![Nenu Meeku Baaga Kavalsinvaadini Movie OTT Release Date Out - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/11/kiran-abbavaram.jpg.webp?itok=74OKuSX_)
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో హీరో కిరణ్ అబ్బవరం నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్దమైంది. అక్టోబర్ 14న ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘ఆహా’, అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది.
‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ కథేంటంటే..
వివేక్(కిరణ్ అబ్బవరం) ఓ క్యాబ్ డ్రైవర్.అతనికి ఓ సాఫ్ట్‌వేర్ అమ్మాయి తేజు(సంజనా ఆనంద్) పరిచయం అవుతుంది. ఆమె ప్రతి రోజు రాత్రి మద్యం సేవించి.. వివేక్ క్యాబ్‌ని బుక్ చేసుకొని ఇంటికి వెళ్తుంది. అయితే ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న తేజూను ఓ రౌడీ ముఠా ఎత్తుకెళ్తే.. వారి నుంచి ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత ఆమె ఎందుకిలా రోజూ అతిగా మద్యం సేవిస్తుందో అడిగి తెలుసుకుంటాడు. తనను సిద్దు(సిధ్ధార్ద్ మీనన్) ప్రేమించి మోసం చేశాడని, తన అక్క చేసిన తప్పుకు తనకు శిక్ష పడిందని బాధ పడుతుంది. వివేక్ తన మాటలతో సంజుని ప్రోత్సహించి ఇంటికి పంపిస్తాడు. తనను ఫ్యామిలికి దగ్గరకు చేసిన వివేక్‌పై ఇష్టం పెంచుకుంటుంది తేజు. ఓ రోజు తన ప్రేమ విషయాన్ని అతనితో చెప్పాలనుకుంటుంది. అయితే అదే సమయంలో తేజుకు షాకిస్తాడు వివేక్. తన పేరు వివేక్ కాదని పవన్ అని చెబుతాడు. మలేషియాలో ఉండే పవన్ క్యాబ్ డ్రైవర్ వివేక్‌గా ఎందుకు మారాడు? తేజును ప్రేమించి మోసం చేసిందెవరు? ఆమె అక్క చేసిన తప్పేంటి? చివరకు తేజు, వివేక్‌లు ఎలా ఒక్కటయ్యారనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment