బాబా భాస్కర్.. బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఈయన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. చెన్నైలో పుట్టి పెరిగిన ఆయనకు చిన్ననాటి నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. ఈ ఇష్టంతోనే అతడు శివ శంకర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా కొన్నేళ్లు పని చేశాడు. తర్వాత సుందరం మాస్టార్‌కు అసిస్టెంట్‌గా చేరాడు. వీళ్లిద్దరూ బాబాకు సినిమా కొరియోగ్రఫీలో ఓనమాలు నేర్పించారు. పాటను ఎలా కొరియోగ్రఫీ చేయాలనేదాన్ని వారి దగ్గరి నుంచే నేర్చుకున్నాడు.
తెలుగు, తమిళ చిత్రాల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ఆరంభించిన బాబా భాస్కర్ కొత్త బంగారు లోకంతో కొరియోగ్రాఫర్‌గా మారాడు. కేడీ సినిమాతో కోలీవుడ్‌లోనూ కొరియోగ్రాఫర్‌గా అడుగుపెట్టాడు. ఆ సినిమాతో బాబా ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్, సిద్దార్థ్, కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా, విశాల్ వంటి ఎందరో స్టార్ హీరోలతో స్టెప్పులేయించాడు బాబా.
తెలుగులో మహేశ్ బాబు, రామ్‌చరణ్, నాగార్జున వంటి బడా హీరోల సినిమాలకు సైతం కొరియోగ్రఫీ చేశాడు. ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తోన్న బాబా భాస్కర్ గతంలో బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్నాడు. అయితే అప్పుడు ఫినాలేకు అడుగు దూరంలో ఆగిపోయిన ఆయన తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో అడుగు పెట్టాడు. ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన టాప్ 5లో చోటు దక్కించుకుంటాడేమో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment