కోరియోగ్రాఫర్ , డ్యాన్సర్ , యాక్టర్...ఇలా ఏదైనా సరే నాకు సినిమానే జీవితం. సినిమానే నా డ్రీమ్. ఎవరు ఏ అవకాశం ఇచ్చినా చేస్తాను’అని కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ అన్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ‘ఎస్‌ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోడి దివ్య ఎంటర్‌టైన్ మెంట్స్‌పై కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► ఈ సినిమాలో హీరోకి స్నేహితుడుగా కీలక పాత్రలో నటించాను. కిరణ్ తో పని చేయడం చాలా సులువుగా ఉంది. తను అందరితో బాగా కలసి పోతాడు.చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె కు కథ విషయంలో మంచి స్పష్టత ఉంది. ఈ సినిమా కొరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన కోడిరామకృష్ణ బ్యానర్ లో నటించడం చాలా హ్యాపీ గా ఉంది
► ఈ చిత్రంలో నటిస్తూనే లాయర్ పాప సాంగ్ కు కోరియోగ్రఫీ చేశాను.ఈ పాట ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.. నాకు కోరియోగ్రఫీ, యాక్టింగ్ అనేవాటిని వేరుగా చూడకుండా .రెండు సేమ్ అని భావిస్తాను.అయితే నాకు ఎవరు ఏ అవకాశం ఇచ్చినా చేస్తాను. చివరికి చిన్న క్యారెక్టర్ అయినా చెయ్యాలనే కోరిక ఉంది.
►నేను ఒక సినిమా డైరెక్షన్ చేశాను. ఆ తరువాత కూడా డైరెక్షన్ చేయాలని చాలా కథలు సెలెక్ట్ చేసుకొంటున్నాను. టైమ్ సెట్ అయితే వెంటనే సినిమా చేస్తాను. కోరియోగ్రాఫర్ గా రాష్ట్ర జాతీయ పురస్కారాలు అందుకోవాలనేది నా కోరిక దానికోసం చాలా కష్టపడ్డాను. ఇకపై కూడా కష్టపడతాను.
► కొత్త చిత్రాల విషయానికొస్తే.. తెలుగులో నీలకంఠం గారు చేసే సినిమాలో మంచి క్యారెక్టర్ లో చేస్తున్నాను. తమిళ్ లో ఒక సినిమాకు కోరియోగ్రఫీ చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment