బిగ్‌బాస్ హౌస్‌లో అన్నింటికంటే కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లడం కష్టమైంది. ఇంటిసభ్యులకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలన్నా.. సీక్రెట్ టాస్క్ ఇవ్వాలన్నా.. అలాంటి వాటికి కన్ఫెషర్ రూమ్ అడ్డాగా మారుతుంది. అందుకే ఆ రూమ్ అంటే అందరికీ దడగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం ఫుడ్ ఐటమ్స్ కూడా ఇస్తుంటాడు బిగ్‌బాస్. గత సీజన్‌లో తనీష్, రోల్ రైడా కన్ఫెషన్ రూమ్‌లో చాక్లెట్లు ఆరగించిన విషయం గుర్తుండే ఉంటుంది. నేటి ఎపిసోడ్‌లో కూడా అలాంటిదే జరగనున్నట్లు కనిపిస్తోంది.