బిగ్‌బాస్ ఇంట్లో సరదాలకు బ్రేక్ పడింది. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టడానికి బిగ్‌బాస్ రెడీ అయిపోయాడు. ఇప్పటికే 80వ రోజులోకి అడుగు పెట్టిన బిగ్‌బాస్ హౌస్ ఇంటి సభ్యుల గొడవలతో నేడు హీటెక్కనుంది. హౌస్‌మేట్స్‌కు వారి వెనక మాట్లాడుకున్న వీడియో క్లిప్పింగ్స్‌ను చూపించాడు. వీడియో చూసిన తర్వాత వారి రియాక్షన్స్ పూర్తిగా మారిపోయాయి. ఇంటి సభ్యులు కోపంతో ఊగిపోతున్నారు. బాబా భాస్కర్.. ఇక నుంచి రాహుల్‌నే టార్గెట్ చేస్తానంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో చూసి బయటకు వచ్చిన అలీని తన ప్రకోపాన్ని అంతా కుండపై చూపించాడు. ఏ కర్ర సహాయం తీసుకోకుండా చేతితో కుండను పగలగొట్టాడు. ఇక శ్రీముఖి.. మహేశ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్తూనే అతని పోస్టర్ ఉన్న కుండను బద్దలు కొట్టింది.
కాగా వీడియో క్లిప్పింగ్స్ ఇంటి సభ్యులందరికీ చూపించారా, లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎలాగోలా నిజాలైతే బయటికి వచ్చాయి. మరి దీనితోనైనా ఇంటిసభ్యుల నిజస్వరూపాలు వెలికి వస్తాయా అన్న సందేహం ప్రేక్షకులకు కలుగుతోంది. ఈ ప్రోమోపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రోమో చూస్తే సీరియస్‌గా ఉంటుంది.. ఎపిసోడ్ చూస్తేనేమో కామెడీగా ఉంటుంది అని ప్రోమోలవర్స్ పెదవి విరుస్తున్నారు. మరికొంతమందేమో.. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ప్రోమో మాత్రం అదిరిపోయింది, ఎపిసోడ్ కూడా అంతకు మించి ఉంటుందని నేటి ఎపిసోడ్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. మరి నేటి ఎపిసోడ్‌లో ఎవరి బండారాలు బయటపడ్డాయి? దానిపై ఇంటిసభ్యులు ఎలా స్పందించారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే!
Kunda baddalakottinattu nijam bayatapadindi #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/KVpnuSDWUE
— STAR MAA (@StarMaa) October 10, 2019
Comments
Please login to add a commentAdd a comment