బిగ్‌బాస్‌.. డోస్‌ పెంచిన నాగ్‌ | Bigg Boss 3 Telugu: Nagarjuna Fires On Rahul Varun And Baba Bhaskar | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. డోస్‌ పెంచిన నాగ్‌

Published Sat, Sep 28 2019 10:43 PM | Last Updated on Tue, Oct 1 2019 12:38 PM

Bigg Boss 3 Telugu: Nagarjuna Fires On Rahul Varun And Baba Bhaskar - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో పదోవారం గడిచేందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన గొడవలపై ఇంటి సభ్యులను నాగార్జున కాస్త గట్టిగానే మందలించాడు. రాహుల్‌-వరుణ్‌ మధ్య జరిగిన గొడవను నాగ్‌ సద్దుమణిగేలా చేశాడు. పాత విషయాలను తవ్వడం తన తప్పేనని వరుణ్‌ క్షమాపణలు చెప్పాడు. తనది కూడా తప్పేనని రాహుల్‌కూడా సారీ చెప్పాడు. గొడవ జరుగుతూ ఉంటే.. చూస్తూ కూర్చున్నావ్‌ టాస్క్‌ ఆడలేదని ఎంపైర్‌లా పక్కన ఉన్నావంటూ పునర్నవికి చురకలంటించాడు. రాహుల్‌-పున్నులు మాట్లాడకపోయే సరికి వరుణ్‌ నీతో ఉన్నాడంటూ శ్రీముఖితో వితికా చెప్పిన మాటలను ప్రస్తావించాడు. పునర్నవి గురించి బాబా, శ్రీముఖి దగ్గర చెప్పడం తప్పు కదా అని వితికాను మందలించాడు. 

పునర్నవి తిట్లదండకానికి సంబంధించిన వీడియోను ప్లే చేసి ఆమెపై సెటైర్‌ వేశాడు. బయటకు వెళ్లాక తిట్ల కోచింగ్‌ సెంటర్‌ పెట్టుకోవచ్చని అన్నారు. బాబా భాస్కర్‌ మాస్క్‌ తీసేశాడని, శ్రీముఖి, వరుణ్‌తో జరిపిన సంభాషణలకు సంబంధించిన వీడియోలను చూపించాడు. నామినేషన్‌ విషయంలో పునర్నవితో మాట్లాడిన విధానంపైనా ఫైర్‌ అయ్యాడు. ప్రతీది కామెడీ చేస్తున్నాడని బాబాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిత్రబేధాన్ని వాడుకుంటోందని శ్రీముఖికి చురకలంటించాడు. రాహుల్‌-వరుణ్‌ మధ్య వచ్చిన గొడవను వాడుకుంటున్నావని శ్రీముఖినుద్దేశించి నాగ్‌ పేర్కొన్నాడు.
(ఎలిమినేట్‌ అయింది అతడే!)

బ్రోకెన్‌ హార్ట్‌ అంటూ ఆట ఆడించాడు...
హౌస్‌మేట్స్‌ అందరికీ హార్ట్‌ షేప్‌ థర్మకోల్‌ షీట్‌లను ఇచ్చాడు. ఎవరి వల్ల హార్ట్‌ బ్రేక్‌ అయిందని హౌస్‌మేట్స్‌ భావిస్తున్నారో.. వారి వద్దకు వెళ్లి.. ఆ హార్ట్‌ను విరగొట్టి కారణం చెప్పాలనే టాస్క్‌ ఇచ్చాడు. దీనిలో భాగంగా మహేష్‌ మొదటగా ఆటను ప్రారంభించాడు. బాబా భాస్కర్‌ వల్ల తన హార్ట్‌ బ్రేక్‌ అయిందని బాబా ఎదుటకు వెళ్లి థర్మకోల్‌ హార్ట్‌ షేప్‌ను మహేష్ విరగొట్టాడు. రాహుల్‌కు శివజ్యోతి వల్ల, శివజ్యోతికి రాహుల్‌ వల్ల, రవి, వితికాలకు పున్ను వల్ల, బాబాకు మహేష్‌ వల్ల, శ్రీముఖికి బాబా వల్ల, అలీకి బాబా వల్ల, పున్నుకు వరుణ్‌ వల్ల హార్ట్‌ బ్రేక్‌ అయినట్లు తెలిపారు.  ఇక నామినేషన్‌లో ఉన్న శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌, రవిలోంచి వరుణ్‌ సేవ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించేశాడు. అయినా.. రవి ఎలిమినేట్‌ అయినట్లు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఇక రేపు రవి ఎలిమినేషన్‌తో శివజ్యోతి ఏం చేస్తున్నది చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement