పల్లెటూరి జంక్షన్‌.. విలేజ్ డ్రామా | suryapet junction Movie lyrical video Song Launch | Sakshi
Sakshi News home page

పల్లెటూరి జంక్షన్‌.. విలేజ్ డ్రామా

Published Wed, Aug 9 2023 12:54 AM | Last Updated on Wed, Aug 9 2023 8:36 AM

suryapet junction Movie lyrical video Song Launch - Sakshi

ఈశ్వర్, సి. కల్యాణ్‌

ఈశ్వర్, నైనా సర్వర్‌ జంటగా నటించిన విలేజ్‌ డ్రామా ‘సూర్యాపేట జంక్షన్‌’. నాదెండ్ల రాజేష్‌ దర్శకత్వంలో అనిల్‌ కుమార్‌ కత్ర గోడ, ఎన్‌. శ్రీనివాసరావు నిర్మించారు. ఈ చిత్రంలోని ‘చెంగు చెంగుమంటూ జింక పిల్లలాగా..’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను నిర్మాత సి. కల్యాణ్‌ రిలీజ్‌ చేశారు.

రోషన్‌ సాలూరి స్వరకల్పనలో ఎస్‌. సాయిచరణ్, సోరస్‌ పాడిన ఈ పాటకు రెహమాన్‌ లిరిక్స్‌ అందించారు. ‘‘వ్యవస్థను సరిదిద్దే బాధ్యత యువతపై ఉంటుంది. కొత్త తరం ఓటర్లు చూడాల్సిన చిత్రమిది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు హరి గౌర మరో స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement