బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యాలు పడ్డాయి. వాటి కోసం కోర్ట్ యార్డ్‌లో స్మశానాన్ని కూడా నిర్మించాడు బిగ్‌బాస్. ఇంటి సభ్యులను మనుషులు, దెయ్యాలు అంటూ రెండు గ్రూపులుగా విభజించాడు. ఆ రెండు వర్గాల చేత ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’ టాస్క్‌లు ఆడించాడు. దొరికిందే చాన్స్ అనుకున్న దెయ్యాలు మనుషుల్ని విసిగించడానికి నానా హంగామా చేశాయి. ఈ క్రమంలో దెయ్యం రూపంలో ఉన్న వితిక వరుణ్‌ను చంపి మనిషిగా మారగా వరుణ్ దెయ్యం అయ్యాడు. ఇక మొదటి రోజు దెయ్యాలుగా ఉన్న వితిక, శిల్ప మనుషులుగా మారగా వారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన వరుణ్, పునర్నవి దెయ్యాలుగా అవతారం ఎత్తాల్సి వచ్చింది.