బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి! | Bigg Boss 3 Telugu: Housemates Stunts For Proving Strong | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: సర్కస్‌ ఫీట్లకు సై అంటున్న హౌస్‌మేట్స్‌

Oct 23 2019 12:30 PM | Updated on Oct 25 2019 11:42 AM

Bigg Boss 3 Telugu: Housemates Stunts For Proving Strong - Sakshi

బిగ్‌బాస్‌ షో ముగింపుకు వస్తున్న కొద్దీ మరింత రంజుగా మారుతోంది. పద్నాలుగో వారానికి గానూ బిగ్‌బాస్‌ ఇచ్చిన నామినేషన్‌ టాస్క్‌.. ఈ సీజన్‌లోనే బెస్ట్‌ టాస్క్‌గా నిలిచిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే జోష్‌లో మరో ఆసక్తికర టాస్క్‌ ఇవ్వడానికి బిగ్‌బాస్‌ సిద్ధమయ్యాడు. అందులో భాగంగా నామినేట్‌ అయిన ఇంటి సభ్యులకు కఠినతరమైన టాస్క్‌లు ఇస్తూ వారి బలాబలాలను బేరీజు వేయనున్నాడు. మిమ్మల్ని మీరు నిరూపించుకోడానికి ఇది సువర్ణావకాశం అంటూ.. నామినేషన్‌లో ఉన్న బాబా భాస్కర్‌, వరుణ్‌, శ్రీముఖి, అలీ, శివజ్యోతిలకు భిన్న టాస్క్‌లను ఇచ్చాడు. అభిమానులను అలరించడానికి సర్కస్‌ ఫీట్లు చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు హౌస్‌మేట్స్‌.

తాజా ప్రోమో ప్రకారం.. టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేయడానికి ఇంటి సభ్యులు నానా తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనూ కామెడీ కింగ్‌ బాబా.. పంచ్‌లు విసురుతూ ఇంట్లో నవ్వులు పూయిస్తు​న్నాడు. మరి వీళ్ల ఫీట్లతో జనాల్ని మెప్పిస్తారా? లేక బొక్కబోర్లా పడతారా అన్నది చూడాలి! అయితే ఈ వారం ఎవర్ని పంపించాలన్నది ప్రేక్షకులు ఎప్పుడో డిసైడ్‌ అయ్యారని తెలుస్తోంది. గత వారం స్వల్ప ఓటింగ్‌ తేడాతో గట్టెక్కిన శివజ్యోతి ఈసారి తప్పించుకోలేదని, బిగ్‌బాస్‌ షోకు బైబై చెప్పే రోజులు ఆమెకు దగ్గర్లోనే ఉన్నాయని నెటిజన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement