
చిన్న మాటలే.. పెద్ద గొడవలకు దారి తీస్తున్నాయి. వరుణ్ అన్న మాటలకు వితికా ఏడవగా.. రాహుల్ అన్న మాటకు పునర్నవి ఏడ్చింది. చివరకు వరుణ్-రాహుల్‌కు కూడా గొడవైంది. మొదట్నుంచీ ఓ గ్రూప్‌గా ఉన్న వీరిలో.. విబేధాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ ఉన్న పునర్నవి.. ఉదయాన్నే రాహుల్ అన్న మాటకు ఏడ్చింది. పిచ్చిదానిలా వాగుతూ ఉంటదని అనే రాహుల్ అనేసరికి పునర్నవి ఏడ్చింది. ఇలా గొడవలతో నిండిపోతోన్న హౌస్‌లో.. కెప్టెన్ టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్.
ఏడో వారానికి గానూ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌లో బాబా భాస్కర్, శ్రీముఖి, హిమజలను టాస్క్‌కు అర్హులుగా.. రాహుల్, రవి, శిల్పాలను అనర్హులని ఇంటిసభ్యులు ఏకాభిప్రాయంతో బిగ్‌బాస్‌కు సూచించారు. అర్హులైన సభ్యులకు అనర్హులైన హౌస్‌మేట్స్ సపోర్ట్ చేయాలని తెలిపాడు. ఆపినవాడిదే అధికారం అనే ఈ టాస్క్‌లో బాబా భాస్కర్‌కు శిల్పా, హిమజకు రాహుల్, శ్రీముఖికి రవి సపోర్ట్ చేసేందుకు వచ్చారు. మిగతా హౌస్‌మేట్స్ తమకు నచ్చిన వారికి సపోర్ట్‌చేస్తూ మిగతా వారి బాక్స్‌ల్లో ఇసుకను వేస్తూ ఉండాలి. సపోర్ట్‌చేయడానికి వచ్చిన రవి, రాహుల్,శిల్పాలు బాక్సులో పడే ఇసుకను వెంటవెంటనే తీసేస్తూ ఉండాలి. ఇలా ఎండ్ బజర్ మోగే వరకు ఎవరి బాక్సుల్లో తక్కువ ఇసుక ఉంటుందో వారే కెప్టెన్‌గా ఎన్నికవుతారని తెలిపాడు. ఈ టాస్క్‌కు కెప్టెన్ వరుణ్ సంచాలకులుగా వ్యవహరిస్తారని బిగ్‌బాస్ తెలిపాడు.
ఇక టాస్క్ మొదలైన వెంటనే.. ఎవరికి కేటాయించిన బాక్సుల వద్దకు వెళ్లి నిల్చున్నారు. మిగిలిన ఇంటి సభ్యులు ఇసుకను వేసేందుకు ప్రయత్నిస్తుంటే.. వారిని నిరోదిస్తూ ఉండేందుకు బాబా, హిమజ, శ్రీముఖి కష్టపడ్డారు. అలీరెజా హిమజను టార్గెట్ చేస్తూ ఉండగా.. మధ్యలో కాలిజారిపడ్డాడు. పునర్నవి, మహేష్ శ్రీముఖికి సంబంధించిన బాక్స్‌లో ఇసుకను వేసేందుకు ప్రయత్నించగా.. మహేష్ చేతిల్లోంచి మగ్గును తీసుకుని శ్రీముఖి పారేసింది. అలా విసిరేయకూడదని వరుణ్ వారించగా.. తాను కావాలని చేయలేదని శ్రీముఖి చెప్పుకొచ్చింది.
ఇసుకను వేయకుండా మిగిలిన ఇంటిసభ్యులను అలీరెజా అడ్డుకుంటూ ఉండటంపై వరుణ్ ఫైర్ అయ్యాడు. ఆ నియమం టాస్క్‌లో లేదని.. సపోర్ట్ చేయాలనుకుంటే.. మిగిలిన వారి బాక్సుల్లో ఇసుకను నింపాలని. అంతేకాని ఎవరికీ అడ్డుపడొద్దని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే విషయమై మహేష్, పునర్నవితో అలీ వాగ్వాదానికి దిగాడు. వరుణ్ కూడా వాదించగా.. అలీరెజా ఆటను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. పునర్నవి, మహేష్, శివజ్యోతి, వితికా ఆటను కొనసాగిస్తూ.. తమకు నచ్చిన వారికి మద్దతుగా నిలిచారు. ఎండ్‌బజర్ మోగేవరకు బాబా భాస్కర్‌కు సంబంధించిన బాక్స్‌లో తక్కువ ఇసుక ఉండటంతో.. ఏడో వారానికి సంబంధించి బాబా భాస్కర్ కెప్టెన్‌గా ఎన్నికైనట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.
టాస్క్ అనంతరం ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తాను సంచాలకుడిగా నియమాలానుసారం నడుచుకున్నానని అలీరెజాతో చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అతను వినలేదు. పునర్నవి సారీ చెప్పినా .. దానిని స్వీకరించలేదు. మధ్యలో శ్రీముఖి వెళ్లి అలీని శాంతపర్చింది. తనను ఓ ఐదుగురు కలిసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఏం మాట్లాడకు అంటూ అలీని కూల్ చేసింది. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ టాస్క్‌లో స్పోర్టివ్ లేదని, తాను చేసింది ఏమీ లేదని, తాను ఆడి గెలుస్తానో లేదో కానీ.. ప్రస్తుతం మాత్రం హ్యాపీగా లేనని వరుణ్, రాహుల్‌తో చెప్పుకొచ్చారు. ఇక రేపటి నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి రూల్స్ పెడతారో? హౌస్‌మేట్స్ అందరూ బాబాను ఎలా ఏడిపిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment