
చలో ఇండియా టాస్క్ మొదటి అంకం సరదాగా గడిచింది. ఆరో వారంలో నామినేషన్ ప్రక్రియ అనంతరం ఇచ్చిన ఈ టాస్క్‌తో ఫన్ జనరేట్ చేయాలని బిగ్‌బాస్ ప్రయత్నిస్తున్నాడు. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఎక్స్‌ప్రెస్‌లో ఇండియాను చుట్టి రావాలని ఇంటి సభ్యులకు కొన్ని క్యారెక్టర్లను ఇచ్చాడు. హనీమూన్ కోసం వచ్చిన కొత్త జంట రవి-పునర్నవి కాగా గయ్యాలి పెళ్లాం పాత్రలో హిమజ, చెప్పింది వినే భర్తగా మహేష్ టాస్క్‌లో ఇరగదీసిన సంగతి తెలిసిందే. చాదస్తపు తల్లిగా శివజ్యోతి, అల్లరి పిల్లగా వితికా.. ప్రేమను వెతుక్కునే క్యారెక్టర్‌లో శ్రీముఖి, ట్రావెల్ ఏజెన్సీ మేనేజర్, అందమైన యువకుడిగా అలీరెజా, చాయ్‌వాలాగా బాబా భాస్కర్, ట్రైన్ డ్రైవర్స్‌గా వరుణ్, రాహుల్‌లు నటించారు.
ఇక బుధవారం నాటి ఎపిసోడ్‌లో హిమజ, శివజ్యోతిలు ఫన్ క్రియేట్ చేయగా.. నేటి రెండో అంకంలో బాబా భాస్కర్ ఇంటి సభ్యులను విసిగిస్తూ.. ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనున్నుట్లు తెలుస్తోంది. తాను మొదట్లో హైదరాబాద్‌కు వచ్చినప్పటి పరిస్థితుల గురించి చెబుతూ ఉన్నాడు. మధ్యలో ఇంటి సభ్యులు అడ్డుకుంటూ ఉండటంతో మళ్లీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుండటంతో హౌస్‌మేట్స్ అందరూ చేతులెత్తి దండం పెట్టారు. మరి ఈ టాస్క్‌లోని రెండో అంకంలో ఇంకా ఎలాంటి ఫన్ మూమెంట్స్ ఉండనున్నాయో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment