ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు! | Netizens Comments On Jaffar Elimination In Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!

Published Sun, Aug 4 2019 8:11 PM | Last Updated on Sun, Aug 4 2019 10:24 PM

Netizens Comments On Jaffar Elimination In Bigg Boss 3 Telugu - Sakshi

ఒక బంధం ఎందుకు ఎలా ఏర్పడుతుందో చెప్పలేము. ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో మనుషులు నేరుగా మాట్లాడుకోవటమే తగ్గిపోయింది. అలాంటిది ఓ పదిహేను మందిని ఒకే ఇంట్లో పడేసి.. వారికి టీవీ,ఫోన్‌, నెట్‌ ఇలా అన్నింటిని దూరం చేస్తే ఎలా ఉంటుందో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. బిగ్‌బాస్‌ హౌస్‌లో కోపాలు, తాపాలు, బాధలతో పాటు బంధాలు కూడా ఏర్పడతాయి. గత సీజన్‌లో పాల్గొన్నవారిలో దాదాపు అందరూ ఎప్పుడోకప్పుడు కలుసుకుంటూనే ఉంటారు. ఇక ఈ మూడో సీజన్‌లో ఇప్పటి వరకు బాబా భాస్కర్‌, జాఫర్‌లు మాత్రమే చాలా దగ్గరయ్యారు.

వీరిద్దరు కలిసి చేసే కామెడీని వీక్షకులు ఇష్టపడుతుంటారు. బాబా భాస్కర్‌ డైరెక్షన్‌ జాఫర్‌ చేసే డ్యాన్సులు, పాడే పాటలు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. అప్పుడప్పుడు కెమెరాలతో చేసే కామెడీ టైమింగ్‌కు ఫ్యాన్స్‌ అయ్యారు. ఇక ఈ రోజు ఎలిమినేట్‌ కానుంది జాఫర్‌ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు సోషల్‌ మీడియాలో కూడా జాఫర్‌ ఎలిమినేట్‌ అయినట్లు చెబుతున్నారు. ఫ్రెండ్‌ షిప్‌ రోజే బాబా భాస్కర్‌, జాఫర్‌లు విడిపోయారని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ రోజు ఎపిసోడ్‌లో నాగ్‌ దర్శనమివ్వడమే కాకుండా రామ్‌, నిధి అగర్వాల్‌ అతిథులుగా రానున్నారు. హౌస్‌మేట్స్‌ కూడా ఫ్రెండ్‌షిప్‌ డేను సెలబ్రేట్‌ చేసుకోనున్నారు. మరి నిజంగానే జాఫర్‌ ఎలిమినేట్‌ అయితే.. బాబా భాస్కర్‌ హౌస్‌లో మళ్లీ యాథావిథిగా ఎంటర్‌టైన్‌ చేస్తాడా?లేదా అన్నది చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement