బాబా భాస్కరా? మజాకా? నేరుగా ఫినాలేలోకి! | Bigg Boss Non Stop: Baba Bhaskar Not Used Eviction Free Pass For Anyone | Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: అషూకి హ్యాండ్‌ ఇచ్చిన బాబా! ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ ఇతడేనా?

Published Sun, May 8 2022 6:52 PM | Last Updated on Sun, May 8 2022 7:00 PM

Bigg Boss Non Stop: Baba Bhaskar Not Used Eviction Free Pass For Anyone - Sakshi

బిగ్‌బాస్‌ షోను రక్తికట్టించేవి నామినేషన్స్‌, ఎలిమినేషన్సే! అయితే కొన్నిసార్లు ఎలిమినేషన్‌ కూడా కంటెస్టెంట్ల చేతిలోనే ఉంటుంది. అందుకు నేటి ఎపిసోడ్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎనిమిదో వారంలో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్‌ హౌస్‌మేట్స్‌ అందరినీ వెనక్కు నెట్టుతూ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెలిచాడు. దీన్ని డేంజర్‌ జోన్‌లో ఉన్న అరియానా, అషూలలో ఎవరికోసమైనా వాడొచ్చని నాగ్‌ చెప్పాడు. ఈ మేరకు ప్రోమో కూడా రిలీజైంది. అంటే ఈ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోవాలా? వద్దా? అన్నది బాబా భాస్కర్‌ చేతిలో ఉంది.

అయితే నాగ్‌ ఇక్కడే ఓ మెలిక పెట్టాడు. ఈసారి తనెలాగో నామినేషన్స్‌లో లేడు కాబట్టి ఈ వారం ఎవరినైనా సేవ్‌ చేయడానికి ఆ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడొచ్చు, లేదంటే వచ్చేవారం తను నామినేషన్స్‌ నుంచి గట్టెక్కడానికి వాడుకోవచ్చు అని చెప్తాడు. ఇంత మంచి అవకాశం ఇచ్చాక ఇంకా ఎవరికోసమో ఎందుకు పాస్‌ వాడతాడు. ఛాన్సే లేదు, నెక్స్ట్‌ వీక్‌ తనకోసం వాడుకుంటానని అతడు ముక్త కంఠంతో చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో తక్కువ ఓట్లు పడ్డ అషూ ఎలిమినేట్‌ అయినట్లు సమాచారం. ఎలాగో బాబా సోమవారం తన పాస్‌ వాడుకుంటాడు కాబట్టి వచ్చేవారం(11వ వారం) నామినేషన్‌లో ఉండడు. ఒకవేళ 11వ వారం మధ్యలో సడన్‌ ఎలిమినేషన్‌ ఉన్నా, వీకెండ్‌లో డబుల్‌ ఎలిమినేషన్‌ ఉన్నా బాబా భాస్కర్‌ నేరుగా టాప్‌ 6లో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన బాబా బిగ్‌బాస్‌ ఓటీటీలో ఫస్ట్‌ ఫైనలిస్టుగా చరిత్ర సృష్టించనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: బిగ్‌బాస్‌ షో నుంచి ఆమె ఎలిమినేట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement