బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌ | Bigg Boss 3 Telugu Sixth Week Task May Create Problems In Housemates | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌

Published Tue, Aug 27 2019 5:03 PM | Last Updated on Wed, Aug 28 2019 5:41 PM

Bigg Boss 3 Telugu Sixth Week Task May Create Problems In Housemates - Sakshi

బిగ్‌బాస్‌లో ప్రతీవారం నామినేషన్స్‌,టాస్క్‌, ఎలిమినేషన్స్‌ జరగుతూనే ఉంటాయి. హౌస్‌లో ఉండే కంటెస్టంట్లు ఒక్కొక్కరుగా ఇంటిని వీడిపోతూ ఉంటారు. సోమవారం నాడు నామినేషన్‌ ప్రక్రియ అనంతరం ఆరోవారానికి గానూ.. పునర్నవి,రవికృష్ణ, మహేష్‌, హిమజ, రాహుల్‌,వరుణ్‌ సందేశ్‌ నామినేట్‌ అయ్యారు. ఇక నేడు బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ టాస్క్‌లో భాగంగా ఏయ్‌ సరిగా మాట్లాడు అంటూ రాహుల్‌పై అలీరెజా ఫైర్‌ అయ్యాడు.

ఈ టాస్క్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌ అంతా గందరగోళంగా మారినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరగబోతోన్నట్లు తెలుస్తోంది. టాస్క్‌లో భాగంగా ఈ గొడవ జరగనుందా? మరేతర కారణంగానైనా జరగనుందా? అనే విషయం తెలియాలి. గతానికి భిన్నంగా వితికా ఏడ్వడం లేదు.. వరుణ్‌ కూడా తన భార్యను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకలా బిహేవ్‌ చేస్తున్నావ్, రూడ్‌గా బిహేవ్‌ చేస్తున్నావ్‌ అంటూ వితికానుద్దేశించి వరుణ్‌ చెప్పడం.. ‘నా దగ్గరికి రావొద్దంటోన్న’ అంటూ వితికా తిరిగి అనడం.. ఇలా మాటామాట పెరిగి వరుణ్‌ అసహనానికి గురైనట్టు కనిపిస్తోంది. కోపంలో కాఫీని విసిరేయడం లాంటివి ప్రోమోలో ఆసక్తిని రేపుతున్నాయి. మరి వారిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ ప్రసారమయ్యేవరకు ఆగాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement