
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు తమ ఇంటికి దూరంగా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారిలో వారే బంధాలను ఏర్పర్చుకుంటూ.. ప్రేమలు, గొడవలు, కోపాలు, అలకలతో గడిపేస్తున్నారు. మధ్యమధ్యలో బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ తమ ఇంటిసభ్యులను గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడతుంటారు.
అయితే నేడు బిగ్‌బాస్ హౌస్‌లో ఆనంద భాష్పాలు రాలనున్నాయి. తమ ఇంటి సభ్యులు పంపిన సందేశాలను బిగ్‌బాస్.. తన హౌస్‌మేట్స్‌కు అందించనున్నాడు. ఇక వాటిని చదువుకుంటూ ప్రతీ ఒక కంటెస్టెంట్ ఆనందంతో కన్నీరుపెట్టారు. వారి కుటుంబ సభ్యులు పంపిన సందేశాలతో.. కంటెస్టెంట్ల గుండెలు బరువెక్కినట్టు తెలుస్తోంది. మరి ఎవరెవరికి ఎలాంటి సందేశాలు వచ్చాయో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి. ఇక బాబా భాస్కర్ కెప్టెన్సీలో ఇళ్లంతా సందడి మారనున్నట్లు కనిపిస్తోంది. బాబా తన కొత్త రూల్స్‌తో ఎలాంటి ఫన్‌ను క్రియేట్ చేస్తాడో చూడాలి.