బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి | Bigg Boss 3 Telugu: This Housemate Won The Bigg Boss Heart | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: జర్నీ చూసి ఏడ్చేసిన బాబా భాస్కర్‌..

Published Thu, Oct 31 2019 10:42 AM | Last Updated on Fri, Nov 1 2019 10:56 AM

Bigg Boss 3 Telugu: This Housemate Won The Bigg Boss Heart - Sakshi

మూడు రోజుల్లో బిగ్‌బాస్‌ షోకు శుభం కార్డు పడనుంది. ఇప్పటికే వంద రోజులు పూర్తవడంతో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగిన జర్నీని వీడియో ద్వారా చూపించాడు. మొదటగా వరుణ్‌ను యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్‌బాస్‌ అతని గ్రాఫ్‌ను, ప్రేక్షకుల అభిప్రాయాలను క్షుణ్ణంగా వివరించాడు. బిగ్‌బాస్ ఇల్లు ఆనందంగా ఉండేందుకు వరుణ్ ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. ప్రేక్షకులు వరుణ్‌ను ‘మిస్టర్‌ కూల్‌, ప్రాబ్లమ్‌ సాల్వర్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ అని ప్రేమగా పిలుస్తారని బిగ్‌బాస్‌ తెలిపారు. మీ మానసిక శక్తే మీ బలం అని చెప్తూ హౌస్‌లో ఇప్పటివరకు సాగిన జర్నీని చూపించాడు. వీడియో చూస్తూ వరుణ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.


రాహుల్‌ను చూసి గర్వించిన బిగ్‌బాస్‌..

అనంతరం రాహుల్‌ వెళ్లగా.. ఇంట్లో మీ ప్రయాణం ఎలాంటి అంచనాలు లేకుండా సాగింది అని పేర్కొన్నాడు. ‘టాస్క్‌ల్లో మొదట నిరుత్సాహంగా ఆడటంతో నిన్ను ఇంటి సభ్యులు చాలాసార్లు నామినేట్‌ చేశారు. బహుశా.. మిగతా వాళ్లలా మీ మనసుకు గేమ్‌ ఆడటం తెలియదేమో.. అందుకే ఆటలో వెనుకబడ్డార’ని చెప్పుకొచ్చాడు. మీ స్నేహితుల కష్టసుఖాల్లో తోడుగా నిలిచారని ప్రశంసించాడు. అన్నింటికీ మించి పెద్ద ఊరట కలిగించింది మీ స్నేహమని తెలిపాడు. ప్రేక్షకులకు మీరేంటో తెలుసు, ఏం చేయగలరో తెలుసు. అందుకే నామినేషన్‌లో ఉన్న ప్రతీసారి మీకు అండగా నిలిచారని గుర్తు చేశాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో మీరు ఎదిగిన తీరు చూసి గర్వపడుతున్నానని బిగ్‌బాస్‌ పేర్కొన్నాడు. కాస్త ఎమోషనల్‌ అయిన రాహుల్‌ వెంటనే తేరుకుని బిగ్‌బాస్‌కు కృజ్ఞతలు తెలిపాడు.


కన్నీళ్లు పెట్టుకున్న బాబా భాస్కర్‌..
ఆ తర్వాత బాబా భాస్కర్ యాక్టివిటీ ఏరియాలోకి ప్రవేశించాడు. ‘బాబా భాస్కర్‌.. ఈ పేరు వింటే డాన్స్‌ మాత్రమే గుర్తొచ్చేది.. కానీ ఇప్పుడు వినోదం గుర్తుకు వస్తుంది. మీరు ప్రతీ ఇంటి సభ్యుల మనసు గెలుచుకున్నారు. మీరు చేసిన వంటలు, పంచిన నవ్వులు ప్రతీ ఒక్కరినీ అలరించాయి. చిన్నపిల్లాడిలా అల్లరి చేసినప్పటికీ ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు పెద్ద మనిషి పాత్ర పోషించి అందరి బాగోగులు చూసుకున్నారు. బిగ్‌బాస్‌ను గురువుగారు అని సంభోధించిన తీరు బిగ్‌బాస్‌ మనసు గెలుచుకుంది. అందరినీ నవ్వించే మీరు కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. గుండెలో బాధ ఉన్నా పైకి చిరునవ్వుతోనే ఇంతదూరం వచ్చారు’ అని అభినందనలు తెలిపాడు. కాగా బిగ్‌బాస్‌.. బాబాకు ‘సూపర్‌స్టార్‌ ఆఫ్‌ ద హౌస్‌’ బిరుదు ఇచ్చాడు. తన జర్నీ వీడియో చూసిన బాబా కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఎమోషనల్‌ అయితే ఇంటి సభ్యులు తప్పుపడుతున్నారని దిగులు చెందాడు. తాను చాలా సెన్సిటివ్‌ అని చెప్పుకొచ్చాడు. ఇక మిగతా హౌస్‌మేట్స్‌ జర్నీ వీడియోలు నేటి ఎపిసోడ్‌లో ప్రసారం కానున్నాయి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement