
బిగ్‌బాస్‌లో మొదటి వారం గడిచిపోయింది. కోపాలు, అలకలు, ప్రేమలు ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో నిండిన ఆ ఇంట్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించలేం. ఇంట్లోంచి హేమ ఫస్ట్ ఎలిమినేట్ కాగా..రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. పద్నాలుగు మంది నామినేషన్ ప్రక్రియలో పాల్గొనగా.. వితికాను మినహాయించిన సంగతి తెలిసిందే. నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా.. వరుణ్ సందేశ్‌తో వితిక గుసగుసలాడుకుంటూ ఉండటంతో ఆమెను మినహాయించారు.
ఇక ఈ మొత్తం ప్రాసెస్‌లో బాబా భాస్కర్ హైలెట్‌గా నిలిచాడు. తాను ఎవర్నీ అంచనా వేయలేకపోతున్నానని, అందరూ మంచివారేనని తానేవర్నీ నామినేట్ చేయనని బిగ్‌బాస్‌కు తేల్చి చెప్పాడు. కొంత సమయం తీసుకుని మళ్లీ కన్ఫెషన్ రూమ్‌కు వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాల్సిందిగా ఆదేశించాడు. అయినా సరే బాబా భాస్కర్ ఎవరినీ నామినేట్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో విసుగుచెందిన బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ అందర్నీ హెచ్చరించాడు. బాబా భాస్కర్ నామినేషన్ ప్రక్రియలో ఎవరినీ నామినేట్ చేయనందున హౌస్‌మేట్స్ అందరూ నామినేషన్‌లో ఉండటం.. లేదా అందరూ కలిసి బాబా భాస్కర్‌ను నామినేట్ చేయడం అంటూ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. దీంతో బాబా భాస్కర్ వెనక్కు తగ్గి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటానంటూ వితికా, రాహుల్‌ను నామినేట్ చేశాడు.
ఇక ఈ విషయంపై బాబా భాస్కర్ వ్యవహరించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అతి మంచితనం కూడా చేటే అని కొందరు అంటుంటే.. రియల్ రేలంగి మామ అని మరికొందరు పొగిడేస్తున్నారు. బిగ్‌బాస్‌కు ఎదురు తిరుగుతున్న బాబా భాస్కర్ అంటూ రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతకీ రేలంగి మామయ్య అంటే తెలుసు కదా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాశ్‌రాజ్ పోషించిన పాత్ర అది. మనుషులు మంచోళ్లు అని అసలు మనుషులంటేనే మంచోళ్లు అంటూ అతి మంచితనంతో ప్రకాశ్ రాజ్ పోషించిన ఆ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే బిగ్‌బాస్‌లో మాత్రం బాబా భాస్కర్.. రేలంగి మామయ్య అంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.





Comments
Please login to add a commentAdd a comment