
బిగ్‌బాస్ హౌస్‌లో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ కంటెస్టెంట్ అయిన బాబా భాస్కర్.. ప్రతీ విషయాన్ని కామెడీ చేయడమే ఆయనకు మైనస్‌గా మారేలా ఉంది. బాబా భాస్కర్ కాదు.. మాస్కర్ అంటూ పలుమార్లు నాగార్జున చెప్పుకొచ్చాడు. బయటకు వచ్చిన హౌస్‌మేట్స్ సైతం అదే మాట్లాడుతున్నారు. బాబా భాస్కర్ ఇంకా తన మాస్క్ తీయలేదని..సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, అందరి చేత మంచి అనిపించుకోవాలని అనుకుంటున్నాడని కామెంట్లు చేస్తుంటారు.
అయితే నేటి ఎపిసోడ్‌లో నాగార్జున బాబా భాస్కర్‌కు గట్టిగానే క్లాస్ పీకినట్లు కనిపిస్తోంది. నామినేషన్ విషయంలో ప్రవర్తించిన తీరు, హౌస్‌మేట్స్ వెనకాల మాట్లాడిన విషయాలను ప్లే చేయించి కడిగిపారేసినట్టు విడుదలైన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రోమోలో ఇలానే ఉంటుంది.. తీరా షో చూస్తే అంత సీన్ ఉండదని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment