బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌ | Bigg Boss 3 Telugu Who Will Win The Medal | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌

Oct 4 2019 9:19 AM | Updated on Oct 5 2019 7:04 PM

Bigg Boss 3 Telugu Who Will Win The Medal - Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో నవ్వులు తగ్గిపోయి కేవలం అరుపులు, గొడవలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజా ఎపిసోడ్‌లో డెటాల్‌ కోసం పునర్నవి రాహుల్‌ను చెడామడా తిట్టడమే కాక అలిగింది. దీంతో అలక పోగొట్టడానికి రాహుల్‌ కాసేపు పునర్నవిని ఆటపట్టించాడు. ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన ‘బ్యాటిల్‌ ఆఫ్‌ ద మెడాలియన్‌’ రెండో లెవల్‌లో శ్రీముఖి, శివజ్యోతి, బాబా భాస్కర్‌, అలీ రెజా తలపడ్డారు. ఈ టాస్క్‌లో ఒక్కొక్కరు ఒక్కో ఫ్రేములో నిలబడి తలపై పెట్టుకున్న వస్తువును ఫ్రేముకు ఆనించాలి. ఫ్రేమును కానీ వస్తువును కానీ చేతితో తాకడం లాంటివి చేయకూడదు. ఇక ఎక్కువ సేపు బ్యాలెన్స్‌గా ఉన్న బాబా భాస్కర్‌ ఈ టాస్క్‌లో గెలిచి ఫైనల్‌ లెవల్‌కు చేరుకున్నాడు.


టాస్క్‌ తర్వాత ఇంటిసభ్యులు బాబా భాస్కర్‌ మునుపటిలా లేడు అంటూ మాట్లాడుకున్నారు. బాబా హీరోయిజంలో బతుకుతారే తప్ప, రియాలిటీ చెక్‌లో బతకలేడు అని పునర్నవి ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా బ్యాటిల్‌ ఆఫ్‌ మెడాలియన్‌ ఆఖరి అంకానికి వెళ్లే ముందు ఇంటిసభ్యుల అభిప్రాయాలు చెప్పమని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఫైనల్‌ లెవల్‌కు చేరుకున్న బాబా భాస్కర్‌, వితికలలో నచ్చినవారికి తిలకం పెట్టి నచ్చని వ్యక్తి తలమీద గుడ్డు పగలగొట్టాలని పేర్కొన్నాడు. ఇక శ్రీముఖి.. వితికపై గుడ్డు పగలగొట్టగా, బాబాకు తిలకం పెట్టింది. మహేశ్‌.. తన మార్పుకు కారణమైన వ్యక్తి అంటూ బాబాకు అంటూ తిలకం దిద్దాడు. శివజ్యోతి కూడా బాబాకు తిలకం పెట్టింది. కాగా అతనేంటో ఇప్పటివరకూ అర్థం కావట్లేదు అంటూ అలీరెజా, రాహుల్‌, పునర్నవి.. బాబా భాస్కర్‌ మీద గుడ్లు పగలగొట్టి వితికకు నుదుటిపై బొట్టు పెట్టారు.

వరుణ్‌.. వితికకు తిలకం దిద్దాడు. టాస్క్‌ అనంతరం ఇంటిసభ్యులు బాబా భాస్కర్‌తో.. మాతో ఎందుకు కలవట్లేదు అని ప్రశ్నించారు. దీనికి బాబా భాస్కర్‌ మాట్లాడుతూ.. నాగార్జున వీడియో చూపించినప్పటినుంచి గిల్టీగా ఉందని వాపోయాడు. అది గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తోంది అని బాధపడ్డాడు. ఆయన మనోవేదనను చూసిన రాహుల్‌ అనవసరంగా బాబాను తప్పుగా అర్థం చేసుకున్నామేమో అని పునర్నవితో చెప్పుకొచ్చాడు. ఇక మహేశ్‌.. మళ్లీ పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసినట్టు కనిపిస్తోంది. వరుణ్‌ టీంతో మంచిగా ఉంటూనే వారి వెనక గోతులు తవ్వడం ప్రారంభించాడు. వారు మాట్లాడుకున్న విషయాలను శ్రీముఖి దగ్గర ప్రస్తావించాడు. వరుణ్‌, రాహుల్‌, పునర్నవి, వితిక అంతా ఒక్కటే అని పేర్కొన్నాడు. ‘నీ వెనక దారుణంగా మాట్లాడతారు కానీ నీ ముందుకు రాగానే బెస్ట్‌ఫ్రెండ్స్‌ అన్నట్టుగా మాట్లాడతారు’  అని శ్రీముఖితో అన్నాడు. ఇక బాబా భాస్కర్‌, వితికలలో మెడల్‌ ఎవరి సొంతం అవుతుందో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement