Nenu Meeku Baga Kavalsina Vadini Movie
-
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్తో హీరో కిరణ్ అబ్బవరం నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్దమైంది. అక్టోబర్ 14న ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘ఆహా’, అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది. ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ కథేంటంటే.. వివేక్(కిరణ్ అబ్బవరం) ఓ క్యాబ్ డ్రైవర్.అతనికి ఓ సాఫ్ట్వేర్ అమ్మాయి తేజు(సంజనా ఆనంద్) పరిచయం అవుతుంది. ఆమె ప్రతి రోజు రాత్రి మద్యం సేవించి.. వివేక్ క్యాబ్‌ని బుక్ చేసుకొని ఇంటికి వెళ్తుంది. అయితే ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న తేజూను ఓ రౌడీ ముఠా ఎత్తుకెళ్తే.. వారి నుంచి ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత ఆమె ఎందుకిలా రోజూ అతిగా మద్యం సేవిస్తుందో అడిగి తెలుసుకుంటాడు. తనను సిద్దు(సిధ్ధార్ద్ మీనన్) ప్రేమించి మోసం చేశాడని, తన అక్క చేసిన తప్పుకు తనకు శిక్ష పడిందని బాధ పడుతుంది. వివేక్ తన మాటలతో సంజుని ప్రోత్సహించి ఇంటికి పంపిస్తాడు. తనను ఫ్యామిలికి దగ్గరకు చేసిన వివేక్‌పై ఇష్టం పెంచుకుంటుంది తేజు. ఓ రోజు తన ప్రేమ విషయాన్ని అతనితో చెప్పాలనుకుంటుంది. అయితే అదే సమయంలో తేజుకు షాకిస్తాడు వివేక్. తన పేరు వివేక్ కాదని పవన్ అని చెబుతాడు. మలేషియాలో ఉండే పవన్ క్యాబ్ డ్రైవర్ వివేక్‌గా ఎందుకు మారాడు? తేజును ప్రేమించి మోసం చేసిందెవరు? ఆమె అక్క చేసిన తప్పేంటి? చివరకు తేజు, వివేక్‌లు ఎలా ఒక్కటయ్యారనేదే మిగతా కథ. -
సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని వచ్చా: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ హీరోయిన్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ మూవీతో టాలీవుడ్‌కు పరిచమైన బ్యూటీ సంజన ఆనంద్. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ నేపథ్యంలో సంజన ఆనంద్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘నేను పుట్టి పెరిగింది బెంగుళూరులోనే. నా మాతృభాష కన్నడ. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా రెండేళ్లు జాబ్ కూడా చేశాను. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. చదవండి: ‘సీతారామం’ మూవీపై ‘ది కశ్మీర్ ఫైల్స్ ’డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు మంచి జాబ్ వదులుకుని వెళ్లడం ఎందుకని మా పేరెంట్స్ అన్నారు. కానీ ఇక్కడ ఎంతో కొంత సాధించాలనే పట్టుదలతోనే వచ్చాను’ అని తెలిపింది. అలాగే ‘‘నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాలో నా పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొత్తగా వచ్చిన హీరోయిన్స్‌కి ఇలాంటి రోల్స్ దొరకడం కష్టం. నా నటన బాగుందని అందరు అంటుంటే చాలా సంతోషంగా ఉంది. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. కొన్ని కథలు నా దగ్గరికి వచ్చాయి. అవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చింది. అనంతరం గ్లామర్ షోపై ఆమె స్పందిస్తూ.. కథకి అవసరమైనంత వరకు స్కిన్ షో చేయడానికి రెడీ కానీ, అంతకు మించిన పరిధిని దాటేది మాత్రం లేదని తేల్చి చెప్పంది. -
రికార్డు కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం చిత్రం, 3 రోజుల్లోనే ఎంతంటే..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. సెప్టెంబర్ 16న విడుదలైన ఈ చిత్రం హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఎస్ఆర్ కల్యాణమండపం డైరెక్టర్ శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య నిర్మించారు. రిలీజైన తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను తెచ్చేకుంది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. చదవండి: మరో ప్రేమకథతో రాబోతున్న ‘సీతారామం’ టీం!, ఆ నిర్మాత క్లారిటీ.. మాస్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూ కమర్షియల్ హిట్‌గా కొనసాగుతుంది. కేవలం మూడు రోజుల్లోనే 4.5 కోట్ల గ్రాస్ సాధించడం ఈ సినిమా విజయానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఏ బాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక హీరో సినిమా, ఈ స్థాయిలో ఆదరణ పొందడం అంటే మాములు విషయం కాదు. కిరణ్ అబ్బవరం గత చిత్రాలైన రాజా వారు రాణి గారు, ఎస్ఆర్ కల్యాణమండపంలాగే ఈ చిత్రం కూడా తెలుగు సినిమాకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు. చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ -
'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ మూవీ రివ్యూ
టైటిల్: నేను మీకు బాగా కావాల్సిన వాడిని నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్ తదితరులు నిర్మాణ సంస్థ: కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: కోడి దివ్య దీప్తి దర్శకత్వం : శ్రీధర్ గాదె మాటలు, స్క్రీన్‌ప్లే: కిరణ్ అబ్బవరం సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫి: రాజ్ నల్లి విడుదల తేది: సెప్టెంబర్ 16, 2022 రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కల్యాణమండపం లాంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యే సమ్మతమే అంటూ ప్రేక్షకులన పలకరించిన కిరణ్.. తాజాగా ‘మీకు బాగా కావాల్సిన వాడిని’అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచాల మధ్య ఈ శుక్రవారం (సెప్టెంబర్16) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వివేక్(కిరణ్ అబ్బవరం) ఓ క్యాబ్ డ్రైవర్.అతనికి ఓ సాఫ్ట్వేర్ అమ్మాయి తేజు(సంజనా ఆనంద్) పరిచయం అవుతుంది. ఆమె ప్రతి రోజు రాత్రి మద్యం సేవించి.. వివేక్ క్యాబ్‌ని బుక్ చేసుకొని ఇంటికి వెళ్తుంది. అయితే ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న తేజూను ఓ రౌడీ ముఠా ఎత్తుకెళ్తే.. వారి నుంచి ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత ఆమె ఎందుకిలా రోజూ అతిగా మద్యం సేవిస్తుందో అడిగి తెలుసుకుంటాడు. తనను సిద్దు(సిధ్ధార్ద్ మీనన్) ప్రేమించి మోసం చేశాడని, తన అక్క చేసిన తప్పుకు తనకు శిక్ష పడిందని బాధ పడుతుంది. వివేక్ తన మాటలతో సంజుని ప్రోత్సహించి ఇంటికి పంపిస్తాడు. ఏడాది తర్వాత ఇంటికి వచ్చిన తేజుని కుటుంబ సభ్యులు ఒక్క మాట అనకుండా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. తానను ఫ్యామిలికి దగ్గరకు చేసిన వివేక్‌పై ఇష్టం పెంచుకుంటుంది తేజు. ఓ రోజు తన ప్రేమ విషయాన్ని అతనితో చెప్పాలనుకుంటుంది. అయితే అదే సమయంలో తేజుకు షాకిస్తాడు వివేక్. తన పేరు వివేక్ కాదని పవన్ అని చెబుతాడు. మలేషియాలో ఉండే పవన్ క్యాబ్ డ్రైవర్ వివేక్‌గా ఎందుకు మారాడు? తేజును ప్రేమించి మోసం చేసిందెవరు? ఆమె అక్క చేసిన తప్పేంటి? చివరకు తేజు, వివేక్‌లు ఎలా ఒక్కటయ్యారనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ కథ కొత్తదేమి కాదు. పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అందులో కొంతవరకు మాత్రమే దర్శకుడు సఫలం అయ్యాడు. ట్విస్టులు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. కుటుంబానికి దూరమైన బాధలో మద్యానికి అలవాటైన హీరోయిన్ని హీరో తన మాటలతో మార్చి, ఆమెను కుటంబానికి దగ్గరయ్యేలా చేయడమే ఈ సినిమా కథ. అయితే ఇందులో వచ్చే ట్విస్టుల మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా కిరణ్ అబ్బవరం గెస్ట్ రోల్‌గానే కనిపిస్తాడు. ఫ్యామిలీతో తేజుకు ఉన్న అనుబంధం, ఆమె లవ్‌స్టోరి, అందులో వచ్చే ట్విస్ట్‌లతో ఫస్టాప్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో లాయర్ పాపతో వివేక్ లవ్‌స్టోరీ ఫన్నీగా సాగుతుంది. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్ నవ్వులు పూయిస్తుంది. అయితే కొన్ని డైలాగ్స్ మాత్రం సహజంగా కాకుండా తెచ్చిపెట్టినట్లుగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. లాజిక్కులు వెతక్కుండా చూస్తే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాస్త అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. క్యాబ్ డ్రైవర్ వివేక్ పాత్రకి కిరణ్ అబ్బవరం న్యాయం చేశాడు. గత చిత్రాలలో పోలిస్తే నటన పరంగా ఓ మెట్టు ఎక్కాడనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంజనా ఆనంద్ పాత్ర చాలా కీలకం. తేజుగా ఆమె తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లాయర్ దుర్గగా సోనూ ఠాకూర్ మెప్పించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తెరపై అందంగా కనిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. సంజు తండ్రిగా నటించిన ఎస్వీ కృష్ణారెడ్డి తన పాత్రకు న్యాయం చేశాడు. సెకండాఫ్‌లో బాబా భాస్కర్ తనదైన కామెడీతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మణిశర్మ సంగీతం బాగుంది. పాటలు ఈ సినిమాకు చాలా ప్లస్. నేపథ్య సంగీతం పర్వాలేదు. రాజ్ నల్లి సినిమాటోగ్రఫి బాగుంది. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ సినిమాతో మరింత దగ్గరవుతా
‘‘నా గత చిత్రాల్లో నేను రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేయలేదు. కానీ తొలిసారి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమాలో చేశాను. ఒకటేమో ఎనర్జిటిక్ మాస్ అయితే మరొకటి సెటిల్డ్‌గా ఉంటుంది. హీరోగా సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి కథ నా కెరీర్‌కి చాలా బూస్టప్ ఇస్తుంది. ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాఅనే నమ్మకం ఉంది’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. శ్రీధర్ గాదె దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా తెరకెక్కిని చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి దివ్య దీప్తి నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం పంచుకున్న విశేషాలు... ►దర్శకుడు కోడి రామకృష్ణగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసిన ‘అమ్మోరు, అరుంధతి’ వంటి సినిమాలు చూసి పెరిగాను. ఆయనతో పనిచేసే అవకాశం రాకపోయినా, ఆయన కుమార్తె దివ్య దీప్తి గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ కి ముందే ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ఓకే అయింది. అయితే లాక్డౌన్ వల్ల ఆలస్యం అయింది. దివ్య దీప్తి సహకారం వల్లే ఈ సినిమా అనుకున్నదాని కంటే బాగా వచ్చింది. కథ డిమాండ్ మేరకు ఈ మూవీలో డైలాగ్స్ నేనే రాశాను. ►కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాయింట్‌ని చర్చించాం. సరికొత్త కథ అని చెప్పను కానీ, మన అందరి ఇంట్లో జరిగే కథలా ఉంటుంది. ఎస్వీ కృష్ణారెడ్డిగారు హీరోయిన్ తండ్రిగా ఇన్నోసెంట్ పాత్ర చేశారు. ఇందులోని తండ్రీకూతుళ్ల ఎమోష ్సకు ఆడియ ్స బాగా కనెక్ట్ అవుతారు. ►ఈ మూవీలో మణిశర్మగారి సంగీతం, నేపథ్య సంగీతం నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. మా సినిమా ట్రైలర్‌ను పవన్ కల్యాణ్‌గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి, రవితేజగార్లలా మాస్ పాత్రలు చేయాలని ఉంది. ►నేను ఇప్పటి వరకూ చేసిన ‘రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కల్యాణ మండపం, సెబాస్టియన్, సమ్మతమే’ చిత్రాల్లో ‘సెబాస్టియన్’ ఒక్కటే నన్ను నిరుత్సాహ పరిచింది. ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు ఉండటంతో విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావడం కష్టంగా ఉంది(నవ్వుతూ) ►గీతా ఆర్ట్స్‌లో చేస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మైత్రీ మూవీ మేకర్స్‌లో చేస్తున్న ‘మీటర్’ సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాయి. ఏయమ్ రత్నం బ్యానర్లో చేస్తున్న ‘రూల్స్ రంజన్’ సినిమా 40% షూటింగ్ అయ్యింది. శ్రీధర్ గాదెతో మరో చిత్రం చేసే అవకాశం ఉంది. -
అందరి ఇంట్లో జరిగే కథే ఈ సినిమా: కిరణ్ అబ్బవరం
రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కున్న హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తాజాగా నటిస్తున్న ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సిద్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్కర్, సోను ఠాగూర్, భరత్ రొంగలి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ‘యస్.ఆర్ కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇందులో హీరోయిన్ తండ్రిగా దర్శక, నిర్మాత ఎస్. వి కృష్ణారెడ్డి నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 16న దేశవ్యాప్తంగా దాదాపు 550 పైచిలుకు థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మూవీ హీరో కిరణ్ అబ్బవరం బుధవారం మీడియాతో ముచ్చటించారు. ⇔ దర్శకుడు కోడి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి పెరిగాను .ఆయనతో పనిచేసే అవకాశం దొరకపోయినా తన కూతురు కోడి దివ్య దీప్తి గారితో పని చేయడం ఆనందంగా ఉంది.అలాగే నేను నటించిన ఈ సినిమా ట్రైలర్ ను పవన్ అన్న లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ పవన్ సార్ ⇔ మన అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో తెరకెక్కిన ఈ సినిమాలో అండర్ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని డిస్కస్ చేశాం. ఎస్వీ కృష్ణారెడ్డి గారి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది . ఇందులోని తండ్రి కూతుళ్లు ఎమోషన్స్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ⇔ హీరోగా సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి కథ నా కెరియర్‌కు చాలా బూస్టప్ ఇస్తుంది. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. అయితే ఇప్పటి వరకు రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఇదే అవుతుంది. ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. హీరోయిన్‌కి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ దొరికింది.. ⇔ దర్శకుడు శ్రీధర్ నా కాంబినేషన్లో సినిమా చేయడానికి కొంతమంది ప్రయత్నించినప్పటికీ కోడి దివ్య గారి బ్యానర్ ఫైనల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా కథ డిమాండ్ మేరకు డైలాగ్ వెర్షన్ నేనే రాశాను. ఇందులో నాది బాబా భాస్కర్ల ట్రాక్ చాలా బాగుంటుంది. ⇔ నిర్మాత కోడి దివ్య దీప్తి సహకారం వల్లే ఈ సినిమా అనుకున్న దాని కంటే బాగా వచ్చింది. మణిశర్మ గారితో కలిసి పని చేసే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది. అయన ఇచ్చిన పాటలు అద్భుతంగా వచ్చాయి. అలాగే ఫైట్స్, ఎమోషన్స్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ⇔ ఇక తన తదుపరి చిత్రాలతో గురించి ప్రస్తావిస్తూ.. గీతా ఆర్ట్స్ ‘వినరో విష్ణు భాగ్యం’, మైత్రి మూవీ మేకర్స్‌లో ‘మీటర్’ ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఏ యం రత్నం బ్యానర్ లోని రూల్స్ రంజన్ సినిమా 40 శాతం షూటింగ్ అయ్యింది. ఇవి కాకుండా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉంది అని ముగించారు. -
ప్రతిరోజూ ఓ చాలెంజ్ : కోడి దివ్య
‘‘సినిమా నిర్మాణం అనేది ప్రతి రోజూ ఓ చాలెంజ్లా అనిపించింది. కానీ కష్టంగా భావించకుండా ఓ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌లా అనుకుని చేశాను. ఇప్పుడున్నంత టెక్నాలజీ ఒకప్పుడు లేదు కానీ అప్పుడు వర్క్ చాలా స్పీడ్‌గా జరిగేది. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా కొన్ని అంశాల్లో వర్క్ అనుకున్న విధంగా సాగడం లేదు. ఎందుకు అలా జరుగుతుందనే విషయంపై నేను మరింత ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత కోడి దివ్యదీప్తి. కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ జంటగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. దివంగత ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ నెల 16న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా కోడి దివ్య మాట్లాడుతూ– ‘‘సినిమా బాగా వచ్చింది. హిట్ సాధిస్తుందనే నమ్మకంతోనే ఉన్నాం. కిరణ్ అబ్బవరం బాగా నటించారు. ఈ సినిమాకు ఆయన కొన్ని డైలాగ్స్ కూడా ఇచ్చారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ ఓ మంచి పాయింట్‌ను ఈ సినిమాలో టచ్ చేశాం. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీ ఆడియన్, ప్రతి అమ్మాయి ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. కిరణ్ అబ్బవరం, బాబా భాస్కర్ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. మణిశర్మగారు ఇచ్చిన ఆరు పాటలు, ఆర్ఆర్ సినిమాకు మరో హైలైట్. ఓవర్సీస్లో కాకుండా ఈ సినిమాను దాదాపు 550 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. భవిష్యత్‌లో తప్పకుండా దర్శకత్వం వహిస్తాను’’ అన్నారు. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా నడుస్తోంది. సెప్టెంబర్ నెలలో పెద్ద చిత్రాలేవి బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో.. ప్రతి వారం నాలుగైదు చిన్న చిత్రాలు విడుదలవుతున్నాయి. వచ్చే నెలలో దసరా ఉంటుంది. అప్పుడు పెద్ద చిత్రాల రద్దీ కారణంగా చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టమే. అందుకే తమ చిత్రాలను సెప్టెంబర్ నెలలో విడుదల చేసి లాభాలను పొందాలని భావిస్తున్నారు చిన్న నిర్మాతలు. గతవారం నాలుగైదు చిత్రాలు విడుదల కాగా.. ఈ వారం కూడా భారీగానే చిన్న హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. సెప్టెంబర్ రెండో వారంలో విడుదలకు సిద్దమైన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. ముత్తు తమిళ స్టార్ శింబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వెందు తనిందతు కాడు’. తెలుగు ఈ చిత్రం ‘ది లైప్ ఆఫ్ ముత్తు’పేరుతో ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గణేశ్ నిర్మించిన ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. సిద్ధి ఇద్నాని కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రాధిక కీలకమైన పాత్ర పోషించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. నేను మీకు బాగా కావాల్సినవాడిని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శాకినీ డాకినీ రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్నైట్ రన్నర్’కి తెలుగు రీమేక్ ఇది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదలవుతుంది. కే3 శివ కార్తీక్ దర్శకత్వంలో కిచ్చా సుదీప్ హీరోగా తెకెక్కిన చిత్రం కే3: కోటికొక్కడు . మడోనా సెబాస్టియన్, అఫ్తాబ్, రవిశంకర్, శ్రద్ధాదాస్ తదితురులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న థియేటర్స్‌లో విడుదల కానుంది. సకల గుణాభి రామ బిగ్ బాస్ ఫేమ్ వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న థియేటర్స్‌లో విడుదల కానుంది. అం అః సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'అం అః'. ‘ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి శ్యామ్ మండల దర్శకత్వం వహిస్తున్నారు. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు.. సోనీలీవ్ రామారావు ఆన్ డ్యూటీ, సెప్టెంబర్ 15 కాలేజ్ రొమాన్స్(హిందీ సిరీస్-3, సెప్టెంబర్ 15 అమెజాన్ ఫ్రైమ్ విరుమన్( తమిళ చిత్రం), సెప్టెంబర్ 11 డిస్నీ+ హాట్‌స్టార్ విక్రాంత్ రోణ(తెలుగు) సెప్టెంబర్ 16 దహన్(హిందీ సిరీస్) సెప్టెంబర్ 16 నెట్‌ఫ్లిక్స్ జోగి(హిందీ), సెప్టెంబర్ 16 ఆహా డ్యాన్స్ ఐకాన్(రియాల్టీ షో), సెప్టెంబర్ 11 -
ఊరమాస్‌గా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' ట్రైలర్
కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ జంటగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై కోడి దివ్య దీప్తి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో పవన్ కల్యాణ్ విడుదల చేసి, యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో కిరణ్ క్యాబ్ డ్రైవర్‌గా మాస్ లుక్‌లో కనిపించనున్నారు. అన్ని కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: రాజ్ కె. నల్లి, సహనిర్మాత: నరేష్ రెడ్డి మూలే. -
అదే నా కోరిక..దాని కోసం ఎంత కష్టమైన భరిస్తా : బాబా భాస్కర్
కోరియోగ్రాఫర్ , డ్యాన్సర్ , యాక్టర్...ఇలా ఏదైనా సరే నాకు సినిమానే జీవితం. సినిమానే నా డ్రీమ్. ఎవరు ఏ అవకాశం ఇచ్చినా చేస్తాను’అని కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ అన్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఈ సినిమాలో హీరోకి స్నేహితుడుగా కీలక పాత్రలో నటించాను. కిరణ్ తో పని చేయడం చాలా సులువుగా ఉంది. తను అందరితో బాగా కలసి పోతాడు.చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె కు కథ విషయంలో మంచి స్పష్టత ఉంది. ఈ సినిమా కొరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన కోడిరామకృష్ణ బ్యానర్ లో నటించడం చాలా హ్యాపీ గా ఉంది ► ఈ చిత్రంలో నటిస్తూనే లాయర్ పాప సాంగ్ కు కోరియోగ్రఫీ చేశాను.ఈ పాట ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.. నాకు కోరియోగ్రఫీ, యాక్టింగ్ అనేవాటిని వేరుగా చూడకుండా .రెండు సేమ్ అని భావిస్తాను.అయితే నాకు ఎవరు ఏ అవకాశం ఇచ్చినా చేస్తాను. చివరికి చిన్న క్యారెక్టర్ అయినా చెయ్యాలనే కోరిక ఉంది. ►నేను ఒక సినిమా డైరెక్షన్ చేశాను. ఆ తరువాత కూడా డైరెక్షన్ చేయాలని చాలా కథలు సెలెక్ట్ చేసుకొంటున్నాను. టైమ్ సెట్ అయితే వెంటనే సినిమా చేస్తాను. కోరియోగ్రాఫర్ గా రాష్ట్ర జాతీయ పురస్కారాలు అందుకోవాలనేది నా కోరిక దానికోసం చాలా కష్టపడ్డాను. ఇకపై కూడా కష్టపడతాను. ► కొత్త చిత్రాల విషయానికొస్తే.. తెలుగులో నీలకంఠం గారు చేసే సినిమాలో మంచి క్యారెక్టర్ లో చేస్తున్నాను. తమిళ్ లో ఒక సినిమాకు కోరియోగ్రఫీ చేస్తున్నాను. -
ఆ అనుభవంతో సినిమాలో నటించడం ఈజీ అయింది: సోను ఠాగూర్
కిరణ్ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా, సోను ఠాగూర్ హీరోయిన్లుగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని(NMBk)’. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సోను ఠాగూర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►చిన్నప్పటి నుండి నాకు సినిమా అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఆ తరువాత నేను మోడల్ గా కేరీర్ ప్రారంభించాను. మోడలింగ్ చేస్తున్న టైమ్ లోనే ‘జోరుగా హుషారుగా’ సినిమాలో ఒక మంచి సాంగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ పాటకు ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ రావడంతో నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. ►ఎన్నో హిట్స్ ఇచ్చిన లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి బ్యానర్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, నిర్మాత కోడి దివ్యదీప్తి, హీరో కిరణ్ అబ్బవరంతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ►మోడల్‌గా చేసిన అనుభవం ఉండడం వల్ల సినిమాలో నటించడం చాలా ఈజీగా అనిపించింది. ఈ సినిమాలో లాయర్ పాప సాంగ్ చేశాను. ఈ పాటకు ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ►ఈ సినిమాలో నాకు రన్ టైమ్ తక్కువ ఉన్నా ఫుల్ ఫన్ ఉంటుంది. బాబా భాస్కర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. తను ఆన్ స్క్రీన్ పై ఎలా ఉంటాడో, ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే ఉంటాడు. ►చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె ఈ సినిమా కొరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. తనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత దీప్తి గారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. కో స్టార్ కిరణ్ చాలా కూల్ పర్సన్ తనతో కలసి డ్యాన్స్ చేయడం హ్యాపీ గా ఉంది. ►మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి పాటలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి. తన సంగీతంలో వర్క్ చేస్తున్నందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ నెల 9 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
సెప్టెంబర్‌లో ఇన్ని చిత్రాలా?.. వీటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ అవుతాయో?
తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా చిన్న సినిమాలు విజయవంతం అవుతుండటంతో పరిశ్రమ మొత్తం సందడి సందడి మారిపోయింది. చిన్న నిర్మాతల్లో ఎక్కడలేని ధైర్యం కనిపిస్తోంది. మొన్నటి వరకు ఆడియెన్స్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చూస్తారన్నారు. ఆ తర్వాత మాస్ మూవీస్ చూసేందుకు వస్తున్నారు అన్నారు. ఆ తర్వాత అస్సలు ఆడియెన్స్ రావడం లేదన్నారు. కానీ కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఆదరిస్తారని ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ2’ నిరూపించాయి. (చదవండి: 60 ఏళ్లు వచ్చినా.. ఆ 20 రోజులు మరిచిపోలేను : విజయ్ దేవరకొండ) ఈ మూడు చిత్రాల ఘన విజయం..చిన్న చిత్రాలకు గొప్ప ధైర్యాన్ని అందించింది. అందుకే సెప్టెంబర్ లో వరుస పెట్టి చిన్న సినిమాలు థియేటర్స్ కు క్యూ కట్టాయి. సెప్టెంబర్ 2న ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘రంగరంగ వైభవంగా’ రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 9న సత్యదేవ్, తమన్నాల ‘గుర్తుందా సీతా కాలం’, కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’, శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. (చదవండి: తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా..) ఈ మూడు చిత్రాలపై మంచి బజ్ ఉంది. సెప్టెంబర్ మూడో వారంలో నిఖిల్ కొత్త చిత్రం ‘18 పేజెస్’ రిలీజ్ కు రెడీగా ఉంది. సెప్టెంబర్ 16 ‘శాకిని డాకిని’ విడుదలకు ముస్తాబవుతోంది. దక్షిణ కొరియా చిత్రం మిడ్ నైట్ రన్నర్ కు అఫీసియల్ రీమేక్ గా తెరకెక్కింది శాకిని ఢాకిని. ఈ సినిమాకు పోటీగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదల కానుంది. సెప్టెంబర్ 23న కృష్ణవిందా విహారి, అల్లూరి రిలీజ్ కానున్నాయి. వీటిలో ఎన్ని, ప్రేక్షకులను అలరిస్తాయో, బ్లాక్ బస్టర్ రేంజ్ కు చేరుతాయో తెలియాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కళాశాలలో ‘ఎన్‌ఎంబీకే’ సందడి
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవల ‘సమ్మతమే’తో ప్రేక్షకులను పలకరించిన ఈ యంగ్ హీరో.. త్వరలోనే మరో సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నారు. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’(NMBK). సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇదివరకే రిలీజైన టీజర్ కు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఈ యంగ్ హీరో ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ కళాశాలను సందర్శించారు. అక్కడ కిరణ్‌తో పాటు చిత్ర యూనిట్‌కి అనూహ్యమైన స్పందన లభించింది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంతో పాటు గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలలోనూ కిరణ్ అబ్బవరం సినిమాలు చేస్తున్నాడు. -
NMBK: ఆకట్టుకుంటున్న ‘నచ్చావ్ అబ్బాయి’ పాట
రాజావారి రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యే సమ్మతమే చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. త్వరలోనే మరో సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నారు. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’(NMBK). సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నచ్చావ్ అబ్బాయి’పాట విడుదలైంది. ఈ పాటకు భాస్కరపట్ల లిరిక్స్ అందించగా, ధనుంజయ్, లిప్సిక అద్భుతంగా ఆలపించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. కిరణ్ అబ్బవరం తనదైన స్టెప్పులతో ఆకట్టుకుంటున్నాడు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు. -
ఒక్కరి మనసునైనా దొంగలించామా మామ.. ఆసక్తిగా టీజర్
Kiran Abbavaram Nenu Miku Kavalsinavadini Teaser: వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ హీరో ఇటీవలే 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో కొత్త సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీధర్ గాదే దర్శకత్వంలో యూత్‌ఫుల్, ఫ్యామిలీ కథాంశంతో రెడీ అవుతోన్న సినిమా 'నేను మీకు కావాల్సిన వాడిని'. ఈ సినిమాలో సోనూ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'డ్రైవర్‌వి డ్రైవర్లా ఉండూ' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 'పదిసార్లు ప్రేమలో ఓడిపోయినా సరే.. సిగ్గు లేకుండా పదకొండోసారి ప్రేమకోసం పరితపించే ప్రేమికుల మధ్య బతుకుతున్నాం' అంటూ కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్, కిరణ్ అబ్బవరం మధ్య వచ్చే సీన్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కిరణ్ అబ్బవరమే స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడం విశేషం. -
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా నుంచి క్రేజీ అప్డేట్
రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆ వెంటనే ఎస్.ఆర్.కళ్యాణమండపం, సెబాస్టియన్ చిత్రాలతో అలరించాడు. ఇటీవల సమ్మతమేతో పలకరించాడు. ప్రస్తుతం అతడి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అందులో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ఒకటి. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ మొదలై నెలలు దాటుతున్న ఈ సినిమా గురించి అప్డేట్లు రావడంలేదు. చదవండి: నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్ డేట్‌ను తాజాగా చిత్రబృందం ప్రకటించింది. జూలై 10న 11.05 నిమిషాలకు ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో కిరణ్ స్టైలిష్‌లుక్‌లో దర్శనం ఇచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్వ దీప్తి నిర్మిస్తున్నారు. Mass unloading with entertainment 💥💥@Kiran_Abbavaram's #NMBKteaser releasing on July 10th at 11:05am 🔥#NenuMeekuBaagaKavalsinavaadini #NMBK@itssanjanaanand #SonuThakur @kodidivya @sridhar_chotu @KodiDivyaaEnt #Manisharma @LahariMusic pic.twitter.com/bQnYXh7RLw — KodiDivyaaEntertainments (@KodiDivyaaEnt) July 7, 2022 -
అందుకే డైరెక్షన్ చేయకూడదనుకున్నాను: కోడి రామకృష్ణ కూతురు
‘‘నాకు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. నాన్న (కోడి రామకృష్ణ) ద్వారా దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నాను. మా ఆయన కూడా డైరెక్షన్ చేయమని ప్రోత్సహించారు. ఇంతలో నాన్న దూరమయ్యారు. దర్శకుడిగానే కాకుండా మంచి వ్యక్తిత్వంతోనూ అభిమానులను సంపాదించుకున్నారు నాన్న. అటువంటిది నేను డైరెక్షన్ చేసి ఆయన పేరు చెడగొట్టకూడదని నా నిర్ణయం మార్చుకున్నాను’’ అని నిర్మాత కోడి దివ్య దీప్తి అన్నారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై రూపొందుతున్న ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. నేడు (జూలై 8) కోడి దివ్య దీప్తి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ఉన్నప్పుడే కిరణ్‌తో సినిమా చేద్దామని కథలు విన్నాను. ‘మనం పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్‌పై కనపడేలా చెయ్యాలి తప్ప వృథా చేయకూడదు’ అని నాన్న ఎప్పుడూ చెప్పేవారు.. ఆ మాటలు మనసులో పెట్టుకొని ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చేస్తున్నాను. ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 10న పాలకొల్లులో విడుదల చేస్తున్నాం. సెప్టెంబర్ 9న సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం. నాకు కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలంటే ఇష్టం. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. నా తర్వాతి సినిమా ఏంటనేది త్వరలో చెబుతాను’’ అన్నారు.