Bigg Boss Non Stop Telugu Finale : Baba Bhaskar Eliminate From Top 7 Deets Here - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop Telugu Grand Finale: అదొక్కటే అసంతృప్తి: బాబా భాస్కర్‌

Published Sat, May 21 2022 8:07 PM | Last Updated on Mon, May 23 2022 10:02 AM

Bigg Boss Non Stop Telugu: Baba Bhaskar Eliminate From Top 7 - Sakshi

Bigg Boss Non Stop Telugu Grand Finale: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో గ్రాండ్ ఫినాలే జోరుగా ప్రారంభమైంది. ఈషోలో బాబా భాస్కర్‌ మాస్టర్‌ ప్రయాణం ముగిసిపోయింది. టాప్‌ 7 నుంచి అనిల్‌ రాథోడ్‌ ఎలిమినేట్‌ కాగా తర్వాత సత్యదేవ్ చేతుల మీదుగా బాబా బాస్కర్‌ ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చేశాడు. బాబా మాస్టర్‌ స్టేజ్‌పైకి వస్తూనే ఆయన భార్య రేవతికి దండం పెట్టేశాడు. ఇది గమనించిన నాగార్జున భలే కవర్‌ చేస్తున్నావ్ కదా ? అన్నట్లుగా సెటైర్‌ వేశాడు. దీని తర్వాత బాబా మాస్టార్‌ తన అనుభూతి గురించి తెలిపాడు. 

ఈ సీజన్‌ కంటే ముందుగా వచ్చిన సీజన్‌ అనుభవం బాగుంది. అప్పుడు మాకేం తెలియదు. కానీ ఈ సీజన్‌కు వచ్చే సరికి అంత ఎగ్జైట్‌మెంట్‌ లేదు. బిగ్‌బాస్ గురించి అంతా తెలుసు కాబట్టి అలా అనిపించలేదు. అయితే ఈ షోకు రావడం ఆనందగా ఉంది. సీక్రెట్ రూమ్‌లో ఉండటం, ఎవిక్షన్‌ పాస్‌ రావడం అన్ని బాగున్నాయి. కానీ శ్రీకాంత్‌ లోపలకు వస్తాడేమో, డబ్బులు పట్టుకుని పోదామనుకున్నా. అలా జరగలేదు. అదొక్క అసంతృప్తి మాత్రమే ఉంది. తర్వాత విన్నర్‌ ఎవరు అవుతారని నాగార్జున అడగ్గా, ముందుగా బిందు అని సమాధానం ఇచ్చాడు బాబా మాస్టర్‌. తర్వాత మళ్లీ శివ, అఖిల్ పేర్లు చెప్పాడు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కావాలని అన్నట్లుగా తెలిపాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement