటి సహాయంతో తీయాల్సి ఉండగా ఇద్దరూ సమానంగా తీయగా టై అయింది. దీంతో టాస్క్‌ను ముందుగా పూర్తి చేసిన బాబా భాస్కర్ విజయం సాధించాడని బిగ్‌బాస్ ప్రకటించాడు. కాగా వారికిచ్చిన టాస్క్‌ల్లో గెలిచిన అలీ, రాహుల్, బాబా 10 శాతం బ్యాటరీలను పెంచుకున్నారు. ఇక అర్ధరాత్రి బజర్ మోగినప్పుడు బెల్ కొట్టిన బాబా, అలీ ఇద్దరూ చివరగా తలపడ్డారు. మట్టి నింపిన డబ్బాలో తలా ఒక రంగును పూలను నిలబెట్టాల్సి ఉంటుంది. ప్రత్యర్థి పూలను పీకే ప్రయత్నం కూడా చేయవచ్చని బిగ్‌బాస్ సూచించాడు. ఈ క్రమంలో అలీ, బాబాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చాలా రోజులకు ఫిజికల్ టాస్క్ రావటంతో అలీ తన శక్తినంతా కూడబెట్టుకుని బాబాపై విరుచుకుపడుతున్నాడు. బాబా పెట్టిన పూలను దూరంగా విసిరి పారేస్తున్నాడు. బాబా తన పూలను కాపాడుకోడానికి ఎంతో కష్టపడుతున్నాడు. మరి ఈ భీకర పోరులో విజయం ఎవరిని వరించనుంది అనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. -
బిగ్‌బాస్: ఆ ముగ్గురు సేఫ్..!
బిగ్‌బాస్ ఇంట్లో చూస్తుండగానే తొంభై రోజులు గడిచిపోయాయి. ఇక వీకెండ్లో వచ్చిన నాగార్జున ఇంటిసభ్యుల గొడవలను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అనంతరం వారితో.. చిచ్చు రేపిన నామినేషన్ టాస్క్‌నే మళ్లీ ఆడించడం ఆసక్తి రేపింది. ఇంట్లో తమ స్థానాలను తెలిపే నెంబర్స్‌ను ఎంచుకోమనగా శ్రీముఖి, శివజ్యోతి 1, అలీ రెజా..2, బాబా భాస్కర్, వితిక..3, రాహుల్..4, వరుణ్ 7 స్థానాలను ఇచ్చుకున్నారు. ఇక శ్రీముఖి, రాహుల్‌ల లొల్లి మళ్లీ మొదలైంది. బిగ్‌బాస్ షోకు తనను శ్రీముఖే రికమెండ్ చేసిందని చెప్పుకుంటోందని రాహుల్ నాగార్జున దగ్గర వాపోయాడు. వితిక తనకీ విషయం చెప్పిందని రాహుల్ చెప్పుకొచ్చాడు. ‘రికమెండ్ చేయడానికి నేనెవర్ని.. అసలు ఆ మాటే అనలేదు’ అని శ్రీముఖి కరాఖండిగా చెప్పింది. దీనిపై నాగార్జున వితికను ప్రశ్నించగా తాను అలా చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ విషయంపై రాహుల్ ఎంతకూ వెనక్కు తగ్గలేదు. తాను చెప్పింది అబద్ధం అని తేలితే తక్షణమే షో నుంచి వెళ్లిపోతానంటూ శపథం చేశాడు. మీ మధ్య మిస్ కమ్యూనికేషన్ జరిగింది అంటూ నాగ్ ఈ విషయాన్ని పక్కన పెట్టేశాడు. ఇక ఇంటి సభ్యులతో కాకుండా వారి కుటుంబ సభ్యులతో నాగ్ టాస్క్ ఆడించాడు. అందులో భాగంగా వచ్చిన వాళ్లు ఇంట్లో ఎవరు చివరి స్థానాల్లో ఉన్నారని చెప్పమనగా మెజారిటీ సభ్యులు అలీ, వితికలు వెళ్లిపోవాలనుకుంటున్నట్టుగా ప్రకటించారు. వచ్చిన బంధువులు ఇంటి సభ్యుల కోసం గిఫ్ట్‌లు తీసుకుచ్చారు. శ్రీముఖి తండ్రి రామకృష్ణ రాములమ్మను బాగా ఆడుతున్నావని మెచ్చుకున్నాడు. ఆమె కోసం తెచ్చిన టెడ్డీబేర్ గిఫ్ట్‌ను రాహుల్ ఓపెన్ చేయగా.. అతని చేతుల మీదుగా శ్రీముఖి సేవ్ అయింది. శివజ్యోతి అక్క స్వప్న నాగార్జునను చూసి సర్ప్రైజ్ అయింది. ఇక వితిక తల్లి తన అల్లుడే ఎక్కువ మంచోడంటూ వరుణ్‌కు ఓటు వేసింది. వితికను చూడగానే ఒకరు కన్నీటి పర్యంతమయ్యారు. బిగ్‌బాస్ అయిపోయాక ఇంటికి వస్తే అందరికీ భీమవరం వంట చేసిపెడతానని ఆఫర్ ఇచ్చింది. అనంతరం అలీ స్నేహితుడు యాంకర్ రవి షోలో పంచ్‌లు పేల్చుతూ ఎంటర్టైన్ చేశాడు. శ్రీముఖిని బాగా మిస్ అవుతున్నానని రవి చెప్పుకొచ్చాడు. రాహుల్ మిత్రుడు.. సింగర్ నోయెల్ వచ్చి అతనిలో కొత్త హుషారును నింపాడు. ఇక నుంచి రాహుల్ 2.0 చూడాలని కోరాడు. బిగ్‌బాస్ టైటిల్ కొట్టాలంటూ రాహుల్ కోసం ఉరకలెత్తించే పాట పాడాడు. అనంతరం ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ అక్క శోభన కాస్త ఎమోషనల్ అవుతూనే, బాబా మంచివాడంటూ చెప్పుకొచ్చింది. అనంతరం అలీ చేతుల మీదుగా బాబా సేవ్ అయ్యారు. షోకు వచ్చిన గెస్ట్‌లు ఎక్కువమంది అలీ, వితికలు టాప్ 5లో ఉండే అర్హత లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. శ్రీముఖి, రాహుల్ ,బాబా భాస్కర్ సేఫ్ అయ్యారు. మరి మిగిలిన నలుగురిలో బయటకు వెళ్లేది వితికేనా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
బాబా భాస్కర్ వెకిలి కామెడీ.. నెటిజన్లు ఫైర్
బిగ్‌బాస్ ఇంట్లోకి ఏడుగురు అతిథులు వచ్చారు. ఇంటి సభ్యులు వారికి సకల మర్యాదలు చేసి ఏడు స్టార్లను సంపాదించుకున్నారు. అయితే వచ్చిన అతిథుల్లో మెజారిటీ జనాలు వరుణ్ బామ్మ అదుర్స్ అంటున్నారు. తన కామెడీ టైమింగ్‌తో, పంచులతో హుషారెత్తించింది అంటూ బామ్మకు జై కొడుతున్నారు. ఇక రాహుల్ తల్లి సుధారాణి.. తన కొడుకుకు, శ్రీముఖికి మధ్య ఉన్న గొడవలను ఏమాత్రం పట్టించుకోకుండా రాములమ్మ అల్లరి ఎంతో ఇష్టమని పాజిటివ్‌గా మాట్లాడింది. ఇక చివరగా శ్రీముఖి.. తన తల్లిని కలుసుకోడానికి ఆమెను బిగ్‌బాస్ మూడు చెరువుల నీళ్లు తాగించాడు. శ్రీముఖి తల్లి లత ఇంట్లోకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోగా శ్రీముఖి గుండె పగిలేలా రోదించింది. ఇన్ని ట్విస్టుల మధ్య మళ్లీ ఆమె ఇంట్లోకి ప్రవేశించగా రాహుల్‌ను కాస్త సున్నితంగానే హెచ్చరించింది. మరోవైపు శ్రీముఖి లేనిదే బిగ్‌బాస్ హౌస్ లేదంటూ ఆమెను ఆకాశానికి ఎత్తింది. రాహుల్ తల్లి అంత పాజిటివ్‌గా మాట్లాడితే శ్రీముఖి తల్లి మాత్రం అలా రాహుల్‌ను వేలెత్తి చూపడం ఏం బాగోలేదంటూ కొంతమంది ఆమె తీరును తప్పుపడుతున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే నిన్నటి ఎపిసోడ్లో బాబా భాస్కర్ ప్రవర్తించిన విధానం ఏమీ బాగోలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అతని తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. శ్రీముఖి తల్లి లతను ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరును తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఆమెను హగ్ చేసుకోడానికి అన్నట్టుగా బాబా భాస్కర్ దగ్గరికెళితే శివజ్యోతి ఆయనను పక్కకు లాక్కెళ్లింది. సిగ్గులేదా అంటూ బాబాను శివజ్యోతి తిట్టిపోసింది. పైగా బాబా శ్రీముఖి తల్లిని ఉద్దేశించి.. సేమ్ జిరాక్స్.. జై రామకృష్ణ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆమె కోసం వస్తా నీ వెనక.. అని పాటలు పాడటం వెగటు పుట్టించిందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆమెకు మోకాళ్లపై కూర్చుని టీ ఇస్తూ అతిగా ప్రవర్తించడం చిరాకు పుట్టించదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. శ్రీముఖి ఆమె తల్లిని ఎత్తుకున్న సమయంలోనూ ‘ఏమైనా హెల్ప్ చేయాలా..’ అంటూ వెకిలిగా మాట్లాడటం ఆయన దిగజారిన కామెడీకి అద్దం పట్టాయని విమర్శిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో బాబా ప్రవర్తనను చూసిన నెటిజన్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అలాగే బాబా ప్రవర్తనకు ఇంటి సభ్యులు సైతం షాకైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు బాబా అభిమానులు మాత్రం ఇదంతా కేవలం కామెడీయే అని వెనకేసుకొస్తున్నారు. -
శ్రీముఖిని ఓ రేంజ్లో ఆడుకున్న బిగ్‌బాస్!
బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చిన అతిథులతో హౌస్ సందడిగా మారింది. గత ఎపిసోడ్లో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ నానమ్మ రాజ్యలక్ష్మి గలగలా మాట్లాడుతూ, పంచ్‌లు విసురుతూ అందరినీ నవ్వించింది. కుదిరితే తర్వాతి సీజన్‌కు తాను కూడా వస్తానని ఉత్సాహం ప్రదర్శించింది. టాస్క్‌లు బాగా ఇస్తున్నాడని బిగ్‌బాస్‌ను మెచ్చుకోవడంతో పాటు ఇంటికి తప్పకుండా రావాలి అంటూ ఇన్వైట్ చేసింది. తర్వాత కన్ఫెషన్ రూంలో నుంచి రాహుల్ తల్లి సుధారాణి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లిని చూడగానే ఏడుపును తమాయించుకున్న రాహుల్ వెళ్లి ఆమె ఒడిలో పసిబిడ్డలా ఒదిగిపోయాడు. రాహుల్‌ను అక్కున చేర్చుకుని సుధారాణి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. బిగ్‌బాస్ ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. టాస్క్‌లు సరిగా ఆడమని సూచించింది. ‘రాహుల్.. మనసులో ఏం ఉంటుందో.. అది మొహం మీదే అనేస్తాడు. కానీ వాడి మనసు చాలా మంచిది, ఎవరూ వాడిని తప్పుగా అనుకోకండి’ అని ఇంటి సభ్యులను కోరింది. శ్రీముఖి గెలిచేసింది శ్రీముఖి అల్లరంటే చాలా ఇష్టమని రాహుల్ తల్లి తెలిపింది. రాహుల్.. పెదవే పలికిన మాటల్లోన పాట పాడి తల్లిపై ప్రేమ కురిపించాడు. అనంతరం తల్లికి పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నాడు. చివరి అతిథిగా శ్రీముఖి తల్లి లత లోనికి వస్తుండగా ఆమెను చూడగానే శ్రీముఖి కన్నీటి పర్యంతమయింది. అయితే బిగ్‌బాస్ కాస్త నాటకీయతను జోడించి శ్రీముఖి ఎమోషన్స్‌తో ఆడుకున్నాడు. కనీసం కళ్లారా చూడకముందే లతను బయటికి పంపించేయడంతో శ్రీముఖి వెక్కివెక్కి ఏడ్చింది. కన్నీళ్లు ధారలు కడుతుండగా మళ్లీ ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లిని చూడగానే లేడిపిల్లలా చెంగుచెంగున పరుగెత్తుకు వెళ్లి గట్టిగా హత్తుకుని ఏడుపు లంకించుకుంది. శ్రీముఖి తల్లి ఆమెను ఓదారుస్తూ.. ‘డాన్సు ఇరగదీస్తున్నావ్.. ఎవరు ఏమన్నా నువ్వు పడుతున్నావ్ తప్ప తిరిగి మాటలు అనట్లేదు.. అక్కడే నువ్వు గెలిచావ్, నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అని సంతోషించింది. ‘బయట చిన్నపిల్లోడి నుంచి ముసలోడి వరకు అందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు. నువ్వు లేనిది బిగ్‌బాస్ హౌసే లేదు’ అని శ్రీముఖితో చెప్పుకొచ్చింది. నిజామాబాద్ అమ్మాయిలు దుమ్ము లేపుతున్నారు అంటూ శ్రీముఖి, శివజ్యోతిలను పొగడ్తలతో ముంచెత్తింది. రాహుల్‌తో మాట్లాడుతూ.. మాట్లాడుకోండి, పోట్లాడకండి అని చురకలు అంటించింది. ఇక బాబా భాస్కర్ కామెడీ వెగటు పుట్టించింది. శ్రీముఖి తల్లి లతను ఉద్దేశించి ‘రామకృష్ణ సేమ్ పీస్ పట్టారు’ అని సెటైర్ వేశాడు. కిచెన్‌లో ఆమె కోసం పాట పాడారు. ఇక ఆయన కుళ్లు కామెడీ భరించలేక వితిక, శివజ్యోతిలు ఆపండి మాస్టర్ అంటూ హెచ్చరించారు. వచ్చిన ప్రతీ అతిథి ఒక్కో స్టార్‌ను ఇవ్వడంతో బిగ్‌బాస్ హోటల్ సెవన్ స్టార్ హోటల్‌గా మారింది. దీంతో నేటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. -
బిగ్‌బాస్: ‘పాత అలీ కావాలి!’
బిగ్‌బాస్ ఇంట్లో గ్రూప్‌లు మారిపోయినట్టు కొట్టొచినట్టు కనిపిస్తోంది. రాహుల్.. శివజ్యోతి, అలీ రెజా ఒక గ్రూప్... శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, వితిక మరో గ్రూప్‌గా మారిపోయారు. అయితే ఇదంతా నామినేషన్ ఎఫెక్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక బిగ్‌బాస్ ఇంట్లోకి హౌస్మేట్స్ కుటుంబీకులను పంపిస్తూ అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈపాటికే వితిక చెల్లెలు రితిక అందరినీ పలకరించి వెళ్లింది. తాజా ఎపిసోడ్లో అందరూ స్లీప్ మోడ్‌లో ఉన్న సమయంలో అలీ భార్య మసుమా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే వచ్చింది మసుమా అని శివజ్యోతి గుర్తుపట్టింది. స్లీప్ మోడ్ రివీల్ చేసిన తర్వాత అలీతో బయట జరుగుతున్న వాటికోసం కబుర్లు చెప్పింది. ‘వైల్డ్‌కార్డ్ ఎంట్రీకి ముందున్న అలీ కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని.. నాకు అదే కావాలని కోరింది. బంధాల్లో ఇరుక్కుపోకుండా నీ గేమ్ నువ్వు ఆడు..’ అని అలీకి చురకలు అంటించింది. తర్వాత వచ్చిన మరో అతిథి గంగూలీని చూడగానే శివజ్యోతి కన్నీటి పర్యంతం అయింది. శివజ్యోతిని దగ్గరికి తీసుకుని బాగా ఆడుతున్నావ్ అంటూ గంగూలీ ధైర్యం చెప్పాడు. కాసేపు రాహుల్, అలీ శివజ్యోతిని ఆటపట్టించగా.. ఏయ్, మా ఆయన ఉన్నాడు అంటూ రెచ్చిపోయింది. అయితే తను లేనందుకు గంగూలీ కొంచెం కూడా బాధపడట్లేదని శివజ్యోతి ఫీల్ అయింది. ఏడుస్తూనే భర్తను సాగనంపింది. తర్వాత బాబా భాస్కర్ వంతు వచ్చింది. ముందుగా వారి పిల్లలను, తర్వాత భార్య రేవతిని ఇంట్లోకి పంపించారు. ఏంటి.. ఇంత మేకప్ వేసుకున్నారు అంటూ బాబా వాళ్లని ఆటపట్టించాడు. ఇంటి సభ్యులను పరిచయం చేస్తూ సైతాన్ అని శ్రీముఖిని చూపించాడు. అనంతరం కుటుంబం అంతా కలిసి కాసేపు హాయిగా ముచ్చటించారు. ఎందుకు అన్నిసార్లు ఏడ్చారు అని రేవతి.. బాబాను ప్రశ్నించింది. ‘బిగ్‌బాస్ షో ఎలా ఉంటుందో చూద్దాం అని వచ్చాను.. కానీ ఇక్కడ అందరూ నేను గేమ్ ఆడుతున్నానని అనేసరికి కష్టం అనిపించి ఏడ్చాన’ని చెప్పాడు. వెళ్లిపోయే ముందు రేవతి మాట్లాడుతూ ఎప్పుడూ బాబానే మూడుపూటలా వంట చేస్తాడు.. అసలు మీరెవరూ చేయరా అని నిలదీసింది. అసలు వితిక, శివజ్యోతిలను వంట వచ్చా? కిచెన్‌లో శ్రీముఖి కేవలం గరిటె ఊపుతుంది.. అని కామెంట్ చేసింది. అయితే బాబా మమ్మల్ని ఎవరినీ వంట చేయనివ్వడని ఇంటి సభ్యులు సమాధానమిచ్చారు. కాగా ముచ్చటగా మరో ముగ్గురి ఇంటి సభ్యుల బంధువులు ఇంకా రావాల్సి ఉంది. వాళ్లను చూడగానే ఇంటి సభ్యులు తమాయించుకుంటారో, ఏడ్చేస్తారో లేదో చూడాలి! -
బిగ్‌బాస్: ‘బాబా సైకో.. రాహుల్ వేస్ట్’
బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకలు ముగింపుకు చేరుకున్నాయి. బిగ్‌బాస్ బర్త్‌డే సందర్భంగా.. బిగ్‌బాస్ నిద్రపోయే సమయంలో ఇంటి సభ్యులు నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించాడు. పైగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు కొన్ని టాస్కులను ఇస్తూ అవి కూడా సైలెంట్‌గా కానిచ్చేయాలని పేర్కొన్నాడు. అందులో భాగంగా అలీ, శ్రీముఖిని వీపుపై ఎత్తుకుని గార్డెన్ ఏరియాలో 20 రౌండ్లు తిరగాలి. వితిక, రాహుల్‌లు బెలూన్లకు షేవింగ్ ఫోమ్ రాసి క్లీన్‌గా షేవ్ చేయాలి. వరుణ్, శివజ్యోతిలకు ఇంటి సభ్యులు కితకితలు పెట్టాలి. మహేశ్ తలపై ప్లేట్ పెట్టుకుని గోడ కుర్చీ వేయాలి. బాబా భాస్కర్.. చేతులకు, కాళ్లకు వాక్స్ చేసుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇక వీటన్నింటిని చేసే సమయంలో ఎంత నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించినా కొందరు సఫలీకృతం కాలేకపోయారు. వితిక, మహేశ్, శ్రీముఖి, శివజ్యోతిలు బిగ్‌బాస్ నిద్రకు భంగం కలిగించినందున టాస్క్‌లో ఫెయిల్ అయినట్టుగా ప్రకటించాడు. అనంతరం ఇంటి సభ్యులకు మరో పరీక్ష పెట్టాడు. బిగ్‌బాస్ ఊహాచిత్రాన్ని గీయమని ఆదేశించాడు. దీంతో ఇంటి సభ్యులు వారి ఆలోచనలకు పదును పెడుతూ ఎవరికి తోచినట్టుగా వాళ్లు బిగ్‌బాస్ చిత్రాన్ని గీశారు. అన్ని చిత్రాల్లో కల్లా మహేశ్ గీసిన బిగ్‌బాస్ ఊహాచిత్రం హైలెట్‌గా నిలిచింది. దొరికిందే చాన్స్ అన్నట్టుగా మహేశ్.. బిగ్‌బాస్‌ను దేవుడు, అంతరాత్మ అంటూ పెద్ద పెద్ద పదాలను వాడుతూ కాకా పట్టడానికి ప్రయత్నించినట్టు కనిపించింది. బిగ్‌బాస్ ఇంట్లో కేకుల గోల ఇంకా తగ్గలేదు. ఇప్పటికే నాలుగు కేకులు తిని పొట్ట పగలిపోయేలా ఉందన్న ఇంటి సభ్యుల మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా మళ్లీ 2 కేకులు పంపించాడు. ఈ దెబ్బతో ఇంటి సభ్యులకు కేకులంటేనే వెగటు పుట్టింది. బిగ్‌బాస్ నిద్రకు భంగం కలిగించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూశాడు. రకరకాల శబ్దాలు చేస్తూ ఇంటి సభ్యుల నిద్ర చెడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నించాడు. అలీ విలన్లా, మాస్టర్ సైకోలాగా, రాహుల్ వేస్ట్ సాలే, చిచోరలా కనిపిస్తాడని శ్రీముఖి కామెంట్ చేసింది. తనకైతే రాహుల్ బఫూన్‌లాగా కనిపిస్తాడంటూ వితిక సెటైర్ వేసింది. అయితే ఈ విషయాన్ని రాహుల్ లైట్ తీస్కున్నాడు. కాగా రాహుల్ రాసి, పాడిన పాటకు బాబా డైరెక్షన్లో తీసిన ఇంటి సభ్యుల వీడియో అదిరిపోయింది. టీవీలో వారి వీడియో చూసుకుని మురిసిపోయారు. ఎట్టకేలకు బిగ్‌బాస్ బర్త్‌డే ముగియడంతో కేకుల గోల తప్పిందని ఇంటి సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
బిగ్‌బాస్: అందరి బండారాలు బయటపడ్డాయి!
బిగ్‌బాస్ ఇంట్లో సరదాలకు బ్రేక్ పడింది. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టడానికి బిగ్‌బాస్ రెడీ అయిపోయాడు. ఇప్పటికే 80వ రోజులోకి అడుగు పెట్టిన బిగ్‌బాస్ హౌస్ ఇంటి సభ్యుల గొడవలతో నేడు హీటెక్కనుంది. హౌస్‌మేట్స్‌కు వారి వెనక మాట్లాడుకున్న వీడియో క్లిప్పింగ్స్‌ను చూపించాడు. వీడియో చూసిన తర్వాత వారి రియాక్షన్స్ పూర్తిగా మారిపోయాయి. ఇంటి సభ్యులు కోపంతో ఊగిపోతున్నారు. బాబా భాస్కర్.. ఇక నుంచి రాహుల్‌నే టార్గెట్ చేస్తానంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో చూసి బయటకు వచ్చిన అలీని తన ప్రకోపాన్ని అంతా కుండపై చూపించాడు. ఏ కర్ర సహాయం తీసుకోకుండా చేతితో కుండను పగలగొట్టాడు. ఇక శ్రీముఖి.. మహేశ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్తూనే అతని పోస్టర్ ఉన్న కుండను బద్దలు కొట్టింది. కాగా వీడియో క్లిప్పింగ్స్ ఇంటి సభ్యులందరికీ చూపించారా, లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎలాగోలా నిజాలైతే బయటికి వచ్చాయి. మరి దీనితోనైనా ఇంటిసభ్యుల నిజస్వరూపాలు వెలికి వస్తాయా అన్న సందేహం ప్రేక్షకులకు కలుగుతోంది. ఈ ప్రోమోపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రోమో చూస్తే సీరియస్‌గా ఉంటుంది.. ఎపిసోడ్ చూస్తేనేమో కామెడీగా ఉంటుంది అని ప్రోమోలవర్స్ పెదవి విరుస్తున్నారు. మరికొంతమందేమో.. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ప్రోమో మాత్రం అదిరిపోయింది, ఎపిసోడ్ కూడా అంతకు మించి ఉంటుందని నేటి ఎపిసోడ్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. మరి నేటి ఎపిసోడ్లో ఎవరి బండారాలు బయటపడ్డాయి? దానిపై ఇంటిసభ్యులు ఎలా స్పందించారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే! Kunda baddalakottinattu nijam bayatapadindi #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/KVpnuSDWUE — STAR MAA (@StarMaa) October 10, 2019 -
నామినేట్ అయింది ఆ ముగ్గురే
బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 పన్నెండో వారం నలుగురు నామినేట్ అయ్యారు. ఇంటి సభ్యులందరికి బిగ్‌బాస్ సోమవారం పార్కింగ్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా గూడ్స్ ట్రాలీని నిర్దేశిత ప్రాంతంలో పార్కింగ్ చేయాలి. పార్కింగ్ చేయలేని సభ్యులు ఈ వారం ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు నేరుగా నామినేట్ అవుతారు. తొలుత హౌజ్‌లో ఉన్న ఎనిమిది మంది ఇంటిసభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో ట్రాలీ ఇచ్చి.. ఏడు పార్కింగ్ స్థలాలు మాత్రమే అందుబాటులో ఉంచారు. అలా నాలుగుసార్లు పార్కింగ్ స్థలాలు తగ్గిస్తూ ఉండటంతో నలుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. మొదటగా వరుణ్, తర్వాత వితిక, అటు తర్వాత మహేశ్, చివరగా రాహుల్ పార్కింగ్‌లో చోటు దక్కించుకోలేదు. దీంతో ఈ నలుగురు నామినేట్ అయినట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే, పోయిన వారం జరిగిన టాస్క్‌లో వితిక బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌తో వితికకు ఒక వారం ఎలిమినేషన్ తప్పించుకునే అవకాశం దక్కింది. ఇక సోమవారం జరిగిన టాస్క్‌లో వితిక ట్రాలీ పార్కింగ్ చేయడంలో విఫలం కావడంతో నామినేట్ అయింది. అయితే, ఈవారం మెడాలియన్ను వాడుకుని సేవ్ అవుతారా..? లేదంటే నామినేషన్లో ఉంటారా..? అని బిగ్‌బాస్ అడగ్గా.. వితిక మెడాలియన్తో సేవ్ అవుతానంది. దీంతో మిగిలిన ముగ్గురే నామినేట్ అయినట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఆసక్తికరంగా.. ఉత్కంఠగా టాస్క్..! ఇక ట్రాలీ పార్కింగ్ టాస్క్ ఆసక్తికరంగా.. కాస్త ఉత్కంఠగా సాగింది. ఓ సమయంలో రాహుల్, బాబా భాస్కర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. తనను బాబా బ్యాచ్ టార్గెట్ చేసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. బాబా కావాలనే అందర్నీ ఆపేసి.. శ్రీముఖి, శివజ్యోతి వెళ్లేందుకు సహాయం చేస్తున్నాడని ఆరోపించాడు. బాబా తన దారికి అడ్డు రావడం వల్లే కింద పడ్డానని రాహుల్ చెప్పుకొచ్చాడు. అయితే, తన దృష్టంతా పార్కింగ్ చేయడంపైనే ఉందని, తాను కావాలని ఎవరినీ అడ్డుకోలేదని బాబా స్పష్టం చేశాడు. మరి టాస్క్ మొదలైనప్పుడు తనకు అలీకి మధ్యన ఉన్న శివజ్యోతి.. మూడో రౌండ్ తర్వాత బాబావైపునకు ఎలా వెళ్లిందని ప్రశ్నించాడు. బాబా కావాలనే శివజ్యోతిని సేవ్ చేయాలని ప్లాన్ చేశాడని ఆరోపించాడు. అందువల్ల మిగతావారికి ఇబ్బంది కలిగిందని చెప్పాడు. గేమ్ స్టార్టింగ్ లైన్లో మూడో స్థానంలో ఉన్న తాను బాబా వల్ల చివరకు వెళ్లాల్సి వచ్చిందని రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై బాబా స్పందిస్తూ.. శివజ్యోతి అప్పటికే తన పక్కన నిలబడ్డానికి వచ్చిందని.. ఆడపిల్ల కావడంతో ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక సరే అన్నానని చెప్పాడు. రాహుల్‌ను.. మరెవరినీ టార్గెట్ చేసే ఉద్దేశం తనకు లేదని సమాధానమిచ్చాడు. అందరి తప్పులకు దేవుడే సాక్షి అని బాబా పేర్కొన్నాడు. ఇక టాస్క్ చివరి రౌండ్ (నాలుగు)లో కిందపడటంతో శివజ్యోతి కాలు బెనికింది. దీంతో ఆమెను మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లాలని బిగ్‌బాస్ సూచించాడు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
బిగ్‌బాస్: పుల్లలు పెట్టడం స్టార్ట్ చేసిన మహేశ్
బిగ్‌బాస్ ఇంట్లో నవ్వులు తగ్గిపోయి కేవలం అరుపులు, గొడవలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజా ఎపిసోడ్లో డెటాల్ కోసం పునర్నవి రాహుల్‌ను చెడామడా తిట్టడమే కాక అలిగింది. దీంతో అలక పోగొట్టడానికి రాహుల్ కాసేపు పునర్నవిని ఆటపట్టించాడు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన ‘బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్’ రెండో లెవల్లో శ్రీముఖి, శివజ్యోతి, బాబా భాస్కర్, అలీ రెజా తలపడ్డారు. ఈ టాస్క్‌లో ఒక్కొక్కరు ఒక్కో ఫ్రేములో నిలబడి తలపై పెట్టుకున్న వస్తువును ఫ్రేముకు ఆనించాలి. ఫ్రేమును కానీ వస్తువును కానీ చేతితో తాకడం లాంటివి చేయకూడదు. ఇక ఎక్కువ సేపు బ్యాలెన్స్‌గా ఉన్న బాబా భాస్కర్ ఈ టాస్క్‌లో గెలిచి ఫైనల్ లెవల్‌కు చేరుకున్నాడు. టాస్క్ తర్వాత ఇంటిసభ్యులు బాబా భాస్కర్ మునుపటిలా లేడు అంటూ మాట్లాడుకున్నారు. బాబా హీరోయిజంలో బతుకుతారే తప్ప, రియాలిటీ చెక్‌లో బతకలేడు అని పునర్నవి ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ ఆఖరి అంకానికి వెళ్లే ముందు ఇంటిసభ్యుల అభిప్రాయాలు చెప్పమని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఫైనల్ లెవల్‌కు చేరుకున్న బాబా భాస్కర్, వితికలలో నచ్చినవారికి తిలకం పెట్టి నచ్చని వ్యక్తి తలమీద గుడ్డు పగలగొట్టాలని పేర్కొన్నాడు. ఇక శ్రీముఖి.. వితికపై గుడ్డు పగలగొట్టగా, బాబాకు తిలకం పెట్టింది. మహేశ్.. తన మార్పుకు కారణమైన వ్యక్తి అంటూ బాబాకు అంటూ తిలకం దిద్దాడు. శివజ్యోతి కూడా బాబాకు తిలకం పెట్టింది. కాగా అతనేంటో ఇప్పటివరకూ అర్థం కావట్లేదు అంటూ అలీరెజా, రాహుల్, పునర్నవి.. బాబా భాస్కర్ మీద గుడ్లు పగలగొట్టి వితికకు నుదుటిపై బొట్టు పెట్టారు. వరుణ్.. వితికకు తిలకం దిద్దాడు. టాస్క్ అనంతరం ఇంటిసభ్యులు బాబా భాస్కర్‌తో.. మాతో ఎందుకు కలవట్లేదు అని ప్రశ్నించారు. దీనికి బాబా భాస్కర్ మాట్లాడుతూ.. నాగార్జున వీడియో చూపించినప్పటినుంచి గిల్టీగా ఉందని వాపోయాడు. అది గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తోంది అని బాధపడ్డాడు. ఆయన మనోవేదనను చూసిన రాహుల్ అనవసరంగా బాబాను తప్పుగా అర్థం చేసుకున్నామేమో అని పునర్నవితో చెప్పుకొచ్చాడు. ఇక మహేశ్.. మళ్లీ పుల్లలు పెట్టడం స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది. వరుణ్ టీంతో మంచిగా ఉంటూనే వారి వెనక గోతులు తవ్వడం ప్రారంభించాడు. వారు మాట్లాడుకున్న విషయాలను శ్రీముఖి దగ్గర ప్రస్తావించాడు. వరుణ్, రాహుల్, పునర్నవి, వితిక అంతా ఒక్కటే అని పేర్కొన్నాడు. ‘నీ వెనక దారుణంగా మాట్లాడతారు కానీ నీ ముందుకు రాగానే బెస్ట్‌ఫ్రెండ్స్ అన్నట్టుగా మాట్లాడతారు’ అని శ్రీముఖితో అన్నాడు. ఇక బాబా భాస్కర్, వితికలలో మెడల్ ఎవరి సొంతం అవుతుందో చూడాలి! -
బిగ్‌బాస్ ఇంట్లో నీళ్ల కోసం కొట్లాట!
బిగ్‌బాస్ పదకొండో వారానికిగానూ జరిపిన నామినేషన్ ప్రక్రియ ఈసారి వినూత్నంగా జరగడమేకాక రెండురోజులు కొనసాగింది. ఇందులో బాగానే రాళ్లు పోగేసుకున్న వారు నామినేషన్ నుంచి తప్పించుకోగా టాస్క్‌లో వెనుకబడిన రాహుల్, మహేశ్, పునర్నవి, వరుణ్ ఒక్కొక్కరుగా డేంజర్ జోన్లోకి వచ్చారు. ఇక ఇంటిసభ్యులు గత రెండురోజులుగా సాదాసీదాగా గడిపారు. కడుపునిండా తిండి కూడా లేకుండా, కప్పుకోడానికి సరైన వస్త్రాలు లేక నానా కష్టాలు పడ్డారు. ఇక బిగ్‌బాస్ ‘బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్’ టాస్క్ ఇవ్వగా దీనికోసం ఇంటిసభ్యులు నానా హంగామా సృష్టించారు. జనాలు నీటికోసం బిందెలతో ఎలా పోట్లాడుకుంటారో.. అంతకు మించి ఇక్కడ నీటికోసం కొట్లాడుకున్నారు. సరదాగా సాగుతున్నట్టు అనిపించినప్పటికీ నేటి టాస్క్‌లోనూ చిన్నపాటి గొడవ జరిగేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే నిన్నటి ఎపిసోడ్లో బాబా భాస్కర్, వితికల మధ్య తోపులాట జరగగా వితిక ఫైర్ అయిన విషయం తెలిసందే! అయితే ఇక్కడ బాబా రియాక్ట్ అవడానికి ముందు వరుణ్ సీరియస్ అయ్యాడు. ఇద్దరూ కాసేపు వాదులాడుకోగా మళ్లీ వరుణ్ వితికను బుజ్జగించాడు. కాగా నేటి ఎపిసోడ్లో వరుణ్, బాబా భాస్కర్‌కు గొడవ జరిగేలా ఉంది. ఇంట్లో ఉండాలని లేదు అంటూనే బాబా భాస్కర్ నామినేషన్ నుంచి తప్పించుకోడానికి బాగానే కష్టపడ్డాడు. ఇక బాబా మాస్క్ తీసేశాడని అటు నాగార్జునతోపాటు ఇటు ఇంటిసభ్యులు ఇప్పుడిప్పుడే ఓ నిర్ణయానికి వస్తున్నారు. Medal evari sontham avtundi?#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/zZXcelxVX8 — STAR MAA (@StarMaa) October 2, 2019 -
బిగ్‌బాస్ ఇంటిపై రాళ్ల వర్షం!
బిగ్‌బాస్ ఇంట్లో పదివారాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇంటిసభ్యుల్లో కొంతమంది ఓ పట్టాన అర్థం కావట్లేదు. అందులో ముందు వరుసలో ఉండే వ్యక్తి బాబా భాస్కర్. ఇప్పటికే చాలాసార్లు బాబా ‘మాస్కర్’ అన్న నాగార్జున తాజా ఎపిసోడ్‌లోనూ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘ఆడాలని లేదు, వెళ్లిపోతాను’ అంటూనే ఎవర్ని పంపించాలో బాబా ప్లాన్ చేశాడు. తీరా ప్లాన్ వీడియోను వీకెండ్లో నాగార్జున అందరిముందు చూపించడంతో బాబా గుట్టు రట్టయింది. ఇక నాగ్ ఇచ్చిన కౌంటర్లతో ఎంటర్టైన్మెంట్ బాబా కాస్త మూడీ బాబాగా మారిపోయాడు. ఇప్పటికే అతను టార్గెట్ చేసిన బిగ్బాడీల్లో ఒకరైన రవి ఎలిమినేట్ అయ్యాడు. మరో టార్గెట్ అయిన శ్రీముఖి కెప్టెన్ అవటంతో ఈవారం నామినేషన్లోకి వచ్చే ప్రసక్తే లేదు. మరోవైపు విడిపోయిన నలుగురు మిత్రులను నాగ్ కలపాలని ప్రయత్నించగా రాహుల్, వరుణ్ తిరిగి మళ్లీ ఒక్కటయ్యారు. కానీ వితిక, పునర్నవి మధ్య అగ్గి చల్లారినట్టు కనిపించడం లేదు. పదకొండోవారానికిగానూ నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ కాస్త వెరైటీగా ఇచ్చాడు. వారిమధ్య ఎలాంటి చిచ్చు పెట్టకుండా ‘రాళ్లే రత్నాలు’ అనే గేమ్ ఆడించనున్నాడు. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు ఎలాంటి సదుపాయాలు లేని సాదాసీదా జీవనాన్ని గడపాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఇంటిపై హఠాత్తుగా రాళ్ల వర్షం పడుతుంది. ఆ సమయంలో ఇంటిసభ్యులు అప్రమత్తతతో రాళ్లను సేకరించి జమ చేస్కోవాలి. ఇక్కడో చిన్న ట్విస్ట్ దాగి ఉంది. బజర్ మోగిన ప్రతీసారి ఎవరి దగ్గరైతే ఎక్కువ రాళ్లు కాకుండా ఎక్కువ విలువైన రాళ్లు ఉంటాయో వారు నామినేషన్ నుంచి తప్పించుకోవచ్చు. అదే విధంగా తక్కువ విలువ ఉన్న రాళ్లను సేకరించినవారు నామినేట్ అవుతారు. జీవితంలో నాలుగు రాళ్లు సంపాదించుకోవటం ఏమో కానీ ఈ పూటకు వీలైనన్ని ఎక్కువ రాళ్లు చేజిక్కించుకోవాలని ఆరాటం చెందుతున్నారు హౌస్మేట్స్. ఇప్పటివరకు టాస్క్‌లో పెద్దగా చురుకుగా పాల్గొనని పునర్నవి నామినేషన్ నుంచి గట్టెక్కడానికి కష్టపడుతుందా అనేది చూడాలి. మరి ఈ వారం రాళ్లు వెనుకేసుకోకుండా నామినేషన్ జోన్లోకి ఎవరు వెళ్తారనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది! Nalugu rallu sampayinchukotam ante idey emo 😀 😀 #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/Er7aCYK5HY — STAR MAA (@StarMaa) September 30, 2019 -
బిగ్‌బాస్.. డోస్ పెంచిన నాగ్
బిగ్‌బాస్ హౌస్‌లో పదోవారం గడిచేందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన గొడవలపై ఇంటి సభ్యులను నాగార్జున కాస్త గట్టిగానే మందలించాడు. రాహుల్-వరుణ్ మధ్య జరిగిన గొడవను నాగ్ సద్దుమణిగేలా చేశాడు. పాత విషయాలను తవ్వడం తన తప్పేనని వరుణ్ క్షమాపణలు చెప్పాడు. తనది కూడా తప్పేనని రాహుల్కూడా సారీ చెప్పాడు. గొడవ జరుగుతూ ఉంటే.. చూస్తూ కూర్చున్నావ్ టాస్క్ ఆడలేదని ఎంపైర్‌లా పక్కన ఉన్నావంటూ పునర్నవికి చురకలంటించాడు. రాహుల్-పున్నులు మాట్లాడకపోయే సరికి వరుణ్ నీతో ఉన్నాడంటూ శ్రీముఖితో వితికా చెప్పిన మాటలను ప్రస్తావించాడు. పునర్నవి గురించి బాబా, శ్రీముఖి దగ్గర చెప్పడం తప్పు కదా అని వితికాను మందలించాడు. పునర్నవి తిట్లదండకానికి సంబంధించిన వీడియోను ప్లే చేసి ఆమెపై సెటైర్ వేశాడు. బయటకు వెళ్లాక తిట్ల కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చని అన్నారు. బాబా భాస్కర్ మాస్క్ తీసేశాడని, శ్రీముఖి, వరుణ్‌తో జరిపిన సంభాషణలకు సంబంధించిన వీడియోలను చూపించాడు. నామినేషన్ విషయంలో పునర్నవితో మాట్లాడిన విధానంపైనా ఫైర్ అయ్యాడు. ప్రతీది కామెడీ చేస్తున్నాడని బాబాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిత్రబేధాన్ని వాడుకుంటోందని శ్రీముఖికి చురకలంటించాడు. రాహుల్-వరుణ్ మధ్య వచ్చిన గొడవను వాడుకుంటున్నావని శ్రీముఖినుద్దేశించి నాగ్ పేర్కొన్నాడు. (ఎలిమినేట్ అయింది అతడే!) బ్రోకెన్ హార్ట్ అంటూ ఆట ఆడించాడు... హౌస్మేట్స్ అందరికీ హార్ట్ షేప్ థర్మకోల్ షీట్లను ఇచ్చాడు. ఎవరి వల్ల హార్ట్ బ్రేక్ అయిందని హౌస్మేట్స్ భావిస్తున్నారో.. వారి వద్దకు వెళ్లి.. ఆ హార్ట్‌ను విరగొట్టి కారణం చెప్పాలనే టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా మహేష్ మొదటగా ఆటను ప్రారంభించాడు. బాబా భాస్కర్ వల్ల తన హార్ట్ బ్రేక్ అయిందని బాబా ఎదుటకు వెళ్లి థర్మకోల్ హార్ట్ షేప్‌ను మహేష్ విరగొట్టాడు. రాహుల్‌కు శివజ్యోతి వల్ల, శివజ్యోతికి రాహుల్ వల్ల, రవి, వితికాలకు పున్ను వల్ల, బాబాకు మహేష్ వల్ల, శ్రీముఖికి బాబా వల్ల, అలీకి బాబా వల్ల, పున్నుకు వరుణ్ వల్ల హార్ట్ బ్రేక్ అయినట్లు తెలిపారు. ఇక నామినేషన్లో ఉన్న శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, రవిలోంచి వరుణ్ సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించేశాడు. అయినా.. రవి ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. ఇక రేపు రవి ఎలిమినేషన్‌తో శివజ్యోతి ఏం చేస్తున్నది చూడాలి. -
బాబా భాస్కర్‌కు నాగ్ క్లాస్
బిగ్‌బాస్ హౌస్‌లో మోస్ట్ ఎంటర్టైనింగ్ కంటెస్టెంట్ అయిన బాబా భాస్కర్.. ప్రతీ విషయాన్ని కామెడీ చేయడమే ఆయనకు మైనస్‌గా మారేలా ఉంది. బాబా భాస్కర్ కాదు.. మాస్కర్ అంటూ పలుమార్లు నాగార్జున చెప్పుకొచ్చాడు. బయటకు వచ్చిన హౌస్మేట్స్ సైతం అదే మాట్లాడుతున్నారు. బాబా భాస్కర్ ఇంకా తన మాస్క్ తీయలేదని..సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, అందరి చేత మంచి అనిపించుకోవాలని అనుకుంటున్నాడని కామెంట్లు చేస్తుంటారు. అయితే నేటి ఎపిసోడ్లో నాగార్జున బాబా భాస్కర్‌కు గట్టిగానే క్లాస్ పీకినట్లు కనిపిస్తోంది. నామినేషన్ విషయంలో ప్రవర్తించిన తీరు, హౌస్మేట్స్ వెనకాల మాట్లాడిన విషయాలను ప్లే చేయించి కడిగిపారేసినట్టు విడుదలైన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రోమోలో ఇలానే ఉంటుంది.. తీరా షో చూస్తే అంత సీన్ ఉండదని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. -
బాబాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన శ్రీముఖి
బిగ్‌బాస్‌లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వ్యక్తుల్లో మొట్టమొదటి కంటెస్టెంట్ బాబా భాస్కర్. అతను మాత్రమే హౌస్‌లో మొదటినుంచీ అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు అది శ్రుతిమించిందని హౌస్మేట్స్ ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే తన పంథా అదేనంటూ అందర్నీ ఆటపట్టిస్తూ.. సరదాగా ఉంటాడు. నిన్నటి ఎపిసోడ్లో మాటల యుద్దాలు జరగ్గా.. నేటి ఎపిసోడ్లో మాత్రం బిగ్‌బాస్ హౌస్ కూల్ కూల్‌గా ఉండేట్టు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా.. తన పెద్దకొడుకు కోడలి (రవి-శ్రీముఖి) పెళ్లి చూపులు చూడాలనుకుంటున్నానంటూ శివజ్యోతి ఆర్డర్ వేసింది. ఇక అతివినయం ప్రదర్శిస్తూ..తల కిందకు వేసుకుని వస్తున్న శ్రీముఖిని చూస్తూ.. మెడ నొప్పా? అంటూ బాబా ఓ పంచ్ వేశాడు. దీంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. పెళ్లిచూపుల్లో భాగంగా.. ప్లేట్లో కాఫీ మగ్గును రవి, బాబాకు శ్రీముఖి ఇచ్చింది. అయితే అందులో షుగరే లేదని బాబా కౌంటర్ వేయగా.. అవి నీళ్లంటూ శ్రీముఖి రివర్స్ కౌంటర్ వేసింది. దీంతో హౌస్మేట్స్ అందరూ ఘొల్లున నవ్వారు. చివరగా.. కట్నం ఎంత ఇవ్వాలంటూ శ్రీముఖి తరుపున మహేష్ అడుగుతుండగా.. మా అమ్మకు కట్నం అంటే నచ్చదని రవి చెప్పసాగాడు.. మధ్యలో అందుకున్న బాబా.. వెళ్లేటప్పుడు మాత్రం ఆటోకు రూ.500 ఇస్తే చాలు అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు. దీంతో ఇంటి సభ్యులందరూ పగలబడి నవ్వారు. -
ఒంటరయ్యానంటూ బాధపడిన శ్రీముఖి
బిగ్‌బాస్ చేపట్టిన నామినేషన్ ప్రక్రియ పెద్ద చిచ్చునే పెట్టింది. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్.. హౌస్‌లో ఫుల్ ఫన్ క్రియేట్ చేసింది. పిసినారి రాణిగా శివజ్యోతి, కొడుకులుగా రవి, వరుణ్, రాహుల్.. కోడళ్లుగా శ్రీముఖి, వితికా, పునర్నవిలు మేనేజర్‌గా బాబా భాస్కర్, అతనికి అసిస్టెంట్‌గా మహేష్ తమ పాత్రల్లో లీనమై అందరినీ ఎంటర్టైన్ చేశారు. బిగ్‌బాస్ పదో వారంలో చేపట్టిన నామినేషన్ ప్రక్రియ శ్రీముఖికి ఒంటరయ్యాననే ఫీలింగ్‌ను తీసుకొచ్చింది. బాబా భాస్కర్ కూడా తనకు ఓటు వేయకపోయేసరికి తెగ బాధపడినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై బాబా భాస్కర్‌ను ప్రశ్నించింది. ఏ విషయంలో తనకు ఓటు వేయకుండా.. శివజ్యోతికి ఓటు వేశారని అడిగింది. తానొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, ఎలిమినేషన్లో ఉన్నా.. సేవ్ అవుతుందని, ఏడుస్తుందని శివజ్యోతిని పదే పదే టార్గెట్చేసేలా మాట్లాడిందనే కారణాలతో తనకు ఓటు వేయలేకపోయానని బాబా చెప్పుకొచ్చాడు. సారీ అని బాబా చెప్పుకుంటూ ఉండగా.. సారీ ఎందుకు చెబుతున్నారని.. వద్దంటూ తనకు దూరంగా ఓ ఐదు నిమిషాలు వెళ్లమని బాబాను వేడుకుంది. టాస్క్‌లో అతి చేసిన శ్రీముఖి.. పిసినారి రాణి అయిన శివజ్యోతి వద్ద ఉండే ఇటుకలను సంపాదించి.. కొడుకులైన రవి, వరుణ్, రాహుల్ గొడను నిర్మించవలసి ఉంటుంది. అయితే మూడు జంటలు కలిసి ఆడే ఈ ఆటలో చివరి వరకు ఎవరు ఎక్కువ ఎత్తులో ఉన్న గోడను కడతారో.. వారికి తదుపరి వారం కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపాడు. వీలునామా చివరకు ఎవరి చేతిలో ఉంటే.. వారు కూడా కెప్టెన్సీ పోటీకి అర్హులవుతారని తెలిపాడు. టాస్క్‌లో భాగంగా రవి-శ్రీముఖి, వరుణ్-వితికా, రాహుల్-పునర్నవి భార్యాభర్తలుగా నటించారు. ఇక శ్రీముఖి ఈ టాస్క్‌లో రెచ్చిపోయి నటించింది. అతి వినయం ప్రదర్శిస్తూ.. తన అత్త దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు నానా ప్రయత్నాలు చేసింది. అత్త గుప్పిట్లో ఉన్న వీలునామాను చేజిక్కించుకునేందుకు వితికా ప్రయత్నించసాగింది. ఇదే మంచి సమయం అనుకున్న రాహుల్.. పునర్నవిని సొంత భార్యగానే ఫీలైనట్లు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా వీరిద్దరి సంభాషణలు హైలెట్‌గా నిలిచాయి. ఇక ముగ్గురు కొడుకులు తమ ప్రేమతో శివజ్యోతి ఉక్కిరిబిక్కిరి చేశారు. నేటి ఎపిసోడ్లో ఫన్నీగా సాగిన ఈ టాస్క్ రేపటికి భీకరపోరును పుట్టించేలా ఉంది. వరుణ్, రాహుల్ హోరాహోరిగా తలపడినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సంభాషణలు కూడా హద్దులు దాటేలా కనిపిస్తుంది. ఇక మరి వీరి మధ్య జరగనున్న పోరు.. వారి స్నేహాన్ని దెబ్బతీస్తుందా? లేదా? అన్నది చూడాలి. -
బాబా భాస్కర్, శ్రీముఖి మధ్య వార్!
బాబా భాస్కర్‌కు జాఫర్ తర్వాత మళ్లీ అంతగా క్లోజ్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది మహేశ్, శ్రీముఖిలు మాత్రమే. అయితే బాబా భాస్కర్‌ను తనను విడదీస్తున్నారని మహేశ్ చాలా సందర్భాల్లో వాపోయాడు. మహేశ్ చెప్పిన విషయాన్ని కాస్త పక్కనపెడితే బాబా శ్రీముఖిలు ఇంట్లో బెస్ట్ ప్రెండ్స్‌గా మారారు. అయితే ఆటలో ఫ్రెండ్షిప్ అడ్డుకారాదు అనే విషయాన్ని బాబా భాస్కర్ తూచ తప్పకుండా పాటిస్తాడు. అది గతంలోనూ నిరూపితమైంది. బాబా కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎలిమినేషన్లో ఉన్న ఇంటిసభ్యుల్లో నుంచి ఒకరిని సేవ్ చేయవచ్చు అని బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో శ్రీముఖి, మహేశ్ ఉన్నప్పటికీ వారిద్దరూ కాదని రవిని సేవ్ చేశాడు. ఆ విషయాన్ని శ్రీముఖి అంత సులువుగా జీర్ణించుకోలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని నెమ్మదిగా మర్చిపోతున్న శ్రీముఖికి బాబా భాస్కర్ నుంచి మరో ఊహించని షాక్ ఎదురైంది. పదోవారానికిగానూ జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో శివజ్యోతి శ్రీముఖిలో ఎవరో ఒకరు నామినేట్ అవాలి. ఇద్దరికీ చెరి సమానమైన ఓట్లు పడ్డాయి. దీంతో బాబా భాస్కర్ ఇచ్చే ఓటు కీలకంగా మారింది. బాబా భాస్కర్.. శ్రీముఖిని సేవ్ చేస్తాడనుకుంటే అంతా తలకిందులైంది. శివజ్యోతిని సేవ్ చేస్తున్నట్టు తెలపడంతో శివజ్యోతి కన్నా ఒక్క ఓటు తక్కువ రావటంతో శ్రీముఖి ఎలిమినేషన్ రౌండ్లోకి వెళ్లింది. ప్రస్తుతం ఈ విషయం ఇంటి సభ్యులను షాక్‌కు గురిచేస్తోంది. ఇదే విషయాన్ని వరుణ్ బాబాతో ప్రస్తావించగా శ్రీముఖి హార్ష్‌గా మాట్లాడిందని, అది నచ్చకే తనను సేవ్ చేయలేదని చెప్పాడు. ఈ ఘటనతో శ్రీముఖి ఒక్కసారిగా డీలా పడిపోయింది. నాకంటూ ఇంట్లో ఎవరూ లేరంటూ బాధపడింది. మరి బాబా భాస్కర్, శ్రీముఖిల ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందా? అన్నీ మర్చిపోయి మునుపటిలా కొనసాగుతారా? అనేది సస్పెన్స్‌గా మారింది. -
శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?
తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టిన బిగ్‌బాస్ హౌస్ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోగా రాహుల్, మహేశ్, హిమజలు ముగ్గురు ఎలిమినేషన్లో ఉన్నారు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన ఫన్నీటాస్క్ క్రేజీ కాలేజ్... గత సీజన్ల నుంచి కాపీ కొట్టింది అనడంలో సందేహం లేదు. ఇక ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులందరూ ఇరగదీశారు. లవ్వాలజీ లెక్చరర్‌గా వ్యవహరించిన బాబా భాస్కర్ బాగానే కామెడీ పండించాడు. అదే సమయంలో శివజ్యోతిని ఏడిపించాడు కూడా!. మొదట ఏడుపును పంటికిందే బిగపట్టినప్పటికీ చివరికి భోరున ఏడ్చేసింది. తను ఎంత స్ట్రాంగో అందరికీ తెలుసు అంటూనే బాబా... శివజ్యోతిని ఏడిపించాడు. ఇకపోతే గత ఎపిసోడ్‌లోనూ బాబా భాస్కర్, శ్రీముఖిలు... శివజ్యోతి గురించి చర్చించుకున్నారు. తను రిలేషన్ షిప్స్‌తో వీక్ అవుతోందని.. అవి దాటి గేమ్‌లోకి రావాలని కోరుకుంటున్నట్టుగా మాట్లాడుకున్నారు. శివజ్యోతిని ఏడిపిస్తున్న బాబా భాస్కర్ నిజంగా సీజన్ ప్రారంభం నుంచి చూసినట్టైతే శివజ్యోతి మొదట రోహిణి, అషూరెడ్డితో బాగానే దోస్తీ చేసింది. షోలో భాగంగా రోహిణి ఇంటిని వీడే సమయం వచ్చినప్పుడు శివజ్యోతి వెక్కివెక్కి ఏడ్చింది. రోహిణి వెళ్లిన తర్వాతి వారానికే అషూ బయటకు వెళ్లాల్సి రావటంతో తనను ఆపటం ఎవరితరం కాలేదు. బిగ్‌బాస్ ముగ్గురు స్నేహితులను విడగొట్టినప్పటికీ శివజ్యోతి మరో తోడు వెతుక్కుంది. అలీ రెజాను సొంత తమ్ముడిగా చూసుకుంటూ మురిసిపోయింది. అంతలోనే బిగ్‌బాస్ అనూహ్యంగా ఏడోవారంలోనే అలీని ఎలిమినేట్ చేశాడు. దీంతో శివజ్యోతి ఇప్పుడు రవితో క్లోజ్‌గా ఉంటోంది. నామినేషన్ టాస్క్‌లో కూడా రవి, మహేశ్‌లకు తప్ప ఇంకెవరి కోసం త్యాగం చేయను అని తేల్చిచెప్పింది. ఇవన్నీ చూస్తుంటే ఆమె నిజంగానే రిలేషన్ షిప్స్‌లో ఇరుక్కుపోయిందని, సొంతంగా ఆట ఆడలేకపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే బాబా భాస్కర్ కావాలనే శివజ్యోతి ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నాడని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివజ్యోతిని స్ట్రాంగ్ చేయడానికే బాబా గట్టి క్లాస్ పీకుతున్నాడని మరికొందరు అంటున్నారు. ఇక బిగ్‌బాస్ షో కాస్త డైలీ సీరియల్లా మారుతోందని మరికొందరు నిట్టూరుస్తున్నారు. మరి శివజ్యోతి ఈ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటుందా? లేక ఎదురు తిరుగుతుందా అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
బిగ్‌బాస్.. కన్ఫెషన్ రూమ్‌లో కష్టాలు
-
బిగ్‌బాస్.. కన్ఫెషన్ రూమ్‌లో కష్టపడుతున్నారేంటి?
బిగ్‌బాస్ హౌస్‌లో అన్నింటికంటే కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లడం కష్టమైంది. ఇంటిసభ్యులకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలన్నా.. సీక్రెట్ టాస్క్ ఇవ్వాలన్నా.. అలాంటి వాటికి కన్ఫెషర్ రూమ్ అడ్డాగా మారుతుంది. అందుకే ఆ రూమ్ అంటే అందరికీ దడగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం ఫుడ్ ఐటమ్స్ కూడా ఇస్తుంటాడు బిగ్‌బాస్. గత సీజన్లో తనీష్, రోల్ రైడా కన్ఫెషన్ రూమ్‌లో చాక్లెట్లు ఆరగించిన విషయం గుర్తుండే ఉంటుంది. నేటి ఎపిసోడ్లో కూడా అలాంటిదే జరగనున్నట్లు కనిపిస్తోంది. నేటి ఎపిసోడ్లో ఇంటి సభ్యులందర్నీ కన్ఫెషన్ రూమ్‌కు రావాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వెళ్లిన బాబా భాస్కర్ అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతూ కనిపిస్తున్నాడు. ఇంగ్లీష్ రైమ్స్ చెప్పలేక పునర్నవి తడబాటు పడటం, రాహుల్ గుంజీలు తీయడం.. రవి-హిమజలకు తినే పదార్థాలను ఇవ్వడం.. వాటిని హిమజ దాచుకోవడం.. మీకు చెప్పింది తినమని.. దాచుకోమని కాదని బిగ్‌బాస్ అనడం హైలెట్‌గా నిలిచింది. ఇంతకీ ఇంటి సభ్యులందరు కన్ఫెషనరూమ్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాలి. -
బిగ్‌బాస్.. రవిని బురిడీ కొట్టించిన బాబా
-
బిగ్‌బాస్.. రవిని బురిడీ కొట్టించిన బాబా
బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యాలు పడ్డాయి. వాటి కోసం కోర్ట్ యార్డ్‌లో స్మశానాన్ని కూడా నిర్మించాడు బిగ్‌బాస్. ఇంటి సభ్యులను మనుషులు, దెయ్యాలు అంటూ రెండు గ్రూపులుగా విభజించాడు. ఆ రెండు వర్గాల చేత ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’ టాస్క్‌లు ఆడించాడు. దొరికిందే చాన్స్ అనుకున్న దెయ్యాలు మనుషుల్ని విసిగించడానికి నానా హంగామా చేశాయి. ఈ క్రమంలో దెయ్యం రూపంలో ఉన్న వితిక వరుణ్‌ను చంపి మనిషిగా మారగా వరుణ్ దెయ్యం అయ్యాడు. ఇక మొదటి రోజు దెయ్యాలుగా ఉన్న వితిక, శిల్ప మనుషులుగా మారగా వారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన వరుణ్, పునర్నవి దెయ్యాలుగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఈ టాస్క్ రెండో రోజు కూడా కంటిన్యూ అయింది. ఆటకు తగ్గట్టుగానే నందికొండ వాగుల్లోన.. అంటూ ఓ భయంకర పాటను ప్లే చేశారు. దీంతో బాబా భాస్కర్ తెలివిగా రవిని ముగ్గులో దింపి అతని చేత డాన్స్ చేయించాడు. ఇది టాస్క్ అని తెలీక రవి బాబాతో కలిసి స్టెప్పులేశాడు. రవితో డాన్స్ చేయించినందుకుగానూ బాబా భాస్కర్ మనిషిగా మారగా రవి దెయ్యంగా మారిపోనున్నాడు. అటు మహేశ్‌ను కూడా ఐదు సార్లు బట్టలు మార్చుకునేలా చేయడంతో మహేశ్ కూడా దెయ్యంగా మారిపోయాడంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. అసలేం జరుగుతుందో అర్థం కాక మహేశ్ తల గోక్కున్నాడు. ఇక బిగ్‌బాస్.. ఆదేశాలు పాటించని కారణంగా పునర్నవి, శ్రీముఖి, మహేశ్‌లకు శిక్ష విధించాడు. అయితే పునర్నవి నా వల్ల కాదంటూ చేతులెత్తేసినా చివరకు చేయక తప్పదని ప్రేక్షకులు అంటున్నారు. ఇక గత ఎపిసోడ్లో పునర్నవిని ఈడ్చుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేయగా దానికి దెయ్యంగా మారిన తర్వాత ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి! -
బాబా భాస్కర్ ఎవరిని సేవ్ చేయనున్నాడు?
-
బాబా భాస్కర్ ఎవరిని సేవ్ చేయనున్నాడు?
బిగ్‌బాస్ ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టనుంది. నిన్నటి ఎపిసోడ్లో యాభై రోజులు పూర్తైనందుకు స్పెషల్ గెస్ట్‌గా నాని వచ్చాడు. ఇక నాగార్జున, నానిలు కలిసి నిన్న సందడి చేసిన సంగతి తెలిసిందే. నేటి ఎపిసోడ్లో ఈ వారానికి గానూ సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగినట్టు తెలుస్తోంది. గార్డెన్ ఏరియాలో ఈ ప్రక్రియను నిర్వహించినట్టు తెలుస్తోంది. గత సీజన్లో మాదిరిగా.. ఇంటి సభ్యుల ఫోటోలను కాల్చేస్తు ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారో చెప్పాల్సినట్టు తెలుస్తోంది. ఇన నామినేషన్ ప్రక్రియ అనంతరం బిగ్‌బాస్ ఇచ్చే ట్విస్ట్ అందరికీ తెలిసిందే. అయితే ఈ వారం మాత్రం కాస్త విభిన్నంగా షాక్ ఇచ్చాడు. నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లోంచి ఒకర్ని సేవ్ చేసే అవకాశాన్ని ఇచ్చాడు. దీంతో బాబా భాస్కర్ ఎవరిని సేవ్ చేయనున్నాడనే విషయం ఆసక్తిగా మారింది. మరి ఈ వారం ఇంటి నుంచి ఎవరు వీడనున్నారు? ఎలాంటి టాస్క్‌లతో ఎంటర్టైన్ చేయనున్నారు? అనేది చూడాలి. -
ఇంటి నుంచి సందేశాలు.. హౌస్మేట్స్ కన్నీళ్లు
-
ఇంటి నుంచి సందేశాలు.. హౌస్మేట్స్ కన్నీళ్లు
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు తమ ఇంటికి దూరంగా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారిలో వారే బంధాలను ఏర్పర్చుకుంటూ.. ప్రేమలు, గొడవలు, కోపాలు, అలకలతో గడిపేస్తున్నారు. మధ్యమధ్యలో బిగ్‌బాస్ హౌస్మేట్స్ తమ ఇంటిసభ్యులను గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడతుంటారు. అయితే నేడు బిగ్‌బాస్ హౌస్‌లో ఆనంద భాష్పాలు రాలనున్నాయి. తమ ఇంటి సభ్యులు పంపిన సందేశాలను బిగ్‌బాస్.. తన హౌస్‌మేట్స్‌కు అందించనున్నాడు. ఇక వాటిని చదువుకుంటూ ప్రతీ ఒక కంటెస్టెంట్ ఆనందంతో కన్నీరుపెట్టారు. వారి కుటుంబ సభ్యులు పంపిన సందేశాలతో.. కంటెస్టెంట్ల గుండెలు బరువెక్కినట్టు తెలుస్తోంది. మరి ఎవరెవరికి ఎలాంటి సందేశాలు వచ్చాయో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి. ఇక బాబా భాస్కర్ కెప్టెన్సీలో ఇళ్లంతా సందడి మారనున్నట్లు కనిపిస్తోంది. బాబా తన కొత్త రూల్స్‌తో ఎలాంటి ఫన్ను క్రియేట్ చేస్తాడో చూడాలి. -
బిగ్‌బాస్.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్
చిన్న మాటలే.. పెద్ద గొడవలకు దారి తీస్తున్నాయి. వరుణ్ అన్న మాటలకు వితికా ఏడవగా.. రాహుల్ అన్న మాటకు పునర్నవి ఏడ్చింది. చివరకు వరుణ్-రాహుల్‌కు కూడా గొడవైంది. మొదట్నుంచీ ఓ గ్రూప్‌గా ఉన్న వీరిలో.. విబేధాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ ఉన్న పునర్నవి.. ఉదయాన్నే రాహుల్ అన్న మాటకు ఏడ్చింది. పిచ్చిదానిలా వాగుతూ ఉంటదని అనే రాహుల్ అనేసరికి పునర్నవి ఏడ్చింది. ఇలా గొడవలతో నిండిపోతోన్న హౌస్‌లో.. కెప్టెన్ టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్. ఏడో వారానికి గానూ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌లో బాబా భాస్కర్, శ్రీముఖి, హిమజలను టాస్క్‌కు అర్హులుగా.. రాహుల్, రవి, శిల్పాలను అనర్హులని ఇంటిసభ్యులు ఏకాభిప్రాయంతో బిగ్‌బాస్‌కు సూచించారు. అర్హులైన సభ్యులకు అనర్హులైన హౌస్మేట్స్ సపోర్ట్ చేయాలని తెలిపాడు. ఆపినవాడిదే అధికారం అనే ఈ టాస్క్‌లో బాబా భాస్కర్‌కు శిల్పా, హిమజకు రాహుల్, శ్రీముఖికి రవి సపోర్ట్ చేసేందుకు వచ్చారు. మిగతా హౌస్మేట్స్ తమకు నచ్చిన వారికి సపోర్ట్‌చేస్తూ మిగతా వారి బాక్స్‌ల్లో ఇసుకను వేస్తూ ఉండాలి. సపోర్ట్చేయడానికి వచ్చిన రవి, రాహుల్,శిల్పాలు బాక్సులో పడే ఇసుకను వెంటవెంటనే తీసేస్తూ ఉండాలి. ఇలా ఎండ్ బజర్ మోగే వరకు ఎవరి బాక్సుల్లో తక్కువ ఇసుక ఉంటుందో వారే కెప్టెన్‌గా ఎన్నికవుతారని తెలిపాడు. ఈ టాస్క్‌కు కెప్టెన్ వరుణ్ సంచాలకులుగా వ్యవహరిస్తారని బిగ్‌బాస్ తెలిపాడు. ఇక టాస్క్ మొదలైన వెంటనే.. ఎవరికి కేటాయించిన బాక్సుల వద్దకు వెళ్లి నిల్చున్నారు. మిగిలిన ఇంటి సభ్యులు ఇసుకను వేసేందుకు ప్రయత్నిస్తుంటే.. వారిని నిరోదిస్తూ ఉండేందుకు బాబా, హిమజ, శ్రీముఖి కష్టపడ్డారు. అలీరెజా హిమజను టార్గెట్ చేస్తూ ఉండగా.. మధ్యలో కాలిజారిపడ్డాడు. పునర్నవి, మహేష్ శ్రీముఖికి సంబంధించిన బాక్స్‌లో ఇసుకను వేసేందుకు ప్రయత్నించగా.. మహేష్ చేతిల్లోంచి మగ్గును తీసుకుని శ్రీముఖి పారేసింది. అలా విసిరేయకూడదని వరుణ్ వారించగా.. తాను కావాలని చేయలేదని శ్రీముఖి చెప్పుకొచ్చింది. ఇసుకను వేయకుండా మిగిలిన ఇంటిసభ్యులను అలీరెజా అడ్డుకుంటూ ఉండటంపై వరుణ్ ఫైర్ అయ్యాడు. ఆ నియమం టాస్క్‌లో లేదని.. సపోర్ట్ చేయాలనుకుంటే.. మిగిలిన వారి బాక్సుల్లో ఇసుకను నింపాలని. అంతేకాని ఎవరికీ అడ్డుపడొద్దని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే విషయమై మహేష్, పునర్నవితో అలీ వాగ్వాదానికి దిగాడు. వరుణ్ కూడా వాదించగా.. అలీరెజా ఆటను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. పునర్నవి, మహేష్, శివజ్యోతి, వితికా ఆటను కొనసాగిస్తూ.. తమకు నచ్చిన వారికి మద్దతుగా నిలిచారు. ఎండ్బజర్ మోగేవరకు బాబా భాస్కర్‌కు సంబంధించిన బాక్స్‌లో తక్కువ ఇసుక ఉండటంతో.. ఏడో వారానికి సంబంధించి బాబా భాస్కర్ కెప్టెన్‌గా ఎన్నికైనట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. టాస్క్ అనంతరం ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తాను సంచాలకుడిగా నియమాలానుసారం నడుచుకున్నానని అలీరెజాతో చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అతను వినలేదు. పునర్నవి సారీ చెప్పినా .. దానిని స్వీకరించలేదు. మధ్యలో శ్రీముఖి వెళ్లి అలీని శాంతపర్చింది. తనను ఓ ఐదుగురు కలిసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఏం మాట్లాడకు అంటూ అలీని కూల్ చేసింది. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ టాస్క్‌లో స్పోర్టివ్ లేదని, తాను చేసింది ఏమీ లేదని, తాను ఆడి గెలుస్తానో లేదో కానీ.. ప్రస్తుతం మాత్రం హ్యాపీగా లేనని వరుణ్, రాహుల్‌తో చెప్పుకొచ్చారు. ఇక రేపటి నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి రూల్స్ పెడతారో? హౌస్మేట్స్ అందరూ బాబాను ఎలా ఏడిపిస్తారో చూడాలి. -
బిగ్‌బాస్.. ఆ ముగ్గురిలో కెప్టెన్ కాబోయేదెవరు?
చలో ఇండియా టాస్క్‌ను పూర్తి చేసిన హౌస్మేట్స్.. వారి అనుభూతులను కెమెరాలో బంధించారు. ఈ ట్రిప్‌లో భాగంగా శ్రీనగర్, చంఢీగర్, కోల్‌కతా, ముంబై, కొచ్చిలకు ప్రయాణించిన ఇంటి సభ్యులు మార్గమధ్యంలో సరదా ముచ్చట్లు, ఆటపాటలతో సందడి చేశారు. ముంబై చేరుకున్నానక ఓ సినిమాను కూడా తెరకెక్కించారు. బాబా భాస్కర్ డైరెక్షన్లో తీసిని ఆ సినిమాలో రవికృష్ణ హీరోగా, అలీరెజా విలన్‌గా నటించారు. మొత్తానికి ఏదో రకంగా సినిమాను కంప్లీట్ చేసిన టీమ్.. ప్రెస్‌మీట్ లాంటిది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబా భాస్కర్కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించారు. వెండితెరపై ఎప్పుడు కనబడతారు అన్న ప్రశ్నకు కంటతడి పెడుతూ త్వరలోనే హీరోగా నటిస్తానని తెలిపారు. ఇక ఇంటిసభ్యులకు ఇచ్చిన కొన్ని టాస్కులను కూడా వారు పూర్తి చేశారు. కొచ్చిలో పీచు తీయండి.. టెంకాయ వేయండి టాస్క్‌లో బాబా భాస్కర్ గెలవగా.. రాణీ మెడలో రత్నాల హారం టాస్క్‌లో మహేష్ గెలుపొందాడు. ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు దిగిన ఫోటోలు, వీడియోలను ప్లే చేసి చూపించాడు. అనంతరం ఈ టాస్క్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ముగ్గురు సభ్యుల పేర్లను ఏకాభిప్రాయంతో చెప్పమని అదేశించాగా.. వరుణ్, రాహుల్, బాబా భాస్కర్ల పేర్లను తెలిపారు. దీంతో ఈ ముగ్గురుకి ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ను పెట్టనున్నట్లు ప్రకటించారు. మట్టిలో ఉక్కు మనిషి అనే ఈ టాస్క్‌లో ఎవరు గెలుపొంది.. కెప్టెన్‌గా ఎన్నికవుతారో చూడాలి. రెండో సారి కెప్టెన్‌గా ఎన్నికై వరుణ్ రికార్డు సృష్టిస్తాడా? లేదా బాబా భాస్కర్, రాహుల్‌లో ఎవరో ఒకరు కెప్టెన్ పదవిని పొందుతారా? అన్నది చూడాలి. -
డైరెక్షన్ చేస్తోన్న బాబా భాస్కర్
-
బిగ్‌బాస్.. డైరెక్షన్ చేస్తోన్న బాబా భాస్కర్
బిగ్‌బాస్ సెట్ కాస్త షూటింగ్ సెట్‌గా మారనుంది. చలో ఇండియా టాస్క్‌లో రెండో అంకమే ఈ ఎర్రగడ్డ లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కించడమేనని తెలుస్తోంది. నిన్నటి బీబీ ఎక్స్‌ప్రెస్‌లో ఇండియాను చుట్టిరావడానికి వెళ్లిన ఇంటి సభ్యులు నేడు సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. మరి ఎవరు ఏ క్యారెక్టర్‌ను పోషించారో చూడాలి. రెండో సీజన్లో కూడా ఇలాంటి ఓ టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్. మరి ఆ సీజన్లో పండిన సెంటిమెంట్, సన్నివేశాలు మరి ఎర్రగడ్డ లవ్ స్టోరీలో కూడా హైలెట్ అవుతాయో లేదో చూడాలి. ఈ టాస్క్‌లో బాబా భాస్కర్ తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించగా.. అలీ రెజా, రవికృష్ణ తమ పర్ఫామెన్స్తో ఇరగదీసేట్టు కనిపిస్తున్నారు. ఆ సినిమా కథ, కథనాలు ఏంటో తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్‌ను చూడాల్సిందే. -
హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపించిన బాబా భాస్కర్
-
హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపించిన బాబా భాస్కర్
చలో ఇండియా టాస్క్ మొదటి అంకం సరదాగా గడిచింది. ఆరో వారంలో నామినేషన్ ప్రక్రియ అనంతరం ఇచ్చిన ఈ టాస్క్‌తో ఫన్ జనరేట్ చేయాలని బిగ్‌బాస్ ప్రయత్నిస్తున్నాడు. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఎక్స్‌ప్రెస్‌లో ఇండియాను చుట్టి రావాలని ఇంటి సభ్యులకు కొన్ని క్యారెక్టర్లను ఇచ్చాడు. హనీమూన్ కోసం వచ్చిన కొత్త జంట రవి-పునర్నవి కాగా గయ్యాలి పెళ్లాం పాత్రలో హిమజ, చెప్పింది వినే భర్తగా మహేష్ టాస్క్‌లో ఇరగదీసిన సంగతి తెలిసిందే. చాదస్తపు తల్లిగా శివజ్యోతి, అల్లరి పిల్లగా వితికా.. ప్రేమను వెతుక్కునే క్యారెక్టర్లో శ్రీముఖి, ట్రావెల్ ఏజెన్సీ మేనేజర్, అందమైన యువకుడిగా అలీరెజా, చాయ్‌వాలాగా బాబా భాస్కర్, ట్రైన్ డ్రైవర్స్‌గా వరుణ్, రాహుల్‌లు నటించారు. ఇక బుధవారం నాటి ఎపిసోడ్లో హిమజ, శివజ్యోతిలు ఫన్ క్రియేట్ చేయగా.. నేటి రెండో అంకంలో బాబా భాస్కర్ ఇంటి సభ్యులను విసిగిస్తూ.. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయనున్నుట్లు తెలుస్తోంది. తాను మొదట్లో హైదరాబాద్‌కు వచ్చినప్పటి పరిస్థితుల గురించి చెబుతూ ఉన్నాడు. మధ్యలో ఇంటి సభ్యులు అడ్డుకుంటూ ఉండటంతో మళ్లీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుండటంతో హౌస్మేట్స్ అందరూ చేతులెత్తి దండం పెట్టారు. మరి ఈ టాస్క్‌లోని రెండో అంకంలో ఇంకా ఎలాంటి ఫన్ మూమెంట్స్ ఉండనున్నాయో చూడాలి. -
నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్
నామినేషన్, ఎలిమినేషన్ ఓ లెక్కైతే.. వీకెండ్లో హౌస్‌మేట్స్‌తో ఫన్నీ టాస్క్‌లు చేయించి బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేయడం మరోలెక్క. వారాంతంలో నాగార్జున వచ్చి.. హౌస్‌మేట్స్‌ను సరైన దారిలో పెట్టడం.. దానికి తగ్గట్టు కొన్ని హెచ్చరికలు, సూచనలు ఇవ్వడం చేస్తుంటాడు. ఐదో వారాంతానికి చేరుకున్న బిగ్‌బాస్‌లో ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఐదో కంటెస్టెంట్ బయటకు వెళ్లడానికి రంగం సిద్దమైంది. ఎలిమినేట్ అయ్యేది ఎవరో అందరికీ తెలిసిపోయినా.. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. (బిగ్‌బాస్.. అషూ ఎలిమినేటెడ్!) కంటెస్టెంట్ ఎలిమినేషన్ విషయంలో ఉండాల్సిన ఉత్కంఠ ఉండకపోయే సరికి.. ఎసిసోడ్‌ను మరింత ఎంటర్టైన్గా మలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆదివారం నిజంగాన్ ఫన్‌డేగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఒకరి క్యారెక్టర్‌ను మరొకరు ప్లే చేసి చూపించడంతో మంచి ఎంటర్టైన్ వచ్చేలా కనిపిస్తోంది. వరుణ్ సందేశ్ పునర్నవిలా.. పునర్నవి వరుణ్‌సందేశ్‌లా, వితికాల అలీరెజా, రాహుల్లా శ్రీముఖి నటించడం ఫన్ను క్రియేట్ చేసేలా ఉంది. ఇక బాబా భాస్కర్‌కు తెలుగు సరిగా రాకపోవడంతో హౌస్మేట్స్ పేర్లను కరెక్ట్‌గా పలకలేకపోతున్నాడు. ఈ క్రమంలో నాగార్జున పేరును నాగరాజు అని మార్చేశాడని శివజ్యోతి నాగ్‌కు ఫిర్యాదు చేస్తోంది. ఇంటి సభ్యులను మాస్క్‌లతో ఆట ఆడించిన నాగ్.. ఈ సన్‌డేను ఫన్‌డేగా మార్చబోతోన్నట్లు కనిపిస్తోంది. -
బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్ : నాగ్
వీకెండ్లో దర్శనమిచ్చేందుకు.. హౌస్‌మేట్స్‌ను దారిలో పెట్టేందుకు నాగార్జున రెడీ అయ్యాడు. బిగ్‌బాస్ ఐదో వారంలో హౌస్మేట్స్ ప్రవర్తనపై కొందరికి అక్షింతలు పడేట్టు కనిపిస్తున్నాయి. ఓ వారం పొగడ్తలు, మరోవారం అక్షింతలతో అలీరెజా నెట్టుకొస్తున్నాడు. అయితే ఈ వారం అలీకి గట్టిగానే క్లాస్ పీకుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం మహేష్‌తో వాగ్వాదానికి దిగడం, కెప్టెన్ శివజ్యోతి చెబుతున్నా వెనక్కి తగ్గకపోవడంపై నాగ్ గురిపెట్టినట్టు కనిపిస్తోంది. నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను కాసేపటి క్రితమే విడుదల చేశారు. అలీరెజా, బాబా భాస్కర్ల తీరును నాగార్జున ఎత్తిచూపుతున్నాడు. అంత అహంకారమెందుకు? ఆడపిల్ల కెప్టెన్ అయితే మాట వినవా? అంటూ అలీరెజాను ప్రశ్నిస్తున్నాడు? ఇక బాబా భాస్కర్ విషయాన్ని కూడా నాగ్ లేవనెత్తగా.. కామెడీగా చేసేందుకు ప్రయత్నించిన బాబానుద్దేశించి.. ఇది కామెడీ కాదు సీరియస్ అంటూ కాస్త ఘాటుగా స్పందించాడు. మిగిలిన ఇంటి సభ్యులకు కూడా నాగ్ క్లాస్ పీకాడా అని తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాలి. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
బిగ్‌బాస్.. అది సీక్రెట్ టాస్కా?
ప్రోమోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్‌బాస్ షో.. నెట్టింట చర్చకు దారితీస్తోంది. తినే విషయంలో బాబా భాస్కర్ హిమజను ఏదో అన్నట్లు, దానికి ఫీలైన హిమజ.. ఇంట్లో ఉన్న ఎగ్స్‌ను పగలగొట్టినట్లు చూపిస్తున్న ప్రోమోపై అందరూ చర్చించుకుంటున్నారు. ఇదేమైనా సీక్రెట్ టాస్కా? లేదా నిజంగానే గొడవ జరిగిందా? అని తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే అది సీక్రెట్ టాస్క్ కావాలని? హిమజ ఫాలోవర్స్ కోరుకుంటున్నారు. లేదా ఈ సంఘటనతో హిమజ ఎలిమినేట్ కావడం గ్యారంటీ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హిమజకు కాస్త నెగెటివిటీ కూడా పెరుగుతోంది. ఎవరితోనూ సరిగా కలవకపోవడం, తన ధోరణిలోనే వెళ్లడం లాంటివి వీక్షకులకు చికాకుపుట్టించేలా ఉన్నాయి. ఈ వారంలో ఎలిమినేషన్ అయ్యేందుకు చాన్స్ఉన్న కంటెస్టెంట్‌గా హిమజ లిస్ట్‌లోకి వచ్చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఉన్నది నిజమైతే.. ఈ వారం కచ్చితంగా హిమజనే ఎలిమినేట్ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గొడవ నిజంగా జరిగిందా? లేదా బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కా? అన్నది తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
బాబా భాస్కర్-అలీ వ్యవహారం ముదురుతోందా?
బిగ్‌బాస్ ఇంట్లో గొడవలు ముదురుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో వారి ఫాలోవర్స్ మధ్య వాడివేడిగా చర్చలు జరగుతున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో ముందు నుంచీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన బాబా భాస్కర్ గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది. జాఫర్ ఉన్నంత కాలం ఆయనతో సరదాగా కామెడీలు చేస్తూ, ఆటపాటలతో ఎంజాయ్ చేసిన బాబాకు రానురాను గడ్డుపరిస్థతి ఎదురయ్యేట్టు కనిపిస్తోంది. జాఫర్ ఎలిమినేట్ అయ్యాక కుంగిపోయిన బాబా.. అనంతరం శ్రీముఖి, మహేష్‌లతో క్లోజ్ అయ్యాడు. ఎప్పుడు చూసిన మహేష్ లేదా శ్రీముఖితో ఉంటూ.. మిగతా వారిని గ్రూప్ అంటూ కామెంట్లు చేస్తూ ఉంటే వింటూ ఉంటున్నాడు. సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అలీరెజా, పునర్నవిలు కనిపించకుండా పోయినప్పుడు బాబా భాస్కర్, హిమజలు వారిద్దరు రాకపోయినా తమకేం ఇబ్బంది లేదన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే అదే విషయాన్ని గుర్తించుకుని అలీ రెజా బాబాను నామినేట్ చేశాడని, కెప్టెన్సీ టాస్క్‌లో బాబా అంతగా సహాయం చేసినా అది గుర్తుంచుకోలేదని అలీరెజాను టార్గెట్ చేస్తున్నారు బాబా ఫాలోవర్స్. శ్రీముఖి, మహేష్ మాటలకు ఇన్ఫ్లూయెన్స్ అవుతూ.. వారితోనే ఓ గ్రూప్‌గా ఉంటూ మిగతా వారి గురించి కామెంట్లు చేస్తుంటే వింటూ ఉంటాడు, ఏదైనా గొడవలు జరిగితే సేఫ్ గేమ్ ఆడుతూ.. ఏ స్టాండ్ సరిగా తీసుకోకుండా ఉంటాడని ఓ వర్గం బాబాను టార్గెట్ చేస్తోంది. మొత్తానికి మంచి వాడిగా, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న బాబా భాస్కర్.. నామినేషన్స్‌లోకి వస్తే కంగారుపడటం, బాధపడటం ఆయన ఫాలోవర్స్‌కు మింగుడుపడటం లేదు. బాబా భాస్కర్‌ను ఏడిపించేలా చేస్తారా? అంటూ ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్‌గా ఎవరు ఎన్నికవుతారో చూడాలి. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి
నామినేషన్ ప్రక్రియతో బిగ్‌బాస్ హౌస్ వేడెక్కింది. కెప్టెన్ అయిన అలీరెజాకు ప్రత్యేక అధికారాన్ని ఇవ్వడం.. నామినేషన్స్ కోసం నాలుగు పేర్లను ముందే ప్రకటించడం.. నామినేషన్ నుంచి తప్పించుకోవడం కోసం అలీరెజాను కాకాపట్టడం.. ఈ విషయంలో బాబా భాస్కర్ ఫన్ క్రియేట్ చేయడం.. హైలెట్‌గా నిలిచింది. అనంతరం ఐదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. నామినేషన్ ప్రక్రియ కోసం హౌస్మేట్స్ అందరూ కోర్ట్ యార్డ్‌లో కూర్చున్నారు. వారి ముందు ఉన్న బాక్సులను సెలెక్ట్ చేసుకోవాలని.. అందులో బ్లాక్ బాల్ వస్తే ఎరుపు రంగు పూసి నామినేట్ చేయాలని, రెడ్ బాల్ వస్తే.. కన్ఫెషన్ రూమ్‌కు వచ్చి నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరి పేర్లు చెప్పాలని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో వితికా, శ్రీముఖి, రాహుల్, శివజ్యోతిలు కన్ఫెషన్ రూమ్‌కు వెళ్లి నామినేట్ చేశారు. మహేష్, అషూలను వితికా.. రాహుల్, అషూలను శ్రీముఖి.. హిమజ, శ్రీముఖిలను రాహుల్.. పునర్నవి, రాహుల్‌ను శివజ్యోతి నామినేట్చేస్తున్నట్లు బిగ్‌బాస్‌కు తెలిపారు. మిగతా సభ్యులకు బ్లాక్ బాల్ రావడంతో కోర్ట్ యార్డ్‌లోనే ఎరుపు రంగును పూసి నామినేట్ చేశారు. హిమజ, రాహుల్ పునర్నవిని నామినేట్ చేస్తూ.. రాహుల్ గేమ్‌ను లైట్‌గా తీసుకుంటున్నాడని, హిమజ చెప్పింది వినకుండా వాదిస్తూ ఉంటుందనే కారణాలు చెప్పుకొచ్చింది. ఇక వరుసబెట్టి మిగతా హౌస్మేట్స్ అదే కారణం చెప్పి రాహుల్‌ను నామినేట్ చేస్తూ వచ్చారు. రాహుల్, అషూను బాబా భాస్కర్.. రాహుల్, హిమజలను అషూ.. హిమజ, రాహుల్‌ను అషూ.. రాహుల్, మహేష్‌లను వరుణ్.. రాహుల్, వరుణ్‌లను మహేష్.. పునర్నవి, అషూలను హిమజ నామినేట్ చేసింది. ఈ ప్రాసెస్‌లో పునర్నవి, అషూలతో హిమజకు పెద్ద వాగ్వాదం జరిగింది. కంటతడి పెట్టిన బాబా భాస్కర్ కెప్టెన్ అయినందుకు అలీరెజాకు ప్రత్యేక అధికారాన్ని ఇచ్చాడు బిగ్‌బాస్. నేరుగా ఓ హౌస్‌మేట్‌ను నామినేట్ చేసే అధికారాన్ని ఇస్తూ.. అందుకు గానూ ముందుగా ఓ నలుగురు ఇంటి సభ్యుల పేర్లు చెప్పాలని తెలిపాడు. దీంతో రాహుల్, హిమజ, వితిక, బాబా భాస్కర్ల పేర్లను బిగ్‌బాస్‌కు తెలిపాడు. అయితే ఆ నలుగురు అలీరెజాను ఒప్పించి.. నామినేషన్ నుంచి తప్పించుకోవచ్చు అనే మెలిక పెట్టాడు. ఇక బాబా భాస్కర్ తనను నామినేషన్ నుంచి తప్పించమని అలీరెజా వెంటపడ్డాడు. అయితే తను గేమ్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని బాబాకు అలీరెజా సూచించాడు. అయితే తాను సీరియస్‌గా ఉండడానికి ప్రయత్నిస్తానంటూ అలీతో బాబా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటివరకు నామినేట్ కాని సభ్యుల పేర్లు చెప్పమని అలీరెజాకు బిగ్‌బాస్ సూచించగా.. బాబా భాస్కర్‌ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఈ వారానికి రాహుల్, హిమజ, అషూ, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్లు నామినేట్ అయినట్లు ప్రకటించాడు. తనను నామినేట్ చేస్తున్నట్లు, తన పేరు చెప్పగానే బాబా భాస్కర్ కంట్లో నీళ్లు తిరిగినట్టు అనిపించాయి. ఇక నామినేషన్ విషయంలో తనను అలీరెజా మోసం చేశాడని బాబా భాస్కర్ శ్రీముఖితో చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నాడు. అతను చెప్పాడనే సైలెంట్‌గా ఉన్నానని కానీ చివరకు తననే నామినేట్ చేశాడని పేర్కొన్నాడు. వెనకాలే ఉంటూ నమ్మక ద్రోహం చేస్తే తాను తట్టుకోలేనని, ఇక్కడికి ఆట ఆడటానికి రాలేదంటూ బాధపడ్డాడు. నామినేషన్స్‌కు బాబ భాస్కర్ భయపడంటూ తనలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది శ్రీముఖి. ఇక రేపటి ఎపిసోడ్లో పంతం నీదా నాదా? అనే కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు గెలుస్తారో? బిగ్‌బాస్ ఇంటికి మూడో కెప్టెన్‌గా ఎవరు ఎన్నికవుతారో చూడాలి. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
బిగ్‌బాస్.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్
ఆదివారం వస్తే ఎలిమినేషన్స్‌తో బయపడే హౌస్మేట్స్.. సోమవారానికి నామినేషన్ ప్రక్రియతో హడలెత్తిపోతారు. ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు.. ఏ కారణాలతో నామినేట్ చేస్తారు.. ఎవరిని నామినేట్ చేయాలని ఇలా హౌస్మేట్స్ ఆలోచిస్తూ ఉంటారు. సరైన కారణాలను చెబుతూ కొందరు నామినేట్ చేయగా.. ఎలాంటి కారణాలు లేకుండా చిన్న చిన్న విషయాలను చూపిస్తూ మరికొందరు నామినేట్ చేస్తుంటారు. (బిగ్‌బాస్.. రాహుల్‌కు పునర్నవి షాక్!) అయితే ఇప్పటికి బిగ్‌బాస్‌లో నాలుగు వారాలు గడవగా.. నలుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. హేమ, జాఫర్, తమన్నా, రోహిణిలు బిగ్‌బాస్ హౌస్‌ను వీడగా.. ఇంటి నుంచి బయటకు పంపే ఐదో వ్యక్తి కోసం నామినేషన్ ప్రక్రియ సోమవారం ఎపిసోడ్లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నామినేషన్ ప్రక్రియలో బాబా భాస్కర్‌ను నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి గానూ బాబా భాస్కర్ కంటతడి పెట్టినట్టు కనబడుతోంది. అయితే హౌస్మేట్స్ చెప్పిన కారణాలకు అతను బాధపడ్డాడా? అంతలా ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నాడు అనేది చూడాలి. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంతో క్లోజ్‌గా ఉండే.. పునర్నవి-రాహుల్‌లు నామినేషన్ ప్రక్రియతో శత్రువులుగా మారేట్టు కనిపిస్తోంది. ఈ వారానికి పునర్నవి రాహుల్‌ను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి నామినేషన్ ప్రక్రియలోనే ఇన్ని మలుపులు ఉంటే.. ఈ వారం మొత్తం బిగ్‌బాస్ ఇంకెలా ఉండబోతోందో చూడాలి. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
ఫ్రెండ్షిప్ రోజే.. ఫ్రెండ్స్ విడిపోయారు!
ఒక బంధం ఎందుకు ఎలా ఏర్పడుతుందో చెప్పలేము. ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో మనుషులు నేరుగా మాట్లాడుకోవటమే తగ్గిపోయింది. అలాంటిది ఓ పదిహేను మందిని ఒకే ఇంట్లో పడేసి.. వారికి టీవీ,ఫోన్, నెట్ ఇలా అన్నింటిని దూరం చేస్తే ఎలా ఉంటుందో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. బిగ్‌బాస్ హౌస్‌లో కోపాలు, తాపాలు, బాధలతో పాటు బంధాలు కూడా ఏర్పడతాయి. గత సీజన్లో పాల్గొన్నవారిలో దాదాపు అందరూ ఎప్పుడోకప్పుడు కలుసుకుంటూనే ఉంటారు. ఇక ఈ మూడో సీజన్లో ఇప్పటి వరకు బాబా భాస్కర్, జాఫర్లు మాత్రమే చాలా దగ్గరయ్యారు. వీరిద్దరు కలిసి చేసే కామెడీని వీక్షకులు ఇష్టపడుతుంటారు. బాబా భాస్కర్ డైరెక్షన్ జాఫర్ చేసే డ్యాన్సులు, పాడే పాటలు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. అప్పుడప్పుడు కెమెరాలతో చేసే కామెడీ టైమింగ్‌కు ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఈ రోజు ఎలిమినేట్ కానుంది జాఫర్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా జాఫర్ ఎలిమినేట్ అయినట్లు చెబుతున్నారు. ఫ్రెండ్ షిప్ రోజే బాబా భాస్కర్, జాఫర్లు విడిపోయారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజు ఎపిసోడ్లో నాగ్ దర్శనమివ్వడమే కాకుండా రామ్, నిధి అగర్వాల్ అతిథులుగా రానున్నారు. హౌస్మేట్స్ కూడా ఫ్రెండ్షిప్ డేను సెలబ్రేట్ చేసుకోనున్నారు. మరి నిజంగానే జాఫర్ ఎలిమినేట్ అయితే.. బాబా భాస్కర్ హౌస్‌లో మళ్లీ యాథావిథిగా ఎంటర్టైన్ చేస్తాడా?లేదా అన్నది చూడాలి. -
బిగ్‌బాస్‌లో రేలంగి మామయ్య
బిగ్‌బాస్‌లో మొదటి వారం గడిచిపోయింది. కోపాలు, అలకలు, ప్రేమలు ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో నిండిన ఆ ఇంట్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించలేం. ఇంట్లోంచి హేమ ఫస్ట్ ఎలిమినేట్ కాగా..రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. పద్నాలుగు మంది నామినేషన్ ప్రక్రియలో పాల్గొనగా.. వితికాను మినహాయించిన సంగతి తెలిసిందే. నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా.. వరుణ్ సందేశ్‌తో వితిక గుసగుసలాడుకుంటూ ఉండటంతో ఆమెను మినహాయించారు. ఇక ఈ మొత్తం ప్రాసెస్‌లో బాబా భాస్కర్ హైలెట్‌గా నిలిచాడు. తాను ఎవర్నీ అంచనా వేయలేకపోతున్నానని, అందరూ మంచివారేనని తానేవర్నీ నామినేట్ చేయనని బిగ్‌బాస్‌కు తేల్చి చెప్పాడు. కొంత సమయం తీసుకుని మళ్లీ కన్ఫెషన్ రూమ్‌కు వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాల్సిందిగా ఆదేశించాడు. అయినా సరే బాబా భాస్కర్ ఎవరినీ నామినేట్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో విసుగుచెందిన బిగ్‌బాస్ హౌస్మేట్స్ అందర్నీ హెచ్చరించాడు. బాబా భాస్కర్ నామినేషన్ ప్రక్రియలో ఎవరినీ నామినేట్ చేయనందున హౌస్మేట్స్ అందరూ నామినేషన్లో ఉండటం.. లేదా అందరూ కలిసి బాబా భాస్కర్‌ను నామినేట్ చేయడం అంటూ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. దీంతో బాబా భాస్కర్ వెనక్కు తగ్గి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటానంటూ వితికా, రాహుల్‌ను నామినేట్ చేశాడు. ఇక ఈ విషయంపై బాబా భాస్కర్ వ్యవహరించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అతి మంచితనం కూడా చేటే అని కొందరు అంటుంటే.. రియల్ రేలంగి మామ అని మరికొందరు పొగిడేస్తున్నారు. బిగ్‌బాస్‌కు ఎదురు తిరుగుతున్న బాబా భాస్కర్ అంటూ రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ రేలంగి మామయ్య అంటే తెలుసు కదా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాశ్‌రాజ్ పోషించిన పాత్ర అది. మనుషులు మంచోళ్లు అని అసలు మనుషులంటేనే మంచోళ్లు అంటూ అతి మంచితనంతో ప్రకాశ్ రాజ్ పోషించిన ఆ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే బిగ్‌బాస్‌లో మాత్రం బాబా భాస్కర్.. రేలంగి మామయ్య అంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. -
బాబా భాస్కర్-జాఫర్‌ల మధ్య గొడవ
బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నది ఎవరైనా ఉన్నారు అంటే అది బాబా భాస్కర్,జాఫర్లు మాత్రమే. వీరిద్దరి ద్వయం చేసే చేష్టలు, మాటలు వీక్షకులకు కాస్త రిలీఫ్ దొరికినట్టు అనిపిస్తోంది. జాఫర్‌కు వ్యాయామం ఎలా చేయాలో డైరెక్షన్ ఇవ్వడం, డ్యాన్సులు నేర్పించడం, ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఇలా ప్రతీ దాంట్లో ఫన్ ఉంటోంది. నిన్నటి ఎపిసోడ్ మొత్తం గొడవలతో నిండినా.. వీరిద్దరు కలిసి చేసిన బాహుబలి స్పూఫ్ కాస్త ఫన్ క్రియేట్ చేసింది అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమో కాస్త వైరల్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ ప్రోమోలో బాబా భాస్కర్, జాఫర్లు ఇద్దరూ కలిసి డ్యాన్సులు, పాటలు పాడుకుంటూ ఉన్నారు. డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ ఉండగా తననే చూడాలని అక్కడ చూడకూడదు, హేమ వైపు చూడకూడదు అనడం, పాట పాడటంలో తప్పు దొర్లితే సరిచేయటం, గొడవలు లేకుండా ఇలా ఉంటేనే బాగుంది, లేదంటే గొడవలు పెట్టుకోవడం మళ్లీ కొద్దిసేపటికే నవ్వుకోవడం అంటూ జాఫర్ కామెంట్ చేయడం, చివరగా.. జాఫర్‌ను అమర్యాదగా (రా) సంభోదించడంతో ఆయన సీరియస్ కావడం హైలెట్‌గా నిలిచాయి. మరి నిజంగానే వారిద్దరికి గొడవ జరిగిందా? లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే. చదవండి : నా భార్యకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు -
మాస్ స్టెప్పులకు మారుపేరు బాబా భాస్కర్
బిగ్‌బాస్ ఇంట్లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా బాబా భాస్కర్ ఎంట్రీ ఇచ్చారు. ఢీ షోతో ఫేమస్ అయిన ఈ డ్యాన్స్ మాస్టర్.. కొద్ది కాలంలోనే స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. ఎంతో మంది స్టార్ హీరోలతో కొత్త కొత్త స్టెప్పులు వేయిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డ్యాన్స్ మాస్టర్‌గా ఉన్న బాబా భాస్కర్.. కొరియోగ్రఫీలో ప్రత్యేకమైన శైలి ఉంటుందన్న సంగతి తెలిసిందే. సెట్లో ఈయన చేసే అల్లరి గురించి, బుల్లితెరపై వచ్చే కార్యక్రమాల్లో ఈయన చేసే సందడిని అందరూ చూసే ఉంటారు. మగధీర చిత్రంలోన పంచదార బొమ్మా అనే పాట తన లైఫ్‌కు టర్నింగ్‌పాయింట్ అని చెప్పుకునే ఈ కొరియోగ్రాఫర్‌కు.. బిగ్‌బాస్ కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్నది చూడాలి.