Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ! | Naila Grewal Says That My Acting Is Inspired By Television | Sakshi
Sakshi News home page

Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ!

Published Sun, Mar 24 2024 7:51 AM | Last Updated on Sun, Mar 24 2024 9:18 AM

Naila Grewal Says That My Acting Is Inspired By Television - Sakshi

నైలా గ్రేవాల్‌.. హిందీ నటి. ఇప్పుడు ఓటీటీ స్టార్‌ కూడా! బయటెంత ఫాలోయింగ్‌ ఉందో.. అంతకంటే ఎక్కువ సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ ఉన్నారు ఆమెకు. ఇంకొన్ని వివరాల్లోకి వెళితే..

  • నైలా పుట్టి,పెరిగింది ఢిల్లీలో. మాస్‌ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. డాన్స్‌ నేర్చుకుంది. థియేటర్‌ స్కిల్స్‌ కూడా ఒంటబట్టించుకుంది.
  • ముందు మోడలింగ్‌ వైపే అడుగులేసింది. కానీ ఆసక్తి అంతా యాక్టింగ్‌ మీదే ఉండింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా డాన్స్‌ బాలేలు చేస్తూ.. థియేటర్‌లో నటిస్తూ నటనా ప్రతిభను మెరుగుపరచుకునేది.
  • అలాంటి ఒకానొక సందర్భంలోనే బాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ ఇంతియాజ్‌ అలీ నుంచి ఒక కబురు‡ వచ్చింది..  తను తీయబోయే ‘తమాషా’ సినిమాలో నైలాకు వేషం ఇస్తున్నట్టు. అది విన్న ఆమె సంతోషానికి అవధుల్లేవు. సెట్స్‌ మీదకు వెళ్లినప్పుడైతే కలా.. నిజమా అనుకుందట.
  • మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘భాంగ్డా పా లే’, ‘థప్పడ్‌’లలో నటించింది. ‘ఇష్క్‌ విష్క్‌ రిబౌండ్‌’లో నటిస్తోంది.
  • తాజాగా ‘మామ్లా లీగల్‌ హై’ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నైలా లండన్‌లో లా చదివి.. ఢిల్లీలో వకీల్‌గిరీ ప్రారంభించిన లాయర్‌గా నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.
  • ఆమె నటనకే కాదు ఆమె అందానికి.. ఫ్యాషన్‌ స్టయిల్‌కి.. డాన్స్‌కీ అభిమానగణం ఉంది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆమెను స్ఫూర్తిగా తీసుకునే అభిమానులూ ఉన్నారు.

సినిమానైనా.. సీరియల్‌నైనా.. ఆ మాటకొస్తే కదిలే బొమ్మను ఫస్ట్‌ నేను చూసింది టెలివిజన్‌లోనే. అందుకే యాక్టింగ్‌కి టెలివిజనే నాకు ప్రేరణ, స్ఫూర్తి. సిల్వర్‌స్క్రీన్, స్మాల్‌స్క్రీన్, వెబ్‌స్క్రీన్‌.. ఏ స్క్రీన్‌ అయినా యాక్టర్స్‌కి ఒకటే. రీచింగ్‌లో తేడా తప్ప దేనికైనా టాలెంటే కొలమానం! - నైలా గ్రేవాల్‌.

ఇవి చదవండి: లియాండర్‌ పేస్‌... ప్రముఖ డ్యాన్సర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement