ఆమె నోరు తెరిస్తే బూతులే, శివకు కఠిన శిక్ష విధించిన నాగ్‌! | Bigg Boss Non Stop Promo: Nagarjuna Gives Punishment Shiva | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu OTT: వీడియో చూపిస్తూ శివపై ఫైర్‌ అయిన నాగ్‌, వారమంతా ఆ పని చేయాలంటూ పనిష్మెంట్‌

Published Sun, Apr 10 2022 6:44 PM | Last Updated on Sun, Apr 10 2022 7:32 PM

Bigg Boss Non Stop Promo: Nagarjuna Gives Punishment Shiva - Sakshi

ఎప్పుడూ కూల్‌గా ఉంటూ నవ్వుతూనే చురకలు అంటించే నాగార్జున ఈసారి మాత్రం విశ్వరూపం చూపించాడు. హద్దులు మీరి మాట్లాడుతూ అతి చేస్తున్న బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కంటెస్టెంట్లపై ఫైర్‌ అయ్యాడు. ఈ క్రమంలో యాంకర్‌ శివ, నటరాజ్‌ మాస్టర్‌లకు గట్టి వార్నింగే ఇచ్చాడు. ఇదిలా ఉంటే హౌస్‌మేట్స్‌తో ఫన్నీ టాస్క్‌ కూడా ఆడించాడు నాగ్‌. హౌస్‌లో బూతులు మాట్లాడే కంటెస్టెంట్‌ ఎవరని ప్రశ్నించగా నటరాజ్‌ అషూరెడ్డి అని ఆన్సరిచ్చాడు. అషూ పచ్చిబూతులు మాట్లాడుతుందా అని నాగ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేయగా మా మమ్మీ చూస్తే ఇంటికెళ్లాక చీపురుకట్ట తిరగేస్తుందని వాపోయింది అషూ.

శివ ఒక హౌస్‌మేట్‌ డ్రెస్సును బాత్రూమ్‌ బ్రష్‌తో ఉతికేసిన వీడియోను చూపిస్తూ గరమయ్యాడు నాగ్‌. శివ చేసింది కరెక్టా? అని బిందు మాధవిని అడగ్గా ఆమె తప్పని బదులిచ్చింది. శివ ఏదో చెప్పడానికి ప్రయత్నించగా షటప్‌ అంటూ అతడి నోరు మూయించాడు. ఈ వారమంతా అమ్మాయిల బట్టలు ఉతకాలని పనిష్మెంట్‌ ఇచ్చాడు. అలాగే ఈ రోజు సింగిల్‌ ఎలిమినేషన్‌ కాదని, డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండబోతుందని హౌస్‌మేట్స్‌ను టెన్షన్‌ పెట్టాడు నాగ్‌. అయితే ఆ ఇద్దరు ముమైత్‌ ఖాన్‌, స్రవంతి అని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

చదవండి: కిరాక్‌ ఆర్‌పీ ఇల్లు చూశారా? లిఫ్ట్‌, హోమ్‌ థియేటర్‌.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి!

 డబుల్‌ ఎలిమినేషన్‌ ట్విస్ట్‌! ఆ ఇద్దరు బ్యాగు సర్దేయాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement