బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా | Bigg Boss 3 Telugu Intlo Dayyam Nakem Bayyam Task Continues | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

Published Wed, Sep 11 2019 4:31 PM | Last Updated on Wed, Sep 11 2019 4:46 PM

Bigg Boss 3 Telugu Intlo Dayyam Nakem Bayyam Task Continues - Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో దెయ్యాలు పడ్డాయి. వాటి కోసం కోర్ట్‌ యార్డ్‌లో స్మశానాన్ని కూడా నిర్మించాడు బిగ్‌బాస్‌. ఇంటి సభ్యులను మనుషులు, దెయ్యాలు అంటూ రెండు గ్రూపులుగా విభజించాడు. ఆ రెండు వర్గాల చేత ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’ టాస్క్‌లు ఆడించాడు. దొరికిందే చాన్స్‌ అనుకున్న దెయ్యాలు మనుషుల్ని విసిగించడానికి నానా హంగామా చేశాయి. ఈ క్రమంలో దెయ్యం రూపంలో ఉన్న వితిక వరుణ్‌ను చంపి మనిషిగా మారగా వరుణ్‌ దెయ్యం అయ్యాడు. ఇక మొదటి రోజు దెయ్యాలుగా ఉన్న వితిక, శిల్ప మనుషులుగా మారగా వారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన వరుణ్‌, పునర్నవి దెయ్యాలుగా అవతారం ఎత్తాల్సి వచ్చింది.

ఈ టాస్క్‌ రెండో రోజు కూడా కంటిన్యూ అయింది. ఆటకు తగ్గట్టుగానే నందికొండ వాగుల్లోన.. అంటూ ఓ భయంకర పాటను ప్లే చేశారు. దీంతో బాబా భాస్కర్‌ తెలివిగా రవిని ముగ్గులో దింపి అతని చేత డాన్స్‌ చేయించాడు. ఇది టాస్క్‌ అని తెలీక రవి బాబాతో కలిసి స్టెప్పులేశాడు. రవితో డాన్స్‌ చేయించినందుకుగానూ బాబా భాస్కర్‌ మనిషిగా మారగా రవి దెయ్యంగా మారిపోనున్నాడు.  అటు మహేశ్‌ను కూడా ఐదు సార్లు బట్టలు మార్చుకునేలా చేయడంతో మహేశ్‌ కూడా దెయ్యంగా మారిపోయాడంటూ బిగ్‌బాస్‌ ప్రకటించాడు. అసలేం జరుగుతుందో అర్థం కాక మహేశ్‌ తల గోక్కున్నాడు. ఇక బిగ్‌బాస్‌.. ఆదేశాలు పాటించని కారణంగా పునర్నవి, శ్రీముఖి, మహేశ్‌లకు శిక్ష విధించాడు. అయితే పునర్నవి నా వల్ల కాదంటూ చేతులెత్తేసినా చివరకు చేయక తప్పదని ప్రేక్షకులు అంటున్నారు. ఇక గత ఎపిసోడ్‌లో పునర్నవిని ఈడ్చుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేయగా దానికి దెయ్యంగా మారిన తర్వాత ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement