బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే? | Bigg Boss 3 Telugu Second Week Nominations Process | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. తమన్నా పక్కా ప్లాన్‌తో ఎంట్రీ ఇచ్చిందా?

Published Mon, Jul 29 2019 11:06 PM | Last Updated on Mon, Jul 29 2019 11:19 PM

Bigg Boss 3 Telugu Second Week Nominations Process - Sakshi

నామినేషన్స్‌ ప్రక్రియతో ఇంట్లో అంతా ఒక రకమైన వాతావరణం నెలకొంది. బాబా భాస్కర్‌ నామినేషన్స్‌ ప్రక్రియలో పాల్గొనను అని అనడం.. అనంతరం బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు తప్పనిసరై ఇద్దరి సభ్యులను నామినేట్‌ చేయడం.. ఇంట్లో సభ్యులెవరైనా నామినేషన్‌ ప్రక్రియ గురించి మాట్లాడితే నామినేట్‌ అవుతారని తెలపడం.. వరుణ్‌ సందేశ్‌-వితికాలు తమన్నా సింహాద్రి గురించి మాట్లాడుకుంటూ ఉంటే బిగ్‌బాస్‌ నామినేషన్‌ ప్రక్రియ అనుకుని వితికాను ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ నుంచి మినహాయించడం.. తనకంటూ ఓ గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకుందామని ప్రయత్నిస్తున్నట్లు తమన్నా కనపడటం.. సోమవారం ఎపిసోడ్‌లో  హైలెట్‌గా నిలిచాయి.

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో వచ్చిన తమన్నా ఇంట్లో కొందర్ని టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది. వచ్చీ రావడంతోనే తమన్నా.. న్యాయనిర్ణేతగా మారినట్టు అనిపిస్తోంది. మహేష్‌-వరుణ్‌ సందేశ్‌ వ్యవహారం గురించి హౌస్‌లో ముచ్చటించింది. మహేష్‌ అలా సారీ చెప్పడం తనకు నచ్చలేదని.. ఆ సమయంలో ఇంట్లో ఉండి ఉంటే.. మహేష్‌కు సపోర్ట్‌ ఇచ్చేదాన్ని, మహేష్‌ను అలా చీప్‌ మెంటాల్టీ అనడం తనకు నచ్చలేదని బాబా భాస్కర్‌, జాఫర్‌, మహేష్‌, అలీ రెజా, శ్రీముఖిలతో చెప్పుకొచ్చింది. ఇక నామినేషన్‌ ప్రక్రియలో కూడా తమన్నా వరుణ్‌-వితికాల పేర్లు చెప్పడం చూస్తే ముందుగానే ఓ ప్లాన్‌తో వచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరూ కలిసి ఒకే గేమ్‌ ఆడుతున్నారని, వారిద్దరిలో ఒకర్ని ఎలిమినేట్‌ చేసేందుకే ఇద్దర్నీ నామినేట్‌ చేస్తున్నానని తెలిపింది. అయితే తనకు, మహేష్‌కు గొడవ పెట్టాలని తమన్నా చూస్తోందని రాహుల్‌తో వరుణ్‌ సందేశ్‌ చెప్పుకొచ్చాడు.

ఇక హౌస్‌లో రెండో వారానికి గానూ నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఇక హిమజ- పునర్నవి, రాహుల్‌ సిప్లిగంజ్‌.. వరుణ్‌ సందేశ్‌- జాఫర్‌, శ్రీముఖి.. అషూ-శ్రీముఖి, రాహుల్‌.. రాహుల్‌-హిమజ,శ్రీముఖి.. సావిత్రి- శ్రీముఖి,జాఫర్‌.. అలీ-హిమజ,వరుణ్‌ సందేశ్‌.. రవికృష్ణ-హిమజ, జాఫర్‌.. జాఫర్‌-వితికా, మహేష్‌.. రోహిణి-పునర్నవి, మహేష్‌.. మహేష్‌- వితికా, వరుణ్‌.. శ్రీముఖి-హిమజ, మహేష్‌.. పునర్నవి-హిమజ, శ్రీముఖి.. తమన్నా-వరుణ్‌ సందేశ్‌, వితికాలను నామినేట్‌ చేశారు.

ఇక వీరిలో శ్రీముఖి,హిమజ ఐదు ఓట్లతో.. జాఫర్‌, మహేష్‌ విట్టా, వితికా, వరుణ్‌సందేశ్‌ మూడు ఓట్లతో..  పునర్నవి, రాహుల్‌ రెండు ఓట్లతో నామినేట్‌ అయ్యారు. రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఇప్పటివరకు ఎనిమిది మంది నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ తెలిపాడు. ఈ నామినేషన్‌ ప్రక్రియలో బాబా భాస్కర్‌ ఎవర్నీ నామినేట్‌ చేయలేనని.. కావాలంటే తనను నామినేట్‌ చేసుకోండని బిగ్‌బాస్‌కు తెలిపాడు. అయితే నియమాల ప్రకారం ప్రతీ ఇంటి సభ్యుడు ఓ ఇద్దరి పేర్లను నామినేట్‌ చేయాల్సిందేనని బిగ్‌బాస్‌ సూచించాడు. అయినా సరే బాబా భాస్కర్‌ వినకపోవడంతో ఆలోచించుకోవడానికి కొంత సమయాన్ని ఇచ్చారు. మళ్లీ చివర్లో కన్ఫెషన్‌ రూమ్‌కు రావాలని కోరాడు. ఇక అందరూ నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొని తమకు నచ్చని ఇద్దరు కంటెస్టెంట్ల పేర్లను బిగ్‌బాస్‌కు తెలిపారు.

అయితే రెండో సారి కూడా బాబా భాస్కర్‌ ఎవర్నీ కూడా నామినేట్‌ చేయలేదు. ఈసారి బిగ్‌బాస్‌ రెండు అవకాశాలు ఇచ్చారు. ఇద్దరు పేర్లు చెప్పి నామినేషన్‌ ప్రక్రియను ముగించడం.. లేదా.. ఇంటిసభ్యులందరితో చర్చించడం ఇంకొకటి. బాబా భాస్కర్‌ నామినేషన్స్‌లో ఎవరి పేరు చెప్పనందుకు.. ఇంటి సభ్యులందరూ నామినేషన్స్‌లో ఉండటం ఒక దారి లేదంటే అందరూ కలిసి బాబా భాస్కర్‌ను నామినేట్‌ చేయడం ఇంకోదారి అని బిగ్‌బాస్‌ సెలవిచ్చాడు. అయితే బాబా భాస్కర్‌ను తామెవ్వరమూ నామినేట్‌ చేయలేమని ముక్తకంఠంతో తెలిపారు.

కావాలంటే.. అందరం నామినేషన్స్‌లో ఉంటామని ఏకతాటిపైకి వచ్చారు. అలా వద్దని.. కావాలంటే తానే ఓ ఇద్దరిని నామినేట్‌ చేస్తానని బాబా భాస్కర్‌ ముందుకు వచ్చాడు. అనంతరం కన్ఫెషన్‌ రూమ్‌కు వెళ్లిన బాబా భాస్కర్‌.. వితికా, రాహుల్‌ను నామినేట్‌ చేశాడు. ఇక అంతటితో నామినేషన్‌ ప్రక్రియ ముగిసిందని ప్రకటించి.. శ్రీముఖి, హిమజ, జాఫర్‌, మహేష్ విట్టా‌, వరుణ్ సందేశ్‌‌, వితికా షెరు, పునర్నవి భూపాలం, రాహుల్‌ సిప్లిగంజ్‌లు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారని తెలిపాడు. ఈ వారం ఇంటి సభ్యులు ఎవరు ఎలా ఆడతారు? వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఈ ఎనిమిది మంది సభ్యుల్లోంచి ఎవరు నిష్క్రమిస్తారో తెలియాలంటే బిగ్‌బాస్‌ చూస్తూ ఉండాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement