
వీకెండ్‌లో దర్శనమిచ్చేందుకు.. హౌస్‌మేట్స్‌ను దారిలో పెట్టేందుకు నాగార్జున రెడీ అయ్యాడు. బిగ్‌బాస్ ఐదో వారంలో హౌస్‌మేట్స్ ప్రవర్తనపై కొందరికి అక్షింతలు పడేట్టు కనిపిస్తున్నాయి. ఓ వారం పొగడ్తలు, మరోవారం అక్షింతలతో అలీరెజా నెట్టుకొస్తున్నాడు. అయితే ఈ వారం అలీకి గట్టిగానే క్లాస్ పీకుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం మహేష్‌తో వాగ్వాదానికి దిగడం, కెప్టెన్ శివజ్యోతి చెబుతున్నా వెనక్కి తగ్గకపోవడంపై నాగ్ గురిపెట్టినట్టు కనిపిస్తోంది.
నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను కాసేపటి క్రితమే విడుదల చేశారు. అలీరెజా, బాబా భాస్కర్‌ల తీరును నాగార్జున ఎత్తిచూపుతున్నాడు. అంత అహంకారమెందుకు? ఆడపిల్ల కెప్టెన్ అయితే మాట వినవా? అంటూ అలీరెజాను ప్రశ్నిస్తున్నాడు? ఇక బాబా భాస్కర్ విషయాన్ని కూడా నాగ్ లేవనెత్తగా.. కామెడీగా చేసేందుకు ప్రయత్నించిన బాబానుద్దేశించి.. ఇది కామెడీ కాదు సీరియస్ అంటూ కాస్త ఘాటుగా స్పందించాడు. మిగిలిన ఇంటి సభ్యులకు కూడా నాగ్ క్లాస్ పీకాడా అని తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment