
చలో ఇండియా టాస్క్‌ను పూర్తి చేసిన హౌస్‌మేట్స్.. వారి అనుభూతులను కెమెరాలో బంధించారు. ఈ ట్రిప్‌లో భాగంగా శ్రీనగర్, చంఢీగర్, కోల్‌కతా, ముంబై, కొచ్చిలకు ప్రయాణించిన ఇంటి సభ్యులు మార్గమధ్యంలో సరదా ముచ్చట్లు, ఆటపాటలతో సందడి చేశారు. ముంబై చేరుకున్నానక ఓ సినిమాను కూడా తెరకెక్కించారు. బాబా భాస్కర్ డైరెక్షన్‌లో తీసిని ఆ సినిమాలో రవికృష్ణ హీరోగా, అలీరెజా విలన్‌గా నటించారు.
మొత్తానికి ఏదో రకంగా సినిమాను కంప్లీట్ చేసిన టీమ్.. ప్రెస్‌మీట్ లాంటిది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబా భాస్కర్‌కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించారు. వెండితెరపై ఎప్పుడు కనబడతారు అన్న ప్రశ్నకు కంటతడి పెడుతూ త్వరలోనే హీరోగా నటిస్తానని తెలిపారు. ఇక ఇంటిసభ్యులకు ఇచ్చిన కొన్ని టాస్కులను కూడా వారు పూర్తి చేశారు. కొచ్చిలో పీచు తీయండి.. టెంకాయ వేయండి టాస్క్‌లో బాబా భాస్కర్ గెలవగా.. రాణీ మెడలో రత్నాల హారం టాస్క్‌లో మహేష్ గెలుపొందాడు.
ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు దిగిన ఫోటోలు, వీడియోలను ప్లే చేసి చూపించాడు. అనంతరం ఈ టాస్క్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ముగ్గురు సభ్యుల పేర్లను ఏకాభిప్రాయంతో చెప్పమని అదేశించాగా.. వరుణ్, రాహుల్, బాబా భాస్కర్‌ల పేర్లను తెలిపారు. దీంతో ఈ ముగ్గురుకి ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ను పెట్టనున్నట్లు ప్రకటించారు. మట్టిలో ఉక్కు మనిషి అనే ఈ టాస్క్‌లో ఎవరు గెలుపొంది.. కెప్టెన్‌గా ఎన్నికవుతారో చూడాలి. రెండో సారి కెప్టెన్‌గా ఎన్నికై వరుణ్ రికార్డు సృష్టిస్తాడా? లేదా బాబా భాస్కర్, రాహుల్‌లో ఎవరో ఒకరు కెప్టెన్ పదవిని పొందుతారా? అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment