బిగ్‌బాస్ చేపట్టిన నామినేషన్ ప్రక్రియ పెద్ద చిచ్చునే పెట్టింది. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్.. హౌస్‌లో ఫుల్ ఫన్ క్రియేట్ చేసింది. పిసినారి రాణిగా శివజ్యోతి, కొడుకులుగా రవి, వరుణ్, రాహుల్.. కోడళ్లుగా శ్రీముఖి, వితికా, పునర్నవిలు మేనేజర్‌గా బాబా భాస్కర్, అతనికి అసిస్టెంట్‌గా మహేష్ తమ పాత్రల్లో లీనమై అందరినీ ఎంటర్‌టైన్ చేశారు.
బిగ్‌బాస్ పదో వారంలో చేపట్టిన నామినేషన్ ప్రక్రియ శ్రీముఖికి ఒంటరయ్యాననే ఫీలింగ్‌ను తీసుకొచ్చింది. బాబా భాస్కర్ కూడా తనకు ఓటు వేయకపోయేసరికి తెగ బాధపడినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై బాబా భాస్కర్‌ను ప్రశ్నించింది. ఏ విషయంలో తనకు ఓటు వేయకుండా.. శివజ్యోతికి ఓటు వేశారని అడిగింది. తానొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, ఎలిమినేషన్‌లో ఉన్నా.. సేవ్ అవుతుందని, ఏడుస్తుందని శివజ్యోతిని పదే పదే టార్గెట్‌చేసేలా మాట్లాడిందనే కారణాలతో తనకు ఓటు వేయలేకపోయానని బాబా చెప్పుకొచ్చాడు. సారీ అని బాబా చెప్పుకుంటూ ఉండగా.. సారీ ఎందుకు చెబుతున్నారని.. వద్దంటూ తనకు దూరంగా ఓ ఐదు నిమిషాలు వెళ్లమని బాబాను వేడుకుంది.
టాస్క్‌లో అతి చేసిన శ్రీముఖి..
పిసినారి రాణి అయిన శివజ్యోతి వద్ద ఉండే ఇటుకలను సంపాదించి.. కొడుకులైన రవి, వరుణ్, రాహుల్ గొడను నిర్మించవలసి ఉంటుంది. అయితే మూడు జంటలు కలిసి ఆడే ఈ ఆటలో చివరి వరకు ఎవరు ఎక్కువ ఎత్తులో ఉన్న గోడను కడతారో.. వారికి తదుపరి వారం కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపాడు. వీలునామా చివరకు ఎవరి చేతిలో ఉంటే.. వారు కూడా కెప్టెన్సీ పోటీకి అర్హులవుతారని తెలిపాడు.
టాస్క్‌లో భాగంగా రవి-శ్రీముఖి, వరుణ్-వితికా, రాహుల్-పునర్నవి భార్యాభర్తలుగా నటించారు. ఇక శ్రీముఖి ఈ టాస్క్‌లో రెచ్చిపోయి నటించింది. అతి వినయం ప్రదర్శిస్తూ.. తన అత్త దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు నానా ప్రయత్నాలు చేసింది. అత్త గుప్పిట్లో ఉన్న వీలునామాను చేజిక్కించుకునేందుకు వితికా ప్రయత్నించసాగింది. ఇదే మంచి సమయం అనుకున్న రాహుల్.. పునర్నవిని సొంత భార్యగానే ఫీలైనట్లు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా వీరిద్దరి సంభాషణలు హైలెట్‌గా నిలిచాయి. ఇక ముగ్గురు కొడుకులు తమ ప్రేమతో శివజ్యోతి ఉక్కిరిబిక్కిరి చేశారు.
నేటి ఎపిసోడ్‌లో ఫన్నీగా సాగిన ఈ టాస్క్ రేపటికి భీకరపోరును పుట్టించేలా ఉంది. వరుణ్, రాహుల్ హోరాహోరిగా తలపడినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సంభాషణలు కూడా హద్దులు దాటేలా కనిపిస్తుంది. ఇక మరి వీరి మధ్య జరగనున్న పోరు.. వారి స్నేహాన్ని దెబ్బతీస్తుందా? లేదా? అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment