![Nenu Meeku Baga Kavalsina Vadini Actress Sanjana Anand Talks With Media - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/21/Sanjana-Anand1.jpg.webp?itok=XO5v8Dhl)
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ మూవీతో టాలీవుడ్‌కు పరిచమైన బ్యూటీ సంజన ఆనంద్. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ నేపథ్యంలో సంజన ఆనంద్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘నేను పుట్టి పెరిగింది బెంగుళూరులోనే. నా మాతృభాష కన్నడ. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా రెండేళ్లు జాబ్ కూడా చేశాను. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు.
చదవండి: ‘సీతారామం’ మూవీపై ‘ది కశ్మీర్ ఫైల్స్ ’డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
మంచి జాబ్ వదులుకుని వెళ్లడం ఎందుకని మా పేరెంట్స్ అన్నారు. కానీ ఇక్కడ ఎంతో కొంత సాధించాలనే పట్టుదలతోనే వచ్చాను’ అని తెలిపింది. అలాగే ‘‘నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాలో నా పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొత్తగా వచ్చిన హీరోయిన్స్‌కి ఇలాంటి రోల్స్ దొరకడం కష్టం. నా నటన బాగుందని అందరు అంటుంటే చాలా సంతోషంగా ఉంది. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. కొన్ని కథలు నా దగ్గరికి వచ్చాయి. అవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చింది. అనంతరం గ్లామర్ షోపై ఆమె స్పందిస్తూ.. కథకి అవసరమైనంత వరకు స్కిన్ షో చేయడానికి రెడీ కానీ, అంతకు మించిన పరిధిని దాటేది మాత్రం లేదని తేల్చి చెప్పంది.
Comments
Please login to add a commentAdd a comment