
బాబా భాస్కర్.. బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. మూడో సీజన్‌లో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. శ్రీముఖితో చేసిన కామెడీకి జనాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. కొరియోగ్రాఫర్ బాబాలో కామెడీ యాంగిల్ కూడా ఉందని నిరూపించాడు. ఇప్పుడు ఈయన పేరు ఎందుకు ప్రస్తావించామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. తాజాగా అతడు బిగ్‌బాస్ ఓటీటీలోనూ అడుగుపెట్టాడు. ఈ మేరకు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది.
నా ఇంటికి వచ్చేశాను అంటూ సంతోషం వ్యక్తం చేశాడు బాబా. అతడి ఎనర్జీని చూసి ఆశ్చర్యపోయిన నాగ్ మీరు ముదురులా ఉన్నారే అంటూ పంచ్ వేశాడు. ఇదిలా ఉంటే ఈరోజు మహేశ్ విట్టా ఎలిమినేట్ అవనున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అనంతరం రేపటి నామినేషన్స్ పర్వం ముగిశాక బాబాను హౌస్‌లోకి పంపించనున్నారట. అప్పటివరకు అతడిని సీక్రెట్ రూమ్‌లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. మరి షో ప్రారంభమైన ఏడు వారాల తర్వాత హౌస్‌లో అడుగు పెట్టబోతున్న బాబా భాస్కర్‌ను హౌస్‌మేట్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి!
చదవండి: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గని, ఆహా ట్వీట్ చూశారా?
నిఖిల్ పాన్ ఇండియా సినిమా టైటిల్ ఇదే, దసరా పండుగే టార్గెట్
Comments
Please login to add a commentAdd a comment