బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ను ఓటీటీలోకి తెస్తే ఎలా ఉంటుంది? బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేదాన్ని గంట ఎపిసోడ్‌గా చూపించడం కంటే కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు 24 గంటలు చూసేలా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తే ఇంకెలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా పుట్టుకొచ్చిందే బిగ్‌బాస్ ఓటీటీ. హిందీ, తమిళంలోనూ వర్కవుట్ అయిన ఈ బిగ్‌బాస్ ఓటీటీ తెలుగులో ప్రారంభమై ఏడువారాలవుతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం 11 మంది మాత్రమే మిగిలారు. శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి వరుసగా ఎలిమినేట్ అయ్యారు.
ఈ వారం అనిల్, నటరాజ్, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్, అరియానా, మహేశ్ విట్టా నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో అఖిల్, బిందు మాధవి ఓట్ల రేసులో దూసుకుపోతున్నారు. అరియానా, శివ మొదటి నుంచి మంచి గేమ్ ఆడుతుండటంతో వీరికంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓట్ల విషయం పక్కన పెడితే ఎప్పటిలాగే ఈవారం కూడా మిత్ర శర్మ సేఫ్. మిగిలిందల్లా అనిల్, మహేశ్. ఇద్దరూ గేమ్ ఎవరి స్టైల్‌లో వారు గేమ్ ఆడుతున్నారు, కానీ శ్రమకు తగ్గ గుర్తింపు మాత్రం దొరకడం లేదు. ఇంకా చెప్పాలంటే అనిల్ ఇంట్లో ఉండీలేనట్టుగా ఉంటున్నాడు.
చదవండి: ప్రియురాలితో యాంకర్ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్
అటు మహేశ్ గతంలో కంటే కూడా చాలా మెరుగయ్యాడు. హౌస్‌మేట్స్‌కు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. టాప్ 5కి చేరుకునే సత్తా ఉంది. కానీ అనూహ్యంగా అతడిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఏడో వారం మహేశ్ ఎలిమినేట్ అయ్యాడని లీకువీరులు దండోరా వేసి చెప్తున్నారు. నిజానికి ఓట్ల పరంగా అతడు మెరుగైన స్థానంలోనే ఉన్నప్పటికీ కావాలనే అతడిని గేమ్ నుంచి తప్పించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే గేమ్‌లో కొట్లాటలు తప్ప పెద్దగా కామెడీ లేకుండా పోవడంతో బిగ్‌బాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూడో సీజ్‌లో పాల్గొన్న బాబా భాస్కర్‌ను హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించనున్నట్లు తెలుస్తోంది. మరి బిగ్‌బాస్ ప్లాన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment