బిగ్‌బాస్‌: బాబా ఔట్‌.. విజేత ఎవరంటే! | Srimukhi, Rahul Sipligunj, Baba Bhaskar Are Top 3 Contestants of Biggboss 3 Telugu | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: బాబా ఔట్‌.. విజేత ఎవరంటే!

Published Sun, Nov 3 2019 8:48 PM | Last Updated on Mon, Nov 4 2019 7:34 AM

Srimukhi, Rahul Sipligunj, Baba Bhaskar Are Top 3 Contestants of Biggboss 3 Telugu - Sakshi

బాస్‌బాస్‌ సీజన్‌ 3 తుదిపోరు రసవత్తరంగా మారింది. టాప్‌-5లో ఉన్న ఐదుగురి కంటెస్టెంట్లలో ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయ్యారు. అలీ రెజా, వరుణ్‌ సందేశ్‌ ఇప్పటికే ఎలిమినేట్‌ అవ్వగా.. తాజాగా ఊహించినట్టే బాబా భాస్కర్‌ కూడా హౌజ్‌ నుంచి బయటకు వచ్చాడు. దీంతో తుది అంకానికి చేరుకున్న ఫైనల్‌ పోరులో టాప్‌-2 కంటెస్టెంట్స్‌ శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ మిగిలారు. టాప్‌-2లో ఈ ఇద్దరే ఉంటారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీముఖి, రాహుల్‌లలో విజేత కానుండగా.. మరొకరు రన్నరప్‌ కానున్నారు.

బిగ్‌బాస్‌-3 గ్రాండ్‌ ఫినాలెలో మూడో కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌ కూడా నాటకీయంగా సాగింది. ఈ ఎలిమినేషన్‌ కోసం అంజలి హౌజ్‌లోకి వెళ్లారు. ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్‌ చేసి.. తన వద్దకు తీసుకువచ్చే బాధ్యతను నాగార్జున ఆమెకు అప్పగించారు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి కూడా రూ. 25 లక్షల ఆఫర్‌ను నాగార్జున ఇచ్చారు. నమ్మకం లేనివారు రూ. 25 లక్షలు తీసుకొని రావొచ్చునంటూ ఊరించారు. అయినా ఎవ్వరూ ఆఫర్‌ను స్వీకరించలేదు. దీంతో బాబా భాస్కర్‌ను ఎలిమినేట్‌ చేస్తున్నట్టు అంజలి ప్రకటించి.. నాగార్జున వద్దకు తీసుకొచ్చారు. ఇక, మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లలో ఎవరు విన్నర్‌ అవుతారని బాబా భాస్కర్‌ను అడుగగా.. శ్రీముఖి విజేతగా నిలుస్తారని, రాహుల్‌ రన్నరప్ అవుతారని బాబా తన అభిప్రాయం చెప్పారు. ఇక, గ్రాండ్‌ ఫినాలె షోలో భాగంగా వితిక, పునర్నవి, రవికృష్ణ, శిల్పా చక్రవర్తి తమ డ్యాన్సులతో అదరగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement