Nenu Meeku Baga Kavalsina Vaadini Movie 3 Days Box Office Collections, Deets Inside - Sakshi
Sakshi News home page

Nenu Meeku Baaga Kavalsinavaadini: ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ కలెక్షన్ల దూకుడు, మూడు రోజుల్లోనే ఎంతంటే..

Published Mon, Sep 19 2022 1:27 PM | Last Updated on Mon, Sep 19 2022 1:47 PM

Nenu Meeku Baga Kavalsina Vaadini Box Office 3 Days Collection is 4 Cr 50 Lakhs - Sakshi

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. సెప్టెంబర్‌ 16న విడుదలైన ఈ చిత్రం హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఎస్‌ఆర్‌ కల్యాణమండపం డైరెక్టర్‌ శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య నిర్మించారు. రిలీజైన తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ను తెచ్చేకుంది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. 

చదవండి: మరో ప్రేమకథతో రాబోతున్న ‘సీతారామం’ టీం!, ఆ నిర్మాత క్లారిటీ..

మాస్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూ కమర్షియల్ హిట్‌గా కొనసాగుతుంది. కేవలం మూడు రోజుల్లోనే 4.5 కోట్ల గ్రాస్‌ సాధించడం ఈ సినిమా  విజయానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఏ బాగ్రౌండ్‌ లేకుండా వచ్చిన ఒక హీరో సినిమా, ఈ స్థాయిలో ఆదరణ పొందడం అంటే మాములు విషయం  కాదు. కిరణ్‌ అబ్బవరం గత చిత్రాలైన రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపంలాగే ఈ చిత్రం కూడా తెలుగు సినిమాకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు.

చదవండి: లారెన్స్‌ షాకింగ్‌ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement