Fashion: ఈ హీరోయిన్‌ ధరించిన డ్రెస్‌ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే! | Fashion: Bindu Madhavi In Naina Jain Dress Cost Leaves You In Shock | Sakshi
Sakshi News home page

Bindu Madhavi: ఈ హీరోయిన్‌ ధరించిన డ్రెస్‌ ధర 45వేల పైమాటే! ప్రత్యేకత ఏమిటంటే!

Published Mon, Jul 18 2022 3:25 PM | Last Updated on Mon, Jul 18 2022 4:57 PM

Fashion: Bindu Madhavi In Naina Jain Dress Cost Leaves You In Shock - Sakshi

ఆవకాయ బిర్యానీ గుర్తుంది కదా.. వంటకం కాదండీ.. రెస్టారెంట్‌ పేరు అంతకన్నా కాదు. అచ్చతెలుగు హీరోయిన్‌.. మదనపల్లె మగువ.. బిందు మాధవి. గ్లామర్‌తో వెండి తెర మీదే కాదు తనదైన సిగ్నేచర్‌ స్టయిల్‌తో ఫ్యాషన్‌ వరల్డ్‌లోనూ మెరిసిపోతోంది ఇలా.. 

నైనా జైన్‌
తరాల నాటి విభిన్న చేనేత కళలను ఒక్కచోట చేర్చి.. వాటికి ఆధునిక రూపమిచ్చే బ్రాండే నైనా జైన్‌. క్లాసిక్‌ లుక్స్‌నే కాదు.. ధరించడంలోని సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్‌ అవుతుంది ఈ బ్రాండ్‌ వేర్‌. పెళ్లికూతురి దుస్తులకు ప్రసిద్ధి ఈ లేబుల్‌. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతపు బందినీ వర్క్‌ నైనా జైన్‌ యూఎస్‌పీ. ధరలు కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి. 

బ్రాండ్‌ వాల్యూ 
►డ్రెస్‌ : రెండ్‌ – యెల్లో లెహెంగా
►బ్రాండ్‌: నైనా జైన్‌
►ధర: రూ. 45,500

ఇషారా
నగల డిజైన్ల పట్ల ఆసక్తి, అభిరుచి ఉన్న కొంతమంది ఉత్సాహవంతులు కలసి 2014లో ఏర్పాటు చేసిన బ్రాండే ‘ఇషారా’. తరాల నాటి సంప్రదాయక నగలు, కుందన్, టెంపుల్‌ జ్యూయెలరీ ఇలా ఏ వెరైటీ డిజైన్లయినా.. ఆయా వేడుకలు.. సందర్భాలకనుగుణంగా..  కొనుగోలుదారులకు నప్పే.. నచ్చే విధంగా తయారు చేసివ్వడం ఈ బ్రాండ్‌ ప్రత్యేకత. ధరలూ అందుబాటులోనే. నగలు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. 

‘నన్ను చాలామంది సిల్క్‌ స్మితతో పోలుస్తుంటారు. నా కళ్లు ఆమె కళ్లలాగే ఉంటాయని.. నేనూ ఆమెలాగా కళ్లతోనే హావభావాలు పలికిస్తానని మెచ్చుకుంటుంటారు. అంతకన్నా గొప్ప ప్రశంసేం ఉంటుంది! ఆవిడ వండర్‌ ఫుల్‌ ఆర్టిస్ట్‌.. నా అభిమాన తార!’ – బిందు మాధవి

బ్రాండ్‌ వాల్యూ 
►జ్యూయెలరీ: పోల్కీ చోకర్, చాంద్‌బాలీలు
►బ్రాండ్‌: ఇషారా
►ధర: రూ. 3,000
--దీపిక కొండి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement