బిగ్‌బాస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే వ్యక్తుల్లో మొట్టమొదటి కంటెస్టెంట్ బాబా భాస్కర్. అతను మాత్రమే హౌస్‌లో మొదటినుంచీ అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు అది శ్రుతిమించిందని హౌస్‌మేట్స్ ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే తన పంథా అదేనంటూ అందర్నీ ఆటపట్టిస్తూ.. సరదాగా ఉంటాడు.
నిన్నటి ఎపిసోడ్‌లో మాటల యుద్దాలు జరగ్గా.. నేటి ఎపిసోడ్‌లో మాత్రం బిగ్‌బాస్ హౌస్ కూల్ కూల్‌గా ఉండేట్టు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా.. తన పెద్దకొడుకు కోడలి (రవి-శ్రీముఖి) పెళ్లి చూపులు చూడాలనుకుంటున్నానంటూ శివజ్యోతి ఆర్డర్ వేసింది. ఇక అతివినయం ప్రదర్శిస్తూ..తల కిందకు వేసుకుని వస్తున్న శ్రీముఖిని చూస్తూ.. మెడ నొప్పా? అంటూ బాబా ఓ పంచ్ వేశాడు. దీంతో హౌస్‌లో నవ్వులు పూశాయి.
పెళ్లిచూపుల్లో భాగంగా.. ప్లేట్‌లో కాఫీ మగ్గును రవి, బాబాకు శ్రీముఖి ఇచ్చింది. అయితే అందులో షుగరే లేదని బాబా కౌంటర్ వేయగా.. అవి నీళ్లంటూ శ్రీముఖి రివర్స్ కౌంటర్ వేసింది. దీంతో హౌస్‌మేట్స్ అందరూ ఘొల్లున నవ్వారు. చివరగా.. కట్నం ఎంత ఇవ్వాలంటూ శ్రీముఖి తరుపున మహేష్ అడుగుతుండగా.. మా అమ్మకు కట్నం అంటే నచ్చదని రవి చెప్పసాగాడు.. మధ్యలో అందుకున్న బాబా.. వెళ్లేటప్పుడు మాత్రం ఆటోకు రూ.500 ఇస్తే చాలు అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు. దీంతో ఇంటి సభ్యులందరూ పగలబడి నవ్వారు.
Comments
Please login to add a commentAdd a comment