బాబా భాస్కర్.. ‘ఎంటర్‌టైన్‌మెంట్ కా బాప్, టాస్క్‌లో తోపు, వర్క్‌లో తోపు, డాన్స్ కా కింగ్, నో బ్యాక్ బిచ్చింగ్, లవ్స్ ఎవ్రీ వన్’ ఇది ఓ అభిమాని చెప్పిన మాట. అయితే ప్రేక్షకులు కూడా దీన్ని ఎంతో కొంత ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే బాబా ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉంటాడు. గుండెలో ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం చిరునవ్వుతో కనిపిస్తాడని స్వయంగా బిగ్‌బాసే పేర్కొన్నాడు. ఇక వచ్చీరాని తెలుగుతో ఆయన ఆపసోపాలు పడ్డా.. అవి కూడా నవ్వు తెప్పించేవి. బాబా భాస్కర్ అంటే ఇంటి సభ్యులందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం. కానీ, అదే సమయంలో బాబా ‘మాస్కర్’ అన్న పేరును సంపాదించుకున్నాడు.
బాబా ఒంటరి పోరాటం
సోషల్ మీడియాలో.. బాబా భాస్కర్ ‘ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్’ అని ఆయన అభిమానులు చెప్పుకొస్తుంటే, బాబా ‘మాస్కర్’ అంటూ ఆయనంటే గిట్టనివాళ్లు ప్రచారం చేస్తున్నారు. దీనిపై బాబా స్నేహితుడు, రెండోవారంలోనే ఇంటి బాట పట్టిన హౌస్‌మేట్ జాఫర్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా బాబాపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టాడు. బిగ్‌బాస్ హౌస్ లోపల ఉన్న ప్రతీ ఒక్కరికీ బయట ఎవరో ఒకరి సపోర్ట్ ఉందని, కొంతమందికైతే ఏకంగా సోషల్ మీడియా మేనేజర్స్ మద్దతు కూడా ఉన్నట్టు కనిపిస్తోంది అని పేర్కొన్నాడు. కానీ ఎలాంటి అండదండలు లేని ఏకైక వ్యక్తి బాబా భాస్కర్ మాత్రమేనన్నాడు.
బాబాను ‘మాస్కర్’ కాదు: పైర్
బాబా భాస్కర్ కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా అంటేనే తెలియదని, దానిపై కనీస అవగాహన కూడా లేదని జాఫర్ చెప్పుకొచ్చాడు. ఆట కోసమో, టైటిల్ కోసమో మాస్కులు వేసుకునే తత్వం బాబాది కాదని ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇక ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో టాప్-5కు చేరుకున్న ఇంటి సభ్యుల కోసం బయట గట్టిగానే ప్రచారం జరుగుతోంది. కానీ బాబాకు మాత్రం ప్రచారం చేసే ఆర్మీలు కానీ మద్దతుగా నిలిచే సెలబ్రిటీలు గానీ లేరు. అయితే.. ఓట్ల కోసం ఎలాంటి జిమ్మిక్కులు చేయకపోయినా బాబా గెలుపు కోసం చాలామందే పోరాడుతుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment