naina
-
Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ!
నైలా గ్రేవాల్.. హిందీ నటి. ఇప్పుడు ఓటీటీ స్టార్ కూడా! బయటెంత ఫాలోయింగ్ ఉందో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. ఇంకొన్ని వివరాల్లోకి వెళితే.. నైలా పుట్టి,పెరిగింది ఢిల్లీలో. మాస్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. డాన్స్ నేర్చుకుంది. థియేటర్ స్కిల్స్ కూడా ఒంటబట్టించుకుంది. ముందు మోడలింగ్ వైపే అడుగులేసింది. కానీ ఆసక్తి అంతా యాక్టింగ్ మీదే ఉండింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా డాన్స్ బాలేలు చేస్తూ.. థియేటర్లో నటిస్తూ నటనా ప్రతిభను మెరుగుపరచుకునేది. అలాంటి ఒకానొక సందర్భంలోనే బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ నుంచి ఒక కబురు‡ వచ్చింది.. తను తీయబోయే ‘తమాషా’ సినిమాలో నైలాకు వేషం ఇస్తున్నట్టు. అది విన్న ఆమె సంతోషానికి అవధుల్లేవు. సెట్స్ మీదకు వెళ్లినప్పుడైతే కలా.. నిజమా అనుకుందట. మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘భాంగ్డా పా లే’, ‘థప్పడ్’లలో నటించింది. ‘ఇష్క్ విష్క్ రిబౌండ్’లో నటిస్తోంది. తాజాగా ‘మామ్లా లీగల్ హై’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నైలా లండన్‌లో లా చదివి.. ఢిల్లీలో వకీల్గిరీ ప్రారంభించిన లాయర్‌గా నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆమె నటనకే కాదు ఆమె అందానికి.. ఫ్యాషన్ స్టయిల్‌కి.. డాన్స్కీ అభిమానగణం ఉంది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆమెను స్ఫూర్తిగా తీసుకునే అభిమానులూ ఉన్నారు. సినిమానైనా.. సీరియల్‌నైనా.. ఆ మాటకొస్తే కదిలే బొమ్మను ఫస్ట్ నేను చూసింది టెలివిజన్‌లోనే. అందుకే యాక్టింగ్‌కి టెలివిజనే నాకు ప్రేరణ, స్ఫూర్తి. సిల్వర్‌స్క్రీన్, స్మాల్‌స్క్రీన్, వెబ్‌స్క్రీన్.. ఏ స్క్రీన్ అయినా యాక్టర్స్‌కి ఒకటే. రీచింగ్‌లో తేడా తప్ప దేనికైనా టాలెంటే కొలమానం! - నైలా గ్రేవాల్. ఇవి చదవండి: లియాండర్ పేస్... ప్రముఖ డ్యాన్సర్! -
పల్లెటూరి జంక్షన్.. విలేజ్ డ్రామా
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన విలేజ్ డ్రామా ‘సూర్యాపేట జంక్షన్’. నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో అనిల్ కుమార్ కత్ర గోడ, ఎన్. శ్రీనివాసరావు నిర్మించారు. ఈ చిత్రంలోని ‘చెంగు చెంగుమంటూ జింక పిల్లలాగా..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను నిర్మాత సి. కల్యాణ్ రిలీజ్ చేశారు. రోషన్ సాలూరి స్వరకల్పనలో ఎస్. సాయిచరణ్, సోరస్ పాడిన ఈ పాటకు రెహమాన్ లిరిక్స్ అందించారు. ‘‘వ్యవస్థను సరిదిద్దే బాధ్యత యువతపై ఉంటుంది. కొత్త తరం ఓటర్లు చూడాల్సిన చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు హరి గౌర మరో స్వరకర్త. -
లైఫ్.. డెత్.. ఫేట్.. ఇదే సర్కిల్
సాయి రోనక్ హీరోగా, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్.వి. శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ‘సర్కిల్’ టీజర్‌ను విడుదల చేశారు. సాయి రోనక్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను ఫొటోగ్రాఫర్ పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘సర్కిల్ ఆఫ్ లైఫ్, సర్కిల్ ఆఫ్ డెత్, సర్కిల్ ఆఫ్ ఫేట్ .. అనే ఈ మూడు అంశాల కలయికయే ఈ చిత్రం. తన జీవితంలో జరిగిన కొన్ని çఘటనల కారణంగా తనకు ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో తెలసుకోలేని సందిగ్థంలో పడే హీరో ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాడన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు నీలకంఠ. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చతుంది. మా తర్వాతి సినిమాను కూడా నీలకంఠగారితోనే చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత శరత్ చంద్ర. -
మన దేశంలో ట్విటర్ తొలి యూజర్ ఎవరో తెలుసా?
దాదాపు 16 ఏళ్ల కిందట.. ట్విటర్ పుట్టుక దశలో ఉన్నప్పుడే మన దేశం నుంచి ఒకావిడ ఆ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను వాడింది. ఆవిడ పేరే నైనా రెద్దు. దేశంలోనే తొలి ట్విటర్ యూజర్ అనే విషయం మీకు తెలుసా?. అంతేకాదు ఆమె ప్రొఫైల్‌కు బ్లూటిక్ కూడా ఉంది. తాజాగా ఎలన్ మస్క్ చేతికి ట్విటర్ వెళ్లడం.. గుణాత్మకం పేరిట అందులో చోటు చేసుకుంటున్న మార్పులపై నైనా స్పందించారు. ఆర్కుట్, బ్లాగింగ్ జమానా టైంలో ట్విటర్ ఇంకా అధికారికంగా అడుగుపెట్టని సమయమది. ఆ ఏడాది(2006)లో TWTTR(ట్విటర్ ప్రాజెక్టు కోడ్ పేరు) పేరిట ఒక మెయిల్ నైనాకు వచ్చింది. ఏదో ఇన్విటేషన్ అనుకుని అందులో చేరారామె. అలా చేరిన ఆమె.. భారత్ తరపున తొలి ట్విటర్ యూజర్ ఖ్యాతిని దక్కించుకున్నారు. నైనా రెద్దు ప్రస్తుతం.. జైసల్మేర్(రాజస్థాన్)లోని ఓ హోటల్లో పని చేస్తున్నారు. అది కాక ఇంకా ఆమెకు కొన్ని హాబీలు పేరు తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆమె ఖాతాలో 22 వేల పైగా ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అందులో సెలబ్రిటీలే ఎక్కువ కావడం గమనార్హం. అయినా ఫాలోవర్స్ సంఖ్య ప్రామాణికం కాదంటున్నారు ఆమె. ఇప్పటిదాకా ఆమె లక్షా 75వేలకు పైగా ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో మొదటి నుంచి ట్విటర్లో ఇప్పటిదాకా వచ్చిన మార్పులు, ఎలన్ మస్క్ పగ్గాల గురించీ ఆమె స్పందించారు. TWTTR పేరుతో అందింన ఆహ్వానం నాకింకా గుర్తుంది. అది ట్విటర్ మహావృక్షంగా ఎదుగుతుందని ఆనాడు నేను ఊహించనే లేదు. ఆ టైంలో భారత్ నుంచి యూజర్లు ఎవరూ లేరు. ట్విటర్ ఉద్యోగులు, వాళ్ల స్నేహితులు మాత్రమే ఛాటింగ్‌లో పాల్గొనేవాళ్లు. ముంబైలో ఉద్యోగం కోసం వచ్చాక.. నేనూ అందులో మెసేజ్‌లు చేయాలని అనుకున్నా. కేవలం అదొక మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అనుకుని ఆగిపోయా. అలా ఏడాదిన్నర గడిపోయాక.. ఆ ప్లాట్‌ఫామ్ గురించి విషయం అర్థమైంది. ట్వీట్లు చేయడం ప్రారంభించా. అమెరికాలో ఓ ఆర్టికల్‌లో తొలి 140 మంది ట్విటర్ యూజర్ల మీద ఓ కథనం ప్రచురితమైంది. అందులో నా పేరు చూసుకున్నాకే అర్థమైంది.. ఇదేదో ప్రత్యేకమైన ఫ్లాట్‌ఫామ్ అని. ఆ తర్వాత తక్కువ యూజర్లే ఉన్నప్పటికీ.. తొలి యూజర్‌కావడంతో ట్విటర్ నుంచి ఆమెకు బ్లూటిక్ మార్క్ దక్కింది. ఇక తాజాగా ఎలన్ మస్క్ బ్లూటిక్కు డబ్బులు వసూలు చేసే అంశంపైనా నైనా స్పందించారు. నెలకు రూ.650(8 డాలర్లు) దాకా చెల్లించాలని అంటున్నారు. అసలు ఎందుకు చెల్లించాలన్న దానిపై స్పష్టత లేదు కదా. ఇప్పుడున్న బ్లూటిక్ అకౌంట్ల విషయంలోనా? కొత్తగా రాబోతున్న అకౌంట్ల విషయంలోనా? లేదంటే ఇంకా ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ప్రతీ ఒక్కరికీ అంటే మాత్రం అది సహేతుకం కాదు. ట్విటర్ ఒక ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ ఫిగర్లకు వెరిఫై పేరిట బ్లూటిక్‌లను కేటాయించడం మొదలుపెట్టింది. గత 16 ఏళ్లుగా నేను చెల్లింపులు చేయలేదు. అలాంటిది ఇప్పుడెందుకు చేయాలి? అని మస్క్ నిర్ణయంపై నిలదీశారామె. ఇక భారత్‌లో బ్లూటిక్ చెల్లింపుల పరిణామం అంతగా ఉండకపోచ్చని ఆమె వ్యాఖ్యానించారు. బ్లూటిక్ అనేది సాధారణంగా అవసరం లేని వ్యవహారం. కచ్చితంగా కావాలని అనుకునేవాళ్లు డబ్బు చెల్లిస్తారు. అవసరం లేదనుకునే వాళ్లు మానుకుంటారు. అయితే ఇండిపెండెంట్ జర్నలిజం లాంటి పనులు చేసుకునేవాళ్లకు మాత్రం ఇది ప్రభావం చూపించొచ్చు అని నైనా తెలిపారు. ఇక ట్విటర్ స్వేచ్ఛా ప్రకటనపై ఆమె భిన్నంగా స్పందించారు. ట్విటర్‌కు స్వేచ్ఛకు సంబంధం ఉందని తాను అనుకోవడం లేదని అన్నారామె. మిగతా యాజర్లలాగా తాను ఇతర సోషల్ మీడియా అకౌంట్లను వాడుతున్నానని, ట్విటర్లో రాబోయే మార్పులు తనపై ప్రభావం చూపించకపోవచ్చని ఆమె అంటున్నారు. Whatever is said and done, there's definitely more excitement on Twitter now, than I've seen in ages, that has nothing to do with government politics. — Naina (@Naina) November 8, 2022 -
Fashion: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఆవకాయ బిర్యానీ గుర్తుంది కదా.. వంటకం కాదండీ.. రెస్టారెంట్ పేరు అంతకన్నా కాదు. అచ్చతెలుగు హీరోయిన్.. మదనపల్లె మగువ.. బిందు మాధవి. గ్లామర్‌తో వెండి తెర మీదే కాదు తనదైన సిగ్నేచర్ స్టయిల్‌తో ఫ్యాషన్ వరల్డ్‌లోనూ మెరిసిపోతోంది ఇలా.. నైనా జైన్ తరాల నాటి విభిన్న చేనేత కళలను ఒక్కచోట చేర్చి.. వాటికి ఆధునిక రూపమిచ్చే బ్రాండే నైనా జైన్. క్లాసిక్ లుక్స్‌నే కాదు.. ధరించడంలోని సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ అవుతుంది ఈ బ్రాండ్ వేర్. పెళ్లికూతురి దుస్తులకు ప్రసిద్ధి ఈ లేబుల్. గుజరాత్‌లోని కచ్ ప్రాంతపు బందినీ వర్క్ నైనా జైన్ యూఎస్పీ. ధరలు కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి. బ్రాండ్ వాల్యూ ►డ్రెస్ : రెండ్ – యెల్లో లెహెంగా ►బ్రాండ్: నైనా జైన్ ►ధర: రూ. 45,500 ఇషారా నగల డిజైన్ల పట్ల ఆసక్తి, అభిరుచి ఉన్న కొంతమంది ఉత్సాహవంతులు కలసి 2014లో ఏర్పాటు చేసిన బ్రాండే ‘ఇషారా’. తరాల నాటి సంప్రదాయక నగలు, కుందన్, టెంపుల్ జ్యూయెలరీ ఇలా ఏ వెరైటీ డిజైన్లయినా.. ఆయా వేడుకలు.. సందర్భాలకనుగుణంగా.. కొనుగోలుదారులకు నప్పే.. నచ్చే విధంగా తయారు చేసివ్వడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ధరలూ అందుబాటులోనే. నగలు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ‘నన్ను చాలామంది సిల్క్ స్మితతో పోలుస్తుంటారు. నా కళ్లు ఆమె కళ్లలాగే ఉంటాయని.. నేనూ ఆమెలాగా కళ్లతోనే హావభావాలు పలికిస్తానని మెచ్చుకుంటుంటారు. అంతకన్నా గొప్ప ప్రశంసేం ఉంటుంది! ఆవిడ వండర్ ఫుల్ ఆర్టిస్ట్.. నా అభిమాన తార!’ – బిందు మాధవి బ్రాండ్ వాల్యూ ►జ్యూయెలరీ: పోల్కీ చోకర్, చాంద్‌బాలీలు ►బ్రాండ్: ఇషారా ►ధర: రూ. 3,000 --దీపిక కొండి -
కొత్త ఏడాది బ్యూటిఫుల్
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అన్నది ఉపశీర్షిక. సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కింది. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ప్రేమ కథాంశంతో వైవిధ్యభరితంగా రూపొందిన చిత్రమిది. సూరి, నైనాల అభినయం మనసులను హత్తుకుంటుంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి శంకర్, సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, రచన, కెమెరా, దర్శకత్వం: అగస్త్య మంజు. -
త్వరలో బ్యూటిఫుల్
నైనా, సూరి జంటగా నటించిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ట్రిబ్యూట్ టూ రంగీలా అనేది చిత్రానికి ఉపశీర్షిక. అగస్త్య మంజు ఈ చిత్రానికి రచన, ఫొటోగ్రఫీతో పాటు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ రూపొందించగా టి.అంజయ్య సమర్పించారు. టి.నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలు. రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ వారు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమిది. హీరో హీరోయిన్లు బాగా నటించారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి పాటలు: సిరాశ్రీ. -
అందమైన ప్రేమకథ
సూరి, నైనా జంటగా నటించిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది ట్యాగ్‌లైన్. రాంగోపాల్ వర్మకు చెందిన టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి.అంజయ్య సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ‘లక్ష్మీస్ యన్టీఆర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకుడు. దర్శకత్వంతో పాటు రచన, ఫొటోగ్రఫీ బాధ్యతలు కూడా చేపట్టారు. టి. నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు. ‘‘ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కి విశేష స్పందన లభించింది. రొమాంటిక్ ప్రేమ కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పాటలు మనసుని హత్తుకునేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్. ∙సూరి, నైనా -
అందమైన పాట
సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘బ్యూటీఫుల్’. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘రొమాంటిక్ కథాంశంతో వైవిధ్యభరితంగా ఉంటుందీ చిత్రం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. త్వరలో ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సిరాశ్రీ పాటలు రాశారు. రవిశంకర్ సంగీతం అందించారు. ∙నైనా, సూరి -
బ్యూటిఫుల్
రామ్‌గోపాల్ వర్మ నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘బ్యూటిఫుల్’. ఆయన గతంలో తీసిన ఐకానిక్ మూవీ ‘రంగీలా’ కు ఇది ట్రిబ్యూట్. నైనా, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇదివరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని వర్మతో కలసి దర్శకత్వం వహించారు అగస్త్య మంజు. ప్రస్తుతం ‘బ్యూటిఫుల్’ చిత్రం రామ్‌గోపాల్ వర్మ టైగర్ ప్రొడక్షన్‌పై నిర్మాణం జరుపుకుంది. టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్‌కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు. ‘‘మా ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.. అందరూ వెరీ బ్యూటిఫుల్ అంటున్నారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం:రవి శంకర్, సాహిత్యం: సిరా శ్రీ. -
టైటిల్ పోరుకు లాస్య, నైనా
సాక్షి, హైదరాబాద్: ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యలో జరుగుతోన్న స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో లాస్య (ఏడబ్ల్యూఏ), నైనా (ఎల్బీ స్టేడియం) ఫైనల్‌కు చేరుకున్నారు. ఖైరతాబాద్‌లో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో లాస్య 7–11, 7–11, 11–6, 11–9, 7–11, 11–4, 11–6తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్)పై గెలుపొందగా, నైనా 9–11, 11–1, 6–11, 11–7, 11–9, 11–5తో ఎం. మౌనిక (జీఎస్ఎం)ను ఓడించింది. పురుషుల విభాగంలో మొహమ్మద్ అలీ (ఎల్బీ స్టేడియం), అమన్ రహమాన్ (ఏవీఎస్‌సీ) తుదిపోరుకు చేరుకున్నారు. సెమీస్ మ్యాచ్‌ల్లో మొహమ్మద్ అలీ 11–8, 11–4, 12–10, 8–11, 11–8తో అలీ మొహమ్మద్‌పై, అమన్ 11–8, 13–11, 11–8, 11–13, 11–13, 12–10తో వి. చంద్రచూడ్ (ఎంఎల్ఆర్)పై గెలుపొందారు. ఇతర కేటగిరీ సెమీఫైనల్ మ్యాచ్‌ల ఫలితాలు క్యాడెట్ బాలికలు: నిఖిత (వీపీజీ) 11–6, 11–5, 11–5, 11–3తో ధ్రితి (జీఎస్ఎం)పై, కావ్య (ఏడబ్ల్యూఏ) 6–11, 12–10, 11–7, 11–5, 11–7తో ప్రగ్యాన్ష (వీపీజీ)పై నెగ్గారు. బాలురు: జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్) 11–6, 11–7, 11–6, 11–4తో కార్తీక్ (నల్లగొండ)పై, శౌర్యరాజ్ సక్సేనా (ఎంఎల్ఆర్) 11–2, 11–7, 5–11, 11–4, 8–11, 11–4, 11–3తో పార్థ్ భాటియా (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. సబ్‌జూనియర్ బాలికలు: ఎన్. భవిత (జీఎస్ఎం) 11–7, 11–7, 11–9, 11–8తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, విధి జైన్ (జీఎస్ఎం) 11–5, 11–7, 11–9, 11–9తో ప్రియాన్షి (జీఎస్ఎం)పై విజయం సాధించారు. బాలురు: కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్)11–7, 9–11, 12–10, 11–8, 11–6తో అథర్వ (ఏడబ్ల్యూఏ)పై, ఎస్ఎస్కే కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 11–8, 11–6, 11–8, 11–6తో ప్రణవ్ నల్లారి (ఏడబ్ల్యూఏ)పై ఆధిక్యం సాధించారు. జూనియర్ బాలికలు: ఐశ్వర్య డాగా (ఏడబ్ల్యూఏ) 11–9, 9–11, 2–11, 11–6, 11–4, 11–7తో అంజలి (జీఎస్ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 9–11, 11–7, 11–9, 11–5, 11–7తో భవిత (జీఎస్ఎం)పై గెలుపొందారు. బాలురు: అద్వైత్ (ఏడబ్ల్యూఏ) 11–5, 11–7, 11–2, 11–7తో సాయినాథ్ రెడ్డి (ఎంఎల్ఆర్)పై, బి. వరుణ్ శంకర్ (జీటీటీఏ) 11–6, 4–11, 7–11, 11–8, 11–7, 11–7తో అమన్ రహమాన్ (ఏవీఎస్‌సీ)పై నెగ్గారు. యూత్ బాలికలు: జి. ప్రణీత (హెచ్‌వీఎస్) 12–10, 11–5, 7–11, 11–7, 11–9తో నైనా (ఎల్బీఎస్)పై, రచన (జీఎస్ఎం) 11–5, 8–11, 12–10, 5–11, 11–3, 1–11, 14–12తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. -
సత్యదేవుని సేవలో నైనా జైస్వాల్
అన్నవరం : ప్రముఖ టేబుల్ టెన్నిస్ చాంపియన్ నైనా జైస్వాల్ ఆదివారం కుటుంబసభ్యులతో రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజ లు చేశారు. ఆల యం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులందించారు. దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. 13వ ఏటే డిగ్రీ పాసయ్యా ఈ సందర్భంగా నైనాజైస్వాల్ మాట్లాడుతూ తాను ఎనిమిదో ఏట పదో తరగతి, పదో ఏట ఇంటర్మీడియట్, 13 ఏట జర్నలిజంలో డిగ్రీ పాసయ్యానని తెలిపారు. తాను టేబుల్ టెన్నిస్‌లో ఇండియాలోనే నంబర్ వన్ ర్యాంకర్‌నని, నేషనల్, సౌత్ ఏషియా చాంపియన్‌నని తెలిపారు. తాను రెండు చేతులతో రాస్తానని, రెండు సెకన్లలోనే ఇంగ్లిష్ అక్షరాలు ఏ టూ జెడ్ టైపు చేస్తానని తెలిపారు. ఇదంతా తాను ఇష్టపూర్వకంగా సాధన చేసి సాధించాను తప్ప కష్టపడి కాదన్నారు. విద్యార్థులు కూడా ఇష్టపడి చదివితేనే మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఉజ్వల భవిష్యత్ పొందుతారన్నారు. తన సోదరుడు అగస్త్య జైస్వాల్ కూడా తనలానే ఇష్టపడి చదువుతాడని, అందువల్లే తొమ్మిదే ఏటే పదో తరగతి పాస్ అయ్యాడని, తను కూడా రెండు చేతులతో రాయగలడని తెలిపారు. తమ తల్లిదండ్రులు భాగ్యలక్షి, అశ్విని కుమార్ జైస్వాల్ ప్రేమాభిమానాలతో , ప్రోత్సాహంతో తాము ఈ విజయాలు సాధించగలిగామని తెలిపారు. -
ఈ ఫేస్బుక్ ప్రేమకథలో ఎన్ని ట్విస్టులో..
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన నైనా అనే యువతి.. బంగ్లాదేశ్‌కు చెందిన జన్నత్ అనే మహిళ మొదట స్నేహితురాళ్లు. ఫేస్బుక్ ద్వారా మొదలైన వీరి పరిచయడం ఫోన్ నంబర్లు మార్చుకుని ప్రేమ కబుర్లుచెప్పుకునేవరకూ వెళ్లింది. అలా మనసులు కలిశాక దూరంగా ఉండలేని పరిస్థితి. దీంతో 2013లో జన్నత్ సూట్‌కేస్ సర్దుకుని ఇండియా(ఇండోర్) వచ్చేసింది. నైనా చదువుతున్న కాలేజీలోనే చేరింది. జన్నత్ కూడా ఇంట్లో ఉండేలా నైనా తన తల్లిదండ్రులను ఒప్పించింది. కొన్నాళ్లు గడిచాక నైనాకు పెళ్లి సంబంధం కుదిరింది. 'పెళ్లైన తర్వాత కూడా జన్నత్ నాతోనే ఉండాలి'అనే షరతుమీద నైనా పెళ్లికి ఒప్పుకుంది. వీళ్ల విచిత్ర స్నేహ బంధాన్ని చూసి కంగారుపడ్డా.. 'ఆ మూడుముళ్లు' పడితే కూతురి మనసు మారిపోతుందని భావించారు నైనా తల్లిదండ్రులు. అందుకే జన్నత్ విషయం తెలియనీయకుండా మహేశ్ అనే కుర్రాడితో నైనా పెళ్లి జరిపించారు. హనీమూన్ కోసమని గోవా బయలుదేరగా జన్నత్‌ను కూడా వెంటతీసుకెళ్తాదమని అడగడంతో భర్త మహేశ్ సరేనన్నాడు. తీరా గోవా వెళ్లాక మహేశ్‌ను హోటర్ గదిలో ఉంచి, బయటి నుంచి తాళంవేసి నైనా, జన్నత్లు షికార్లకు వెళ్లేవారు. 'ఏమిటిది?'అని నిలదీసిన భర్తపై నైనా వేధింపుల కేసు పెట్టింది. ఈ మేరకు ఇండోన్ మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. దర్యాప్తు చేసిన పోలీసులకు నైనా, జన్నత్ లు భార్యాభర్తలుగా భావించుకుంటున్నారన్న సంగతి తెలిసింది. జన్నత్ మొబైల్లో నైనా నంబర్ 'వైఫ్'గా ఫీడ్ చేసుకోగా, నైనా.. జన్నత్ నంబర్ ను 'హబ్బీ'అని ఫీడ్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మూడేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రేమ కేసును పోలీసులు ఇటీవలే పరిష్కరించారు. జన్నత్, నైనాలు కలిసి జీవించేందుకు వారి తల్లిదండ్రులు అంగీకరించారని, అదే సమయంలో మహేశ్ పై పెట్టిన వేధింపుల కేసును ఉపసంహరించుకునేందుకు అంగీకరించారని మహిళా పోలీస్ స్టేషన్ అధికారి జ్యోతి వర్మ మీడియాకు తెలిపారు. -
కృష్ణ నుంచి నైనాగా...
ఢిల్లీ వాసంత్ వ్యాలీ స్కూలు విద్యార్థిని.. ట్రాన్స్ జెండర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. నైనా క్వీన్ బీ పేరిట ఆమె నిర్వహిస్తున్న ఛానల్ ను ఇంటర్నెట్ వినియోగదారులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఏడువేలమందికి పైగా ఆ ఛానల్ ను వీక్షిస్తున్నారు. లింగమార్పిడి తో అతడు (కృష్ణ) నుంచీ ఆమె (నైనా) గా మారిన తను... తన కుటుంబాన్నే కాక, మొత్తం కమ్యూనిటీకి అండగా నిలిచేందుకు వినూత్న పద్ధతిలో వాయిస్ వినిపిస్తోంది. చిన్నతనంలోనే కృష్ణగా ఉండే వికృత రూపం నుంచి... నైనాగా మారిన తన జీవితంలోని ప్రస్తుత అంకం వరకూ ప్రతి సన్నివేశాన్ని ఆమె స్పష్టంగా ఆత్మ విశ్వాసంతో వివరించింది. ఒకప్పుడు అనుభవించిన మానసిక క్షోభను, ఆత్మహత్య చేసుకోవాలన్న తీవ్ర ఆవేదన నుంచి బయటపడి తన గళంతో బాధితులను ఆదుకునేందుకు కృషి చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఉన్నది ఉన్నట్లు వివరించేందుకు వెనుకాడటం లేదు. చివరికి జననేంద్రియాల గురించి మాట్లాడేందుకు కూడా సంకోచించడం లేదు. సరదాగా సంతోషంగా విషయాలను ఆత్మ విశ్వాసంతో వెల్లడించడం ఆమె మొక్కవోని విశ్వాసానికి అద్దం పడుతోంది. ప్రపంచంలో తనవంటి బాధితులెవరైనా, ఎటువంటి సమస్యలనైనా ధైర్యంగా వినిపించేందుకు నైనా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఓ సంప్రదాయ సౌదీ అరేబియన్ సైతం నైనాను ఆహ్వానించాడని, ఆమెకు చుట్టూ ఎంతోమంది అభిమానులు, ప్రోత్సాహకులు ఉన్నారని ఆమె తల్లి మిషీ సింగ్ చెప్తోంది. నైనాను ప్రతివారూ ఇష్టపడతారని, స్కూల్లో టీచర్లు సైతం నైనాకు అండగా నిలబడటం గర్వంగా అనిపిస్తుందని తెలిపింది. అయితే నైనా టాయిలెట్ విషయంలో మాత్రం కాస్త సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోందంటుంది. అమ్మాయిలు వెళ్ళే టాయిలెట్ కు తాను వెళ్ళనని, తాను బాలికనే అయినా ఎందుకు ఆ టాయిలెట్ వాడలేకపోతున్నానో అర్థం కాదని చెప్తుంది. అంతేకాదు.. టాయిలెట్ గురించి ఎవరైనా అడిగితే కొంత బాధకు గురైనట్లు కూడ ఆమెకు సంబంధించిన యూట్యూబ్ వీడియోల్లో కనిపిస్తుంది. అయితే తనవంటివారి సమస్యలపై స్వయంగా పోరాడేందుకు నైనా ఆత్మ విశ్వాసంతో ఉందని ఆమె తల్లి మిషి చెప్తోంది. తన అనుభవసారాన్ని ఉపన్యాసాలుగా వినిపించడంతోపాటు, ఠాగూర్ ఇంటర్నేషనల్ లోనూ ఆమె సమస్యలపై వ్యాఖ్యానిస్తోంది. త్వరలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్ళేందుకు ఆమె సిద్ధమౌతోంది. -
ఏక పాత్రతో ‘నయన’
‘‘ఏక పాత్రతో మధు చేసిన ఈ వినూత్న ప్రయోగం ఫలించాలని కోరుకుంటున్నాను. మధుకి పరిశ్రమ పట్ల మంచి అవగాహన ఉంది. ఆ అవగాహనతో మంచి సినిమా తీసి ఉంటారని నమ్ముతున్నాను’’ అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. నటాషా టైటిల్ రోల్లో చండ్ర మూవీస్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో చండ్ర మధు నిర్మించిన చిత్రం ‘నయన’. కార్తీక్ రోడ్రిజ్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో సీడీని ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి ఆవిష్కరించి, కొమర వెంకటేష్‌కి ఇచ్చారు. ‘‘కథ మీద పట్టు లేకపోతే ఇలాంటి సినిమా చేయలేరు. పాటలు బాగున్నాయి’’ అని ట్రైలర్స్‌ను ఆవిష్కరించిన అనంతరం అచ్చిరెడ్డి చెప్పారు. మ్యూజిక్‌కి స్కోప్ ఉన్న చిత్రం ఇదని కార్తీక్ అన్నారు. చండ్ర మధు మాట్లాడుతూ -‘‘తొలి ప్రయత్నంగా ఓ అవార్డ్ మూవీ చేయాలనుకున్నాను. అందుకే ఈ సినిమా చేశాను. రిథమ్ స్టూడియోవారు అందించిన సహకారం మరువలేనిది. కార్తీక్ మంచి పాటలతో పాటు చక్కని నేపథ్య సంగీతం కూడా ఇచ్చారు. ఈ నెల 6న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.