బిగ్‌బాస్‌: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్‌ | Bigg Boss 3 Telugu: Vithika Sheru Gets Emotional After Eviction | Sakshi
Sakshi News home page

వితిక అవుట్‌.. విలపించిన వరుణ్‌

Published Mon, Oct 21 2019 2:34 PM | Last Updated on Wed, Oct 23 2019 11:13 AM

Bigg Boss 3 Telugu: Vithika Sheru Gets Emotional After Eviction - Sakshi

బిగ్‌బాస్‌ షో రంజుగా మారింది. లీకువీరులు చెప్పినట్టుగానే తొంభై రోజుల భార్యాభర్తల బంధాన్ని బిగ్‌బాస్‌ విడగొట్టాడు. డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందంటూ ట్విస్ట్‌ ఇచ్చినప్పటికీ ఎపిసోడ్‌కు వచ్చేసరికి అది ఉసూరమనిపించింది. నాగార్జున ఇంటిసభ్యులతో ఫన్నీ టాస్క్‌లు ఆడించాడు. మీకు సూటబుల్‌ అనిపించే పాటలను డెడికేట్‌ చేసుకోమని నాగ్‌ సూచించగా.. ఇంటి సభ్యులు దొరికిందే చాన్స్‌ అన్నట్టుగా రెచ్చిపోయారు. అలీ బిల్లా టైటిల్‌ సాంగ్‌తో, శ్రీముఖి..  ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, వితిక.. అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను, రాహుల్‌.. ఈ పేటకు నేనే మేస్త్రిని, బాబా భాస్కర్‌.. జులాయి టైటిల్‌ సాంగ్‌, వరుణ్‌.. ఘర్షణ చిత్రంలోని రాజాది రాజా పాటలతో వాళ్లను పరిచయం చేసుకుంటూ స్టెప్పులేశారు. అందరికన్నా హైలెట్‌గా శివజ్యోతి డాన్స్‌ నిలిచింది. చందమామ ఒకటే సరదాగా అన్న పాటకు చిందేసిన శివజ్యోతికి ఇంటి సభ్యులతోపాటు నాగార్జున సైతం ఫుల్‌ మార్కులు వేశాడు. అనంతరం శివజ్యోతి సేవ్‌ అయినట్టుగా నాగ్‌ ప్రకటించాడు.

తర్వాత హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్‌ ఆడించాడు. కళ్లకు గంతలు కట్టి వరుణ్‌, వితికలను బంతులతో ఒకరినొకరిని కొట్టుకోమన్నారు. వితిక తన కసితీరా భర్తను కొట్టింది. శివజ్యోతికి కళ్లకు గంతలు కట్టి గాడిద బొమ్మకు తోక పెట్టమంటే సునాయాసంగా దాన్ని అతికించేసింది. రాహుల్‌, అలీ రెజాలకు బాక్సింగ్‌ గ్లౌజ్‌లు ఇచ్చి కళ్లకు గంతలు కట్టి కొట్టుకోమని ఆదేశించాడు. వాళ్లు తెగ కొట్టుకుంటున్నట్టుగా బాగా నటించారు. శ్రీముఖి చుట్టూ నీళ్లగ్లాసులు పెట్టి డాన్స్‌ చేయమని టాస్క్‌ ఇచ్చాడు. అయితే తను కళ్లకు గంతలు కట్టుకుని డాన్స్‌ చేస్తుండగా మిగతా హౌస్‌మేట్స్‌ ఆమెకు మరింత దగ్గరగా గ్లాసులు జరపడంతో కష్టపడి చేసిన డాన్స్‌ అంతా నీటిపాలు అయింది. బాబా కళ్లకు గంతలు కట్టుకున్న సమయంలో ఇంటి సభ్యులు అతన్ని గిచ్చాలి. అయితే బాబా.. శ్రీముఖి తప్ప మిగిలిన గిచ్చిన వ్యక్తుల పేర్లను సరిగ్గా చెప్పలేకపోయాడు. అనంతరం అలీ సేవ్‌ అయినట్టుగా నాగ్‌ ప్రకటించాడు.

చివరగా నాగార్జున వితిక ఎలిమినేటెడ్‌ అని ప్రకటించగానే తను మా ఆయన సేఫ్‌ అంటూ కేరింతలు కొట్టింది. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఎంతో సేపు దాచలేకపోయింది. వరుణ్‌ కూడా భార్యను పట్టుకుని బోరున ఏడ్చాడు. మా ఆయన జాగ్రత్త అంటూ ఇంటి సభ్యులకు ఒకటికి పదిసార్లు చెప్తూ వీడ్కోలు తీసుకుంది. వరుణ్‌ తన అర్ధాంగిని కన్నీళ్లతో సాగనంపాడు. స్టేజిపైకి వచ్చిన వితికతో నాగ్‌ ఆసక్తికర టాస్క్‌ ఆడించాడు. అందులో భాగంగా ఇంటి సభ్యుల ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొడుతూ వారికి సూచనలు ఇచ్చింది. కానీ శ్రీముఖిని చూడగానే మన మొహంలో నవ్వు వస్తుంది అంటూ ఆమె ఫొటో ఉన్న బెలూన్‌ పగలగొట్టలేదు. తను ఎలిమినేట్‌ అవడానికి శివజ్యోతే కారణమని చెప్పుకొచ్చింది. ఇక చివరగా బిగ్‌బాస్‌ ఆపమని చెప్పేవరకు ఒక్కరే బాత్రూంలు కడగాలన్న బిగ్‌బాంబ్‌ను రాహుల్‌పై వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement