బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు? | Bigg Boss 3 Telugu Baba Bhaskar Going To Save Who In Eight Week | Sakshi
Sakshi News home page

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?

Published Mon, Sep 9 2019 6:03 PM | Last Updated on Mon, Sep 9 2019 7:47 PM

Bigg Boss 3 Telugu Baba Bhaskar Going To Save Who In Eight Week - Sakshi

బిగ్‌బాస్‌ ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టనుంది. నిన్నటి ఎపిసోడ్‌లో యాభై రోజులు పూర్తైనందుకు స్పెషల్‌ గెస్ట్‌గా నాని వచ్చాడు. ఇక నాగార్జున, నానిలు కలిసి నిన్న సందడి చేసిన సంగతి తెలిసిందే. నేటి ఎపిసోడ్‌లో ఈ వారానికి గానూ సంబంధించిన ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగినట్టు తెలుస్తోంది. 

గార్డెన్‌ ఏరియాలో ఈ ప్రక్రియను నిర్వహించినట్టు తెలుస్తోంది. గత సీజన్‌లో మాదిరిగా.. ఇంటి సభ్యుల ఫోటోలను కాల్చేస్తు ఎవరిని ఎలిమినేట్‌ చేస్తున్నారో చెప్పాల్సినట్టు తెలుస్తోంది. ఇన నామినేషన్‌ ప్రక్రియ అనంతరం బిగ్‌బాస్‌ ఇచ్చే ట్విస్ట్‌ అందరికీ తెలిసిందే. అయితే ఈ వారం మాత్రం కాస్త విభిన్నంగా షాక్‌ ఇచ్చాడు. నామినేట్‌ అయిన ఇంటి సభ్యుల్లోంచి ఒకర్ని సేవ్‌ చేసే అవకాశాన్ని ఇచ్చాడు. దీంతో బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడనే విషయం ఆసక్తిగా మారింది. మరి ఈ వారం ఇంటి నుంచి ఎవరు వీడనున్నారు? ఎలాంటి టాస్క్‌లతో ఎంటర్‌టైన్‌ చేయనున్నారు? అనేది చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement